Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

Work For BRS Bhujanga Rao Sensational Confession In Phone Tapping Case
ఏ ఒక్కరినీ వదల్లేదు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన వాంగ్మూలం

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం.. సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రతిపక్షం, పాలక పక్షం అని చూడకుండా.. నాటి అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసిన ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని నడిచింది ఈ వ్యవహారం. గులాబీ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు.. ప్రణీత్‌రావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తేలింది.భుజంగరావు వాంగ్మూలంలోని విషయాలు యథాతథంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లాం. ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. .. జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ కుమార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్‌తో ఆపరేషన్ చేశాం. అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. .. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యా శ్రీధర్‌రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టాం. .. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్‌పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Ap High Court Granted Anticipatory Bail To Pinnelli Ramakrishna Reddy In 3 Cases
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్‌ మార్చారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్‌ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates.. 2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్‌సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్‌ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైఎస్సార్‌సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

Pushpa Actor Fahadh Faasil Rare Disease ADHD Details
'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?

'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎ‍క్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్‌గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Ksr Comments On The Way Buddha Venkanna Spoke About Nara Lokesh
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!

తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్‌లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్‌లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

World first diabetes cure with cell therapy achieved in China
డయాబెటిక్‌ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత

డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అందుకే షుగర్‌ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్‌ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్‌కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్‌ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్‌లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్‌లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్‌ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్‌ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్‌లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్‌ పెరిఫిరయల్‌ బ్లడ్‌ మోనోన్యూక్లియర్ సెల్స్‌తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్‌ సెల్స్‌గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Thyrocare Technologies Founder A Velumani Success Story
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం

ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్‌పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్‌పట్టి పూదూర్‌లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్‌ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్‌ భర్త సక్సెస్ స్టోరీ

Sensational Details Out From Realtor Kuppala Madhu Incident
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !

హైదరాబాద్‌, సాక్షి: రియల్టర్‌ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్‌.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్‌ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్‌ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్‌ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా‌ గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్‌ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్‌ ప్లాన్‌ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్‌ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్‌ కోసం తనతో పాటు చింతల్‌ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్‌(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్‌ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్‌ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్‌ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Rinku Singh lauds Rohit Sharmas support, reveals message after T20 WC snub
కొంచెం బాధ‌ప‌డ్డాను.. కానీ రోహిత్ భ‌య్యా మాత్రం చాలా: రింకూ

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు మరో మూడు రోజుల్లో తెర‌లేవ‌నుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అమెరికా గ‌డ్డ‌పై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. భార‌త టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌ధాన‌ జ‌ట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌క‌పోయిన సంగ‌తి తెలిసిందే.రింకూకు మెయిన్ స్వ్కాడ్‌లో కాకుండా రిజ‌ర్వ్ జాబితాలో సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. సెల‌క్ట‌ర్లు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డిచింది. ఈ క్ర‌మంలో వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటుద‌క్క‌క‌పోవ‌డంపై తొలిసారి రింకూ స్పందించాడు. జ‌ట్టు సెల‌క్ష‌న్ త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న‌తో మాట్లాడాని, ఎంతో స‌పోర్ట్‌గా నిలిచాడ‌ని రింకూ చెప్పుకొచ్చాడు."టీ20 వ‌ర‌ల్డ్‌కప్ ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం నాకు కొంచెం బాధ క‌ల్గించంది. ఎందుకంటే మ‌నం బాగా ఆడుతున్న‌ప్ప‌ట‌కి ఎంపిక కాక‌పోతే స‌హ‌జంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంలో సెల‌క్ట‌ర్లు త‌ప్పేమి లేదు. టీమ్ కాంబినేషన్ కారణంగా న‌న్ను ఎంపిక చేయ‌లేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ త‌ర్వాత మ‌న చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే స‌ర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా స‌రే అది మ‌న‌ మంచికే అనుకున్నాను. రోహిత్ భ‌య్యా కూడా నాతో మాట్లాడు. సెల‌క్ష‌న్ గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌వ‌ద్దు అని రోహిత్ చెప్పాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు స‌పోర్ట్‌గా నిలిచాడని" దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement