Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

All Arrangements For 4rd Phase Lok Sabha Polls
రేపే లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

Tdp Workers Attacked Ysrcp Workers In Rentachintala
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు

సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్‌రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Ksr Comments On Election Voting System And Public Decision
నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు చివరి క్షణంలో ఓటర్లను ఆకట్టుకోవడంకోసం చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో హోరాహోరీ ప్రచారం జరిగింది. తెలంగాణలో ఉన్నంతలో వ్యక్తిగత విమర్శలకన్నా, విధానాలు, ప్రభుత్వాల పనితీరుపైనే విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో అంత తీవ్రత కనిపించడం లేదు. అయినా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశించే ఎన్నికలుగా అంతా చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం కూటమిల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. కూటమి తరపున కొన్ని మీడియా సంస్థలు రంగంలో దిగి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానంగా విధానాలకు పరిమితం కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ వంటివారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధ్యత అంతా ఓటర్లపై పడింది.ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నదానిపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందుగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుందాం. తమకు కావల్సిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. కేవలం ప్రలోభాలకు లొంగకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఓట్లను వేసే పరిస్తితి రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ప్రజలు ఈ సందర్భంగా గమనించవలసిన అంశాలను తెలుసుకుందాం!ఓటు విలువ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకం. గ్రామవార్డు నుంచి పార్లమెంటు వరకు ఓట్ల ద్వారానే తమ నాయకులను ఎన్నుకునే గొప్ప వ్యవస్థ మనది. దీనిని బాధ్యతాయుతంగా అందరూ ఉపయోగించుకుంటే అది అర్దవంతంగా ఉంటుంది. కేవలం డబ్బు వంటి ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుంది. అయినప్పటికి వర్తమాన రాజకీయాలలో డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగడం లేదు. అది దురదృష్టకరం. డబ్బు తీసుకున్నా, కేవలం ఆ ప్రాతిపదికనే ఓటు వేయడం లేదని పలుమార్లు రుజువు అవుతోంది. ఉదాహరణకు గతంలో ఒకసారి ఒక నేత డబ్బులు పందారం చేసినా ఓటమి చెందారు. దాంతో ఆయన తాను డబ్బు ఇచ్చిన ఇళ్లకు వెళ్లి, డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసి వసూలు చేసుకున్నారు. ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవుతాయని ఓటర్లు గుర్తించాలి. అందుకే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని గమనించి ప్రలోభాలకు గురి కాకుండా ఓట్లు వేస్తే సమాజానికి మంచిది.అబద్దాల ప్రచారాలు: దురదృష్గవశాత్తు మన ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు అసత్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎదుటివారిని తిట్టడానికి ఈ అబద్దాలను వాడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక నేతపై దుమ్మెత్తి పోస్తారు. అదే నేత తమ పార్టీలోకి రాగానే మొత్తం మాఫీ అయినట్లు ఎన్నికలలో పోటీకి గాను టిక్కెట్లు కూడా ఇస్తుంటారు. వీరిలో ఎవరు పద్దతిగా ఉన్నారు? ఎవరిపపైన తక్కువ ఆరోపణలు ఉన్నాయి?ఏ అభ్యర్ధి తమకు అందుబాటులో ఉంటున్నారు? మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తే బాగుంటుంది.ప్రజాసేవ: ప్రతి రాజకీయ పార్టీ నేత తాము వచ్చే ఐదేళ్లు చాలా పెద్ద ఎత్తున సేవ చేస్తామని చెబుతారు. ఆ సందర్భంలో ఈ ఎన్నికల వరకు వారు ఎలా అందుబాటులో ఉన్నారు? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వారివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతోంది? అన్న అంశాల ఆధారంగా ఓట్లు వేస్తే ఉపయుక్తంగా ఉండవచ్చు. కరోనా వంటి సంక్షేభ సమయంలో ఏ నేత ప్రజలను ఆదుకున్నారు? ఏ నేత వేరే రాష్ట్రంలో ఉండి విమర్శలు చేస్తూ కూర్చున్నారు? అన్నవాటిని ఆలోచించుకోగలగాలి.గుణగణాలు: పోటీ చేస్తున్న అభ్యర్దుల గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయగలిగితే అసాంఘీక శక్తులు రాజకీయాలలోకి రాకుండా ఉంటాయి.కాని దురదృష్టవశాత్తు ఎక్కువ తప్పులు చేసేవారిని కూడా ఎన్నికలలో ఒక్కోసారి గెలిపిస్తున్నారు.వ్యక్తిగత జీవితంలో చాలా అరాచకంగా వ్యవహరించి, ప్రజాజీవితంలో నీతులు చెప్పేవారిని మ్మకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే అలాంటివారికి ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏదో ఒక ఆకర్షణకు లోనై ఓట్లు వేయడం కాకుండా, ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలకే మంచి జరుగుతుందా?లేదా?అన్నదానిపై దృష్టి పెట్టాలి.సమాజానికి ఆ అభ్యర్ధి ఏమైనా కొంతైనా ఆదర్శంగా ఉన్నాడా?లేదా?అన్నది కూడా చూడాలి.నాయకుల నిబద్దత: నాయకుల నిబద్దతను కూడా పరిశీలించాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?లేక తన మాటలను తానే మింగేస్తాడా?అన్నది పరీక్షించాలి. చెప్పాడంటే చేస్తాడంతే అన్న చందంగా నేతలు ఉంటే మంచిదే. కాని చెప్పేదొకటి, చేసేదొకటి అయితే ప్రజలు నమ్మకపోవడమే బెటర్.నాయకులలో ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు కుట్రలు,కుతంత్రాలకు పాల్పడుతున్నది అర్ధం చేసుకోవాలి. పైకి నీతులు చెబుతూ, లోపల గోతులు తవ్వుతున్నది ఎవరో గుర్తించాలి. లేకంటే గుంటనక్కల వంటి నేతలు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత నష్టపోయేది ప్రజలే అన్న సంగతి గుర్తించాలి.ఏ నాయకుడు అబద్దాలకు ప్రాధాన్యత ఇవ్వడు అన్నది తెలుసుకోవాలి.ఏ నేత అచ్చంగా అబద్దాలపైనే ఆధారపడి తరచు మాటలు మార్చుతుంటాడో అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓడించితే వారికి గుణపాఠం చెప్పినట్లవుతుంది.మానిఫెస్టో: ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలను ప్రకటించాయి. వాటిలో ఎన్ని నిజమైన హామీలు, ఎన్ని గాలి హామీలన్నదానిపై ఓటర్లు ఒక అవగాహనకు రావాలి?ఎవరైనా ఆకాశం తీసుకు వచ్చి మీ ఇంటి ముందు పెడతానంటే నమ్ముతామా?అలాగే ఒక కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామన్న రీతిలో వాగ్దానాలు చేస్తే విశ్వసిస్తామా? రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు అయ్యే ఖర్చు గురించి ఆ పార్టీ నేతలు చెప్పకపోతే వారిని అసలు విశ్వసించవద్దు. ఆ వాగ్దానాలన్నీ గాలిమూటలేనని తెలుసుకుని తగు విధంగా ఓట్లు వేయాలి.అధికారం వచ్చేవరకు కల్లబొల్లి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఓటర్లనే డబాయించడం చేసే నేతలను గుర్తు పెట్టుకుని ఓడించకపోతే, వారు నిత్యం మోసం చేస్తూనే ఉంటారు.అలవాటుప్రకారం మోసం చేసేవారిది తప్పుకాదు..మోసపోయేవారిదే తప్పు అని ఒకనానుడి ఉంది. అందువల్ల తాము మోసపోతున్నామా?లేదా? అన్నదాని ఆధారంగా ఓటు వినియోగించుకోవాలి.కొన్ని పార్టీలు తమ మానిఫెస్టోని ఎన్నికల తర్వాత వెబ్ సైట్ నుంచి తొలగించేస్తుంటాయి. అలాంటివారిని అసలు నమ్మవద్దని చెప్పకతప్పదు.కొన్ని హామీలు ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణమని వాగ్దానం చేశారు. వారు అదికారంలోకి వచ్చాక తేలికగా ఉండే ఆ హామీని అమలు చేశారు.దాని ఫలితంగా లక్షల మంది ఆటోలవారు ఉపాది కోల్పోయారు. చివరికి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో రైలు కూడా తీవ్రనష్టాలపాలవుతోంది.దాంతో మెట్రో రైల్ నిర్వహణ నుంచి వైదొలగుతామని ఆ సంస్థ చెబుతోందట.తప్పుడు ప్రచారాలు: కొన్ని రాజకీయ పార్టీలు అచ్చం తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీపై ఉన్నవి,లేనివి కల్పించి, అబూత కల్పనలను ప్రచారం చేస్తుంటాయి.అందువల్ల ఏ రాజకీయ పార్టీ చేసే ప్రచారంలో అయినా నిజం ఉందా?లేదా? అన్నది నిర్దారించుకోవాలి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎవరూ వ్యవహరించకూడదు. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పార్టీ లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన దుష్ప్రచారంపై కేసు నమోదు అయినా, అదే తప్పుడు ప్రచారాన్ని ఆ పార్టీ కొనసాగించింది.అలా చేయవచ్చా? ఎట్టి పరిస్థితిలోను అలాంటి పార్టీలను విశ్వసించకూడదు. ఒకవేళ నమ్మితే ఓటర్లు తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లే అవుతుంది.మీడియా కథనాలు: ఎపికి సంబంధించి మీడియా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. ఒక వర్గం మీడియా స్వతంత్రంగా ఉన్నామన్న ముసుగులో పచ్చి అబద్దాలను వార్తలుగా అల్లి రాస్తోంది. కల్పిత కథనాలకు అంతులేకుండా ఉంటోంది. ఒక రాజకీయపార్టీపై నిత్యం ద్వేషంతో విషం కక్కుతోంది. అలాంటి పత్రికలను అసలు పరిగణనలోకి తీసుకోవద్దు. స్వేచ్చగా ,వాస్తవం ఏమిటో తెలుసుకుని ఓట్లు వేయాలి.ప్రజా ప్రయోజనాలకన్నా, తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న మీడియాను గుర్తించగలగాలి.ప్రభుత్వ పనితీరు: నాయకుల పనితీరు, వ్యవహార శైలితో పాటు ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలను నిర్వహించిన వైనాన్ని కూడా సమీక్షించుకోవాలి. తమ మానిఫెస్టోలో ఉన్న అంశాలను సంబంధిత రాజకీయ పార్టీ పూర్తి చేసిందా?లేదా?ప్రభుత్వం తమకు అందుబాటులో ఉదా? లేదా? పాలనను తమ గడపవద్దకు తీసుకు వచ్చిందా? లేదా? ఎపిలో ఓడరేవులు, కొత్త పరిశ్రమల, మెడికల్ కాలేజీలు, ఐటి హబ్‌ల తయారీ మొదలైనవాటికి ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం గట్టిగా కృషి చేసిందో గమనించాలి.ఉద్దానం వంటి కిడ్నీ బాధిత ప్రాంతానికి ఏ ప్రభుత్వం బాగా సాయం చేసింది?విద్య, వైద్యం వంటి కీలకమైన రంగాలలో ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నది కూడా ఆలోచించాలి. కొన్ని ప్రభుత్వాలు విద్య,వైద్య రంగాలను ప్రైవేటు రంగానికి అప్పగించేసి ఉండవచ్చు. ఇంకో ప్రభుత్వం విద్య,వైద్యం పేదలకు నిత్యం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఓటరుగా మీరు ఎటు ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాలి.గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, వార్డు క్లినిక్ వంటివి అవసరమా?కాదా? వలంటీర్ల వ్యవస్థ అవసరమా? కాదా? దానిపై ఎవరు మాట మార్చారు? ఎవరు నికరంగా నిలబడ్డారు? తదితర అంశాలను గమనంలోకి తీసుకుని ఓటు హక్కు వాడుకోవడం కూడా అవసరమే. ఒక పార్టీ మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన రాజకీయ పార్టీలే, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చెబుతుంటే నమ్మవచ్చా? అంటే వారు తొలుత చేసిన విమర్శల ప్రకారం అప్పట్లో ఒక శ్రీలంక అయితే, వీరు అధికారంలోకి వస్తే మూడు శ్రీలంకలు చేస్తామని చెబుతున్నట్లేనా? మనం దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి?అన్నదానిపై స్పష్టతకు రావాలి.సోషల్ మీడియా: సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఒక మేలు జరుగుతోంది. అలాగే మరో కీడు కూడా ఎదురవుతోంది. తప్పుడు ప్రకటనలు చేసే రాజకీయ నేతల పాత వీడియోలతో సహా బయటపెట్టి సోషల్ మీడియా ఎండగడుతోంది. అంతవరకు బాగానే ఉంది. మరికొంత సోషల్ మీడియా మరింత ఆరాచకంగా పచ్చి అబద్దాలను, వదంతులను ప్రచారం చేస్తుంటుంది. అందువల్ల సోషల్ మీడియాను పాలు, నీళ్ల మాదిరి వేరు చేసుకుని నిజాలనే నమ్మాలి. ఈ సందర్భంగా సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటివాటికి తావివ్వకుండా జాగ్రత్తపడాలి.సత్వరమే ఓటు వేసుకోవడం బెబర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వాడుకునే అవకాశం ఉన్నా, సాధ్యమైనంతవరకు పెందలకడే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు వేస్తే బెటర్. ఆ తర్వాత తమ ఓటు ఎవరో వేసేశారని ఫిర్యాదు చేసినా, పెద్ద ఉపయోగం ఉండదు. వృద్దులు, మహిళలు ఇతరత్రా సీరియస్ సమస్యలు ఉన్నవారు తమకు సంబంధించిన బంధువులను వెంటబెట్టుకుని ఓట్లు వేయాలి తప్ప, పోలింగ్ బూత్ లోని సిబ్బందిని సహాయం అడగితే కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. ఆ సిబ్బంది వారికి నచ్చినవారికి ఓటు వేస్తే చేయగలిగింది ఏమీ ఉండదు. అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు. కాని కొన్ని సందర్భాలలో ఇలా జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు అపోహలు కూడా వస్తుంటాయి.ఓటర్ స్లిప్‌తో పాటు, గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.ఏది ఏమైనా 2024 శాసనసభ ఎప్నికల ఫలితాలు ఒక కీలకమైన మలుపు అవుతాయని చెప్పాలి. ఒక రాష్ట్ర గమనాన్ని నిర్దేశిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తమకు మేలు చేస్తుందనుకున్న రాజకీయ పార్టీకి ఓటు వేసుకుని గెలిపిస్తే ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయలు

Information About How To Cast Vote
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్‌ చేస్కోండి

AP Telangana Elections 2024: Sakshi Contest Selfie Challenge
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్‌ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్‌ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్‌ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.‌

AP Elections 2024: May 12th Politics Latest News Updates Telugu
May 12th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు..

TDP Chandrababu Naidu benami land grabs in Andhra pradesh
గ్యాంగ్‌ ఆఫ్‌ పెత్తందార్స్‌

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్‌ కథలు వల్లె వేశారు. సీఎం జగన్‌ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్‌ సిటీ ముసుగులో మురళీమోహన్‌ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్‌ ఆఫ్‌ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్‌ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్‌ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్‌ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్‌ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్‌ పొందుపరిచారు.

TDP Leader Chandrababu Fake Promises Of Manifesto
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?

(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చి­న హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవ­త్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025­లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథ­కాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–­2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టో­ను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్‌ లెక్కలు, ఆర్‌బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్‌ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్‌డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్‌ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్‌ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.

Land Titling Act - Lies vs Truths
లాండ్‌ టైట్లింగ్‌ చట్టం - అబద్దాలు vs నిజాలు

“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all