Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్‌ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్‌ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్‌ జగన్‌ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్‌ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు, పోలింగ్‌ బూత్‌ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్‌ జగన్‌ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్‌ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్‌ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్‌ జగన్‌కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు, వైస్‌ ఛైర్మన్‌ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్‌, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్‌, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Israel-Hamas war: Israel attacks UN-run school in central Gaza, killing at least 40
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి

డెయిర్‌ అల్‌ బలాహ్‌(గాజా): ఇజ్రాయెల్‌ బలగాలు సెంట్రల్‌ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్‌–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్‌–సర్డి స్కూల్‌లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్‌ మిలిటెంట్లు ఈ స్కూల్‌ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్‌ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్‌–అక్సా మార్టిర్స్‌ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్‌ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు.

Three Arrested For Using Forged Aadhaar Cards To Enter Parliament
ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్‌లోకి చొరబడేందుకు..

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఖసిం, మోనిస్‌, షోయాబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్‌ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. విచారిస్తున్నారు. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Nirabkumar Prasad As New Cs Of Ap
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

How NSA Tool Helped Man Crack Password After 11 Years to Recover Rs 25 Crore in Bitcoin Wallet
పాస్‌వర్డ్‌ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌ వాలెట్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయారు. పాస్‌వర్డ్‌ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్‌లో తక్కువ బిట్‌కాయిన్‌లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్‌కాయిన్‌లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.ఇటీవల బిట్‌కాయిన్‌ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్‌కాయిన్‌లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ రికవర్ చేసాడు.సుమారు దశాబ్దంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి.

AP Is Likely To Get Four Or Five Ministerial Posts In The Central Cabinet
కేంద్ర కేబినెట్‌ కూర్పు.. ఏపీకి ఎన్ని?

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.టీడీపీకి రెండు మంత్రి‌ పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేముల ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్‌తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

Satyabhama Movie Review And Rating In Telugu
‘సత్యభామ’ మూవీ రివ్యూ

టైటిల్‌: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్‌ పవిత్రన్‌, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్‌, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్‌ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్‌ సత్యభామ(కాజల్‌)షీ టీమ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్‌ యాప్‌ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్‌ పవిత్రన్‌)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్‌ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్‌(ప్రజ్వల్‌) మిస్‌ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్‌ కేసుకి లోకల్‌ ఎంపీ కొడుకు రిషి(అంకిత్‌ కోయా)కి లింక్‌ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్‌, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్‌ని కిడ్నాప్‌ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్‌లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్‌ మిస్సింగ్‌ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్‌(నవీన్‌ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్‌లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్‌) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్‌ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్‌ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ అనే చేప్పేలా ఎంట్రీ సీన్‌ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్‌ లైఫ్‌ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్‌ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్‌ యాప్‌ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌..తొలిసారి ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్‌గా నవీన్‌ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్‌గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శ‌శికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్‌. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్‌: 2.75/5

USA win over Pakistan in Super Over
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. పాక్‌ను చిత్తు చేసిన అమెరికా

డాలస్‌: టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా అనూహ్య ఫలితం వచి్చంది. తొలిసారి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్‌ ఓవర్‌’ అనివార్యమైంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది. 2009 విజేత పాకిస్తాన్‌ సమష్టి వైఫల్యం కారణంగా పరాభావంతో టోర్నీని మెుదలు పెట్టగా...తొలి మ్యాచ్‌లో కెనడాపై నెగ్గిన యూఎస్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాక్‌ తరఫున ఆమిర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్‌ ఓవర్‌’లో 19 పరుగులు చేయాల్సిన పాక్‌... అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో ఒక వికెట్‌ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించగా... షాహిన్‌ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్‌ కెన్‌జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్‌ నేత్రావల్కర్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్‌ జోన్స్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్‌ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్‌ బౌలింగ్‌ ముందు తడబడింది. అయితే 19వ ఓవర్‌ వరకు పట్టు బిగించిన పాక్‌...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్‌ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్‌ ఫోర్, సిక్స్‌ సహా 14 పరుగులు రాబట్టింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్‌ X కెనడావేదిక: న్యూయార్క్‌; రాత్రి గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Many people died because they could not bear Jagans defeat
ఆగుతున్న అభిమానుల గుండెలు

సాక్షి, నెట్‌వర్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఓటమిని తట్టు­కో­లేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామ­రాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కిల్లో మోహన్‌ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కి­ంపులో జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పి­తో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108­లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరి­స్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించా­రు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.తిరుపతి జిల్లాలో..తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్‌సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్యదెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్‌సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్‌సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్‌ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడు­లు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.వైఎస్సార్‌ జిల్లాలో..వైఎస్సార్‌ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్‌సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.అనకాపల్లి జిల్లాలో.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్‌సీపీ అభిమాని. వైఎస్‌ జగన్‌ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్‌ పూర్తయ్యాక వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్‌ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్‌సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్‌కుమార్‌(26) ఆత్మహత్య చేసు­కుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్‌ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్‌ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

PM Narendra Modi and Amit Shah directly involved in stock market crash says Rahul Gandhi
స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంలో మోదీ, షా: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్‌’ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్‌ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్‌ మార్కెట్‌ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్‌ షాపై రాహుల్‌ మండిపడ్డారు. రిటైల్‌ ఇన్వెస్టర్లను ముంచేశారు షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్‌ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్‌ షా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్‌ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్‌ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్‌ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్‌ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో రాహుల్‌ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటేమే 13: జూన్‌ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్‌ షా సూచించారు. మే 19: జూన్‌ 4న స్టాక్‌ మార్కెట్‌ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్‌ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో స్టాక్‌ మార్కెట్‌ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్‌టైమ్‌ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. జూన్‌ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.పస లేని ఆరోపణలు పీయూష్‌ గోయల్‌ మండిపాటు స్టాక్‌ మార్కెట్‌లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత మన మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్‌ గోయల్‌ వివరించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్‌ మార్కెట్‌ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్‌లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement