Top Stories
ప్రధాన వార్తలు
‘సాక్షి’కి టీ 20 వరల్డ్‌కప్ ట్రోఫీ
మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.‘సాక్షి’కి రానున్న వరల్డ్‌కప్ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్‌కు రానుంది. ప్రొటెక్టెడ్ కంటైనర్‌లో సాక్షి ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్‌కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా కూడా సాక్షి ఆఫీస్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్‌కు విచ్చేయనుంది.కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి.
రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ (ఆర్)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్‌ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్‌పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్‌లాల్‌గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు.
May 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 19th AP Elections 2024 News Political Updates7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా అభిమానులు ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్ పుట్టింది.
Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
మేషంసన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా, సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. వారం చివరిలో కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.వృషభంకొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.మిథునంముఖ్య పనులు విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.కర్కాటకంచిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్య పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. కళారంగం వారికి చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్యఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.తులముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఅనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సుకొన్ని నిర్ణయాలు మిత్రులను ఆశ్చర్యపరుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.మకరంమీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మీనంచేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?
అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్‌లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు)
తప్పక చదవండి
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
సినిమా
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
సింగర్ సుచిత్ర గతంలో సుచీలీక్స్ పేరిట హీరోల పర్సనల్ ఫోటోలను లీక్ చేసి సెన్సేషన్ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్‌ఖాన్ గే అంది. వాటిపైనే ఆసక్తితన భర్త కార్తీక్ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్ రంగనాథన్పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అనిరుధ్‌తో..వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్‌నైల్స్ పెడుతూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్‌తో ఉంది.. అనిరుధ్‌తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్‌నైల్స్ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే..
'నరేంద్ర మోదీ' బయోపిక్‌లో స్టార్ యాక్టర్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్యరాజ్‌కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్‌కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్‌కు పాజిటివ్‌గా పోస్ట్ పెడితే ఆ క్రెడిట్ అంతా పవన్‌కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్ అభిమాని ఇలా కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
ఫొటోలు
ట్రెండీ ట్రెండీ స్టైలిష్ సారీ కుచ్చులు చూసారా..! (ఫొటోలు)
Anikha Surendran: ‘ఓహ్ మై డార్లింగ్’ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన లుక్స్ (ఫోటోలు)
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
క్రీడలు
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.
అంచనాలను అందుకోలేకపోయాను: రోహిత్ శర్మ
ఐపీఎల్ తాజా సీజన్లో తాను అనుకున్న విధంగా రాణించలేకపోయానని, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యానని ముంబై ఇండియన్స్ బ్యాటర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి ఇప్పుడు అతిగా ఆలోచించడం అనవసరమని అతను అభిప్రాయపడ్డాడు.‘ఒక బ్యాటర్‌గా నేను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఇప్పుడు దానిని విశ్లేíÙంచి లాభం లేదని ఇన్నేళ్ల అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉండటం అవసరం. ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఆటను మెరుగుపర్చుకోవడమే నేను చేయగలిగింది’ అని రోహిత్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ తమ జట్టు ప్రణాళికల ప్రకారం సాగలేదని, ఎన్నో తప్పులు చేశామన్న రోహిత్ శర్మ...తాము గెలవాల్సిన మ్యాచ్‌లను స్వల్ప తేడాతో చేజార్చుకున్నామని అన్నాడు. మరో వైపు భారత జట్టు విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని కెప్టెన్ అన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టులోని ప్రతీ ఒక్కరికీ తమ బాధ్యతలేమిటో స్పష్టంగా తెలుసని అతను పేర్కొన్నాడు.
IPL 2024: సీఎస్కేపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తాచాటింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖరిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ రెండు వికెట్లు, మాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయినప్పటికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి ఉండేది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి.ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చితన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సత్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ టైమింగ్‌లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్‌కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Anushka Sharma also thinks Virat Kohli was not out 😭😭😭@JayShah, please bring King Kohli back. He should be batting out there 🇮🇳💔💔💔#IPL2024 #RCBvsCSK #tapmad #HojaoADFree pic.twitter.com/5fnBv6hAJO— Farid Khan (@_FaridKhan) May 18, 2024
బిజినెస్
మెట్రో ట్రైన్లో నిర్మలా సీతారామన్ .. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.!అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.అయితే నిర్మలా సీతారామన్ మెట్రో ట్రైన్లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మరో యూజర్ మాత్రం.. నిర్మలా సీతారామన్ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు. Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024
టెస్లా సైబర్‌ట్రక్ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్
సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్‌ట్రక్ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్‌ట్రక్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.Cool https://t.co/oS0gzawPCg— Elon Musk (@elonmusk) May 18, 2024
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ 'నారాయణన్ వాఘుల్' చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు.నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు.నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 - 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.Today, I grieve for the Bhishma Pitamah of Indian Banking—Mr. N.Vaghul, who passed away this morning.I grieve not just for a Titan of Indian Business, but for one of the most inspiring & generous people I have ever had the good fortune to encounter. He was a member of the… pic.twitter.com/YgIs5BsE4d— anand mahindra (@anandmahindra) May 18, 2024
వీడియోలు
అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్
తృటిలో తప్పిన పెను ప్రమాదం
లండన్ వీధుల్లోను అదే అభిమానం
టీడీపీ బండారం బయటపెట్టిన వైఎస్సార్సీపీ మహిళలు
శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం
మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు
పెళ్ళికి ఒప్పుకోలేదని కొబ్బరి బోండాల కత్తితో దాడి
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
ఫ్యామిలీ
అకటా... నడిబజార్లో లక లక లక
‘కంటెంట్ క్రియేటర్లు తలుచుకుంటే వైరల్‌కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్ వీడియో ఇది.ప్రీతీ థాపాఅనే క్రియేటర్ చంద్రముఖి గెటప్‌లో డ్యాన్స్ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్‌తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.‘మీ డ్యాన్స్ స్కిల్స్ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్ రూల్స్‌ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు.
బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
అధిక బరువు నుంచి బైటపడాలంటే చక్కని పోషకాహారంతోపాటు, రోజుకు కనీసం అరగంట వ్యామాయం చేయాల్సిందే. బరువు తగ్గాలంటే వ్యాయామం కంటే డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నం మానేశాం అంటూనే ఉదయం పూట టిఫిన్‌లో ఇడ్లీ, పూరీ, వడ దోసలు, చపాతీలు లాగించేస్తే బరువు తగ్గడం కష్టమే. అందుకే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఉదాహరణకు కొన్ని చూద్దమా..!అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. రోజుమొత్తానికి శక్తినిచ్చేలా ఉండాలి. పోషకాలతో కూడిన అల్పాహారం తింటే ఆరోగ్యకరమైన బరువుతో, మెటబాలిజం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్లూటెన్-రహిత మిలెట్ల్స్ను తీసుకోవడం ఉత్తమం. మిల్లెట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రెడీమేడ్ మిల్లెట్ ఆధారిత పిండి, పొడులు కూడా అందుబాటులో ఉన్నాయి.ఫింగర్ మిల్లెట్ లేదా రాగి దోస, రాగి ఇడ్లీ, రాగి జావ : ఫైబర్, కాల్షియం ,ఐరన్ అధికం.జొన్నలతో కిచ్డీ, జొన్నరొట్టె : కార్బోహైడ్రేట్లు , ఫైబర్ పుష్కలంఫాక్స్టైల్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్స్‌తో చేసిన పొంగల్, లిటిల్ మిల్లెట్ దోస: కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , ప్రోటీన్లు పుష్కలంప్రోసో మిల్లెట్ దోస: సాధారణ దోసలాగానే బియ్యం కలపుకుండా, కొద్దిగా మినపపప్పు కలిపి చేసుకోవాలి. బార్నియార్డ్ మిల్లెట్ పొంగల్ : దీన్ని కూడా బియ్యం పొంగల్లాగా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ , ప్రోటీన్‌లో అధికం.
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
వేసవి కాలం వచ్చిందంటే విధ రకాల స్వీట్లు/రుచికరమైన చిరుతిళ్లు, ఐస్ క్రీమ్స్, కుల్ఫీలకు డిమాండ్ ఉంది. పిల్లలు కూడా మార్కెట్లో దొరకేవిధంగా కావాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో పరి శుభ్రంగా లేకుండా, ప్రతీదీ కల్తీ మయం అయి పోతున్న తరుణంలో బయట దొరికే కుల్ఫీలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చాలా సులభంగా థండయ్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం.అయితే కుల్ఫీ అనేది స్వచ్ఛమైన వెన్నతీయని పాలు, చక్కెర, ఏలకులు లేదా కుంకుమపువ్వు వంటి సువాసన పదార్ధంతో తయారు చేసే ఫ్రీజ్డ్ డెజర్ట్. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్ మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, కేసరి కుల్ఫీ అబ్బో ఇందులో చాలా రకాలున్నాయి. థండయ్ కుల్ఫీ కావలసినవివెన్న తీయని పాలు- 2 కప్పులు కోవా-100 గ్రాములు ; కండెన్స్డ్ మిల్క్-కప్పు; పాల పొడి- పావు కప్పు ; బాదం - 10 ; గసగసాలు- టేబుల్ స్పూన్ ; మిరియాలు-5 ; యాలకులు- 2 ; సోంఫు - టీ స్పూన్.తయారీ: ∙బాదం పప్పులను నానబెట్టి తొక్క వలిచి పలుకుగా గ్రైండ్ చేయాలి ∙గసగసాలను పది నిమిషాల సేపు నీటిలో నానబెట్టి గ్రైండ్ చేయాలి. అవి ఒక మోస్తరుగా మెదిగిన తర్వాత అందులోనే మిరియాలు, యాలకులు, సోంఫు వేసి అవి కూడా మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేయాలి ∙పాలను ఒక వెడల్పాటి పాత్రలో ΄ోసి మరిగించాలి. కాగిన పాలలో కోవా, కండెన్స్డ్ మిల్క్, పాలపొడి వేసి కలిపి సన్న మంట మీద మరిగించాలి. ఇవి మరిగినంత సేపూ అడుగుపట్టకుండా గరిటెతో అడుగు వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని, బాదం పలుకులను వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగనిచ్చి దించేయాలి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎనిమిదిగంటలు వెయిట్ చేసిన తరువాత , హ్యాపీగా లాగించేయడమే.
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పుట్టుకలోనే ఆ విధి చిన్న చూపు చూసింది పుట్టాక తల్లిదండ్రులు మరింత అన్యాయం చేశారు. మా కొద్దీ పాప అంటూ చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇక్కడే ఆమెకు మరో దారి దొరికింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుని తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్త కుప్పలో చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. శంకర్‌బాబా బాలిక సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం కలిగింది. తోటివారు గర్వపడేలా సత్తా చాటుకుంది.పద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టడం మరో విశేషం. అంతే మాలా పట్టుదలగా ఎదిగింది. తాజాగా (మే 16న ) విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. ‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు దేవదూతలను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యం’ అని మాలా చెప్తుతోంది. తన విజయానికి శంకర్ బాబా పాపల్కర్, యూనిక్ అకాడమీ అమరావతి ప్రొఫెసర్ అమోల్ పాటిల్, ప్రకాష్ టోప్లే కారణమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ , ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారని శంకర్‌బాబా వెల్లడించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది.