Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Web Casting Hijack On and off button in Chandrababu hand
వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్‌ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పూర్తి ‘పచ్చ’పాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్థారిస్తోంది. విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ పోలింగ్‌ బూత్‌ వీడియోలను ఎడిట్‌ చేసి విడుదల చేయడం ఏమిటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్‌కు చేరిపోయాయి? అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటవేత వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదులను నిర్ఘాంతపరుస్తోంది. నిష్పాక్షికంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా? అని విస్తుపోతున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితోపాటు పోలింగ్‌ రోజు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ నుంచి క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల వరకూ అందరూ టీడీపీ అక్రమాలకు అండగా నిలిచినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంత చేసినా గెలవలేమనే నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడేలా పథకాన్ని రూపొందించాయి. పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ‘పచ్చ ముఠా’ పెత్తనం ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను చంద్రబాబు ముఠా హైజాక్‌ చేయడం విస్మయం కలిగిస్తోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ఈసీకి నియంత్రణ లేదా? ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులైన ప్రైవేట్‌ వ్యక్తులకు అందుబాటులోకి తెచి్చందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని 46,389 ఎన్నికల కేంద్రాలకుగానూ 31,380 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేశారు. అత్యంత సమస్యాత్మక 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయట వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలతోపాటు ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను చంద్రబాబు ముఠా తమ గుప్పిట్లోకి తీసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ వీడియో రికార్డింగ్‌ అంటూ నారా లోకేష్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్టు చేయడం అందుకు నిదర్శనం. తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఈసీ చెబుతోంది. అలాంటప్పుడు ఎలా లీక్‌ అయింది? వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు పొక్కడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం వెబ్‌ కాస్టింగ్‌ పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ అయ్యే వీడియోలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. వెబ్‌కాస్టింగ్‌ లింక్‌ ను జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాటిని కలెక్టర్‌తోపాటు ఐజీ, ఎస్పీ పరిశీలిస్తారు. వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌ కోసం ప్రైవేట్‌ ఏజెన్సీలను వినియోగించారు. పోలింగ్‌ తరువాత వెబ్‌ కాస్టింగ్‌ హార్డ్‌ కాపీని ప్రైవేట్‌ ఏజెన్సీ కలెక్టర్‌కు అందచేస్తుంది. ప్రైవేట్‌ ఏజెన్సీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ వర్గీయులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోకి చొరబడ్డారు. ‘స్వామి’ భక్తి... 7 ఈవీఎంలు ధ్వంసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పల్నాడులో క్షేత్రస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకు పురందేశ్వరి సమరి్పంచిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్‌ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించారు. రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కూడా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డీఎస్పీ పల్లపురాజు, మాచర్ల సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, ఎస్సై ఎం.రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ ద్వారా టీడీపీ కథ నడిపింది. అత్యంత వివాదాస్పదుడైన నారాయణస్వామిని కారంపూడి సీఐగా నియమించడమే అందుకు నిదర్శనం. టీడీపీ రౌడీమూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రేక్షక పాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం దాడులతో విరుచుకుపడ్డారు. సీఐ నారాయణ స్వామి పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం గమనార్హం. ఆయన పరిధిలోనే పాల్వాయి గేటు కూడా ఉంది. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సీఐ నారాయణస్వామి పరిధిలో ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు. కౌంటింగ్‌ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పిన్నెల్లిపై కుట్రపూరిత కేసు.. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో సీఐ నారాయణ స్వామి పూర్తిగా చంద్రబాబు సేవలో తరిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా గురువారం రాత్రి కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. పిన్నెల్లిపై జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించగా అప్పటికప్పుడు మరో తప్పుడు కేసు నమోదు చేయడం నారాయణ స్వామి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పది రోజుల క్రితం ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో పిన్నెల్లి సోదరులను తాజాగా నిందితులుగా చేర్చడం గమనార్హం. పల్నాడులో పచ్చ ముఠాలు పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 23 గంటల రికార్డింగ్‌లో ఎడిట్‌ చేసిన రెండు నిమిషాల వీడియో క్లిప్‌ మాత్రమే విడుదల కావడం వెనుక పచ్చ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తోపాటు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్‌ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారారని వెల్లడవుతోంది. పల్నాడు జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ నుంచే వెబ్‌ కాస్టింగ్‌ రికార్డింగ్‌ను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసి లీక్‌ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ రౌడీమూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్‌ కావడం వెనుక చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది. మరి దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? పవన్, బాలయ్య ప్రత్యేకమా?పోలింగ్‌కు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ.. టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసింది. నిబంధనల ప్రకారం ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. దర్జాగా ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. దీనిపై ఈసీ కనీసం స్పందించలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదు. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ నోరు మెదపలేదు.

Lok Sabha Election 2024: Sixth Phase Polling Updates In Telugu
LS 2024: కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్‌

Updates జమ్మూ కశ్మీర్‌:పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్‌, అనంత్‌నాగ్‌- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్‌ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులో​కి తీసుకు​న్నారని ఆమె ఆరోపణలు చేశారు.#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti along with party leaders and workers sit on a protest. She alleged that the police have detained PDP polling agents and workers without any reason. pic.twitter.com/dPJb4dolKQ— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన తెలంగాణ గవర్నర్‌ రాంచీ:జార్ఖండ్‌, తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన రాంచీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ:ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు#WATCH | Delhi minister & AAP leader Atishi casts her vote for #LokSabhaElections2024, at a polling booth in Delhi pic.twitter.com/AdfX0qlvkW— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ నారాయణ్‌ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi: Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Ranchi. pic.twitter.com/UoaWLUxEg7— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:బీజేడీ నేత వీకే పాండియన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పొలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | 5T Chairman and BJD leader VK Pandian casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling booth in Bhubaneswar. pic.twitter.com/WBOdNJ4ZSX— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంబీర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో గంబీర్‌ ఓటు వేశారు.#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్‌జమ్మూ కశ్మీర్‌ బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజౌరీ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.అనంత్‌ నాగ్‌-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్‌ కాన్ఫరెస్స్‌ (జేకేఎన్‌సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.#WATCH | Jammu and Kashmir BJP President Ravinder Raina casts his vote at a polling booth in RajouriJammu and Kashmir National Conference (JKNC) has fielded Mian Altaf Ahmad from the Anantnag-Rajouri Lok Sabha seat. PDP has fielded Mehbooba Mufti from this seat.… pic.twitter.com/LmEFuMkIOt— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ఫేజ్‌-1 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.ఆయన ఈస్ట్‌ ఢిల్లీ నుంచి బరిలో దిగారు.ఆయనపై ఆప్‌ కుల్దీప్‌ కుమార్‌ను పోటీకి దింపింది.#WATCH | Delhi BJP president Virendraa Sachdeva casts his vote at a polling booth in Mayur Vihar Phase 1. BJP has fielded Harsh Malhotra from East Delhi Lok Sabha seat. AAP has fielded Kuldeep Kumar#LokSabhaElections2024 pic.twitter.com/I9ftlwnS12— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీన్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆమె ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌ భారతిపై తలపడుతున్నారు#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj casts her vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi.AAP has fielded Somnath Bharti from the New Delhi Lok Sabha seat. pic.twitter.com/hCM2o3wqjx— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:విదేశాంగ మంత్రి డా. ఎస్‌ జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc— ANI (@ANI) May 25, 2024 హర్యానా:హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మీర్జాపూర్‌ గ్రామంలో ఓటు వేశారు.#WATCH | Haryana CM Nayab Singh Saini, his wife Suman Saini show their inked fingers after casting their votes at a polling booth in his native village Mirzapur, Narayangarh pic.twitter.com/TojCp0ygbU— ANI (@ANI) May 25, 2024ఢిల్లీ:ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులుఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్ఢిల్లీ:కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుUnion Minister Hardeep Singh Puri, his wife Lakshmi Puri show their inked fingers after casting their votes at a polling booth in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/j9norx9jL1— ANI (@ANI) May 25, 2024 ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరంమహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీPrime Minister Narendra Modi tweets "I urge all those who are voting in the 6th phase of the 2024 Lok Sabha elections to vote in large numbers. Every vote counts, make yours count too. Democracy thrives when its people are engaged and active in the electoral process. I specially… pic.twitter.com/bqM3ba2Okq— ANI (@ANI) May 25, 2024 ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.ఈశాన్య ఢిల్లీలో మనోజ్‌ తివారీ- కన్హయ్య కుమార్‌ బరిలో ఉ‍న్నారు.పురీలో సంబిత్‌ పాత్ర- అరూప్‌ పట్నాయక్‌ పోటీ పడుతున్నారు.హర్యానాలోని కార్నాల్‌లో మనోహర్‌ లాల్‌ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు. హర్యానా: హర్యానా మాజీ సీఎం, క​ర్నాల్‌ బీజేపీ అభ్యర్థి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కర్నాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, HaryanaCongress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రారంభమైంది.Voting for the sixth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 58 constituencies across 8 states and Union Territories (UTs) today. Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/leDZIY9HIa— ANI (@ANI) May 25, 2024 కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రారంభం కానుందిలోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది.#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 amJharkhand's 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM— ANI (@ANI) May 25, 2024 హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్‌ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్‌ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ పూర్తవనుంది.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rajouri, J&KJammu and Kashmir's Anantnag-Rajouri constituency constituency will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/15zvuLK08k— ANI (@ANI) May 25, 2024 మిగతా 57 స్థానాలకు జూన్‌ 1న చివరి విడతతో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్‌జీత్‌ సింగ్, కృష్ణపాల్‌ గుర్జర్‌తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్‌ హుడా (కాంగ్రెస్‌), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rohtak, HaryanaHaryana's 10 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/p2Cws1ktcr— ANI (@ANI) May 25, 2024 హరియాణాలోని కర్నాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్‌ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్‌ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్‌–ఆప్‌ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.

Result is against what Prashant Kishore said in five elections last year
పీకేవన్నీ తప్పుడు అంచనాలే

సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్‌’ వెబ్‌సైట్, చానల్‌ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్‌ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్‌ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్‌ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్‌ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్‌ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్‌ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్‌ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్‌ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్‌ స్పెషల్‌ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే.

IPL 2024 SRH In Final: Cummins On Decision To Bring Shahbaz As Impact Player
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌: కమిన్స్‌

ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్‌ డానియల్‌ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్‌ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్‌ఆర్‌హెచ్ సారథి కమిన్స్‌ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్‌ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్‌ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్‌ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్‌ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్‌ అహ్మద్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్‌ వెటోరీదే. ‌ ఈ లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్‌ప్రైజ్‌ఇక అభిషేక్‌ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్‌(2/24) చేయడం నిజంగా ఓ సర్‌ప్రైజ్‌ లాంటిదే. మిడిల్‌ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్‌ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్‌ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్‌ ఇచ్చాడు.ఇంపాక్ట్‌ చూపిన షాబాజ్‌కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ స్థానంలో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌.. యశస్వి జైస్వాల్‌(42), రియాన్‌ పరాగ్‌(6), రవిచంద్రన్‌ అశ్విన్‌(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ కెప్టెన్‌ సంజూ శాంసన్‌(10), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్‌-2: సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌), చెన్నై👉టాస్‌: రాజస్తాన్‌.. తొలుత బౌలింగ్‌👉సన్‌రైజర్స్‌ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్‌ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షాబాజ్‌ అహ్మద్‌(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్‌-2024కు పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024

Ap Elections 2024 May 25th Political Updates Telugu
May 25th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 24th AP Elections 2024 News Political Update8:00 AM, May 25th, 2024వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యచిత్తూరుఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యమృతుడు పుంగనూరు శేషాద్రిమదనపల్లెలోని శ్రీవారి నగర్‌లో ఈ ఘటన జరిగింది.తెల్లవారుజామున నివాస గృహంలోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారుకేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు 7:25 AM, May 25th, 2024బెంగళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ సప్లైలో టీడీపీ అనుచరులుడ్రగ్స్‌ అయినా, స్కాములైనా సూత్రధారులు టీడీపీ నేతలు, కార్యకర్తలే. బెంగళూరు రేవ్‌ పార్టీలో పచ్చ బ్యాచ్‌కు లింక్‌. చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్‌ చౌదరి, కొండేటి సుకుమార్‌ నాయుడు కీలక వ్యక్తులురేవ్‌ పార్టీకి వీరే డ్రగ్స్‌ సప్లయర్స్‌. చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులుపూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 7:00 AM, May 25th, 2024వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్లు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలుప్రైవేట్‌ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి విదేశాల నుంచి వీడియోలు పోస్ట్‌ చేసిన లోకేష్‌.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు కౌంటింగ్‌ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు 6:50 AM, May 25th, 2024పీకేవన్నీ తప్పుడు అంచనాలేగతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితంప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్‌ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకేఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్‌ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు 6:40 AM, May 25th, 2024ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?పోలింగ్‌కు రెండు రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఐ అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు 6:30 AM, May 25th, 2024మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రఅందుకు ఈసీలోని కొంతమంది సహకారం చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి

Chittoor TDP Leaders Hand In Bangalore Rave Party
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్‌ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్‌ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్‌ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్‌ చౌదరి, సుకుమార్‌ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్‌ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్‌ పార్టీకి డ్రగ్స్‌ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్‌ అబూబక్కర్‌ సిద్ధికి, ఎల్‌.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్‌ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్‌ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్‌ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్‌ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చారు. వాసు బర్త్‌ డే పార్టీ అనే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్‌ సిటీ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్‌ రాకెట్‌ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్‌ చేసిన కార్లలో ఫార్చూనర్‌ కారు ఏపీ 39 హెచ్‌ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.

Delhi Court Asked Rs 80 Crores From Ashneer Grover And His Wife To Travel To Us
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్‌ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్‌ అష్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్‌ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్‌, మాధురీలకు యూఏఈ గోల్డెన్‌ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్‌ కార్డ్‌ అనే ఐడెంటిటీ కార్డ్‌ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్‌ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్‌ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్‌ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్‌ గ్రోవర్‌ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్‌ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్‌ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్‌అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్‌ గ్రోవర్‌, మాధురి జైన్‌ గ్రోవర్‌లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్‌ గ్రోవర్‌ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

EVM votes are counted after postal ballots: andhra pradesh
ట్రెండ్‌ తెలియాలంటే నిరీక్షించాల్సిందే

సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్‌ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్‌ డ్రైవర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 24,918 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్‌ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్‌ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో గెజిటెడ్‌ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్‌ బ్యాలెట్‌ వెనుక రిటరి్నంగ్‌ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాల­ను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్‌ బ్యా­లె­ట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్‌ బ్యా­లెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లె­క్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొ­మ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

Telangana Vacation Bench Work Mid Night Details
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్‌ బెంచ్‌ ఆ ప్రొసీడింగ్స్‌ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్‌లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్‌ బెంచ్‌. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్‌ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్‌ బెంచ్‌. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్‌ 299, 300 ప్రకారం ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్‌ కోర్టులో అత్యవసర పిటిషన్‌లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్‌ బెంచ్‌ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్‌

Rasi Phalalu On 25-05-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు..!

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.విదియ సా.6.39 వరకు, తదుపరి తదియ నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.35 వరకు, తదుపరి మూల, వర్జ్యం: సా.6.39 నుండి 8.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.30 నుండి 7.07 వరకు అమృతఘడియలు: తె.4.33 నుండి 5.24 వరకు(తెల్లవారితే ఆదివారం). మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం: నూతన పరిచయాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.కర్కాటకం: వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.సింహం: బంధువులతో తగాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కన్య: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.మకరం: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. గృహయోగం. చర్చలు సఫలం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా పడతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. రుణయత్నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement