Top Stories
ప్రధాన వార్తలు
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
జనసేన డీలా పడింది... పోలింగ్ తర్వాత సరళి చూసిన నేతలలో నిరుత్సాహం ఆవహించింది. క్రాస్ ఓటింగ్ భయమూ జనసేన నేతలను వెన్నాడుతోంది. సొంత పార్టీ నేతలను నమ్మకపోవడమూ నష్టమే కలిగించిందంటున్నారు. దీనికి తోడు టీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాపు సామాజికవర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్నారు. ఈ నేపధ్యంలో ఫలితాలపై నేతలు అయోమయంగా ఉన్నారు. పోలింగ్ తర్వాత పవన్ ప్యాకప్ చెప్పేయడమూ జనసేన పరిస్ధితిని తెలియజేస్తోంది.పార్టీ పెట్టి పదేళ్లు అయినా..పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన గప్ చుప్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్యాకప్ చెప్పేయడం పార్టీని డైలమా పడేస్తోంది. పోలింగ్ సరళిపై విశ్లేషణ తర్వాత ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. జనసేన ఏర్పడి దశాబ్ధకాలం దాటుతున్నా ఇప్పటికీ అద్యక్షుడు పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోవడం పెద్ద మైనస్ గానే చెప్పుకోవాలి. ఆది నుంచి పవన్ వ్యవహార శైలే పార్టీని నట్టేట ముంచిందని భావిస్తున్నారు. ఇపుడు కూడా టీడీపీతో జతకట్టడం..పైగా టీడీపీ కోసం దిగజారిపోయి బలమైన సీట్లను సైతం వదులుకోవడం. కేవలం 21 సీట్లకే పరిమితమవడం ఇవన్నీ జనసేన పార్టీని కొంపముంచాయంటున్నారు.ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండాకేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహడ్డిని పదవి నుంచి దింపడానికే తాను కూటమిగా ఏర్పడ్డామని, ఓటు చీలకూడదంటూ పవన్ ప్రతీ సభలోనూ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నెగటివ్‌గా మారాయంటున్నారు. పార్టీకి ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండా సీఎం వైఎస్ జగన్‌పై అక్కసుతో కేవలం ఎదుట పార్టీపై బురదజల్లడం ప్రజలలో వ్యతిరేకత పెంచిందంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ కనీసం 50, 60 సీట్లలో నైనా పోటీ చేయాలని కాపు నేతలు సూచించారు.నేతల మాటలను పెడచెవినట్టి..మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటి నేతలైతే ఏకంగా పలుమార్లు పవన్‌కు లేఖ రాయడమే కాదు స్వయంగా కలిసి కూడా సగం సీట్లలోనైనా పోటీ చేయాలని సూచించారు. అయితే పవన్ ఆ మాటలన్నీ పెడచెవిన పెట్టి కేవలం 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లకే పరిమితమయ్యారు. అందులోనూ కూడా జనసేనని నమ్ముకుని దశాబ్ధకాలంగా పార్టీకోసం కష్టపడుతున్న నేతలకి కాకుండా ఇతర పార్టీ నేతలకి అవకాశం ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేయాల్సిన స్ధానాలని టీడీపీకి వదిలేయడం పార్టీలో చిచ్చురేపింది సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహంముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలోనూ ఈ వ్యవహారాలే పార్టీని రోడ్డున పడేశాయి. ఇలా మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో అవనిగడ్డ సీటులో టిడిపి నుంచి మండలి బుద్ద ప్రసాద్ లాంటి నేతలను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇక పాలకొండలో సైతం ఇదే విధంగా టీడీపీకిి చెందిన నిమ్మక జయరాజుని జనసేనలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం వివాదాన్ని రాజేసింది. అలాగే తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకి కూడా చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపై జనసేనలో అలజడి రేపింది.జనసేన బలం ఉన్న సీట్లని టీడీపీకి త్యాగంఅదే విదంగా మచిలీపట్నం ఎంపి సీటుని వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపి బాలశౌరికి ఇవ్వడం జనసేన నేతలని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇక గోదావరి జిల్లాలలో అయితే అక్కడ పార్టీ నియోజకవర్గి ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేన బలం ఉన్న సీట్లని సైతం టీడీపీకి త్యాగం చేయడం తీవ్ర నిరాశలోకి నెట్టింది. జనసేనకు గుడ్‌బైదీంతో కాకినాడ రూరల్ నుంచి మాజీ మేయర్ సరోజ, అమలాపురం ఇన్ చార్జి శెట్టి బత్తుల రాజాబాబు, రాజోలు ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడవరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ తదితరులు ఏకంగా జనసేనికు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్ కి కాకుండా బీజేపీకి వదిలేయడం కూడా పెద్ద వివాదాన్నే సృష్టించింది. పవన్ శైలిపై విమర్శలుచివరి నిమిషం వరకు పోతిన మహేష్ పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆఖరికి వైఎస్సార్సీపీలో చేరిపోయి పవన్ శైలిపై పూర్తి స్ధాయిలో ద్వజమెత్తారు. అడుగడుగునా పవన్‌ను ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెట్టారు.ఇక జగ్గంపేటలో అయితే పాఠంశెట్టి సూర్యచంద్ర జనసేనకు షాక్ ఇచ్చి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇక అనకాపల్లి సీటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృ్ణ కి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాకినాడ రూరల్‌లో పంతం నానాజీకి టిక్కెట్ ఇవ్వడంతో నిరాశపడిన మాజీ మేయర్ సరోజ తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతూ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశఇక రాజమండ్రి రూరల్ ఆశించి జనసేనకి పనిచేసిన కందుల దుర్గేష్‌ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోసం బుజ్జగించి చివరికి ఆయనను ఏమాత్రం అవగాహనలేని నిడదవోలు నియోజకవర్గానికి చివరి నిమిషంలో పంపడం అక్కరకు రాకుండా పోయిందంటున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ స్ధానాన్ని టీడీపీ ఇన్ చార్జి రామాంజనేయులుకి జనసేన కండువా కప్పి ఇవ్వడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడంపైనా మహిళా నేతలలో తీవ్ర నిరాశని మిగిల్చింది..ఇలా సీట్ల పంపకాలలోనే సొంత పార్టీలోనే పవన్ తన తీరుతో నిప్పు రాజేసుకున్నారు.ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్‌జనసేన పోటీ చేసిన నాలుగైదు స్ధానాలు మినహా మిగిలిన స్ధానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం వల్ల జనసేన బలం ఎన్నికల ముందే తేలిపోయిందని చెబుతున్నారు. ప్రజల్లోకి ఈ సంకేతాలు బలంగా వెళ్లడంతో ఎదురుగాలి వీచిందంటున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు .ఆ తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పవన్ పట్టించుకోలేదు. ఎన్నికలు ముగియగానే పవన్ రెండు నియోజకవర్గాలలో ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయాలను ఖాళీ చేశారు. ఆ తర్వాత తనకి ఓటు వేసిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల తర్వాత పవన్ తమకు అందుబాటులో ఉండరనే భావన ప్రజలలో పెరిగిపోయింది. ఈ ఎన్నికలలో పవన్ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగకుండా పిఠాపురం ఎంచుకోవడం వెనుక కారణం ఇదే అంటున్నారు. అలాగే తన గెలుపుకోసం పవన్ వారంలో మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ప్రచారం చేసినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటందని నేతలు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే టీడీపీ ఇంచార్జి చార్జి వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకత తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత పవన్ చంద్రబాబుతో చెప్పించుకుని స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి షో చేసినా అది పనిచేయలేదంటున్నారు.వంగా గీత పోటీ పవన్‌కు మైనస్ పిఠాపురం నుంచి ఒకసారి పవన్ కళ్యాణ్ నెగ్గితే శాశ్వతంగా తన సీటుకి ఎసరే అన్న ఉద్దేశంతో వర్మ పవన్ గెలుపుకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయడం పవన్‌కు మైనస్ అయిందంటున్నారు. నాలుగు దశబ్ధాలగా రాజకీయాల్లో ఉన్న వంగా గీతకి కాకినాడ జిల్లాలో మంచి పేరుంది. వంగా గీత జెడ్పీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలలో కలిసిపోయినవైనం వంగా గీతకి పాజిటివ్ అయిందంటున్నారు.దీనికి తోడు వంగాగీతపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలో ఆమెపై సానుభూతి పెంచేలా చేశాయంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వంగా గీత చేసిన ప్రసంగం. అదే సమయంలో గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇవన్నీ ఓటర్లని ఆలోచింపచేశాయంటున్నారు.పవన్ గెలిచినా ఎలాగూ సీఎం కాలేరుపవన్ గెలిచినా కూడా 21 సీట్లతో ఎలాగూ సీఎం కాలేరని... కనీసం మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదని భావించిన ఓటర్లు వంగా గీతని గెలిపిస్తే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం అవుతుందన్న ఉద్దేశంతోనే మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలు కట్టారంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై పోలింగ్ ముందు వరకు భారీ బెట్టింగ్‌లకు దిగిన జనసేన నేతలు ఇపుడు మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారట.జనసేన పార్టీ గోదావరి జిల్లాలనే నమ్ముకుని బరిలోకి దిగింది. మొదట నుంచి తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు.ఈ రెండు జిల్లాలలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో పవన్ తనకి ఈ రెండు జిల్లాలలో ఎదురు ఉండదనుకున్నారు. జనసేన మొత్తంగా 21 అసెంబ్లీ స్ధానాలలో పోటీ చేస్తే ఇందులో ఈ రెండు జిల్లాల నుంచి 11 స్ధానాలు ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాలలో కాపు ఓటర్లను తప్పితే మిగిలిన సామాజికవర్గాలని పట్టించుకోకపోవడం. అందరి నాయకుడిగా ఉండాల్సిన పవన్ కాపు చట్రంలోనే ఉండిపోవడం పార్టీకి చేటు తెచ్చాయంటున్నారు.ఈ నేపథ్యంలో కాపు ఓట్లలో కూడా పూర్తిగా తమకు పడలేదని నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీ కోసం పవన్ ఎన్ని త్యాగాలు చేసినా టిడిపి నుంచి మాత్రం పూర్తి స్ధాయిలో ఓట్ల బదిలీ జరగలేదని జనసేన నేతలు భావిస్తున్నారు. టీడీపీకి ఎంతలా సహకరించినప్పటికీ కూడా తమకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్ధాయిలో సహకారం అందలేదని, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా కొంప ముంచిందంటున్నారు. ఇలా పోటీ చేసిన 21 స్ధానాలలో కనీసం రెండు,మూడు స్ధానాలలో కూడా గెలుపు కష్టమేనని, వైఎస్ జగన్ గాలి వీస్తే ఆ సీట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు.ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలంఈసారైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని ఆశించామని, కానీ చేతులారా పవన్ ఆ అవకాశాలను సైతం జారవిడుచుకున్నారని, ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలమయ్యారని, కానీ చంద్రబాబు నమ్మకాన్ని సంపాదించుకున్నారని సొంతపార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్నికల ముగిసిన తర్వాత పోలింగ్ సరళి చూసుకున్న జనసేన నేతలు మీడియాకు పూర్తిగా ముఖం చాటేశారు. నేతలెవరూ మీడియా ముందుకురాలేదు.ఇక పవన్ అయితే తన ఓటు కూడా తనకి వేసుకోలేకపోయారు.. మంగళగిరిలో ఓటు వేసిన తర్వాత అదే రోజు సాయంత్రం పవన్ వారణాసి వెళ్లి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా వారణాసి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల ముగియడంతో ఆంద్రా నుంచి ప్యాకప్ చెప్పారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా అటు పవన్ తీరుతో జనసేన పార్టీ పూర్తిగా డీలా పడింది.
మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!
విద్యుత్ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
విజయవాడ: ఓ మహిళా డాక్టర్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్ షాక్‌కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఆ ఘటనను చూశారు. ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె.. ఉన్నపళంగా సీపీఆర్ చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్విజయవాడ - అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024
T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్ బోర్డులు జట్లను ప్రకటించాయి.అప్పుడు సెమీస్లోనేజూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ రెండో దఫా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు.గత ప్రపంచకప్-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగగా ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. అలాగే ఆతిథ్య వెస్టిండీస్.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్ పేర్లను విస్మరించడం గమనార్హం.కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో!
May 17th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 17th AP Elections 2024 News Political Updates04:16 PM, May 17th, 2024మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే: : బొత్సటార్గెట్ 175 దగ్గరకు వస్తాంఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందితొందరపాటు నియమాకాల వల్లే హింసాత్మక ఘటనలుఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలుహింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించంరాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నానుఅధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలిరాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారుమాపై నిందలు వేయడం సరికాదుహింసాకాండకు వైఎస్సార్సీపీ పూర్తి వ్యతిరేకంప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు 04:13 PM, May 17th, 2024జనసేన డీలా.. నేతల్లో కనిపించని ఉత్సాహంపోలింగ్ తర్వాత నేతలలో నిరుత్సాహంపిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....జనసేనకి దెబ్బకొట్టిన క్రాస్ ఓటింగ్ఎన్నికల తర్వాత పవన్ గప్ చుప్పోలింగ్ తర్వాత ప్యాకప్ చెప్పేసిన పవన్ఆదినుంచి పవన్ వైఖరే పార్టీకి కొంపముంచిందంటున్న నేతలుటీడీపీ కోసం సీట్లు వదులుకోవడమే పార్టీకి చేటుచేసిందనే వ్యాఖ్యలుకాపులు మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని విశ్లేషణగోదావరి జిల్లాలలోనూ ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్న నేతలుకూటమి నుంచి అందని సహకారంటీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాలేదనే అనుమానాలు 03:30 PM, May 17th, 2024విజయవాడఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటుపై సీఎస్ కసరత్తుముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలిస్తున్న ప్రభుత్వంరవి ప్రకాష్, వినీత్ బ్రిజ్ లాల్, పిహెచ్డీ రామకృష్ణలలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం.రెండు రోజుల్లోగా పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల పై నివేదిక ఇవ్వనున్న సిట్.ఎన్నికల అనంతరం హింసలో భాగస్వామ్యం అయిన పోలీస్ అధికారులు, పోలీసుపైన నివేదిక ఇవ్వనున్న సిట్.03:00 PM, May 17th, 2024తాడేపల్లి :కుట్ర ప్రకారమే అల్లర్లు జరిగాయి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదు.రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణం.అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది.చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతం?ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలి.నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారు.అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి.టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.జూన్ 4న వైఎస్ జగన్ సునామీ వస్తుంది.చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?వ్యవస్థలను మేనేజ్ చేసే కట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు.పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారు.ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటి?ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయి.02:40 PM, May 17th, 2024విజయవాడ:విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేతవైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీసీపీని కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ లీగ్ సెల్ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయివైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారుకొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుకావాలనే బైండోవర్లు పెట్టి వేధిస్తున్నారునిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి నిర్భదించారువైఎస్సార్సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి 02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్ అభ్యర్థులుజాయింట్ కలెక్టర్ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్ఎస్2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్ జగన్6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్2019కి మించి 2024లో వైఎస్సార్సీపీ ప్రభంజనంజూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా
కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్‌ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్)
ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట వైరల్ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్ వేశాడు. అది అల్లు అర్జున్ గురించే అంటూ నెట్టింట వైరల్ అయింది.నాగబాబు ట్వీట్‌తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్ పేజీని నాగబాబు క్లోజ్ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్ కుమారుడిగా.. మెగాస్టార్ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్‌లో ఉంటారు.
తప్పక చదవండి
- ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్‌తో
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
సినిమా
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా
కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్‌ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్)
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్‌డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్‌డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్‌డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్‌లో జత చేసింది. ఆ క్యాప్షన్‌కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్‌లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ!
ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. రీసెంట్గా ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు సదరు హీరో హాజరు కావడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)సోమవారం సాయంత్రం మంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఘాట్కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దాంతో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. వీళ్లలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు.తాజాగా వీళ్లిద్దరికీ అంత్యక్రియలు జరగ్గా.. కార్తిక్ ఆర్యన్ హాజరయ్యాడు. తన బంధువులకు తుది నివాళులు అర్పించాడు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు. భవేశ్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..: నటి లయ)14 killed, 74 injured in this giant hoarding collapse in Mumbai’s dust storm yesterday. The 17,000 sqft hoarding was listed in the Limca Book of Records last year. The BMC says it was illegal, unauthorised.FOURTEEN lives gone & counting.Banana republic. pic.twitter.com/uHqx0tW1in— Shiv Aroor (@ShivAroor) May 14, 2024
ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..
హీరోయిన్ లయ.. అప్పట్లో యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఫేవరెట్ హీరోయిన్. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కోవిడ్ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టింది.అందుకే ఇండియాకు వచ్చేశాతాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.నన్ను ఫాలో అవుతూ..అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫొటోలు
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య న్యూ లుక్.. క్యూట్ ఫొటోలు
కిల్లింగ్ లుక్స్‌లో 'సత్యభామ' హంగామా ఫొటోలు
Sharanya Pradeep: అంబాజీపేటతో ఫిదా చేసిన 'శరణ్య ప్రదీప్' ఫోటోలు వైరల్
క్రీడలు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్‌బాల్‌లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్‌ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్‌బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్‌గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే
T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్ బోర్డులు జట్లను ప్రకటించాయి.అప్పుడు సెమీస్లోనేజూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ రెండో దఫా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు.గత ప్రపంచకప్-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగగా ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. అలాగే ఆతిథ్య వెస్టిండీస్.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్ పేర్లను విస్మరించడం గమనార్హం.కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో!
APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్.. మూడో సీజన్ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్ సెన్సేషన్ కోసం గోదావరి టైటాన్స్ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్ కుమార్ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వైజాగ్ కుర్రాడు నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 7 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
బిజినెస్
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం.
మలైకా అరోరా అపార్ట్మెంట్ అద్దెకు.. రెంట్ ఎంతంటే?
ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్ 4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.మలైకా అరోరా తన అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్బర్గ్కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది.
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్ అంబానీపై క్రిప్టోముఠా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్ హెడ్డింగ్లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్ఫామ్లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు
కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్ వ్యాపారంలో డిమాండ్ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్ టైమ్స్ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్ పెంచనున్నాయి.
వీడియోలు
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..
ఫ్యామిలీ
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
ఆహార ప్రాసెసింగ్ రంగంలో కృత్రిమ మేధా వినియోగాన్ని వేగవంతం చేయాలని భారత్ చూస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్(ఎన్ఐఎప్టీఈఎం) నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నిజానికి ఇది భారత్‌లో ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఆహార ప్రాసెసింగ్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై సీనియర్ బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సలహాదారులు ఏఐ పరిష్కారాలను అమలు చేసేందుకు సరైన రోడ్‌మ్యాప్ వ్యూహం అవసరమని అన్నారు. ఈ ఎన్ఐఎప్టీఈఎం సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనితా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఒక పరిశ్రమగా మనం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈటీవై) మద్దతు కూడా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో నీతీ అయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన ఆహార ప్రాసెసింగ్‌కి ఈ "వాతావరణ స్మార్ట్" రైతు ఆదాయాలను పెంపొందించడానికి, వినియోగదారులను సంతృప్తిపరచడానికే కాకుండా పెరుగుతున్న వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో గొప్ప సహాయకారిగా ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సులభమైన పోర్టబుల్ పరికరాలను అవపసరమని, అందుకసం ఏఐని ఉపయోగించాలని చెప్పారు. అదీగాక 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ ఏఐ పరిష్కారాలు మొత్తం రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.ఆహార పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ..ఆహార రంగంలో కృత్రిమ మేధస్సు అనేది ఆహార ఉత్పత్తి, ఖచ్చితమైన వ్యవసాయం, నాణ్యత నియంత్రణ, వ్యక్తిగతీకరించిన పోషణ, సరఫరా గొలుసు నిర్వహణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతలు, డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్లికేషన్లు సమర్థవంతమైన ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తూ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయని అర్థం.(చదవండి: ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!)
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్‌తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్‌ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో పది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది. డెల్వ్.ఏఐ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి ఉండటం విశేషం.పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి ఉన్నతికి పునాది వేశారు. ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది. ఆమెకు 11 ఏళ్లున్నపుడు కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఆమె ఇంటర్న్‌షిప్ ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్‌షిప్ సమయంలో, కోవిడ్ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలోకి ప్రవేశించింది. ఓపెన్ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్ కూడా మొదలైంది.హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది. కేవలం ఒక ఏడాదిలోనే రూ100 కోట్లకు చేరింది.
కిల్లింగ్ లుక్స్‌లో 'సత్యభామ' హంగామా ఫొటోలు
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
న్యూస్ పాడ్‌కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది.