Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Victory In AP Assembly Elections says Majority Exit Polls 2024
వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్‌), చాణక్య (పార్థదాస్‌) తేల్చాయి. జాతీ­య, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టు­లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించా­యి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ నిర్వహించే సర్వే, ఎగ్జిట్‌ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేను ఆరా మస్తాన్‌ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్‌ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పా­రు. ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవు­తుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్‌ చాణక్య, పోల్‌ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్‌ లాబొరేటరీ, జన్మత్‌ పోల్, సీపీఎస్‌ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజ­యం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్‌ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసు­కుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయ­మ­ని క్యూ మెగా అమేజీ పొలిటికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఖాదర్‌ ఖాన్‌ పఠాన్‌ తెలిపారు. 22 పార్లమెంట్‌ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వ­చ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివా­­రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్‌ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్‌ భాస్కర్‌ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్‌–18 వంటి జాతీ­య మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.

mahabubnagar mlc bypoll counting Updates june-2-2024 in Telugu
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు

counting Updatesమహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయంబీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ కుమార్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డి గెలుపొందారు.బీఆర్‌ఎస్‌ 763, కాంగ్రెస్‌ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విమహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మన్నె జీవన్‌ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్‌ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఫలితాలను నేటికి (జూన్‌ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Telangana Formation Day Special Events Live Updates
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అప్‌డేట్స్‌..

Live Updates..👉అమరులకు సీఎం రేవంత్‌ నివాళులు..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు.👉తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులుకేటీఆర్ కామెంట్స్‌..తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి.సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదు.ఛత్తీస్‌గఢ్‌ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రికానీ పది సంవత్సరాల తెలంగాణను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం రేవంత్‌.తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు.రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రిఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్‌ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ… ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ… “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం… ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని… విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…ఆ పిడికిలి విప్పిచూస్తే…త్యాగం…ధిక్కారం…పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో…ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…అందరికి… pic.twitter.com/09sJMwlyFN— Revanth Reddy (@revanth_anumula) June 2, 2024 తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులుఅసెంబ్లీ కౌన్సిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ 👉 తెలంగాణ సెక్రటేరియట్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలుజాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ శాంతకుమారి,పాల్గొన్న ముఖ్య కార్యదర్శిలు కార్యదర్శిలు అధికారులు సిబ్బంది గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్.జాతీయ జెండా ఎగరేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు.కాసేపట్లో గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు..గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అరిపించనున్న కాంగ్రెస్ నేతలు.. 👉 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌ 13 ఏండ్ల ఉద్యమంతో స్వప్నం సాకారం.. 10 ఏండ్ల కేసీఆర్ పాలనతో ప్రగతి వికాసం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయోజనాలను, పదేండ్ల ప్రగతి పాలన ఫలాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమ పంథాకు సిద్ధమవుదాంరాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.జై తెలంగాణ ✊… pic.twitter.com/WAmTHKgCEe— BRS Party (@BRSparty) June 2, 2024 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.👉 ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. 👉 ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవిష్కరించనున్నారు.👉 అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగం ఉండనుంది.

Sakshi Editorial On Exit polls 2024
విజయం సరే... విలువలు?

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌ నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

AP Elections 2024: 2nd June Political Updates In Telugu
June 2nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

June 2nd AP Elections 2024 News Political Updates..8:15 AM, June 2nd, 2024ఫ్యాన్‌దే హవా.. ఏపీలో వైఎస్సార్‌సీపీ దెబ్బకు చేతులెత్తేసిన కూటమివైఎస్సార్‌సీపీ భారీ విజయమని తేల్చిన ఎగ్జిట్‌పోల్స్‌వైఎస్సార్‌సీపీ గెలుపు లోడింగ్‌.. విజయం లాంఛనమే ఏపీలో వైయస్‌ఆర్‌సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఇక లాంఛనమే#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/coTiCq7yz9— YSR Congress Party (@YSRCParty) June 1, 2024 Times Now- @ETG_Research #ExitPoll PredictionsAndhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections:- YSRCP: 14- BJP+: 11- Congres : 0- Others: 0@padmajajoshi further takes us through vote share predictions. pic.twitter.com/6R9hAcNQiA— TIMES NOW (@TimesNow) June 1, 2024 8:00 AM, June 2nd, 2024వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ94–104 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ‘ఆరా’ మస్తాన్‌50% ఓట్లతో 110–120 స్థానాల్లో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్‌ వెల్లడివైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్‌ చాణక్య, అగ్నివీర్, పోల్‌ స్ట్రాటజీ గ్రూప్, రేస్‌ తదితర సంస్థలులోక్‌సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా సంస్థలువైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్ట్‌లపై టీడీపీ ఒత్తిళ్లుఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ 7:30 AM, June 2nd, 2024పోస్టల్‌ బ్యాలెట్లపై భద్రం ఏజెంట్లూ.. అవి అత్యంత కీలకం.. లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్‌ కేంద్రాలకు రావాలి ఆర్‌వో టేబుల్‌ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి 13ఏ డిక్లరేషన్‌పై ఓటరు సంతకం, అటెస్టింగ్‌ సంతకం తప్పనిసరి అనుమానం వస్తే వెంటనే ఆర్వోకి ఫిర్యాదు చేయాలి 7:00 AM, June 2nd, 2024ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీకి సానుకూలత : సజ్జలసీఎం జగన్‌ పాజిటివ్‌ ప్రచారం ఎన్నికల్లో బాగా పనిచేసింది: సజ్జల మహిళా ఓటర్లు మా వైపే నిలబడ్డారని స్పష్టమైంది ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో పెద్దపీట 4న కౌంటింగ్‌లో మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి సొంతంగా పోటీ చేసే శక్తి లేకనే చంద్రబాబు పొత్తులు పోస్టల్‌ బ్యాలెట్‌పై బాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం 6:30 AM, June 2nd, 2024మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయంవైఎస్‌ జగన్‌ పాలన వైపు మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాల మొగ్గు వైఎస్సార్‌సీపీ తన ఓటు శాతాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కాపాడుకుంది 94 –104 సీట్లు వైఎస్సార్‌సీపీకి.. 71 – 81 సీట్లు టీడీపీ కూటమికి వైఎస్సార్‌సీపీకి 13–15 ఎంపీ స్థానాలు.. టీడీపీ కూటమికి 10–12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు బీజేపీ 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌ 7–8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా సర్వే రిపోర్టు ఇచ్చానన్న ఆరా మస్తాన్.

Virat Kohli Receives ICC ODI Player Of The Year 2023 Poses With Trophy Video Viral
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్‌

టీ20 ప్రపంచకప్‌-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్‌.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా 2023లో విరాట్‌ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్‌-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్‌ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్‌) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్‌ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc)

Sikkim And Arunachal Pradesh Assembly Poll Counting Updates
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: భారీ లీడింగ్‌లో బీజేపీ

Counting Updates సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్‌కేఎం చీఫ్‌ సీఎస్‌ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్‌ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్‌కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్‌ పీపుల్స్‌ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఒక స్థానంలో లీడింల్‌ ఉంది. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో కౌంటింగ్‌ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) పవన్‌కుమార్‌ సైన్‌ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్‌ యాక్షన్‌ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.

T20 WC 2024 1st Match Aaron Jones Shines USA Beat Canada Historic Win
T20 WC 2024: యూఎస్‌ఏ సంచలన విజయం

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో తొలి మ్యాచ్‌ ఫలితం వచ్చేసింది. డలాస్‌ వేదికగా అతిథ్య అమెరికా జట్టు కెనడాను చిత్తుగా ఓడించింది. ఈ ఐసీసీ టోర్నీలో అరంగేట్ర ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది.. విజయంతో మెగా ఈవెంట్‌ను మొదలుట్టింది. అంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్‌ఏ క్రికెట్‌ హిస్టరీలోనే ఈ గెలుపును చిరస్మరణీయంగా మార్చుకుంది.సరికొత్త రికార్డుఅంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్‌ఏ క్రికెట్‌ హిస్టరీలో జూన్‌ 2ను చిరస్మరణీయంగా మార్చుకుంది.తొలి హాఫ్‌ సెంచరీ ‘మనోడి’దే!డలాస్‌ వేదికగా గ్రాండ్‌ ప్రైయరీ స్టేడియంలో కెనడాతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌, భారత మూలాలున్న నవనీత్‌ ధాలివాల్‌(61), నికోలస్‌ కిర్టాన్‌(51) అర్ధ శతకాలతో మెరవగా.. కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది.అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది యూఎస్‌ఏ. ఓపెనర్‌ స్టీవెన్‌ టేలర్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ మొనాక్‌ పటేల్‌ కూడా 16 పరుగులకే నిష్క్రమించాడు.ఆండ్రీ గౌస్‌ ఆదుకుంటే. ఆరోన్‌ దంచికొట్టాడుదీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూఎస్‌ఏ జట్టును వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆండ్రీ గౌస్‌ ఆదుకున్నాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు.గౌస్‌కు తోడైన వైస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ జోన్స్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోరే ఆండర్సన్‌(3 నాటౌట్‌) తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో యూఎస్‌ఏకు చారిత్రాత్మక గెలుపు అందించాడు.గౌస్‌, జోన్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన యూఎస్‌ఏ.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా వరల్డ్‌కప్‌ తొమ్మిదో ఎడిషన్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.చదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్‌ View this post on Instagram A post shared by ICC (@icc)

SSMB29: Janhvi Kapoor To Play Key Role In Mahesh Babu, Rajamouli Movie
SSMB 29: మహేశ్‌ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్‌ బ్యూటీ?

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో హాలీవుడ్‌ హీరోలా మహేశ్‌ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్‌ సరసన ఓ బాలీవుడ్‌ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్‌ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్‌. ఇక ఇప్పుడు మహేశ్‌-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్‌ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్‌ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Govt clarification on certificates issued by driving centres
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత

గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్‌ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్‌ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్‌ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement