Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP CM YS Jagan Election Campaign Schedule
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజక­వర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్‌సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

lok sabha election 2024: Phase 3 polling updates in telugu
General Elections 2024: ప్రారంభమైన మూడో విడత పోలింగ్‌

updates మధ్య ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు  ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హకక్కు వినియోగించుకున్నారు.భోపాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి  పోలింగ్‌ కేంద్రంలో  బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్‌ యాదవ్‌ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ  ట్వీట్‌..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024  లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర,  కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్   ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23  దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్‌ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్‌ షా(గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్‌ మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), ఎస్పీ సింగ్‌ బఘేల్‌(ఆగ్రా)మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(విదిశ), దిగ్విజయ్‌సింగ్‌(రాజ్‌గఢ్‌), ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్‌ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్‌ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్‌ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈరోజు పోలింగ్‌ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్‌ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్‌ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్‌ 4న చేపడతారు.రాష్ట్రం               సీట్లుగుజరాత్‌           25కర్ణాటక             14మహారాష్ట్ర          11ఉత్తరప్రదేశ్‌         10మధ్యప్రదేశ్‌          9ఛత్తీస్‌గఢ్‌            7బిహార్‌                5అస్సాం               4బెంగాల్‌              4గోవా                  2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్‌        2 

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 

Lok sabha elections 2024: PM Narendra Modi, Amit Shah to Cast Vote in Ahmedabad
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్‌

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్‌ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్‌...                  వదోదర... కొత్త ముఖాలు గుజరాత్‌లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్‌ ధనంజయ్‌ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్‌ హేమంగ్‌ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరఫున పధియార్‌ జస్పాల్‌సింగ్‌ మహేంద్రసింగ్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్‌... రూపాలాకు రాజ్‌పుత్‌ గండం గుజరాత్‌లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్‌ ఎంపీ మోహన్‌ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్‌ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పరేశ్‌బాయ్‌ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్‌ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.భావనగర్‌.. బరిలో ఆప్‌ ఈ స్థానంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్‌ నరన్‌బాయ్‌ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ భారతీబెన్‌ ధీరూబాయ్‌ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్‌ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్‌ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు.  పోర్‌బందర్‌.. మన్‌సుఖ్‌ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్‌ ధడక్‌ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్‌ వసోయాకే కాంగ్రెస్‌ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.  బనస్కాంత.. గెనీబెన్‌ సవాల్‌ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్‌’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్‌ ఠాకోర్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ పర్వత్‌బాయ్‌ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ రేఖా బెన్‌ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్‌లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్‌ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్‌’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్‌ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్‌ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్‌ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్‌ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్‌.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్‌ సింఘ్‌ వాఘేలా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్‌ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారు. గిఫ్ట్‌ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్‌ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Confusion in Postal Ballot Polling
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు

నరసరావుపేట రూరల్‌/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్‌తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్ల­ంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్‌ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి కిడ్నాప్‌ నరసరావుపేటలో ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్‌ల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద  టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.  కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి  తీసుకెళ్లారని రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ వర్గీయులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్‌కు ఎదురుగా ఉన్న పోలింగ్‌ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్‌ పే, గుగూల్‌ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్‌ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్‌ అసిస్టెంట్‌ మట్ట కిషోర్‌బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్‌బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్‌కు ఓటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కిషోర్‌బాబుకు మంగళవారం 140వ బూత్‌లో ఓటు కల్పిస్తామని ఏఆర్‌వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రం హెల్ప్‌డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్‌.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్‌ ఎస్‌జీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఏఆర్‌వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

Trump fined and threatened with jail for gag order violations
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక

న్యూయార్క్‌: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్‌ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్‌ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్‌ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి  ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్‌ ఎం.మెర్చాన్‌ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. 

Sakshi Editorial On Rahul Gandhi Rae Bareli
రాయ్‌బరేలీ వ్యూహం

ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్‌ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్‌ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్‌ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్‌ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్‌ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్‌ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్‌ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్‌లో రాహుల్‌ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్‌ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్‌ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్‌ శర్మ పంజాబ్‌ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్‌ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్‌ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్‌ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్‌ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్‌ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్‌ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్‌ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్‌ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! 

Sakshi Guest Column On CM YS Jagan Welfare Govt
సమాన అవకాశాల... విద్యా విప్లవం

భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్‌. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్‌ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్‌లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్‌ పేరెంట్‌కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘నాడు–నేడు’  కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్‌ బస్‌స్టాప్‌ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్‌ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్‌ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ  ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్‌ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్‌లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్‌ పద్ధతిలో...  అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్‌ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్‌. జగన్‌ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్‌కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్స్‌ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్‌ స్క్రీన్‌ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్‌ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్‌మొబైల్‌: 94405 95858

TDP Former Minister List of Irregularities: Andhra pradesh
అక్రమాలు కో‘కొల్లు’లు

విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్‌మెంట్లు చేశారు.  ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్‌లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు.   ఎక్సైజ్‌లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్‌ దందా నడిపారు.  ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్‌ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ∗ ఎక్సైజ్‌ శాఖలో డిజిటలైజేషన్‌ నిమిత్తం కాంట్రాక్టర్‌ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్‌ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.  ఎక్సైజ్‌ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం.  ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు.  ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది.  ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్‌ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు.  పొక్లెయిన్‌ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు.   ∗  ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ,  అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి.   ∗ బినామీల పేరుతో కాల్‌మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.   ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్‌ ద్వారా లోన్‌ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్‌ గ్రిల్‌ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్‌ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ∗ ఒక్కో వాటర్‌ ట్యాంక్‌ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్‌ నుంచి మంగినపూడి బీచ్‌ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది.   ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు     ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్‌ 192/2020తో  120 బీ, 302 ఐపీసీ 109 రెడ్‌ విత్‌ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి.  

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all