Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో ఉన్న పామూరు బస్‌స్టాండ్‌ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.   

Elections 2024: Rahul Gandhi To Contest From Raebareli Officially Announced
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విస్ట్‌ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్‌ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్‌ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే1952లో రాయ్‌ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్‌ గాంధీ(రాజీవ్‌ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్‌ నారాయణ్‌ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్‌ నెహ్రూ, షీలా కౌల్‌ కాంగ్రెస్‌ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్‌ సింగ్‌ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ  వచ్చారు.  ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ)‌ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్‌ బరేలీ  ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్‌ కొనసాగింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్‌ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్‌ నుంచి మాత్రమే ఆయన నామినేషన్‌ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్‌ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది.  దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు.. రాహుల్‌ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.మరోవైపు కాంగ్రెస్‌ పెద్దలు రాహుల్‌ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది.  ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో  వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన  చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.  అమేథీ నుంచి కాకుండా రాయ్‌ బరేలీ నుంచి పోటీకి  రాహుల్‌   ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు  ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేయబోతున్నారు.  తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు  రాహుల్‌  నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి  హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో  అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

AP Politics And Election Live Updates May 3rd
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 3rd May..'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్‌కు పిచ్చి పీక్స్‌లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్‌ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్‌   హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం.   దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే   మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్‌ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం  ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు  ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం  పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం    ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం   చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి

Sunrisers Hyderabad surprise win
ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...

సన్‌రైజర్స్‌పై 202 పరుగుల లక్ష్యఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్‌కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్‌ బౌలింగ్‌ అనూహ్యంగా  పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్‌ 7  పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీయగా, 19వ ఓవర్లో కమిన్స్‌ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా, భువనేశ్వర్‌ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్‌ వికెట్ల  ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్‌ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా రాయల్స్‌ కోల్పోగా, ఓటమి అంచుల నుంచి హైదరాబాద్‌ ఒక పరుగుతో గట్టెక్కింది.  సాక్షి, హైదరాబాద్‌: ఉత్కంఠభరిత పోరులో చివరకు హైదరాబాద్‌ పైచేయి సాధించింది. ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... హెన్రిచ్‌ క్లాసెన్‌ (19 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.అనంతరం రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. భువనేశ్వర్‌కు (3/41) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  నితీశ్‌ ధమాకా... పవర్‌ప్లే ముగిసేసరికి 2 వికెట్లకు 37 పరుగులు... ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ చేసిన అత్యల్ప పరుగులివి. దీనిని చూస్తే రైజర్స్‌ 200 పరుగులకు చేరగలదని ఎవరూ ఊహించలేదు. అభిషేక్‌ శర్మ (12), అన్‌మోల్‌ప్రీత్‌ (5) విఫలం కాగా... హెడ్‌ అప్పటికి 17 బంతుల్లో 18 పరుగులే చేసి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. చహల్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాది హెడ్‌ జోరు ప్రదర్శించగా... నితీశ్‌ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. 10 ఓవర్ల తర్వాత స్కోరు 75 పరుగులకు చేరింది. 37 బంతుల్లో హెడ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. చహల్‌ వేసిన 13వ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లతో నితీశ్‌ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు హెడ్‌ను బౌల్డ్‌ చేసి అవేశ్‌ ఈ జోడీని విడదీయగా, కొద్ది సేపటికి 30 బంతుల్లో నితీశ్‌ అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో రైజర్స్‌ బ్యాటర్లు నితీశ్, క్లాసెన్‌ మరింత చెలరేగడంతో 70 పరుగులు వచ్చాయి. అశ్విన్‌ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు కొట్టిన నితీశ్‌... అవేశ్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టాడు. మరోవైపు చహల్‌ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన క్లాసెన్‌... చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టి స్కోరును 200 పరుగులు దాటించాడు.  కీలక భాగస్వామ్యం... భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి బట్లర్‌ (0), ఐదో బంతికి సామ్సన్‌ (0) అవుట్‌... రైజర్స్‌ పైచేయి! కానీ 7 పరుగుల వద్ద యశస్వి ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కమిన్స్‌... 24 పరుగుల వద్ద పరాగ్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన అభిషేక్‌... అంతే... ఆట రాజస్తాన్‌ వైపు మొగ్గింది. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత యశస్వి, పరాగ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వికెట్లు పడినా వీరిద్దరు ధాటిగా ఆడి పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఇద్దరూ బ్యాటర్లు రైజర్స్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. ఒకే ఓవర్లో యశస్వి 30 బంతుల్లో, ఆ తర్వాత 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే విజయం వైపు దూసుకుపోతున్న దశలో వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ తర్వాత కీలక సమయాల్లో మరో మూడు వికెట్లు చేజార్చుకున్న రాయల్స్‌ ఓటమిని ఆహా్వనించింది.  స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) అవేశ్‌ 58; అభిషేక్‌ (సి) జురేల్‌ (బి) అవేశ్‌ 12; అన్‌మోల్‌ప్రీత్‌ (సి) యశస్వి (బి) సందీప్‌ 5; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (నాటౌట్‌) 76; క్లాసెన్‌ (నాటౌట్‌) 42; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–35, 3–131.  బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–33–0, అశి్వన్‌ 4–0–36–0, అవేశ్‌ 4–0–39–2, సందీప్‌ శర్మ 4–0–31–1, చహల్‌ 4–0–62–0.  రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (బి) నటరాజన్‌ 67; బట్లర్‌ (సి) జాన్సెన్‌ (బి) భువనేశ్వర్‌ 0; సామ్సన్‌ (బి) భువనేశ్వర్‌ 0; పరాగ్‌ (సి) జాన్సెన్‌ (బి) కమిన్స్‌ 77; హెట్‌మైర్‌ (సి) జాన్సెన్‌ (బి) నటరాజన్‌ 13; పావెల్‌ (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 27; జురేల్‌ (సి) అభిõÙక్‌ (బి) కమిన్స్‌ 1; అశ్విన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–135, 4–159, 5–181, 6–182, 7–200. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–41–3, జాన్సెన్‌ 4–0–44–0, కమిన్స్‌ 4–0–34–2, నటరాజన్‌ 4–0–35–2, ఉనాద్కట్‌ 2–0–23–0, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1–0–12–0, షహబాజ్‌ 1–0–11–0.  ఐపీఎల్‌లో నేడుముంబై X  కోల్‌కతావేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Operation Leopard Success At Hyderabad Airport
శంషాబాద్‌: ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌

సాక్షి, రంగారెడ్డి:  శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్‌ చిరుత  ఎట్టకేలకు సక్సెస్‌ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.  శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

TDP Chandrababu benami land grabs in Andhra pradesh
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతి  అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ.  సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్‌ కథలు వల్లె వేశారు. సీఎం జగన్‌ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్‌ సిటీ ముసుగులో మురళీమోహన్‌ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు.  రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు.  అంతర్జాతీయ కుంభకోణం  రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్‌ ఆఫ్‌ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్‌ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్‌ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్‌ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి  భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్‌ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్‌ పొందుపరిచారు. 

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పింఛన్‌ డబ్బుల కోసం మండుటెండలో బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్న వృద్ధులు
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి

వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్‌ 26న సీఎస్‌కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం.  (ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది)  విలన్‌ నంబర్‌–1  పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్‌ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే  డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్‌ అధికా­రులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్‌ నంబర్‌ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్‌ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు?  – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్‌(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్‌ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది.  ఏప్రిల్‌ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి:  బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్‌గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు.  పింఛన్‌దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.   ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్‌గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్‌ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్‌దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్‌ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్‌ యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్‌ తిరిగి యాక్టివేట్‌ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు.  బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్‌ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగానే దీన్ని అడ్డు­కుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్‌లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్‌లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్‌ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్‌ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్‌ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం  ప్రతినెలా 1వ తేదీన వలంటీర్‌ వచ్చి పింఛన్‌ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది.      – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్‌ రన్నింగ్‌లో లేదంటున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినెలా వలంటీర్‌ను మా ఇంటికి పంపించి పింఛన్‌ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్‌ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్‌ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్‌ రన్నింగ్‌లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్‌ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు.      –  షేక్‌ గాలిబ్‌సాహెబ్, పింఛన్‌దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్‌ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్‌ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్‌ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్‌కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్‌ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్‌ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు  నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్‌ ఇవ్వడం లేదు. పింఛన్‌ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్‌లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు.  – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్‌ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్‌ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్‌ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం.     – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  

Sakshi Editorial On T20 World Cup Indian Cricket Team
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...

రానున్న టీ20 వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్‌ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్‌ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్‌ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ ప్యానెల్‌ చేసిన ఎంపికలో కొందరు స్టార్‌ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబయ్‌ ఇండియన్స్‌ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను వైస్‌ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీలకు సెలక్షన్‌ ప్యానెల్‌ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్‌ – బ్యాట్స్‌ మన్‌ రిషభ్‌ పంత్‌ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్‌ ఆర్డర్‌లో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ ఆప్షన్‌ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్‌ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్‌ కప్‌ పిలుపొచ్చింది. మిడిల్‌ ఆర్డర్‌లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్‌. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్‌ కుర్రాడు శివమ్‌ దూబే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టులో మిడిల్‌ ఆర్డర్‌లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్‌ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్‌ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్‌ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్‌ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్‌ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్‌ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్‌కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్‌ ఛాన్స్‌ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్‌ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్‌ 15 మందిని మార్చడానికి అగర్కర్‌ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్‌ టీ20 టైటిల్స్‌ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్‌లో కొత్త మలుపు. టీ20లకు భారత్‌ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్‌ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్‌ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్‌ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్‌ విధ్వంసాలు, స్కోర్‌ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్‌ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్‌లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్‌మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్‌ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్‌లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్‌ లేని సేఫ్‌ గేమ్‌తోనే పొట్టి క్రికెట్‌లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! 

Apple sets revenue records in India during March quarter
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్‌ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్‌ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్‌ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ESI scam: TDP MLA Atchannaidu
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక

కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్‌ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్‌ అంటూ దోచుకున్నారు.  సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐ స్కామ్‌.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల  కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్‌ అధికారుల విచారణలో  బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు.    అచ్చెన్న అవినీతి మార్క్‌ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్‌ అవినీతిని చూపించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్‌ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్‌ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్‌ హెడ్‌ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు.  అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్‌ కాంట్రాక్ట్‌ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు.   👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్‌ కొటేషన్స్‌ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్‌ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది.  👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే బినామీ సంస్థకు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సీకే రమే‹Ùకుమార్‌ రూ. 9.50కోట్లు చెల్లించారు.  👉 ఒక్కో బయోమెట్రిక్‌ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు.  👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్‌లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్‌ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్‌ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి.  👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు.  👉టెండర్లు లేకుండా నామినేషన్‌ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్‌ సోర్సింగ్‌ దందా సాధారణంగా ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని కలెక్టర్‌ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి.    అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్‌ నంబర్‌ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.  👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫరీ్నచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు.  👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.  మొదటి నుంచీ అదే బాగోతం  రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు.  

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all