Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How come TDP has majority in villages where YSRCP is doing well
మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?

ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్‌ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి. – దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోట»ొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాసాక్షి, అమరావతి: ‘‘మేం జగన్‌కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్‌ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్‌సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్‌ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్‌ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్‌ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్‌సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్‌ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్‌కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైఎస్సార్‌పార్టీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.

Sakshi Guest Column On NDA Alliance
సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా?

‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది కచ్చితంగా ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. దాంతో ఫలితాలు బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. మోదీని ముస్లిం దేశాలు బద్దశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్‌/బీజేపీ ఆయనను కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ మోదీ తప్పుకొనే అవకాశం కనబడటం లేదు. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మార్గం లేదు.2024 ఎన్నికలు దేశ చరిత్రలో చాలా విచిత్రమైనవి. దేశస్థాయిలో మోదీ నాయకత్వంలోని బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పరిపాలిస్తున్న రెండు పార్టీలూ ఓడిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్నిక కూడా ఇది. బీజేపీ 240కి పడిపోవడం ఒక రక్షణ కవచం.ఈ ఎన్నికతో చాలా ఘోరంగా పతనమైపోతుందనుకున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఉత్తరప్రదేశ్‌లో బుల్‌డోజర్‌ వ్యవస్థకు చెక్‌ పడింది. మొత్తం బీజేపీ శక్తులు ‘పప్పు, పప్పు’ అని ఎద్దేవా చేసిన రాహుల్‌ గాంధీ... ఒక దళిత మల్లిఖార్జున్‌ ఖర్గే నేతృత్వంలో ఎవరూ ఊహించనట్టు మ్యానిఫెస్టోను దేశం ముందు పెట్టి మోదీ, అమిత్‌షాల 400 సీట్లు తెస్తారన్న బీజేపీని 240 సీట్లకు పడేసి దేశాన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.‘ఇండియా’ కూటమి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను సొంతం చేసుకొని దేశమంతటా ప్రచారం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ఈ ఎన్నికల ‘హీరో’ అన్నారు. ‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం కచ్చితంగా చాలామంది ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. నరేంద్ర మోదీ దీన్ని తట్టుకోవడానికి ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలకు ఇస్తామని పదేపదే మాట్లాడారు. కానీ చంద్రబాబు, నితీష్‌ కుమార్‌ వంటివారు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే అటు నితీష్‌ గానీ, ఇటు చంద్రబాబు గానీ మోదీకి మంచి మిత్రులు కారు. ఇద్దరూ మోదీని, షాని వ్యతిరేకించి శత్రుస్థానంలో పెట్టి, వారితో పోరాడినవాళ్లే. అయితే ఆ ఇద్దరు ఇప్పుడు ‘ఇండియా’ కూటమి దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైనదని ప్రచారం చేస్తున్న మోదీని ప్రధానమంత్రిని, షాను మళ్లీ హోంమంత్రిని చేసి దేశ అభద్రతకు బాధ్యులవుతారా? లేక బీజేపీలోని మరో వ్యక్తిని ప్రధానమంత్రిని చెయ్యమని సలహా ఇస్తారా? చూడాలి.మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు దూరమైన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో తీవ్ర నష్టాలను చేసింది. ఆంధ్ర పెట్టుబడిదారులనెవ్వరినీ నిర్మాణం రంగంలో గానీ, పెద్ద బిజినెస్‌లలో గానీ నిలువనివ్వలేదు. బ్యాంకుల విలీనం చేసినప్పుడు బరోడా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ వంటి వాటిని ఆ పేర్లతోనే ఉంచి ఆంధ్రా బ్యాంక్‌ను మాత్రం యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేశారు. మొదటి నుండి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ అన్నింటి రీత్యా ఇప్పుడు చంద్రబాబుపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వానికి బాబు ఎటువంటి కండిషన్లు పెడతారు?అటు కాంగ్రెస్‌తో 2019లో తెలంగాణలో పొత్తులో పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్‌ తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామంటోంది. చంద్రబాబు, నితీష్‌కుమార్‌ ఒక నిర్ణయం తీసుకుంటే, మోదీ, అమిత్‌ షాలను ఇంటికి పంపగలరు. అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న స్థితిలో అది చిన్న నిర్ణయం కాదు. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్‌పేయిలా నడిపే వ్యక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేశంలోని మొత్తం ముస్లింల మీద అక్కసు కక్కారు.గుజరాత్‌లోని 2002 మత కల్లోలం తరువాత జరిగిన ఈ ముస్లింల వ్యతిరేక ప్రచారం ఆయన్ని ఇంకా పెద్ద ముస్లిం వ్యతిరేకిగా నిలబెడుతుంది. ప్రపంచ పత్రికలన్నీ ఆయన్ని ‘గ్రేట్‌ డివైడర్‌’ అని రాశాయి. ముస్లిం దేశాలు ఈ ఎన్నికల తరువాత ఆయన్ని బద్ధశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్‌/బీజేపీ ఆయన్ని కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ ఆరెస్సెస్‌/బీజేపీ క్యాడర్‌ మోదీ, అమిత్‌ షాల పరిపాలనలో సుఖాలను అనుభవించడం నేర్చుకున్నారు. వారికి ఈ భోగం మరో నాయకుల నేతృత్వంలో దొరకదు. అందువల్ల ఆరెస్సెస్‌లో కూడా వారు చెప్పిందే నడుస్తుంది.గుజరాత్‌ పెట్టుబడి దేశాన్ని మొత్తం తన గుతా«్తధిపత్యంలోకి తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుండి కూడా గుజరాత్‌ పెట్టుబడిదారులకు ధీటుగా పోటీపడే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో గుజరాతీ పెట్టుబడిదారులకు ధీటుగా ఎదిగిన జీవీకే కంపెనీని బొంబాయి ఎయిర్‌పోర్ట్‌ నుండి తప్పించి మోదీ, షాలు అదానీకి అప్పజెప్పారు. తమకు ఎదురు తిరిగిన రాజకీయ నాయకులపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితి నుండి దేశం బయట పడాలంటే మోదీ, షాలు అధికారం నుండి పోవడమొక్కటే మార్గం. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మరో మార్గం లేదు. అందుకు ‘ఇండియా’ కాస్త దారి చూపింది. ఈ స్థితిలో ‘ఏ కూటమితోనూ ఉండను’ లాంటి నిర్ణయాలు నష్టం చేస్తాయి. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి వ్యవస్థల్ని శాసించలేవు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో – బీజేపీ చేరి ఎన్నికల కమిషన్‌ను అటు తిప్పింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక స్థలాల్లో వైసీపీ కీళ్లు విరిచే ప్రయత్నం చేసింది.రాహుల్‌ గాంధీ దేశంలో అన్ని సభల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాత్రను ప్రశ్నిస్తూ వచ్చారు. సీబీఐ, ఈడీ, ఎలెక్టోరల్‌ బాండ్స్, ఇతర పార్టీల ఆదాయాలను అడ్డుకోవడం, ఉన్న పార్టీ డబ్బును ఎన్నికల్లో వాడకుండా చూడటం, ఇన్‌కమ్‌టాక్స్‌ వంటి సంస్థల ద్వారా బంధించడం... ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక జాతీయ కూటమిలో చేరి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయాల్లో, పోరాటాల్లో భాగం కాకపోతే ముందు ముందు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ బందీలను చేస్తుంది.కాంగ్రెస్‌ ముఖ్యంగా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యాయ యాత్ర తరువాత ఆరెస్సెస్‌/బీజేపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు డీఎంకే లాగ ఒక ప్రత్యామ్నాయ తాత్విక పునాదితో నిర్మించినవి కావు. అందుకే డీఎంకేని బీజేపీ సనాతన ధర్మం చుట్టూ రాద్దాంతం చేసి ఓడించాలని చూసింది. కానీ దాని ద్రావిడ, శూద్ర సిద్ధాంతరంగం కాపాడింది. బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు పార్లమెంట్‌ పోరాటం... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడాలనే ‘ఇండియా’ కూటమికీ, ఆరెస్సెస్‌ సిద్ధాంతాన్ని దేశంలో నాటి, మత సమస్యను ముందు పెట్టి దేశంలో ఉత్పత్తి కులాలను అణగదొక్కే ఎన్డీఏలోని ఆధిపత్య బీజేపీకీ మధ్య జరుగుతుంది. ఎన్డీయే కూటమిలోని నితీష్‌ కుమార్, చంద్రబాబుకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు చెక్‌ పెట్టే అవకాశమొచ్చింది. ఈ ఇద్దరు నాయకులు ఏం చేస్తారనేది చూడాలి. చంద్రబాబు 2002లో మోదీని ముఖ్యమంత్రి పదవి నుండి దింపే స్థితిలో ఉండి కూడా ఆయన్ని కొనసాగించే బీజేపీ నిర్ణయానికి మద్దతిచ్చారు. మళ్లీ ఈ కీలకదశలో ఆయనకు ఒక అవకాశమొచ్చింది. ‘ఇండియా’ కూటమి దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలను తమ పక్కన చేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

Who Will Be In Cabinet Of TDP Janasena BJP coalition Govt
ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వా­ములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవు­తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.పాతవారికే పెద్దపీటటీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు.

INDIA Bloc Decided To Be In opposition At Kharge House Meeting
ఇండియా కూటమి కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.లోక్‌సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ఇండియా కూటమి సంయుక్త ప్రకటననరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాంబీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాంఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు. :::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే #WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...The INDIA bloc will continue will fight against the fascist rule of the BJP led by PM Modi. We will take the appropriate steps at the appropriate time to realise the people's desire not to be ruled by the BJP's… pic.twitter.com/NhdnHYbbfI— ANI (@ANI) June 5, 2024ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగ‌ర్(272) దాట‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన క‌స‌రత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.కాగా జూన్‌ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి. బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్‌ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

T20 World Cup 2024: India beat Ireland by eight wickets
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...

భారీ అంచనాలతో టి20 వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన భారత్‌ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్‌పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్‌ చక్కటి బ్యాటింగ్‌ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌ రూపంలో తర్వాతి సవాల్‌కు భారత్‌ సిద్ధమైంది. న్యూయార్క్‌: టి20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్‌ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/6), అర్‌‡్షదీప్‌ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్‌ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్‌కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్‌... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (2), బల్బర్నీ (5)లను అవుట్‌ చేసి అర్‌‡్షదీప్‌ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్‌ పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్‌ (10), కాంఫర్‌ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్‌ (4)ను బుమ్రా అవుట్‌ చేశాడు. సిరాజ్‌ ఖాతాలో డాక్‌రెల్‌ (3) వికెట్‌ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్‌ 49/6 వద్ద నిలిచింది. అక్షర్‌ పటేల్‌ కూడా తన తొలి ఓవర్లో మెక్‌కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్‌లో లిటిల్‌ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‌‡్షదీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను అదే ఓవర్‌ చివరి బంతికి రనౌట్‌ కావడంతో ఐర్లాండ్‌ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్‌... ఓపెనర్‌గా వచి్చన విరాట్‌ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్‌ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్‌ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో జోరు పెంచిన రోహిత్‌ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్‌ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచి్చన సూర్యకుమార్‌ (2) విఫలమైనా... మెక్‌కార్తీ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ సిక్సర్‌తో పంత్‌ మ్యాచ్‌ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్‌లో ఆడిన పంత్‌కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. స్కోరు వివరాలు ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: బల్బర్నీ (బి) అర్‌‡్షదీప్‌ 5; స్టిర్లింగ్‌ (సి) పంత్‌ (బి) అర్‌‡్షదీప్‌ 2; టకర్‌ (బి) పాండ్యా 10; టెక్టర్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్‌ (సి) పంత్‌ (బి) పాండ్యా 12; డాక్‌రెల్‌ (సి) బుమ్రా (బి) సిరాజ్‌ 3; డెలానీ (రనౌట్‌) 26; అడెయిర్‌ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్‌కార్తీ (సి అండ్‌ బి) అక్షర్‌ 0; లిటిల్‌ (బి) బుమ్రా 14; వైట్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్‌) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–35–2, సిరాజ్‌ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్‌ పటేల్‌ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 52; కోహ్లి (సి) వైట్‌ (బి) అడెయిర్‌ 1; పంత్‌ (నాటౌట్‌) 36; సూర్యకుమార్‌ (సి) డాక్‌రెల్‌ (బి) వైట్‌ 2; దూబే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్‌: అడెయిర్‌ 4–0–27–1, లిటిల్‌ 4–0–42–0 మెక్‌కార్తీ 2.2–0–8–0, కాంఫర్‌ 1–0–4–0, వైట్‌ 1–0–6–1. 600: 600 రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్‌లు బాదాడు. 4000: రోహిత్‌ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్‌ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

Hyderabad Heavy Rain June 5th 2024 Updates
HYD: కుండపోత వానతో ట్రాఫిక్‌ నరకం

హైదరాబాద్‌, సాక్షి: హైదరాబాద్‌ను కుండపోత వాన ముంచెత్తింది. దీంతో ట్రాఫిక్‌ నరకం చవిచూశారు వాహనదారులు. రెండు మూడు గంటలుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన దృశ్యాలను పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. Heavy Rain now in Hitech City⛈️⚡️#HyderabadRains pic.twitter.com/98g0kor8Vo— Hyderabad Rains (@Hyderabadrains) June 5, 2024బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట్‌, నాచారం, తార్నాక, కొండాపూర్‌, గచ్చిబౌలి, అఫ్జల్‌గంజ్‌, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు మొదలయ్యాయి. Hyderabad Rain 🤝 Hyderabad Traffic @balaji25_t #hyderabad #rain pic.twitter.com/G9r7otsxx9— Shivang🫡 (@theshivangahuja) June 5, 2024నగరం మీదుగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పని వేళలు ముగిసి ఇంటికి వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్‌రద్దీ నెలకొంది. మాదాపూర్‌ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ నెమ్మదిగా ముందుకు కదిలింది. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, బేగంపేట ఏరియాల్లో రెండు మూడు గంటలుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు వాహనదారులు. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలను పలువురు పోస్ట్‌ చేస్తున్నారు. నగరంలో వాన.. ట్రాఫిక్‌ నరకం: ఫొటోల కోసం క్లిక్‌ చేయండిThey are IT employees but when on road behaves like mindless without any road sense See how they occupied the other side of road within #raheja #hyderabad #hyderabadrains #telangana @CoreenaSuares2 @HiHyderabad @balaji25_t @Team_Road_Squad @swachhhyd pic.twitter.com/ZhCRD3DGoj— TGCitizen (@Citizen_TS) June 5, 2024#HYDTPinfoCommuters it's #Raining. Please #Drive carefully.#Mansoon #HyderabadRains pic.twitter.com/PVlStUmyqV— Hyderabad Traffic Police (@HYDTP) June 5, 2024#HYDTPinfoCommuters it's #Raining. Please #Drive carefully.#Mansoon #HyderabadRains pic.twitter.com/PVlStUmyqV— Hyderabad Traffic Police (@HYDTP) June 5, 2024

Winning Losing Part Of Politics Numbers Game Goes On: PM Modi
గెలుపు, ఓటములు సహజం.. నంబర్స్‌ గేమ్‌ కొనసాగుతుంది: మోదీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్‌ గేమ్‌ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్‌ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్‌కు మోదీ బయలుదేరారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Kommineni Srinivasa Rao Reacts On AP Election Results
చివరికి అబద్ధానిదే పైచేయి.. అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు సర్వత్రా నివ్వరపోయేలా చేశాయి. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ రిజల్ట్స్ తో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ షాక్‌కు గురి అవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంబరపడతాయి. వీరి కూటమి సఫలం అయింది. ఒంటరిగానే గెలవగలనన్న ధీమాతో ఉన్న వైఎస్సార్‌సీపీకి గట్టి దెబ్బ తగిలింది. గతసారికి భిన్నంగా సామాజిక సమీకరణలు మారిపోవడం కూడా వైఎస్సార్‌సీపీకి నష్టం చేసింది. పాలనాపరంగా ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తప్పు ఏమిటా అని ఆలోచిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమా? అన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తేనన్ని సంస్కరణలు, వ్యవస్థలు జగన్ తెచ్చారు. ఎవరూ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఈయన చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటిని అభివృద్ది చేస్తున్నారు. అంతదాకా ఎందుకు! దశాబ్దాల తరబడి కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారికోసం ఉద్దానం వద్ద ఒక పెద్ద ఆస్పత్రిని, పరిశోధన కేంద్రాన్ని,నీటి పధకాన్ని తీసుకు వస్తే అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ ఓడిపోయింది. రామాయం పట్నం వద్ద ఓడరేవు నిర్మాణం జరుగుతుంటే,ఆ ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీ ఓటమి చెందింది. మచిలీపట్నంలో ఓడరేవు, వైద్య కళాశాల ఏర్పాటు అవుతుంటే అక్కడా ఓటమి ఎదురైంది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని ప్రకటించినా, అక్కడ పలు అభివృద్ది పనులు నిర్వహించినా జనం పట్టించుకోలేదు. కర్నూలు లో పలు లీగల్ ఆఫీస్ లు ఏర్పాటు చేసినా జనం ఓట్లు వేయలేదు. వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో దారుణ పరాజయం వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలందరికి ఇళ్ల వద్దకే సేవలు అందిస్తుంటే, ఎంతో సంతోషపడ్డారు. వృద్దులకు చెప్పినట్లు పెన్షన్ మూడువేల రూపాయల చేశారు. అయినా జగన్ ప్రభుత్వం ఓడిపోయింది.చేయూత పేరుతో లక్షల మంది 18750 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే వైఎస్సార్‌సీపీకి కేవలం నలభై శాతం ఓట్లతో అంత తక్కువ సీట్లు రావడమా! చివరికి ప్రతిపక్ష హోదా దక్కకపోవడమా!వినడానికే విడ్డూరంగా ఉంది. అయినా చేదు వాస్తవం భరించకతప్పదు. పార్టీ పరంగా జగన్ ఆత్మవిశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగిందన్నది గమనించి, మళ్లీ పార్టీకి ఉత్తేజం తేవలసి ఉంది.కొందరు అభిమానులు ఈ ఓటమి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, గుండెపోటుకు గురై మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. క్లిష్ట సమయాలలోనే ఎవరైనా ధైర్యంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి. ఎందుకింత ఘోర పరాజయం అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. జగన్ పేదలకు, బలహీనవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు. వారు ఆర్ధికంగా మెరుగు అవ్వాలని ఆశించారు. రకరకాల స్కీములను అమలు చేశారు. అమ్మ ఓడి అనే కొత్త స్కీము తెచ్చి, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ బడులలో విద్య కొనసాగించేలా చేశారు. వారికి ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చారు.ఐబి వంటి సిలబస్ ను తీసుకురావాలని తలపెట్టారు. ఇలా వివిధ కార్యక్రమాలను బలహీనవర్గాలకు అమలు చేయడం అగ్రవర్ణాలలోని కొందరికి అంతగా నచ్చలేదు. ఎస్సి,ఎస్టి, బిసి ,మైనార్టీలకే అన్నీ చేస్తున్నారన్న అపోహ ఏర్పడింది. దీంతో సమాజంలో వైరుద్యాలు పెరిగినట్లయింది. ఫలితంగా ఈ అగ్రవర్ణాలకు చెందిన వారిలో పలువురు కూటమి వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చేమో! తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్సి వర్గాల కోసం దళిత బంధు స్కీమును తెచ్చి ఒక్కో కుటుంబానికి పది లక్షల సాయం చేయాలని సంకల్పించారు. అది తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి గ్రామాలలో వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలకు దారి తీసింది. దాంతో ఇతర వర్గాలు దూరం అయ్యయని చెబుతారు. అంతేకాక ఎస్సిలలో కూడా లబ్ది పొందినవారిని చూసి, తమకు ఎందుకు రాలేదన్న అసంతృప్తి మరికొందరికి ఏర్పడింది. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో బిఆర్ఎస్ ఓటమికి దారితీసిందన్న విశ్లేషణ ఉంది. అలాగే జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో నిమ్మవర్గాలకు మేలు చేయాలని అనుకున్నారు. ప్రత్యేకించి బిసిలకు ఆయా స్కీములతో పాటు రాజకీయంగా ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రాజకీయంగా జగన్ కు నష్టం చేసిందా అన్న అభిప్రాయం వస్తోంది. అటు అగ్రవర్ణాలలో అసంతృప్తి ఉంటే, మరో వైపు బలహీనవర్గాల వారు పూర్తిగా ఓన్ చేసుకున్నారా? లేదా?అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే వారిలో పలువురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ లోని కొన్ని అంశాలకు ప్రభావితం అయినట్లు సమాచారం వస్తోంది.పెన్షన్ నాలుగు వేలు చేస్తామని అనడం, తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పడం,మహిళలకు నెలకు 1500 చొప్పున ఇవ్వచూపడం,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, బిసిలకు ఏభైఏళ్లు దాటితో పెన్షన్ హామీ మొదలైనవాటికి కొంత శాతం బలహీనవర్గాలు అట్రాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఈ రకంగా రెండువైపులా నష్టం జరిగి ఉండవచ్చు. పేదలు vs పెత్తందార్ల నినాదం ఫలించలేదని అనుకోవాలి. వలంటీర్ల వ్యవస్థ వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. వీరివల్ల పార్టీ స్థానిక నేతలకు, క్యాడర్‌కు ప్రాధాన్యత తగ్గిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వ్యవస్థ ప్రజలకు బాగా మేలు చేసిన అంశం. ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టడం ద్వారా ప్రజలకు పరిపాలనను బాగా దగ్గర చేశారు. అయినా జనం ఎందుకు ఓట్లు వేయలేదో అర్ధం కావడం లేదు. ప్రభుత్వపరంగా ఆర్ధిక ఇబ్బందులు ఉండడం వల్ల పార్టీ నేతలు చేపట్టిన వివిధ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో క్యాడర్ కొంత ఇబ్బంది పడిందని చెబుతారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇరవై లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నా, ప్రయోజనం కనిపించలేదు. మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నది మరికొందరి భావన. మానిఫెస్టోలోని హామీలను దాదాపు అన్నిటిని అమలు చేసిన నేతగా, అందువల్లే ఓడిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. నేరుగా సుమారు మూడు లక్షల కోట్ల మేర నగదును పేదలకు బదిలీ చేయడం రాజకీయంగా జగన్‌కు పెద్దగా కలిసివచ్చినట్లు లేదు. పైగా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. చంద్రబాబు ఇంకా ఎక్కువ హామీలు, ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తానని సూపర్ సిక్స్ ప్రకటించారు కదా అని అంటే, ఆయన చేసినప్పుడు కదా! అని కొందరు భావించారు. పేదలేమో ఆ స్కీములకు కొంత ఆకర్షితులైతే, మధ్యతరగతి,ధనికవర్గాలేమో అవేవి చేయలేరులే అని అనుకున్నారు. జగన్ మాదిరి చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండరన్నది వారి నమ్మకం. అమరావతి రాజధాని విషయంలో కూడా సరిగా హాండిల్ చేయలేదన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ ప్రభుత్వంపై జరిగినంత అబద్దపు ప్రచారం, దుష్ఫ్రచారం బహుశా దేశంలో ఏ ప్రభుత్వంపై జరగలేదు. చివరికి అబద్దపు ప్రచారానిదే పై చేయి అయింది. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూములు లాగేసుకుంటారు అంటూ చేసిన అసత్య ప్రచారం కూడా బాగా డామేజీ చేసిందని అంటున్నారు. 1955 ఆంద్ర శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధిస్తుందన్న భావన ఉండేదట. కాని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒక వర్గం మీడియా ఒక వదంతిని సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేసిందట.భూస్వాముల భార్యల మెడలపై కాడివేసి దున్నిస్తామని ఒక కమ్యూనిస్టు నాయకుడు అన్నట్లు చేసిన ప్రచారంతో సిపిఐ పదిహేను సీట్లకే పడిపోయి అధికారంలోకి రాలేకపోయింది.రాజకీయాలలో ఒక్కోసారి అబద్దాలు ఎంతగా ప్రభావితం చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. కాగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు కొందరు విజయం సాధించామన్న అత్యుత్సాహంతో కొన్ని చోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఎన్నికలు అయిపోయాక కూడా ఘర్షణ వాతావరణం కొనసాగిస్తే,అది సమాజానికి హానికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

T20 World Cup 2024 ENG VS SCO: England Never Won On European Teams In T20 World Cup Tourneys
రెండు సార్లు ప్రపంచకప్‌ గెలిచినా, ఇంగ్లండ్‌కు ఆ కల తీరడం లేదు..!

టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమ ఖండానికి (యూరప్‌) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్‌ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్‌ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్‌.. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ నిన్న సహచర యూరప్‌ జట్టైన స్కాట్లాండ్‌తో తలపడింది.ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్‌లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్‌ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్‌ దేశాల్లో టెస్ట్‌ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్‌ సొంత ఖండ జట్లు, క్రికెట్‌ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం​ క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కాగా, టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా బార్బడోస్‌ వేదికగా ఇంగ్లండ్‌- స్కాట్లాండ్‌ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్‌ ఆలస్యంగా పడింది. టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌ రద్దయ్యే సమయానికి జార్జ్‌ మున్సే (41), మైఖేల్‌ జోన్స్‌ (45) క్రీజ్‌లో ఉన్నారు.

Karumuri Nageswara Rao Comments On Tampering Of EVMs
ఈవీఎంల ట్యాంపరింగ్‌ అనుమానాలున్నాయ్‌: కారుమూరి

సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్‌ జగన్‌ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్‌ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్‌ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement