Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024 Special Story On West Godavari District Politics
ఉమ్మడి ‘పశ్చిమ’లో సంక్షేమానికే పట్టం!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్‌ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్‌మెంట్‌ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్‌కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్‌ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్‌కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్‌స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.నర్సాపురం పార్లమెంట్‌ పరిధిలోనూ వైఎస్సార్‌సీపీదే హవా!ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలో వైఎస్‌ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు, వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు.

YSRCP Will Clean Sweep In Uttarandhra Seats
టీడీపీకి తడబాటే.. పచ్చ నేతల్లో కొత్త టెన్షన్‌!

ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి భీకరంగా ఉన్నా.. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల నుంచి ఊహించని విధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమలు ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్సార్‌సీపీకి కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినఊరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతీ ఎన్నికలోనూ రిగ్గింగ్‌తో గెలిచే అచ్చెన్నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చెన్న గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్సార్‌సీపీకి ప్రజలు మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసీ వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు. ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీకి క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమాహేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Mallu Ravi Complained EC Against KTR Over His Comments On Teenmar Mallanna
కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్‌ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి.

Sunrisers Hyderabad cancel practice ahead of IPL 2024 final against Kolkata Knight Riders
ఐపీఎల్ ఫైన‌ల్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ కీల‌క నిర్ణ‌యం..

ఐపీఎల్‌-2024లో తుది పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైన‌ల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ ముందు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు ఎటువంటి గాయాల బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి శనివారం త‌మ‌ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్‌ ర‌ద్దు చేసింది. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క‌పోత ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హిందూస్తాన్ టైమ్స్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.కాగా శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించి.. ఫైన‌ల్ పోర‌కు అర్హ‌త సాధించింది.చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్‌.. బ‌ట్ల‌ర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవ‌రంటే?

Five Phases Voter Turn Out Data Released By Ec
ఐదు విడతల ఓటర్‌ టర్నవుట్‌ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్‌ ఓటర్‌ టర్నవుట్‌ డేటాను ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం(మే25) వెల్లడించింది. ఓటింగ్‌ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. టర్నవుట్‌ డేటా అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని, ప్రతి విడత పోలింగ్‌ రోజు ఉదయం 9.30నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్‌ డేటాను ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌లో ఉంచామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది. ఐదు విడతల్లో బూత్‌ల వారిగా పోలింగ్‌ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్‌ టర్నవుట్‌ డేటాను ఈసీ వెల్లడించడం గమనార్హం.ఈసీ వెల్లడించిన పోలింగ్‌ శాతాలు..తొలివిడత - 66.14రెండో విడత- 66.71మూడో విడత- 65.68నాలుగో విడత-69.16ఐదో విడత - 62.20

Chevireddy Bhaskar Reddy Responds Over Chandragiri Riots On Pulivarthi Nani
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి

సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్‌ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు.

Actress Meera Vasudevan Got Married Third Time
తెలుగు సినిమా హీరోయిన్‌.. ముచ్చటగా మూడో పెళ్లి

హీరోయిన్‌ మీరా వాసుదేవన్‌ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్‌ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్‌ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్‌ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్‌ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్‌గా పెళ్లివిపిన్‌ కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్‌. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్‌, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్‌ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్‌ 2001లో సీరియల్‌ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్‌మాల్‌ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. అంజలి ఐ లవ్‌ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్‌ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ తనయుడు విశాల్‌ అగర్వాల్‌ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్‌ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్‌ షూటింగ్‌లో లవ్‌..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్‌ మదర్‌గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్‌ షూటింగ్‌లో ఆ ధారావాహిక కెమెరామన్‌ విపిన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి

exit poll surveys may confusion on india bloc over lok sabha election 2024
ఇండియా కూటమి ఎఫెక్ట్‌..! కన్ప్యూజన్‌లో ఎగ్జిట్ పోల్స్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్‌కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్‌ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్‌ పోల్స్‌ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్‌పుట్‌ ఎడిటర్, సాక్షి

Chinese Woman Love Story With ChatGPT's DAN
చాట్‌జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు

కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.ఈ ఏడాది మార్చిలో చాట్‌జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్‌ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్‌జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్‌ఫ్రెండ్‌గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.లిసా చాట్‌జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్‌ఫ్రెండ్‌ చాట్‌జీపీటీతో కలిసి బీచ్‌కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.లిసా.. చాట్‌జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్‌జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్‌జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు.

Meet star kid Krishna Shroff who earns in crores
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్‌కిడ్‌ నెట్‌వర్త్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్‌ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్‌ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్‌ కిడ్‌? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్‌ కిడ్‌ ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్‌స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్‌ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్‌- ట్రైనింగ్‌ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్‌లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్‌నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్‌ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement