Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.

CM YS Jagan Says YSRCP Will Big Win AP Elections
‘ఫ్యాన్’‌దే ప్రభంజనం.. సీఎం జగన్‌ సరికొత్త రికార్డ్‌!

ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్‌ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్‌ ప్రకటన చేశారు.సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్‌ క్యాంపైనయిర్స్‌ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్‌ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్‌ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్‌ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్‌.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్‌ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్‌ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్‌ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ఫస్ట్‌ రియాక్షన్‌ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్‌ ఫైట్‌, ఎవరికి ఎడ్జ్‌ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్‌ చేసిన ప్రకటన పట్ల షాక్‌ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్‌ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.

Niti Aayog Sensational Announcement On Land Titling Act
ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన

సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్‌.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్‌ సమాధానం పంపింది.కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్‌ ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్‌ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది.

Supreme Court Junks ED Plea On action against Kejriwal Bail
కేజ్రీవాల్‌ బెయిల్‌ రద్దుపై పిటిషన్‌.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ను రద్దు చేసి, తిరిగి జైలుకు పంపాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేస్తే.. తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పని లేదంటూ కేజ్రీవాల్ చేసిన‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈడీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ‘సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారంలో భాగంగా ఆప్‌కి ఓటు వేస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు విధించిన షరతులను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇది న్యాయవ్యవస్థకు చెంపదెబ్బగా పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ మను స్పందిస్తూ.. పలువురు కేంద్ర మంత్రులు (పేర్లు ప్రస్తావించకుండా) తన క్లైయింగ్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ రావడంపై వ్యతిరేకంగా రకరకాల ప్రకటనలు చేశానే విషయాన్ని ఎత్తిచూపారు.ఇరుపక్షాల వాదనలపై కోర్టు స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, అదంతా అతని ఊహేనని ఈడీకి తెలిపింది. దానిపై తాము మాట్లాడటానికి ఏం లేదని పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జూన్‌ 2న తిరిగి జైలుకు రావాలంటూ తాము స్పష్టమైన ఆదేశం ఇచ్చామని వెల్లడించింది. అదే ఈ కోర్టు నిర్ణయమని, తాము చట్టబద్ధమైన పాలన ద్వారా నడుచుకుంటామని స్పష్టం చేసింది.‘కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, తమ తీర్పుపై విశ్లేషణను, విమర్శలను స్వాగతిస్తున్నాం. కానీ మేము ఈ విషయంలో జోక్యం చేసుకోము. మా ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. తిరిగి జైలుకొచ్చే తేదీలు వెల్లడించాం. మధ్యంతర బెయిల్‌ మంజూరుకు కారణాలు కూడా చెప్పాం’ అని పేర్కొంది.

How Did It Feel To Succeed Kohli As Captain Rohit Sharma Replies
కెప్టెన్‌ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్‌ శర్మ

టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు వదిలేయడంతో రోహిత్‌ శర్మ అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో కోహ్లి వన్డే కెప్టెన్సీ కోల్పోవడం, అర్ధంతరంగా టెస్టు సారథ్యానికి కూడా గుడ్‌బై చెప్పడంతో.. మూడు ఫార్మాట్లకు హిట్‌మ్యానే నాయకుడిగా ఎంపికయ్యాడు.ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటడమే గాకుండా.. ఏకకాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపాడు రోహిత్‌ శర్మ. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌, వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ చేరింది.కానీ ఆఖరి గండాన్ని దాటలేక చేతులెత్తి రన్నరప్‌గా మిగిలిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024 రూపంలో ఆ అపఖ్యాతిని చెరిపివేసుకునేందుకు రోహిత్‌ శర్మకు మరో అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ఆడబోతున్న రోహిత్‌.. ఈసారి కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు.కాగా 37 ఏళ్ల రోహిత్‌ శర్మకు ఇదే ఆఖరి టీ20 ప్రపంచకప్ కాబోతుందన్న వార్తల నేపథ్యంలో కప్పు గెలిస్తే మాత్రం అతడి కెరీర్‌లో చిరస్మరణీయ విజయంగా నిలిచిపోతుంది.ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో ఇంత దూరం వస్తానని.. టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదుగుతానని అస్సలు ఊహించలేదనంటున్నాడు రోహిత్‌ శర్మ. ఇది తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.దుబాయ్‌ ఐ 103.8 యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో.. ‘‘విరాట్‌ లాంటి వ్యక్తి స్థానంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. అదొక అతిపెద్ద బాధ్యత. మీరెలా ఫీలయ్యారు’’ అనే ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పనిచేయడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. అయినా.. నా జీవితంలో అలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదు.మంచి వాళ్లకు మంచి జరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. అయితే, ఇది మాత్రం నాకు దక్కిన అదృష్టం. భారత క్రికెట్‌ మీద గత కెప్టెన్లు ఎలాంటి ప్రభావం చూపారో నాకు తెలుసు. వారి వారసత్వాన్ని నిలబెడుతూ సరైన దిశలో జట్టును ముందుకు నడిపించడమే నా పని’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

The Free Dhaniya Option Following A Users Mothers Suggestion
బ్లింకిట్‌ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!

కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ అలవాటు పడిపోయారు జనాలు. అంతకు ముందు కూడా చేశారు గానీ. ఆ మహమ్మారి తర్వాత నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ మహా ఎక్కువయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇలానే ఓ మహిళ కొడుకు బ్లింకిట్‌ నుంచి పెద్ద మొత్తంలో కూరగాయాలు కొనుగోలు చేశాడు. డెలివరీ అయ్యాక బిల్‌ చూసి తల్లి షాకయ్యింది. ఏంటిది ఇంత మొత్తంలో కూరగాయాలు కొన్న కొత్తిమీరకు కూడా బిల్లు వేస్తారా అని విస్తుపోయింది. ఈ విషయమై తన కొడుకుతో చెప్పింది. తన తల్లి ఆలోచననను సోషల్‌ మీడియాలో హైలెట్‌ చేస్తూ..'నేను బ్లింకిట్‌ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు బాధ కలిగింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా! అని ఆమె భావిస్తోంది.' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బ్లింకిట్‌ సీఈవో అల్బిందర్‌ ధింద్సాకి ట్యాగ్‌ చేశారు. వినియోగదారుడు సోషల్‌ మీడియా పోస్ట్‌కి రెస్పాండ్‌ అయిన అల్మిందర్‌ ధింద్సా దీని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత జస్ట్‌ నాలుగు గంటల్లోనే ఫాలో అప్‌ పోస్ట్‌లో ధింద్సా ఫ్రీగా కొత్తిమీర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్‌ సావంత్‌ తల్లిగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్‌డేట్‌ చేస్తాం అని ధింద్సా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇలా ఓసామన్య వినియోగదారుడి పోస్ట్‌పై సీఈవో సత్వరమే స్పందించడంపై ప్రశంసల జల్లు కురిపించారు నెటిజన్లు. అంతేగాదు మరిన్నింటిని ఉచితంగా ఇవ్వొచ్చు అంటూ సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.It’s live! Everyone please thank Ankit’s mom 💛 We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6— Albinder Dhindsa (@albinder) May 15, 2024 (చదవండి: ఘోస్ట్‌ మ్యారేజ్‌లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో)

Allu Arjun Pushpa 2 The Rule postponed for This Reason
బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప-2 మూవీ వాయిదా..?

ఐకాన్‌ స్టార్‌, సుకుమార్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప-2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. మరోసారి దాక్షాయణిగా మెప్పించనున్నారు. తాజాగా అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ రివీల్‌ చేశారు మేకర్స్.పుష్ప-2 వాయిదా?అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు డైరెక్టర్‌ సుకుమార్‌. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో పుష్ప-2 సందడి చేయనుందని వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటేస్ట్‌ టాక్‌ వినిపిస్తోంది. పుష్ప-2 మూవీ ఎడిటర్‌ ఆంటోనీ రూబెన్‌ డేట్స్‌ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్‌ పూర్తి చేయడానికి నవీన్‌ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు.అదే రోజు రిలీజ్మరోవైపు అల్లు అర్జున్‌ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని.. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్‌ చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP Elections 2024: May 16th Politics Latest News Updates In Telugu
May 16th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 16th AP Elections 2024 News Political Updates6:25 PM, May 16th, 2024విజయవాడరాష్ట్ర ప్రజలంతా మళ్లీ వైఎస్‌ జగన్‌ రావాలని కోరుకున్నారు: మంత్రి బొత్సరాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్లీ వైఎస్ జగనే రావాలని కోరుకున్న వైనం‌ ఓటింగ్ లో స్పష్టంగా తెలిసిందిఎన్నికలలో నూతన ట్రెండ్‌ని వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చారుఇచ్చిన హామీలని గత ఐదేళ్లలో హామీలు అమలు చేశాంవిద్య, వైద్యా రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు గత ఐదేళ్లలో జరిగాయిగత అయిదేళ్ల పాలన‌ చూసి ఓటు వేయండని చరిత్రలో ఏ పార్టీ అడగలేదుప్రజలకి మేలు జరుగుతుందంటేనే సిఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటారు...మళ్లీ వెనకడుగు వేయరుసిఎం పాలన చూసే ప్రజలు ఉవ్వెత్తున‌ వచ్చి ఓటేశారుజూన్ 9 న‌ విశాఖలో సిఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారుఅంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం*ఒకటో తేధీన పెన్షన్ రావాలని వృద్దులు...మళ్లీ పథకాలు కొనసాగాలని మహిళలు కోరుకున్నారుటీడీపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందిమా టార్గెట్ 175కి 175 సీట్లు... దానికి దగ్గరగానే రిజల్ట్ రాబోతోందిహింసని ప్రేరేపించకూడదనే మేము సంయమనం పాటిస్తున్నాంజగన్ లాంటి నాయకుడు లేకపోతే మంచి పాలన అందదని ఓట్లు వేశారుసిఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం సమంగా పాటించడం చరిత్రలో ఎపుడూ జరగలేదు50 శాతం‌సీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాంఇలాంటి సామాజిక న్యాయం జరిగిన పాలన గతంలో ఎపుడూ చూడలేదునాకు ఈ కారణం వల్ల ఓటేయండి అని చంద్రబాబు అడిగారానన్ను చూసి ఓటు వేయండని చంద్రబాబు అడిగారామా పాలన చూసి... మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని సీఎం వైఎస్ జగన్ అడిగారుచంద్రబాబు గత పాలనచూసి ఎవరైనా నమ్ముతారాసీఎం వైఎస్ జగన్ అంటే చెప్పిందే చేస్తాడు...చేసేదే చెప్తాడు అని నమ్మకంసీఎం జగన్ పాలనలోనే ఆర్ధికంగా ఎదిగామని సామాన్యులు భావించబట్టే మాకు ఓటేసారుభూహక్కు చట్టం గురించి తప్పుడు వార్తలు రాశారుచంద్రబాబు కుయుక్తుల వల్లే పెన్షన్ ఆగాయిపోలింగ్ తర్వాత నుంచి డిబిటి స్కీమ్స్ కింద జమ అవుతాయని చెప్పాంచెప్పునట్టుగానే డిబిటి ‌నిధులు విడుదలవుతున్నాయిఇదీ మా ప్రభుత్వ క్రెడిబిలిటీఅదే చంద్రబాబు అయితే ఎన్నికలు ముగిసాయి కాబట్టి తన తాబేదార్లకి , కాంట్రాలర్లకి ఇచ్చేవారు5:21 PM, May 16th, 2024అనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టు లో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు5:15 PM, May 16th, 2024దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం: మోపిదేవి వెంకట రమణపోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోందిదీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుందిప్రశాంతంగా ఉన్న ఏపీ లో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణాలు దీపక్ మిశ్రాదీపక్ మిశ్రా పై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాం5:12 PM, May 16th, 2024ఎన్నికలు పక్షపతం లేకుండా ఏకపక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్‌కు తెలిపాం: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా బీజేపీ టీడీపీ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం తెచ్చారుఅతని వల్లే ఈ విధ్వంసంరాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో జగన్ ఇప్పటికే మాట్లాడారుసంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారుహింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తెలిపాం.దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారుజిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారుపోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదుజిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారుదీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాం 5:12 PM, May 16th, 2024పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు: మేరుగ నాగార్జునరాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాంకౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్‌ను కోరాం 5:10 PM, May 16th, 2024పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది: మంత్రి బొత్సఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాముఅబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారుటీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారుఅబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలిఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము 3:34 PM, May 16th, 2024ఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఈసీ సీరియస్పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింసరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:40 PM, May 16th, 2024ఈసీని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సీఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:15 PM, May 16th, 2024ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌విజయవాడ..విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీసీఎం జగన్‌ కామెంట్స్‌..ఏపీలో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం. రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్‌సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది. 1:50 PM, May 16th, 2024ఢిల్లీ చేరుకున్న సీఎస్‌, డీజీపీఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తామధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ముందు హాజరు కానున్న సీఎస్, డీజీపీఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ1:30 PM, May 16th, 2024పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతఏలూరు జిల్లాపెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతహత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని టీడీపీ కార్యకర్త కావడంతో పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్.మరోసారి బయటపడ్డ చింతమనేని ప్రభాకర్ గుండా గిరిపోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్‌తో పాటు వారి అనుచరులు పోలీసులపై దాడికి ప్రయత్నం.కొప్పులవారిగూడెం ఎలక్షన్ రోజున బూత్‌లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్పెదవేగి పీఎస్‌లో ఉన్న అతనిని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకొని తన అనుచరులతో పారిపోయాడు. హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్లిపోవటంతో పీఎస్‌ ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన. 12:50 PM, May 16th, 2024టీడీపీ అభ్యర్థి అనుచరుడి దౌర్జన్యం.నెల్లూరు..సామాన్యులపై కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుడు మురళి దౌర్జన్యం.డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన మురళి.కావ్య కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రమ్మన్నాడంటూ ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నాయకుడు నున్నా మురళి.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ నేత మురళి బెదిరింపుల ఆడియో.కావ్య కృష్ణారెడ్డి అనుచరుల బలవంతపు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. 12:20 PM, May 16th, 2024గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్‌సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్‌కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్‌కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్‌కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్‌ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్‌కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్‌సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్‌మెంట్‌కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్‌కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్‌ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-‍ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం

గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO    #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024

War One Side in Minister Amarnath Predicts On AP Election Results
‘ఏపీలో వార్‌ వన్‌ సైడే.. YSRCPదే గెలుపు’

విశాఖపట్నం, సాక్షి: పోలింగ్‌ పర్సంటేజ్‌ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. ..గతంలో ఓటింగ్‌ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్‌ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్‌ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. .. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్‌ వన్‌సైడ్‌ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కాబోతున్నారు. .. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్‌ ప్రసంగించారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement