Top Stories
ప్రధాన వార్తలు
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్‌కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ఆఫ్ డూయింగ్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్ వివరించారు.
హైదరాబాద్‌లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
మండుటెండలతో అల్లాడిన హైదరాబాద్‌కు మరో చిక్కొచ్చి పడింది. వేడి చల్లారుతుందనుకుంటే.. వరుణదేవుడు అంతకు మించిన ప్రతాపం చూపించాడు. సాయంత్రం 5.30గంటల నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా ఉదృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడప్పుడే ఆఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. టూవీలర్లు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.హైదరాబాద్‌కు వార్నింగ్అయితే రాబోయే సమయంలో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్ హైదరాబాద్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. వాతావరణాన్ని అంచనా వేసే వెబ్సైట్లు అక్యువెదర్ ప్రకారం ఈ సాయంత్రమంతా హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతం, ఉత్తర తెలంగాణకు తీవ్ర వర్షం పొంచి ఉన్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఏపీలో వర్షాలు పడతాయని, సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడతాయని అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే భారీగా వర్షాలు కురుస్తున్నాయిహైదరాబాద్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉందని.. రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కూకట్పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లితో పాటు మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.Heavy rains in #hyderabad #HyderabadRains pic.twitter.com/RD2sRYF8yS— Aditya ✪ (@Glorious_Aditya) May 7, 2024 సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. నేటి వరకు ఎండలతో బెంలేతెత్తిన జనానికి.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా ఈదురుగాలులు భయపెట్టించాయి. The First respite for this Blazing Summer 🌞 #Hyderabad #thunderstorms #Rains pic.twitter.com/aHQENktyuA— Vikrant 🇮🇳🇮🇳 (@KauVikk) May 7, 2024
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్
ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్‌ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.My dear brothers and sisters,Youth unemployment, crimes against women, and discrimination against Dalits, Adivasis, and minorities have reached unprecedented levels. These challenges stem from the ‘niyat’ and ‘niti’ of PM Modi and the BJP which aim for power rejecting… pic.twitter.com/4npHwd8DNW— Congress (@INCIndia) May 7, 2024
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్‌లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్‌కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్ డువాన్ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్‌లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్‌కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్ ఫాలో అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..)
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్‌ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్‌పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్‌కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్‌నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్‌డ్రైవ్‌ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్‌కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్‌ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్‌ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్‌ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్‌పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్‌కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్‌మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
సినిమా
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్‌కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial)
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్‌లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్‌గా అనిపించింది.సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్‌కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
ఇండియన్ సినిమాలో 'పుష్ప: ది రైజ్' చెరిగిపోని ముద్ర వేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2021లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. పుష్పలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు ముందే మలయాళ ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ యాక్టర్‌గా ఉన్నారు. పుష్పతో ఫహాద్ ఫాజిల్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో చేరుకుంది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమి లేదని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే చెప్పేశాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా మారారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది.'పుష్ప సినిమా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఇదే విషయం సుకుమార్ సార్‌కు కూడా చెప్పాను. ఇందులో నేను దాచడం లేదు. అబద్దం చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. అయితే, మలయాళం భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాలో సంతోషాన్ని నింపింది. నేను ఏ ప్రాంతాన్ని, ఎవరినీ అగౌరపరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు.' అని ఆయన అన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్లో తనను పుష్ప చేర్చలేదని ఫహాద్‌ఫాజిల్ పేర్కొన్నాడు.
ఫొటోలు
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
క్రీడలు
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉన్నా ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌లలో భాగమైన బుమ్రా.. 18 వికెట్లు కూల్చాడు.తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానం(మే 7 నాటికి) అగ్రస్థానంలో నిలిచి.. పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆశలు సజీవమేవాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ అధికారికంగా ముంబై ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించలేదు.ఇక ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌కు లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్ చేరితే సంగతి వేరు!కాగా మే 26 నాటి ఫైనల్‌తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలిఈ నేపథ్యంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం విశ్రాంతినివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అసిస్టెంట్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు సోమవారం ప్రశ్న ఎదురైంది.కుదరదుఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంపై నేను స్పష్టతనివ్వలేను. అయితే, మేమంతా ఇక్కడున్నది సీజన్ ఆసాంతం సేవలు అందించడానికే! ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేము. వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడటం అనవసరం. ఇలాంటివి ప్రస్తుత ప్రదర్శనలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు ప్రస్తుతం విశ్రాంతినిచ్చే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు! వీడియో
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ తన మంచి మనుసును చాటుకున్నాడు. ఐపీఎల్-2024లో ధర్మశాల వేదికగా మే5న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మిచెల్ బౌండరీ లైన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మిచిల్ ఫుల్ షాట్ ఆడగా.. బంతి ప్రమాదశాత్తూ స్టాండ్స్‌లో ఉన్న అభిమానికి తాకింది. వెంటనే పక్క సీట్లో పడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న ఐ ఫోన్ గ్లాస్ సైతం బ్రేక్ అయింది. అదృష్టవశాత్తూ ఆ అభిమానికి ఎటువంటి గాయం కాలేదు. కానీ అతడి ఫోన్ మాత్రం పాడైపోయింది. ఇది చూసిన మిచెల్ అతడికి క్షమపణలు తెలిపాడు. అంతేకాకుండా తర్వాత అతడికి వద్ద తన బ్యాటింగ్‌కు గ్లౌవ్స్‌ను మిచెల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ మిచెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా మే 10న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. A guy got hurt and broke his iPhone during practice!!!Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024
పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐ కండిషన్ ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. మెగా టోర్నీని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా ఖరారు చేసింది.అవకాశమే లేదుఈ నేపథ్యంలో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? అన్న సందేహాలు తలెత్తాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు.గతంలో ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్నప్పటికీ.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే.బీసీసీఐ స్పందన ఇదేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత ప్రభుత్వం ఎలా చెబితే మేము అలా నడుచుకుంటాం.కేంద్రం అనుమతినిస్తేనే టీమిండియాను పాకిస్తాన్‌కు పంపిస్తాం. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టే మేము ముందుకు వెళ్తాం’’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో రోహిత్ సేన విజేతగా నిలవగా.. శ్రీలంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఇక ఆఖరిసారి 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై ఈవెంట్ జరుగనుండటం బాబర్ ఆజం బృందానికి సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్#WATCH | Delhi: On the Champion Trophy to be held in Pakistan next year, BCCI vice-president Rajeev Shukla said, "In the case of the Champion Trophy, we will do whatever the Government of India will tell us to do. We send our team only when the Government of India gives us… pic.twitter.com/TeA3dZ5Twn— ANI (@ANI) May 6, 2024
బిజినెస్
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీటైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది.
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్‌గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్‌ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్‌ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్‌ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్‌ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్‌కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్‌లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే.
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,459కు చేరింది. సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగి 73,896 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.03 శాతం లాభపడింది. నాస్డాక్ 1.19 శాతం ఎగబాకింది.బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు సోమవారం 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!
జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ
గాజువాకలో జనజాతర
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
బాబును చీల్చి చెండాడిన మహిళలు
ఫ్యామిలీ
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది.
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!)
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్‌కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్ డువాన్ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్‌లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్‌కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్ ఫాలో అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..)
న్యూస్ పాడ్‌కాస్ట్
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో మరింత సంక్షేమం.. మరింత అభివృద్ధి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... నవరత్నాల పథకాలన్నీ కొనసాగింపు..ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్‌రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాంతులు చేసుకున్న కోరుట్లవాసి వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ ఫర్నిచర్ ధ్వంసం