Top Stories
ప్రధాన వార్తలు
రేపే లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది.
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్ చేస్కోండి
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.
నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే... తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్సీపీ విజయమే ఖాయమని రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్సీపీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే.. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్‌తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. గుణపాఠం తప్పదా? పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. దిక్కుమాలిన ఐడియాలు రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వైఎస్సార్సీపీ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు.
May 12th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు..
గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు.
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?
(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చిన హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవత్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథకాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్ లెక్కలు, ఆర్బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.
నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు చివరి క్షణంలో ఓటర్లను ఆకట్టుకోవడంకోసం చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో హోరాహోరీ ప్రచారం జరిగింది. తెలంగాణలో ఉన్నంతలో వ్యక్తిగత విమర్శలకన్నా, విధానాలు, ప్రభుత్వాల పనితీరుపైనే విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో అంత తీవ్రత కనిపించడం లేదు. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశించే ఎన్నికలుగా అంతా చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం కూటమిల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. కూటమి తరపున కొన్ని మీడియా సంస్థలు రంగంలో దిగి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విధానాలకు పరిమితం కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధ్యత అంతా ఓటర్లపై పడింది.ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నదానిపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందుగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుందాం. తమకు కావల్సిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. కేవలం ప్రలోభాలకు లొంగకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఓట్లను వేసే పరిస్తితి రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ప్రజలు ఈ సందర్భంగా గమనించవలసిన అంశాలను తెలుసుకుందాం!ఓటు విలువ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకం. గ్రామవార్డు నుంచి పార్లమెంటు వరకు ఓట్ల ద్వారానే తమ నాయకులను ఎన్నుకునే గొప్ప వ్యవస్థ మనది. దీనిని బాధ్యతాయుతంగా అందరూ ఉపయోగించుకుంటే అది అర్దవంతంగా ఉంటుంది. కేవలం డబ్బు వంటి ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుంది. అయినప్పటికి వర్తమాన రాజకీయాలలో డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగడం లేదు. అది దురదృష్టకరం. డబ్బు తీసుకున్నా, కేవలం ఆ ప్రాతిపదికనే ఓటు వేయడం లేదని పలుమార్లు రుజువు అవుతోంది. ఉదాహరణకు గతంలో ఒకసారి ఒక నేత డబ్బులు పందారం చేసినా ఓటమి చెందారు. దాంతో ఆయన తాను డబ్బు ఇచ్చిన ఇళ్లకు వెళ్లి, డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసి వసూలు చేసుకున్నారు. ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవుతాయని ఓటర్లు గుర్తించాలి. అందుకే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని గమనించి ప్రలోభాలకు గురి కాకుండా ఓట్లు వేస్తే సమాజానికి మంచిది.అబద్దాల ప్రచారాలు: దురదృష్గవశాత్తు మన ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు అసత్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎదుటివారిని తిట్టడానికి ఈ అబద్దాలను వాడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక నేతపై దుమ్మెత్తి పోస్తారు. అదే నేత తమ పార్టీలోకి రాగానే మొత్తం మాఫీ అయినట్లు ఎన్నికలలో పోటీకి గాను టిక్కెట్లు కూడా ఇస్తుంటారు. వీరిలో ఎవరు పద్దతిగా ఉన్నారు? ఎవరిపపైన తక్కువ ఆరోపణలు ఉన్నాయి?ఏ అభ్యర్ధి తమకు అందుబాటులో ఉంటున్నారు? మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తే బాగుంటుంది.ప్రజాసేవ: ప్రతి రాజకీయ పార్టీ నేత తాము వచ్చే ఐదేళ్లు చాలా పెద్ద ఎత్తున సేవ చేస్తామని చెబుతారు. ఆ సందర్భంలో ఈ ఎన్నికల వరకు వారు ఎలా అందుబాటులో ఉన్నారు? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వారివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతోంది? అన్న అంశాల ఆధారంగా ఓట్లు వేస్తే ఉపయుక్తంగా ఉండవచ్చు. కరోనా వంటి సంక్షేభ సమయంలో ఏ నేత ప్రజలను ఆదుకున్నారు? ఏ నేత వేరే రాష్ట్రంలో ఉండి విమర్శలు చేస్తూ కూర్చున్నారు? అన్నవాటిని ఆలోచించుకోగలగాలి.గుణగణాలు: పోటీ చేస్తున్న అభ్యర్దుల గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయగలిగితే అసాంఘీక శక్తులు రాజకీయాలలోకి రాకుండా ఉంటాయి.కాని దురదృష్టవశాత్తు ఎక్కువ తప్పులు చేసేవారిని కూడా ఎన్నికలలో ఒక్కోసారి గెలిపిస్తున్నారు.వ్యక్తిగత జీవితంలో చాలా అరాచకంగా వ్యవహరించి, ప్రజాజీవితంలో నీతులు చెప్పేవారిని మ్మకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే అలాంటివారికి ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏదో ఒక ఆకర్షణకు లోనై ఓట్లు వేయడం కాకుండా, ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలకే మంచి జరుగుతుందా?లేదా?అన్నదానిపై దృష్టి పెట్టాలి.సమాజానికి ఆ అభ్యర్ధి ఏమైనా కొంతైనా ఆదర్శంగా ఉన్నాడా?లేదా?అన్నది కూడా చూడాలి.నాయకుల నిబద్దత: నాయకుల నిబద్దతను కూడా పరిశీలించాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?లేక తన మాటలను తానే మింగేస్తాడా?అన్నది పరీక్షించాలి. చెప్పాడంటే చేస్తాడంతే అన్న చందంగా నేతలు ఉంటే మంచిదే. కాని చెప్పేదొకటి, చేసేదొకటి అయితే ప్రజలు నమ్మకపోవడమే బెటర్.నాయకులలో ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు కుట్రలు,కుతంత్రాలకు పాల్పడుతున్నది అర్ధం చేసుకోవాలి. పైకి నీతులు చెబుతూ, లోపల గోతులు తవ్వుతున్నది ఎవరో గుర్తించాలి. లేకంటే గుంటనక్కల వంటి నేతలు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత నష్టపోయేది ప్రజలే అన్న సంగతి గుర్తించాలి.ఏ నాయకుడు అబద్దాలకు ప్రాధాన్యత ఇవ్వడు అన్నది తెలుసుకోవాలి.ఏ నేత అచ్చంగా అబద్దాలపైనే ఆధారపడి తరచు మాటలు మార్చుతుంటాడో అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓడించితే వారికి గుణపాఠం చెప్పినట్లవుతుంది.మానిఫెస్టో: ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలను ప్రకటించాయి. వాటిలో ఎన్ని నిజమైన హామీలు, ఎన్ని గాలి హామీలన్నదానిపై ఓటర్లు ఒక అవగాహనకు రావాలి?ఎవరైనా ఆకాశం తీసుకు వచ్చి మీ ఇంటి ముందు పెడతానంటే నమ్ముతామా?అలాగే ఒక కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామన్న రీతిలో వాగ్దానాలు చేస్తే విశ్వసిస్తామా? రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు అయ్యే ఖర్చు గురించి ఆ పార్టీ నేతలు చెప్పకపోతే వారిని అసలు విశ్వసించవద్దు. ఆ వాగ్దానాలన్నీ గాలిమూటలేనని తెలుసుకుని తగు విధంగా ఓట్లు వేయాలి.అధికారం వచ్చేవరకు కల్లబొల్లి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఓటర్లనే డబాయించడం చేసే నేతలను గుర్తు పెట్టుకుని ఓడించకపోతే, వారు నిత్యం మోసం చేస్తూనే ఉంటారు.అలవాటుప్రకారం మోసం చేసేవారిది తప్పుకాదు..మోసపోయేవారిదే తప్పు అని ఒకనానుడి ఉంది. అందువల్ల తాము మోసపోతున్నామా?లేదా? అన్నదాని ఆధారంగా ఓటు వినియోగించుకోవాలి.కొన్ని పార్టీలు తమ మానిఫెస్టోని ఎన్నికల తర్వాత వెబ్ సైట్ నుంచి తొలగించేస్తుంటాయి. అలాంటివారిని అసలు నమ్మవద్దని చెప్పకతప్పదు.కొన్ని హామీలు ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణమని వాగ్దానం చేశారు. వారు అదికారంలోకి వచ్చాక తేలికగా ఉండే ఆ హామీని అమలు చేశారు.దాని ఫలితంగా లక్షల మంది ఆటోలవారు ఉపాది కోల్పోయారు. చివరికి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో రైలు కూడా తీవ్రనష్టాలపాలవుతోంది.దాంతో మెట్రో రైల్ నిర్వహణ నుంచి వైదొలగుతామని ఆ సంస్థ చెబుతోందట.తప్పుడు ప్రచారాలు: కొన్ని రాజకీయ పార్టీలు అచ్చం తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీపై ఉన్నవి,లేనివి కల్పించి, అబూత కల్పనలను ప్రచారం చేస్తుంటాయి.అందువల్ల ఏ రాజకీయ పార్టీ చేసే ప్రచారంలో అయినా నిజం ఉందా?లేదా? అన్నది నిర్దారించుకోవాలి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎవరూ వ్యవహరించకూడదు. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పార్టీ లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన దుష్ప్రచారంపై కేసు నమోదు అయినా, అదే తప్పుడు ప్రచారాన్ని ఆ పార్టీ కొనసాగించింది.అలా చేయవచ్చా? ఎట్టి పరిస్థితిలోను అలాంటి పార్టీలను విశ్వసించకూడదు. ఒకవేళ నమ్మితే ఓటర్లు తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లే అవుతుంది.మీడియా కథనాలు: ఎపికి సంబంధించి మీడియా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. ఒక వర్గం మీడియా స్వతంత్రంగా ఉన్నామన్న ముసుగులో పచ్చి అబద్దాలను వార్తలుగా అల్లి రాస్తోంది. కల్పిత కథనాలకు అంతులేకుండా ఉంటోంది. ఒక రాజకీయపార్టీపై నిత్యం ద్వేషంతో విషం కక్కుతోంది. అలాంటి పత్రికలను అసలు పరిగణనలోకి తీసుకోవద్దు. స్వేచ్చగా ,వాస్తవం ఏమిటో తెలుసుకుని ఓట్లు వేయాలి.ప్రజా ప్రయోజనాలకన్నా, తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న మీడియాను గుర్తించగలగాలి.ప్రభుత్వ పనితీరు: నాయకుల పనితీరు, వ్యవహార శైలితో పాటు ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలను నిర్వహించిన వైనాన్ని కూడా సమీక్షించుకోవాలి. తమ మానిఫెస్టోలో ఉన్న అంశాలను సంబంధిత రాజకీయ పార్టీ పూర్తి చేసిందా?లేదా?ప్రభుత్వం తమకు అందుబాటులో ఉదా? లేదా? పాలనను తమ గడపవద్దకు తీసుకు వచ్చిందా? లేదా? ఎపిలో ఓడరేవులు, కొత్త పరిశ్రమల, మెడికల్ కాలేజీలు, ఐటి హబ్‌ల తయారీ మొదలైనవాటికి ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం గట్టిగా కృషి చేసిందో గమనించాలి.ఉద్దానం వంటి కిడ్నీ బాధిత ప్రాంతానికి ఏ ప్రభుత్వం బాగా సాయం చేసింది?విద్య, వైద్యం వంటి కీలకమైన రంగాలలో ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నది కూడా ఆలోచించాలి. కొన్ని ప్రభుత్వాలు విద్య,వైద్య రంగాలను ప్రైవేటు రంగానికి అప్పగించేసి ఉండవచ్చు. ఇంకో ప్రభుత్వం విద్య,వైద్యం పేదలకు నిత్యం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఓటరుగా మీరు ఎటు ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాలి.గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, వార్డు క్లినిక్ వంటివి అవసరమా?కాదా? వలంటీర్ల వ్యవస్థ అవసరమా? కాదా? దానిపై ఎవరు మాట మార్చారు? ఎవరు నికరంగా నిలబడ్డారు? తదితర అంశాలను గమనంలోకి తీసుకుని ఓటు హక్కు వాడుకోవడం కూడా అవసరమే. ఒక పార్టీ మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన రాజకీయ పార్టీలే, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చెబుతుంటే నమ్మవచ్చా? అంటే వారు తొలుత చేసిన విమర్శల ప్రకారం అప్పట్లో ఒక శ్రీలంక అయితే, వీరు అధికారంలోకి వస్తే మూడు శ్రీలంకలు చేస్తామని చెబుతున్నట్లేనా? మనం దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి?అన్నదానిపై స్పష్టతకు రావాలి.సోషల్ మీడియా: సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఒక మేలు జరుగుతోంది. అలాగే మరో కీడు కూడా ఎదురవుతోంది. తప్పుడు ప్రకటనలు చేసే రాజకీయ నేతల పాత వీడియోలతో సహా బయటపెట్టి సోషల్ మీడియా ఎండగడుతోంది. అంతవరకు బాగానే ఉంది. మరికొంత సోషల్ మీడియా మరింత ఆరాచకంగా పచ్చి అబద్దాలను, వదంతులను ప్రచారం చేస్తుంటుంది. అందువల్ల సోషల్ మీడియాను పాలు, నీళ్ల మాదిరి వేరు చేసుకుని నిజాలనే నమ్మాలి. ఈ సందర్భంగా సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటివాటికి తావివ్వకుండా జాగ్రత్తపడాలి.సత్వరమే ఓటు వేసుకోవడం బెబర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వాడుకునే అవకాశం ఉన్నా, సాధ్యమైనంతవరకు పెందలకడే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు వేస్తే బెటర్. ఆ తర్వాత తమ ఓటు ఎవరో వేసేశారని ఫిర్యాదు చేసినా, పెద్ద ఉపయోగం ఉండదు. వృద్దులు, మహిళలు ఇతరత్రా సీరియస్ సమస్యలు ఉన్నవారు తమకు సంబంధించిన బంధువులను వెంటబెట్టుకుని ఓట్లు వేయాలి తప్ప, పోలింగ్ బూత్ లోని సిబ్బందిని సహాయం అడగితే కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. ఆ సిబ్బంది వారికి నచ్చినవారికి ఓటు వేస్తే చేయగలిగింది ఏమీ ఉండదు. అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు. కాని కొన్ని సందర్భాలలో ఇలా జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు అపోహలు కూడా వస్తుంటాయి.ఓటర్ స్లిప్‌తో పాటు, గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.ఏది ఏమైనా 2024 శాసనసభ ఎప్నికల ఫలితాలు ఒక కీలకమైన మలుపు అవుతాయని చెప్పాలి. ఒక రాష్ట్ర గమనాన్ని నిర్దేశిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తమకు మేలు చేస్తుందనుకున్న రాజకీయ పార్టీకి ఓటు వేసుకుని గెలిపిస్తే ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
- బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
సినిమా
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా?
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్‌ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్
భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్
క్రిమినల్ మూవీతో తెలుగువారికి పరిచయమైంది మనీషా కొయిరాలా. ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లూరి నెరజాణ.. పాటతో ప్రేక్షకులు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను పెళ్లాడింది. పెళ్లయిన ఆరునెలలకే ఈ బంధం కొనసాగదని అర్థమైంది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.తాగుడుకు బానిసఅప్పటికే బిజీ సినిమా షెడ్యూల్స్ వల్ల ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది. దీనికి తోడు విడాకులు తీసుకోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అప్పటిదాకా తనతో కలిసిమెలిసి ఉన్న స్నేహితులు సైతం తమకు సంబంధం లేదన్నట్లు వదిలి వెళ్లిపోయారట.ఒంటరిగా..'జనాలకు ఎవరి బాధనూ పంచుకోవడం ఇష్టముండదు. కష్టాల్లో ఉన్నారనగానే వారిని ఒంటరిగా వదిలేసి పోతారు. స్నేహితులే కాదు నా బంధువులు కూడా ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నేనెలా ఉన్నాను? ఏంటనేది కూడా పట్టించుకోలేదు. నా పేరెంట్స్, సోదరుడు-వదిన.. వీళ్లు మాత్రమే సపోర్ట్‌గా నిలబడ్డారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బోధపడింది. అందుకే ఇంత స్ట్రాంగ్అన్నింటినీ దాటుకుని వచ్చాను కాబట్టే ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. కేవలం నా కుటుంబం వల్లే ఈరోజు ఇలా మీ ముందు నిలబడగలిగాను' అని చెప్పుకొచ్చింది. రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన మనీషా 2014లో ఆ భయంకరమైన వ్యాధిని జయించింది. ఇటీవల హీరామండి అనే వెబ్ సిరీస్‌లో మల్లికా జాన్ అనే పాత్రలో నటించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: నీలి రంగు చీరలో కేక పుట్టిస్తున్న కేరళ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా?
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్‌లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్‌గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్‌కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
ఫొటోలు
Vah Vyshnavi: సొంతింట్లో బుల్లితెర నటి సత్యనారాయణ వ్రతం (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
AP Assembly Elections 2024: ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోలింగ్ సామాగ్రి తరలింపు కోసం అధికారులు బిజీ (ఫొటోలు)
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
Famous Celebrities Mothers Photos: భారతీయులు గర్వించదగ్గ ప్రభావవంతమైన తల్లలు..!
క్రీడలు
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్‌స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
కేకేఆర్ ఆల్‌రౌండర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్‌కు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2024లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదిగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రమణ్‌దీప్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును రమణ్ దీప్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను సైతం అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. క్రికెట్ పరికరాలు లేదంటే, స్టంప్స్‌ను బ్రేక్ చేయడం, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్లకు చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి. ఇక ఈ మ్యాచ్‌లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
సునీల్ నరైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్లగా వెనుదిరిగిన ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన నరైన్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో నరైన్ ఇప్పటివరకు 44 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డకౌటయ్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగమించాడు. అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా పియూష్ చావ్లా సరసన సునీల్ నరైన్ నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ డకౌటయ్యాడు. దీంతో పాటు మరో రికార్డును కూడా నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
చాలా బాధగా ఉంది.. ఆ తప్పే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం తీరలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ ఏడాది సీజన్లో ముంబైకు ఇది తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఆఖరి మ్యాచ్‌లలోనూ తమ మార్కును చూపించలేకపోతుంది. ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(32) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ తెలిపాడు."ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. లక్ష్య చేధనలో మాకు అద్బుతమైన ఆరంభం లభించినప్పటికి మేము సద్వినియోగపరుచుకోలేకపోయాము. వాతవారణ పరిస్ధితుల కారణంగా పిచ్ కొంచెం మేము అనుకున్నదాని కంటే కొంచెం భిన్నంగా ఉంది. అయితే బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్(ఈడెన్ పిచ్) అయితే కాదు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 158 పరుగుల టార్గెట్ అనేది మరి అంత పెద్ద లక్ష్యమేమి కాదు. తొలుత మేము బౌలింగ్ చేసే టప్పుడు మా బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతీసారి పూర్తిగా తడిగా మారి వెనుక్కి వచ్చేది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్ధి బ్యాటర్లు బౌండరీలను అలవోకగా బాదారు.ఇక మా చివరి మ్యాచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలలు ఏమీ లేవు. వీలైనంతవరకు టోర్నీని విజయంతో ముగించేందుకు ప్రయ"త్నిస్తాము. ఏదమైనప్పటికి ఈ ఏడాది సీజన్లో మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.
బిజినెస్
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
గత కొన్ని సంవత్సరాలు ఎగిరే కార్లు వస్తాయని వింటూనే ఉన్నాము. ఇటీవల ఆనంద్ మహీంద్రా దేశంలో అడుగు పెట్టనున్న మొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్లాన్ (Eplane) అనే స్టార్టప్ కంపెనీ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి గత సంవత్సరమే ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారు చేసే కంపెనీగా అవతరిస్తుంది.ఈ కంపెనీకి చెందిన ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ.. వచ్చే ఏడాది లోపల మద్రాస్ ఐఐటీ ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.The eplane company. A company being incubated at IIT Madras to build a flying electric taxi by sometime next year…IIT Madras has become one of the WORLD’s most exciting and active incubators. Thanks to them and the rapidly growing number of ambitious incubators throughout… pic.twitter.com/Ijb9Rd2MAH— anand mahindra (@anandmahindra) May 10, 2024
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు.
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్ స్కూట్ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఐఫోన్లో చాట్‌జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్‌జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్‌లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్‌జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.
వీడియోలు
పోలింగ్ కు కౌంట్ డౌన్
ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ నేత మోహన్ రెడ్డి
కాకినాడ జిల్లాలో పోలింగ్ కోసం స్వరం సిద్ధం
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
కడపలో పోలింగ్ కి ఏర్పాట్లు
ఎన్నికల పండగ..కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ఓటు ఎలా వేయాలి ?..ట్రైనింగ్ వీడియో మీకోసం
కెఎస్ఆర్ లైవ్ షో @ 12 May 2024
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు
ఫ్యామిలీ
కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!
మన భారతీయ ఫుడ్ స్టాల్ దాయాది దేశమైన పాక్‌లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్ స్టాల్ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్ స్టాల్‌ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్ ఆమె ఫుడ్ స్టాల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఆమె ఫుడ్ స్టాల్ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్ చేశారు. ముంబైలో వడపావ్ ఫేమస్. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్లాగర్ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో తమ స్టాల్‌ని నడపమని చెప్పడంతో ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్ ఖాన్ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్‌లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karamat Khan (@karamatkhan_05) (చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!)
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా
న్యూస్ పాడ్‌కాస్ట్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
హైకోర్టు లాయర్ చైత్రా ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్ సెంటర్‌కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారుఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు.
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్‌లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్‌లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.