Top Stories
ప్రధాన వార్తలు
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం
ఓటమి బాటలో బాబు
చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను, ఇటీవల తొలగించిన 33 వేల టీడీపీ దొంగఓట్లను పరిగణనలోకి తీసుకుంటే, మే 13న జరిగిన ఎన్నికలో కుప్పం అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నించున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3–4 వేల ఓట్లు (0.02%) మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్ పడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడి పోబోతున్నారని స్పష్టమవుతోంది. ఇటు ఓటర్లు, అటు రాజకీయ విశ్లేషకులు, పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది. సాక్షి, తిరుపతి: ఐదేళ్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగినంత మేలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జరగలేదని, అందుకే కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటెత్తారని స్పష్టమవుతోంది. 35 ఏళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను నమ్మించి.. సీఎంగా, ఎమ్మెల్యేగా కొనసాగిన చంద్రబాబును కుప్పం ఓటర్లు ఈసారి శంకరగిరి మాన్యాలకు పంపుతున్నట్లు ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. 2019 సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడూ పునరావృతం కాబోతోందని సమాచారం. నాటి చంద్రబాబు.. నేటి వైఎస్ జగన్ పాలనను బేరీజు వేసుకునే ఓటర్లు ఓటెత్తారని స్పష్టమవుతోంది. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,400 కోట్లకుపైగా జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించారు. కుప్పం వాసులకు కలగా మారిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. చంద్రబాబు ఉన్నన్ని రోజులు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హంద్రీ–నీవా సృజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి కలను నిజం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వివరాలు » పలమనేరు నియోజకవర్గం అప్పిన పల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కి.మీ వరకు హంద్రీ–నీవా కాలువ తవ్వారు.» 5 కిలోమీటర్లలో పశు పత్తురు వద్ద, 39వ కిలోమీటర్ కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు» వి.కోట మండలం ఆదిరే పల్లి 54.కి.మీ వద్ద లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ–నీవా కృష్ణా జలాలు అందించారు.» కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్లివ్వడం ద్వారా 6,500 ఎకరాల ఆయకట్టుకు అండగా నిలిచారు. » అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీరు హంద్రీ–నీవా కాలువలు ద్వారా విడుదలవుతుంది. ఆవిరి, లీకేజీ పోగా 220 క్యూసెక్కుల నీరు కుప్పం చేరుతుంది. 4 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుంది. కుడి ఎడమల సంక్షేమం, అభివృద్ధి» వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.» కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, పట్టణ అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.» నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయటంతో పాటు.. కుప్పం పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలను నియమించారు.» రూ.15 కోట్ల వ్యయంతో కుప్పం పట్టణ నడిబొడ్డు, డికే పల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించారు.» నియోజకవర్గంలో ఏడు పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించారు.» రూ.5 కోట్ల వ్యయంతో మున్సిపాలిటి పాలన వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తుల నూతన భవనాలు నిర్మించారు.» శాంతిపురం మండలంలోని కేటీ పల్లి, పోడిచేన్లు, ప్రతిచామనూరులకు రూ 7.25 కోట్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్డు వేయించారు. » నియోజకవర్గంలో 78 సచివాలయాలకు రూ.87.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.15.77 కోట్లతో 77 రైతు భరోసా కేంద్రాలు, రూ.7.9 కోట్లతో 58 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. » కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. »కుప్పంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న వన్నె కులస్తుల కోసం క్షత్రియ భవనం ప్రారంభించారు.బాబును గెలిపిస్తూ వచ్చింది దొంగ ఓట్లేచంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుపొందుతూ వచ్చారు. కుప్పం వాసుల అమాయకత్వంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందిన 52 వేల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి.. దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి.. బాబు దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టారు. ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి జనం భారీగా తరలివచ్చి, ఓట్లు వేసి వెళ్లటం గమనించిన చంద్రమౌళి దొంగ ఓట్లపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో దొంగ ఓట్లు ఉన్నట్టు తేలడంతో ఇదివరకు 18 వేల ఓట్లు, ఈ ఎన్నికలకు ముందు 33 వేల ఓట్లు తొలగించారు. దొంగ ఓట్లను తొలగించటంతో పాటు కుప్పం వాసులు చైతన్య వంతులు కావటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. కుటుంబ సమేతంగా కుప్పానికి పరుగు» కుప్పంలో 2014 ముందు ఒక లెక్క. ఆ తర్వాత ఒక లెక్క అన్న చందంగా మారింది. వైఎస్సార్సీపీ రానంత వరకు అన్ని గ్రామాల్లో చంద్రబాబు చెప్పిందే శాసనంలా సాగింది. భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ అడుగు పెట్టడంతో షాక్‌ల మీద షాక్‌లు తగలటం మొదలయ్యాయి. » బాబు అండ్ కో బ్యాచ్ అరాచకాలను జీర్ణించుకోలేని స్థానికులు ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ జెండాను ఎగుర వేయటం ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మొదటి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు నమోదవ్వటంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మెన్ అంతా వైఎస్సార్సీపీ మద్దతు దారులే గెలుపొందటంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. » 35 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేతల మాటలతో జ్ఞానోదయం అయింది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం చేపట్టారు. కుప్పానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే చంద్రబాబు.. 2019 ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 2019–2024 మధ్య 14 సార్లు కుప్పం రావడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు.» కుమారుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం దారిపట్టారు. ఓటమి భయంతోనే లోకేశ్ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించి అభాసుపాలయ్యారు. నారా భువనేశ్వరి ఇటీవలి కాలంలో రెండు పర్యాయాలు కుప్పానికి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నామినేషన్ వేయటానిక్కూడా కుప్పానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే చందాలు వేసుకుని ఆయన తరుఫున నామినేషన్ వేసేవారు. అటువంటిది ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పానికి చేరుకుని, సొంత డబ్బులతో నామినేషన్ వేశారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఓటుకు రూ.2 వేలు పంపిణీచంద్రబాబు గతంలో కుప్పంలో ఓటర్లకు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.200 లేదా రూ.300 పంపిణీ చేసేవారు. ఈ నగదు కూడా ఓటర్లందరికీ ఇచ్చేవారు కాదు. సగం ఓటర్లకు ఇచ్చి మిగిలిన సగం నగదు నొక్కేసి అందరికీ పంపిణీ చేశామని లెక్క చూపేవారని ఆరోపణలు ఉన్నాయి. అటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో మే 10, 11, 12 తేదీల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఈ నగదును చంద్రబాబే స్వయంగా పంపించారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకే డబ్బులు పంపిణీ చేసి మాయ చేయాలని చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల ద్వారా కుటుంబ ఆర్థిక పురోభివృది్ధకి దోహద పడ్డారని, కుప్పాన్ని అభివృద్ధి చేసినందుకే తాము ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు.బాబు కుప్పం ప్రస్థానం 1989లో పోలైన ఓట్లు: 95,157చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 50,098 (52.65%)మెజారిటీ: 6,9181994లో పోలైన ఓట్లు: 1,07,582చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 81,210 (75.49%)మెజారిటీ: 56,5881999లో పోలైన ఓట్లు: 1,25,357 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 93,288 (74.42%)మెజారిటీ: 65,687 2004లో పోలైన ఓట్లు: 1,40,153 చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 98,123–(70%– 4.42% తగ్గాయి.. 6,195 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 59,5882009లో పోలైన ఓట్లు: 1,45,287చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 89,954 (61.9% – 8.1% తగ్గాయి.. 11,770 ఓట్లు కోల్పోయారు)మెజారిటీ: 46,0662014లో పోలైన ఓట్లు: 1,64,071చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,02,953 (62.5% –0.6% పెరిగాయి. 985 ఓట్లు అదనంగా వచ్చాయి)మెజారిటీ: 47,1212019లో పోలైన ఓట్లు: 1,79,329చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,00,146 (55.18% – 7.32% తగ్గాయి. 13,127 ఓట్లుకోల్పోయారు)మెజారిటీ: 30,722 మే 13న జరిగిన ఎన్నికలో కుప్పంలోమొత్తం ఓటర్లు: 2,13,145 పోల్ అయిన ఓట్లు: 1,83,027 (85.87%)గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు2014 – 55,839 ఓట్లు (33.9%)2019 – 69,424 ఓట్లు (38.25% – 4.35% పెరుగుదల
Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి సా.6.42 వరకు, తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం: విశాఖ ఉ.8.51 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం: ప.1.03 నుండి 2.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు అమృతఘడియలు: రా.11.04 నుండి 1.10 వరకు. మేషం : ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృషభం : ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.మిథునం : ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.కర్కాటకం: ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.సింహం ; స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.కన్య : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.తుల : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.వృశ్చికం : మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.ధనుస్సు: అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.మకరం : కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.కుంభం: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.మీనం: తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా.
కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం
సాక్షి, అమరావతి: ఏ విధంగా అయినా సరే పోలింగ్ రోజు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ తొక్కని అడ్డదారులంటూ లేవు. గూండాయిజం, దౌర్జన్యం, బెదిరింపులు, రిగ్గింగ్.. ఇలా అన్ని విధాలా అక్రమాలకు పాల్పడింది. ఎక్కడైనా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గట్టిగా ప్రతిఘటిస్తే ఈసీ అండతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎదురు దాడులు చేస్తూ.. ‘పచ్చ’ మూక ఎదురు కేసులు పెడుతోంది. నానా యాగీ చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి.. ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున స్పందిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళనకు గురై ధ్వంస రచనకు తెరలేపారు. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఓట్లు వేసేందుకు బయటకు రాకుండా చేయాలని కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పోలింగ్ రోజు (ఈనెల 13న) ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను గొడవలకు ఉసిగొల్పారు. దీంతో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దారుణకాండ వెబ్ కాస్టింగ్‌లో లైవ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ గూండాల పైశాచికత్వానికి వత్తాసు పలికారు. టీడీపీ రౌడీల అరాచకాలను అడ్డుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోన్లు చేసినా, వారు స్పందించలేదు. మాచర్ల నుంచి తాడిపత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ రౌడీల దారుణకాండ మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేసేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఈ అరాచక పర్వం గురించి ఓటర్లు మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిన్నెల్లి ఫిర్యాదు చేసేందుకు పదే పదే ఫోన్లు చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిచి.. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పిన్నెల్లి పాల్వాయిగేటుకు చేరుకున్నారు. టీడీపీ రౌడీల దారుణకాండను అడ్డుకునే యత్నం చేశారు. తమ కుట్ర విఫలమవడంతో పిన్నెల్లిపై పచ్చమూక దు్రష్ఫచారం చేస్తోంది.బడుగులపై దాడులు.. ఈవీఎంల ధ్వంసం మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ బూత్ 251లో ఓటు వేసేందుకు వచ్చిన ఎస్టీ వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావుపై టీడీపీ రౌడీలు దాడి చేసి, చితకబాదారు. భయోత్పాతం సృష్టించడం ద్వారా ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను బెదరగొట్టాలని కుట్ర చేశారు. మాచర్ల మండలం తుమ్మురుకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు ఏకపక్షంగా ఓట్లు వేస్తుండటంతో టీడీపీ గూండాలు జీరి్ణంచుకోలేకపోయారు. ఎలాగైనా సరే ఆ ఓట్లను చెల్లకుండా చేయాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఆ నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో పోలింగ్ సజావుగా జరగకుండా విఘాతం కల్పించడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. జమ్మలమడుగు నవాజ్ కట్టలోని 116, 117 పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్‌ను అడ్డుకోవడానికి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపే‹Ùరెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి సు«దీర్‌రెడ్డిపై రాళ్ల దాడికి దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తేలప్రోలు జెడ్పీ హైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించడానికి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలోని పచ్చమంద బరితెగించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను కవ్విస్తూ దాడికి దిగి భయోత్పాతం సృష్టించింది.
వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నష్టాలు, అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేశాయి. గృహ వినియోగం మినహా.. వాణిజ్య, పారిశ్రామిక, ఇతర కేటగిరీల విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రాథమికంగా ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి త్వరలో ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. జూన్ 6వ తేదీతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత నెల (ఏప్రిల్) ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాలి. ఎన్నికలు, ఇతర కారణాలతో డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించక పోవడంతో ఉన్న చార్జీలనే కొంతకాలం కొనసాగించేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. జనవరి 31 వరకే గడువు ఇచ్చిన ఈఆర్సీ.. విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30వ తేదీలోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాలి. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో వచ్చే ఆదాయం ఎంత? వ్యత్య్సాం (ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వమిచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా మిగిలే లోటును భర్తీ చేసేందుకు.. ఎంత మేర విద్యుత్ చార్జీలు పెంచాలి? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2024–25 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. అప్పట్లో డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా.. ఈఆర్సీ తిరస్కరించింది. వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రతినెలా రూ1,386 కోట్లలోటు.. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగిపోయినట్టు గతంలో విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. డిస్కంలు సగటున ప్రతి నెలా రూ.1,386 కోట్ల లోటు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. కోడ్ ముగిస్తే వారికీ ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించలేదు. ఆ జిల్లాలోని 8 లక్షల గృహ కనెక్షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పొందిన విద్యుత్ కనెక్షన్లకు ఎన్నికల కోడ్ ముగిశాక ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహజ్యోతి పథకంతో నెలకు రూ.120 కోట్ల భారం పడుతోందని.. అది రూ.150 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గృహజ్యోతి అమలుకు అనుమతిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ముందస్తుగానే డిస్కంలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఓ వైపు 200 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ అందిస్తూ.. అంతకు మించి విద్యుత్ వినియోగించే వారి బిల్లులను పెంచడం సమంజసం కాదనే భావన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను మాత్రమే పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెంచకపోతే సర్కారే భరించాలి! లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను ఏ మేర పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు హైదరాబాద్, వరంగల్‌లలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. తర్వాత కొత్త టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే విద్యుత్ సబ్సిడీల రూపంలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎలాంటి చార్జీల పెంపు లేకుండానే కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుంది.
టీడీపీ సైలెన్స్.. దేనికి సంకేతం?
ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.
రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్ నమ్దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్ నాకౌట్ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు! అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దూకుడు లేకుండా... బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్ (0)లను వరుస బంతులకు అవుట్ చేసి అశ్విన్ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్ ఇన్నింగ్స్ ఆర్సీబీని ముందుకు నడిపించింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్ ధాటిగా ఆడాడు. రాణించిన జైస్వాల్... ఛేదనను జైస్వాల్, టామ్ కోలర్ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్ దయాళ్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించారు.అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్ (8) రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. పరాగ్, హెట్‌మైర్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) (సబ్) ఫెరీరా (బి) చహల్ 33; డుప్లెసిస్ (సి) పావెల్ (బి) బౌల్ట్ 17; గ్రీన్ (సి) పావెల్ (బి) అశ్విన్ 27; పటిదార్ (సి) పరాగ్ (బి) అవేశ్ 34; మ్యాక్స్‌వెల్ (సి) జురేల్ (బి) అశ్విన్ 0; లోమ్రోర్ (సి) పావెల్ (బి) అశ్విన్ 32; కార్తీక్ (సి) జైస్వాల్ (బి) అవేశ్ 11; స్వప్నిల్ (నాటౌట్) 9; కరణ్ (సి) పావెల్ (బి) సందీప్ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–16–1, సందీప్ శర్మ 4–0–48–1, అవేశ్ ఖాన్ 4–0–44–3, అశ్విన్ 4–0–19–2, చహల్ 4–0–43–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కార్తీక్ (బి) గ్రీన్ 45; టామ్ కోలర్ (బి) ఫెర్గూసన్ 20; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కరణ్ 17; పరాగ్ (సి) సిరాజ్ 36; జురేల్ (రనౌట్) 8; హెట్‌మైర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 26; పావెల్ (నాటౌట్) 16; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్: స్వప్నిల్ 2–0–19–0, సిరాజ్ 4–0–33–2, దయాళ్ 3–0–37–0, ఫెర్గూసన్ 4–0–37–1, కరణ్ శర్మ 2–0–19–1, గ్రీన్ 4–0–28–1.
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్ లక్ష్మీషా బుధవారం తెలిపారు.ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వార్షిక చికిత్స పరిమితి రూ.25 ల„ý ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,566.22 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు జమ చేశారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకాయిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు వైద్య శాఖ ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూచించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.
తప్పక చదవండి
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..?
- పేటీఎంకు పెరిగిన నష్టాలు
- Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
- సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్‌రెడ్డి
- విమానంలో స్టాండింగ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
సినిమా
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పరిచయ అక్కర్లేని పేరు. బీ టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.తాజాగా రోమ్‌లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది. దీంతో అందరి కళ్లు ప్రియాంక నెక్లెస్‌పైనే పడ్డాయి.ఇంతకీ ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లెస్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప్రియాంక వేసుకున్న నెక్లెస్‌ను 140 క్యారెట్ల డైమండ్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం డైమండ్ నెక్లెస్ దాదాపు రూ.358 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఆ నెక్లెస్ రూపొందించడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అత్యంత ఖరీదైన నెక్లెస్‌లో ఇది ఒకటిగా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక హాలీవుడ్ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో ఆమె చివరిసారిగా 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలసి జీ లే జరా అనే సినిమాలో కనిపించనుంది. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari)
'జ్యోతిష్యం బలంగా నమ్ముతా.. తెలుగులో నటించడం నా అదృష్టం'
దేవర భామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని.. రాశి అనుకూలంగా ఉందా లేదా అని చాలాసార్లు చెక్ చేసుకుంటానని జాన్వీ కపూర్ తెలిపింది.జాన్వీ మాట్లాడుతూ..'మనమందరం రాశులను చెక్ చేసుకుంటాం. నేను కూడా అలాగే చేస్తా. ఇప్పటికీ చాలాసార్లు రాశి అనుకూలంగా ఉందా అని చూసుకుంటా. ఎందుకంటే నేను జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతాను. ఒకవేళ నా రాశి సరిపోకుంటే ఆ వ్యక్తితో మాట్లాడటం మానేస్తాను." అంటూ చెప్పుకొచ్చింది.కాగా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో రాజ్‌కుమార్ రావ్‌కు జంటగా నటించారు. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ సినిమాలో నటించడం తన అదృష్టమని తెలిపింది. దేవర సినిమా సెట్లో పనిచేయడం నాకు చాలా ఇష్టమని పేర్కొంది. సెట్లోని నాపై ఎంతో అభిమానం చూపించారని.. సినిమా పట్ల వారి అంకితభావానికి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు జాన్వీ కపూర్ కృతజ్ఞతలు తెలిపింది.
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
హీరోయిన్‌గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్‌తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది. 13 ఏళ్ల ప్రేమతర్వాతి కాలంటో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.ఆ పాయింట్ దాటొద్దుకానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.లైఫ్ లెస్సన్అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్‌తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్‌లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్‌ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్‌ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్‌కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
ఫొటోలు
గ్రాండ్‌గా ప్రభాస్ కల్కి ఈవెంట్.. బుజ్జి లుక్ రివీల్ చేసిన మేకర్స్ (ఫొటోలు)
Janki Bodiwala: షైతాన్ మూవీలో దెయ్యం పట్టినట్లుగా.. రియల్ లైఫ్‌లో ఏంజెల్‌గా.. (ఫోటోలు)
హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
క్రీడలు
ప్రిక్వార్టర్స్‌లో సింధు
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21–17, 21–16తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన అషి్మత చాలిహా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి–సుమీత్ 21–15, 12–21, 21–17తో లుయి చుర్ వే– ఫు చి యాన్ (హాంకాంగ్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–17తో టకూమా ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు.
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
యెచోన్ (దక్షిణ కొరియా): కొత్త సీజన్లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది.
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్‌మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు.
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు.
బిజినెస్
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్ సేల్స్ విభాగంతో పాటు రిస్క్ అండ్ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్‌తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్‌ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్..వాఘుల్ గురించి తెలుసా..?
భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే కల బలంగా ఉన్నా తగిన వయసు లేకపోవడంతో బ్యాంకింగ్‌లో తన కెరియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్‌కే దక్కుతుంది. బ్యాంకింగ్ రంగంలో తాను చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల తన 88వ ఏటా అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఆ ధర్మయోగి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.నారాయణన్ వాఘుల్ 1936లో అప్పటి బ్రిటిష్ ఇండియా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) జన్మించారు. ఎనిమిది మంది సంతానం ఉన్న కుటుంబంలో ఆయన రెండోవాడు. వాఘుల్ తన బాల్యంలో రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్నారు. 1956లో మద్రాస్ విశ్వవిద్యాలయంలోని లయోలా కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. కానీ వయసు కటాఫ్ ఉండడంతో దానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు.చదువు పూర్తి చేసుకున్న తర్వాత వాఘుల్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరియర్ ప్రారంభించారు. ఆ సమయంలో తనకు అప్పటి బ్యాంక్ ఛైర్మన్ ఆర్.కె.తల్వార్ మార్గదర్శకుడిగా ఉన్నారు. ఎస్బీఐలో సుధీర్ఘంగా 19 ఏళ్లు పనిచేసిన తరువాత పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్కు అధ్యాపకుడుగా పనిచేశారు. 1978లో ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన 44వ ఏటా 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చిన్న వయసులో ప్రభుత్వ రంగ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం.1985లో ప్రభుత్వ నియంత్రణలో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటైజేషన్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1996లో పదవీ విరమణ చేసినా 2009 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తూ కె.వి.కామత్, కల్పనా మోర్పారియా, శిఖా శర్మ, నచికేత్ మోర్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలను తయారుచేశారు. తర్వాతికాలంలో వీరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలకు నాయకత్వం వహించారు.పదవి విరమణ అనంతరం వాఘుల్ విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మిట్టల్ స్టీల్‌తో సహా అనేక కంపెనీల బోర్డులో డైరెక్టర్‌గా వ్యవహరించారు. వాఘుల్‌కు 2010లో వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో భారతదేశపు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. బిజినెస్ ఇండియా 1991 ఏడాదిలో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ది ఎకనామిక్ టైమ్స్.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించాయి. ఆయన భారతదేశంలోని ఎన్జీవోల్లో ఒకటైన ‘గివ్ ఇండియా’కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. నారాయణన్ వాఘుల్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో 2012లో కార్పొరేట్ కాటలిస్ట్ ఫోర్బ్స్ ఫిలాంత్రోపీ అవార్డును అందుకున్నారు.ఇదీ చదవండి: సముద్రంపై మరోసారి అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలువాఘుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పించింది. ‘ఒక ధర్మ యోగి, సంస్థ నిర్మాత, గురువు, దూరదృష్టి కలిగినవాడు, రచయిత, పరోపకారి, భారతీయ పరిశ్రమలో ప్రముఖుడు. వాణిజ్య బ్యాంకింగ్, బీమా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్లు.. ఇలా అన్నింటిలో భాగమైన ఐసీఐసీఐను డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంకింగ్ గ్రూప్‌గా తీర్చిదిద్దిన బ్యాంకర్. అనేక మార్గదర్శక ఆర్థిక సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర వహించిన దూరదృష్టి కలిగిన వ్యక్తి. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో నాయకులకు కొన్నేళ్లుగా మార్గదర్శకాలిచ్చిన గురువుకు ఐసీఐసీఐ బ్యాంకు రుణపడి ఉంటుంది’ అని తెలిపింది.
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం రోజు దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది.
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ వృద్దిని విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.ఈ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్‌ను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.ఈతరుణంలో ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల • సింగిల్ ప్రీమియం ప్లాన్• పాలసీ టర్మ్, డెత్ కవర్ని ఎంపిక చేసుకోవచ్చు. • పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. •ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. • మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్• మెచ్యూరిటీపై ఇన్స్టాల్మెంట్, సెటిల్మెంట్లో డెత్ బెనిఫిట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.• పాలసీకి లోన్ అందుబాటులో ఉందిఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్• ఎల్ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. • ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. • జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి.
వీడియోలు
ఎలిమినేటర్ మ్యాచ్
టాలీవుడ్ స్నిప్పెట్లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్డేట్
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
ఎలిమినేట్ అయ్యేదెవరో?
కాజల్ అగర్వాల్‌తో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
మూడు రోజులు వర్షాలు
పోలీస్ యూనిఫామ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు రామ్ చరణ్
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
ఫ్యామిలీ
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్‌లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌లోని వాంకనేర్‌కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్‌సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్‌తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్‌లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు
Mr & Mrs Mahi జాన్వీ కపూర్ స్టయిల్...సో బ్యూటిఫుల్ : ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ అంతే!
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి అభిమానుల మనసుదోచుకుంది. అంతేకాదు క్రికెట్ నేపథ్య చీరపై ఆమెకున్న మక్కువను మరోసారి చాటుకుంది. తన అప్కమింగ్మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహీలో ప్రమోషనల్లో భాగంగా జాన్వీ ప్రత్యేక కాన్సెప్ట్ - మెథడ్ డ్రెస్సింగ్‌ని ఎంచుకుని అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది. జాన్వీ కపూర్ ఇటీవల రిఫ్రెష్ ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా అద్భుతమైన క్రికెట్ బాల్ థీమ్ డిజైన్‌తో రెడ్ అండ్ వైట్ చారల శారీలో మెరిసిపోయింది. చీరలాగే బ్లౌజ్ కూడా ఎప్పటి లాగే మోడ్రన్‌గా, అద్భుతంగా కనిపించింది. రెడ్ ఫాక్స్ లెదర్ బ్లౌజ్‌ను జత చేసింది. నెక్లైన్, స్లీవ్‌లెస్ డిజైన్‌తో సూపర్ హాట్‌గా కనిపించింది. అంతేకాదు క్రికెట్ బాల్ ఆకారంలో ఉన్న ఒక చిన్న ఎర్రటి లెదర్ పర్స్‌ను ఎంచుకుంది. స్టైలిష్ , కర్లీ హెయిర్‌స్టైల్‌ని , మెరిసే చెవిపోగులు, ఉంగరాలు ఇలా ప్రతీదీ స్పెషల్‌గా ఉండేలా జాగ్రత్తపడింది దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజ్‌కుమార్ రావు జాన్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
కాంజీవరం చీరలో జాన్వీ కపూర్..ఏకంగా 1983 ప్రపంచ కప్..!
దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ ఫిట్నెస్కి సంబంధిందిచిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా డిజైనర్ డ్రెస్‌ల ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ప్రసుత్తం జాన్వీ వరుస బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలో మంచి బిజీగా ఉంది. ఆమె తన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ప్రచారం కోసం వారణాసిలో భారతీయ సంప్రదాయ చీరతో తళుక్కుమంది. అందమైన లేత నీలి రంగు చీరలో జాన్వీ లుక్ మిస్మరైజింగ్ ఉంది. ఆమె ధరించిన కంజీవరం చీర జాన్వీ అందాన్ని రెట్టింపు చేసింది. అయితే జాన్వీ ధరించిన చీర క్రికెట్ అభిమానులకు అలానాటి మధుర జ్ఞాపకాలను కళ్ల ముందు కదలాడేలా చేసింది. క్రికెట్‌కి జాన్వీ ధరించిన చీరకు సంబంధం ఏంటా ? అని అనుకోకండి. ఎందకంటే..? ఆమె చీర పల్లుపై నాటి 1983 ప్రపంచకప్ ఫైనల్స్ని చాలా చక్కగా చిత్రీకరించారు. దీన్ని చాలా వివరణాత్మకంగా చేతితో చిత్రించారు. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami)భారతదేశం ట్రోపీని కైవసం చేసుకున్న ఆ టోర్నీని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూస్తే కళ్లు తిప్పుకోలేం. మంచి కళాత్మక స్ట్రోక్‌లతో పూర్తి స్టేడియం నుంచి బ్యాట్స్‌మ్యాన్ సిక్సర్ కొట్టడం దాక చాలా చక్కగా అవగతమయ్యేలా చిత్రీకరించారు. క్రికెట్ థీమ్‌తో ఆలోచనాత్మకంగా చీరను తీర్చిదిద్దాలనుకువడం హైలెట్‌గా నిలిచింది. ఒక పక్క జాన్వీకి సంప్రదాయ బోర్డర్లోతో ఉన్న చీర మంచి లుక్‌ని తీసుకురాగా, దానిలో ఉన్న క్రికెట్ నేపథ్య చిత్రం చూపురులను మరింతగా ఆకట్టుకుంది. అంతేగాదు ఇది జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్‌ని, ఆమె డ్రెస్ సెలక్షన్ వేరేలెవెల్ అని అనింపించేలా చేసింది. అలాగే ఆ చీరకు తగ్గట్టు బ్యాకెలెస్ బ్లౌజ్ టై చేసి, పొట్టి చేతులతో కూడిన డిజైన్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అంతకుమునుపు జాన్వీ ఇలాంటి బ్లూ కలర్ సీక్విన్స్‌తో డిజైన్ చేసిన మల్హోత్ర శారీని ధరించింది. దీనిక తగ్గట్టుగా స్లీవ్‌లెస్ కాలర్ బ్లౌజ్‌పై ట్రోఫీ చిత్రంతో కూడిన బటన్లు ఉన్నాయి. ఈ చీరలో జాన్వీ మరింత క్యూట్‌గా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో, పోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)
న్యూస్ పాడ్‌కాస్ట్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.
ఎవరు..ఎప్పుడు దాడి చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హౌస్అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే.... అనుమానంగా చూస్తున్నారు... ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్లో లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు. కిర్గిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్యాకుమార్ బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్‌లైన్ నంబర్ 0555710041కు ఫోన్ చేసిసంప్రదించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్డౌన్ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి, చార్జీలు తగ్గించాలి. – రాధ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడుగు బయట పెట్టాలంటే భయం.. కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు. – ఉషారాణి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్‌బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హఠాత్తుగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేస్తోంది. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న యువత అకాల మరణాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు కన్నుమూశారు. వీరిని శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ, యాక్సిడెంట్ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిందని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా, అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.అన్వీశర్మ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ పేర్కొంది. అలాగే శ్రియ అద్భుతమైన డాన్సర్ అని షికారీ గ్రూప్ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ షికారి డ్యాన్స్ టీమ్‌లో సభ్యురాలు, అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్ ,కాపెల్లా బృందంలో సింగర్‌గా ఉన్నారు. ఇక ఆర్యన్ జోషి క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో విచారం వ్యక్తం చేసింది. తెలిపింది.కాగా గత నెల, అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు.