Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PM Modi Satirical Comments On Congress And BRS Party
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్‌పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ

సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్‌ ఫస్ట్‌ అయితే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్‌ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్‌ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్‌ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ కూడా కనిపించడం లేదు.రేవంత్‌, రాహుల్‌ ట్యాక్స్‌..కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్‌. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్‌ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్‌ఆర్‌’ (రేవంత్‌, రాహుల్‌) ట్యాక్స్‌ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్‌ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్‌.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్‌ విసురుతోంది. భారత్‌ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్‌ అతి కష్టం మీద కరీంనగర్‌లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్‌ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్‌లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్‌ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్‌ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్‌లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్‌ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు.  

ktr challenge to cm revanth reddy over krishank ou circular
అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్

సాక్షి, హైదరాబాద్‌:  సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్‌ఎస్‌ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిషాంక్‌ అరెస్ట్‌పై బుధవారం ఆయన స్పందించారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్‌ అన్నారు.‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే  నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్‌ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్‌? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడలో ఉండాలో తేలిపోతది. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. క్రిశాంక్‌ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో.  సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్‌పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024

AP Elections 2024: May 8th Politics Latest News Updates Telugu
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్  ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్‌లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.  చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్‌.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్‌ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు.  07:00 AM, May 8th, 2024గాజువాక  రోడ్‌షోలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్‌ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయడమే కాక జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్‌ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్‌ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్‌ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం

This Indian City Is On Most Millionaires
అత్యధిక మిలియనీర్స్‌ ఉన్న భారతీయ నగరం ఇదే..!

ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్‌ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్‌లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని,  వారిలో చాలామంది దాదాపు రూ. 800 ‍కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది. ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది ఏడు సంఖ్యల నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్‌ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్‌ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్‌నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్‌లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది. పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే.  గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో  సంపన్న ప్రవాసులు సింగపూర్‌కు  తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్‌లలో 4% క్షీణతను చవి చూసింది. ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్‌జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం,  యూఎస్‌లో అరిజోనాలోని స్కాట్స్‌డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్‌​ 21వ స్థానం దక్కించుకోగా,  మొనాకో నెంబర్‌ 1  స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే చెబుతోంది.  (చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థ) 

TDP Cadre Try To Attack AP Home Minister Taneti Vanitha
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం​ మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం

తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ  ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర  హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్‌ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి.  శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్‌సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

AirIndia Express cancelled more than 70 flights due to a mass sick leave by its senior crew member
ఎయిరిండియా సిబ్బంది సిక్‌ లీవ్‌.. 70కి పైగా విమానాలు రద్దు

విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్‌’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ  చదవండి: ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్‌ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్‌ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024

land settlements on bolisetty srinivas rao Case
రచ్చ శ్రీను కేరాఫ్‌ తాడేపల్లిగూడెం

‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్‌తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్‌మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్‌మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్‌ వన్‌ కాంట్రాక్టర్‌ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్‌గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్‌మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్‌మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్‌ సప్లయీస్‌కు లారీల కాంట్రా క్టర్‌గా, గన్నీ బ్యాగ్‌ సప్లయర్‌గా, కందిపప్పు సప్లయర్‌గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్‌ చేస్తే.. ఒకే లారీకి నంబర్‌ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్‌లను బ్లాక్‌ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్‌ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది.  బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్‌ఈడీ లైట్ల కొనుగోలు టెండర్‌లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్‌లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్‌లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్‌ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్‌ సూపర్‌బజార్‌ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్‌ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు.  పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్‌లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్‌ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్‌ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్‌ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్‌ నం.42తో కేసు నమోదైంది.  తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్‌గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్‌ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్‌ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్‌ ప్రాజెక్ట్‌గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్‌వెజ్‌ మార్కెట్, కూరగాయల మార్కెట్‌ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్‌ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. 

Mahesh babu Gives Voice Over To Prabhas In Kalki 2898 AD Movie
కల్కిలో మహేశ్‌ బాబు.. నాగ్‌ అశ్విన్‌ ప్లానింగ్‌ అదుర్స్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌  పాన్‌ వరల్డ్‌ మూవీ   ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్‌ తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు‌ . ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్‌ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్టులో మరో స్టార్‌ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మహేశ్‌ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్‌ కేవలం వాయిస్‌ ఓవర్‌ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్‌ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్‌ పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. పవన్‌ కల్యాణ్‌  ‘జల్సా’, ఎన్టీఆర్‌ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్‌ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్‌ కోసం మళ్లీ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

సంజూ శాంసన్‌ అవుటైన తీరుపై వివాదం(PC: BCCI/Jio Cinema)
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. పంత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌(20 బంతుల్లో 50), అభిషేక్‌ పోరెల్‌(36 బంతుల్లో 65), ఆరో నంబర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్‌లో ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కమార్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద షాయీ హోప్‌ క్యాచ్‌ పట్టగా ఫీల్డ్‌ అంపైర్‌ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్‌ బౌండరీ లైన్‌ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్‌ అంపైర్‌ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్‌ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్‌ జిందాల్‌ సైతం అవుట్‌ అంటూ అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్‌ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్‌ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది.  ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్‌ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all