Top Stories
ప్రధాన వార్తలు
అందుకే సీఎం జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్ఎస్కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్.టీ.ఆర్ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
కేసు పెట్టుకోండి.. పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు.
May 18th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 18th AP Elections 2024 News Political Updates 01.45 PM, May 18th, 2024కడపఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధంరౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాంప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం01.30 PM, May 18th, 2024తిరుపతికి చేరిన సిట్ బృందం స్థానిక అధికారులతో సమావేశం పోలింగ్, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్01.00 PM, May 18th, 2024కృష్ణా జిల్లాఅల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం12.30 PM, May 18th, 2024ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబుహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్.. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపంఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbnహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు… pic.twitter.com/TmsKjABRfH— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 12.00 PM, May 18th, 2024దూకుడు పెంచిన సిట్ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తునిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్లాల్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్లాల్మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్ 11.30 AM, May 18th, 2024తిరుపతిజగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజాతాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారుమళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 11.00 AM, May 18th, 2024మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా? 10.30 AM, May 18th, 2024చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్పరారీలో టీడీపీ నేత ప్రభాకర్‌పోలింగ్ రోజు జరిగిన హత్యాయత్నం కేసులో రాజశేఖర్ నిందితుడుఅతన్ని పోలీసు స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్ బలివైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్ వైఎస్సార్ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో హ్యట్రిక్ విక్టరీపై బీజేపీ కన్నేసింది. అయితే అది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు. దేశానికి గుండెకాయలాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్యట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లకు ఏడు సీట్లు కాషాయం పార్టీనే గెలుచుకుంది. అయితే.. ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగానికే దిగింది. ఢిల్లీలో ఈనెల 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం ఏడు సీట్లలో.. ఆరుగురు సిట్టింగ్‌లను పక్కన పెట్టేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారి మాత్రమే టికెట్ దక్కించుకోగలిగారు. బీజేపీ లీగల్ సెల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్న సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్.. న్యూఢిల్లీ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేయడం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బస్సూరితో పాటు చాందిని చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్ర, నార్త్‌వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ డిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రవాత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిదూరి కొత్తగా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ➡️ అయితే.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి సవాలే ఎదురవుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కానీ ఈ సారి ఆప్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా.. ➡️ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ ప్రచారం చేస్తోంది. తద్వారా ప్రజల్లో కొంత సానుభూతిని రాబట్టాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈలోపే.. ➡️కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘటన జరిగింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజకీయ ప్రచార అస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రతలేదనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుతోంది. అయితే బీజేపీ కేవలం ప్రత్యర్థులపై విమర్శలతోనే సరిపెట్టడం లేదు. ➡️నరేంద్ర మోదీ సారథ్యంలో గత ప్రభుత్వం పదేళ్ల సాధించిన విజయాలనూ ఢిల్లీలో బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్‌ను రాజధాని ప్రజల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటరు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన.
బంగారాన్ని మించి.. వెండి హడల్..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.రికార్డ్ స్థాయిలో వెండి ధరలుబంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య
'త్రినయని' సీరియల్ నటి పవిత్రా జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్నిరోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకొచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.(ఇదీ చదవండి: బుల్లితెర నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు చందు సూసైడ్!)'స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!)
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండుల్కర్ 2024 సీజన్లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేస్ ఆల్‌రౌండర్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు.అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్ స్టొయినిస్‌ను ట్రాప్ చేసేందుకు అర్జున్ ఇన్‌స్వింగర్ సంధించగా.. బ్యాటర్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్ వికెట్లకు స్టొయినిస్ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్‌కు దిగిన అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో నికోలసన్ పూరన్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్ ధిర్ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. తర్వాత నమన్ ధిర్ బౌలింగ్‌లోనూ వరుసగా సిక్స్, ఫోర్, 1, సిక్స్ బాది 29 పరుగులు పిండుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. పూరన్ ఫామ్ చూసి భయపడిపోయిన అర్జున్ను కాపాడేందుకు మేనేజ్మెంట్ నమన్ ధిర్‌ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టొయినిస్ విషయంలో అర్జున్ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో అర్జున్ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024Arjun Tendulkar Going Back To Dressing Room After Pooran Hit Him Two Back To Back Sixes 🤡🤡🔥🔥😂😂He didn't Even Complete His Over 🤡🤡🤡#MIvsLSG #RCBvCSK #CSKvRCB pic.twitter.com/OlyNj9k1QW— Khabri_Prasang (@Prasang_) May 17, 2024
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
సినిమా
నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య
'త్రినయని' సీరియల్ నటి పవిత్రా జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్నిరోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకొచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.(ఇదీ చదవండి: బుల్లితెర నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు చందు సూసైడ్!)'స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!)
గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్!
ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్‌లో నటించి చాలా కాలమైంది.ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)A bond for life with #sivakumar anna, who came to see me as I am recovering from a leg procedure.shared so much on drawings , pictures and our travel 🙏🙏🙏🙏 pic.twitter.com/qxwuBMZD4q— Radikaa Sarathkumar (@realradikaa) May 18, 2024
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్‌గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్‌లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్‌గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్‌తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్‌లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్)
ఫొటోలు
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు (ఫొటోలు)
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
క్రీడలు
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని.. అయినా పరిస్థితులు ఎదుర్కోకుండా పారిపోవడం ఏమిటంటూ నెటిజన్లు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండుల్కర్ 2024 సీజన్లో ఎట్టకేలకు శుక్రవారం తన తొలి మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 2.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేస్ ఆల్‌రౌండర్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా.. లక్నో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. 3 పరుగులు మాత్రమే ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు.అయితే, ఐదో ఓవర్లో కాస్త అతి చేశాడు. మార్కస్ స్టొయినిస్‌ను ట్రాప్ చేసేందుకు అర్జున్ ఇన్‌స్వింగర్ సంధించగా.. బ్యాటర్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అర్జున్ వికెట్లకు స్టొయినిస్ మీదకు విసిరేస్తానన్నట్లుగా దూకుడు ప్రదర్శించాడు. ఇందుకు స్టొయినిస్ చిరాగ్గా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.ఇక ఆ తర్వాత 15వ ఓవర్లో మళ్లీ బాలింగ్‌కు దిగిన అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో నికోలసన్ పూరన్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. అయితే, ఆ తర్వాత అర్జున్ తనకు ఇబ్బంది ఉందంటూ ఫిజియోను పిలిపించుకున్నాడు.ఆ తర్వాత అతడితో కలిసి మైదానం వీడగా.. నమన్ ధిర్ మిగిలిన కోటా పూర్తి చేశాడు. అయితే, ఆ ఓవర్లో టెండుల్కర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. తర్వాత నమన్ ధిర్ బౌలింగ్‌లోనూ వరుసగా సిక్స్, ఫోర్, 1, సిక్స్ బాది 29 పరుగులు పిండుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ కావాలనే గాయం పేరిట తప్పించుకున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. పూరన్ ఫామ్ చూసి భయపడిపోయిన అర్జున్ను కాపాడేందుకు మేనేజ్మెంట్ నమన్ ధిర్‌ను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టొయినిస్ విషయంలో అర్జున్ ప్రవర్తించిన తీరు కూడా ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.కాగా సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్లో అర్జున్ మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు.Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024Arjun Tendulkar Going Back To Dressing Room After Pooran Hit Him Two Back To Back Sixes 🤡🤡🔥🔥😂😂He didn't Even Complete His Over 🤡🤡🤡#MIvsLSG #RCBvCSK #CSKvRCB pic.twitter.com/OlyNj9k1QW— Khabri_Prasang (@Prasang_) May 17, 2024
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024 లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.అయితే, చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్లే!ఇదిలా ఉంటే.. లీగ్ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో ఓవరాల్‌గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు.ఫ్రాంఛైజీ మయాంక్ యాదవ్, యుధ్వీర్ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని.. అయితే, గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. నేను మా మామగారి జట్టులో ఉన్నాఅదే విధంగా.. తన బ్యాటింగ్ పొజిషన్‌పై దృష్టి సారించానని.. మిడిలార్డర్లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు తెలిపాడు. కాగా ఈ ఎడిషన్‌లో లక్నో 14 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఇక ఐపీఎల్-2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను మా మామగారి జట్టులో ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రపంచకప్ టోర్నీలో ఆడే శర్మా జీ వాళ్ల అబ్బాయిని చీర్ చేస్తాం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్-2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.తన మామగారు, బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టితో కలిసి మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. కాగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో రాహుల్‌ను కాదని రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు చోటిచ్చింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ!చదవండి: BCCI: హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. ఐపీఎల్ 2025లో ఇక.. #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్.
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024
బిజినెస్
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది.
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు.
వీడియోలు
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
ఫ్యామిలీ
బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్‌ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు.
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది.
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు.
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.