Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Web Casting Hijack On and off button in Chandrababu hand
వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్‌ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పూర్తి ‘పచ్చ’పాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్థారిస్తోంది. విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ పోలింగ్‌ బూత్‌ వీడియోలను ఎడిట్‌ చేసి విడుదల చేయడం ఏమిటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్‌కు చేరిపోయాయి? అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటవేత వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదులను నిర్ఘాంతపరుస్తోంది. నిష్పాక్షికంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా? అని విస్తుపోతున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితోపాటు పోలింగ్‌ రోజు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ నుంచి క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల వరకూ అందరూ టీడీపీ అక్రమాలకు అండగా నిలిచినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంత చేసినా గెలవలేమనే నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడేలా పథకాన్ని రూపొందించాయి. పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ‘పచ్చ ముఠా’ పెత్తనం ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను చంద్రబాబు ముఠా హైజాక్‌ చేయడం విస్మయం కలిగిస్తోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ఈసీకి నియంత్రణ లేదా? ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులైన ప్రైవేట్‌ వ్యక్తులకు అందుబాటులోకి తెచి్చందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని 46,389 ఎన్నికల కేంద్రాలకుగానూ 31,380 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేశారు. అత్యంత సమస్యాత్మక 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయట వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలతోపాటు ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను చంద్రబాబు ముఠా తమ గుప్పిట్లోకి తీసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ వీడియో రికార్డింగ్‌ అంటూ నారా లోకేష్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్టు చేయడం అందుకు నిదర్శనం. తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఈసీ చెబుతోంది. అలాంటప్పుడు ఎలా లీక్‌ అయింది? వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు పొక్కడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం వెబ్‌ కాస్టింగ్‌ పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ అయ్యే వీడియోలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. వెబ్‌కాస్టింగ్‌ లింక్‌ ను జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాటిని కలెక్టర్‌తోపాటు ఐజీ, ఎస్పీ పరిశీలిస్తారు. వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌ కోసం ప్రైవేట్‌ ఏజెన్సీలను వినియోగించారు. పోలింగ్‌ తరువాత వెబ్‌ కాస్టింగ్‌ హార్డ్‌ కాపీని ప్రైవేట్‌ ఏజెన్సీ కలెక్టర్‌కు అందచేస్తుంది. ప్రైవేట్‌ ఏజెన్సీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ వర్గీయులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోకి చొరబడ్డారు. ‘స్వామి’ భక్తి... 7 ఈవీఎంలు ధ్వంసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పల్నాడులో క్షేత్రస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకు పురందేశ్వరి సమరి్పంచిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్‌ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించారు. రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కూడా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డీఎస్పీ పల్లపురాజు, మాచర్ల సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, ఎస్సై ఎం.రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ ద్వారా టీడీపీ కథ నడిపింది. అత్యంత వివాదాస్పదుడైన నారాయణస్వామిని కారంపూడి సీఐగా నియమించడమే అందుకు నిదర్శనం. టీడీపీ రౌడీమూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రేక్షక పాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం దాడులతో విరుచుకుపడ్డారు. సీఐ నారాయణ స్వామి పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం గమనార్హం. ఆయన పరిధిలోనే పాల్వాయి గేటు కూడా ఉంది. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సీఐ నారాయణస్వామి పరిధిలో ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు. కౌంటింగ్‌ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పిన్నెల్లిపై కుట్రపూరిత కేసు.. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో సీఐ నారాయణ స్వామి పూర్తిగా చంద్రబాబు సేవలో తరిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా గురువారం రాత్రి కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. పిన్నెల్లిపై జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించగా అప్పటికప్పుడు మరో తప్పుడు కేసు నమోదు చేయడం నారాయణ స్వామి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పది రోజుల క్రితం ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో పిన్నెల్లి సోదరులను తాజాగా నిందితులుగా చేర్చడం గమనార్హం. పల్నాడులో పచ్చ ముఠాలు పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 23 గంటల రికార్డింగ్‌లో ఎడిట్‌ చేసిన రెండు నిమిషాల వీడియో క్లిప్‌ మాత్రమే విడుదల కావడం వెనుక పచ్చ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తోపాటు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్‌ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారారని వెల్లడవుతోంది. పల్నాడు జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ నుంచే వెబ్‌ కాస్టింగ్‌ రికార్డింగ్‌ను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసి లీక్‌ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ రౌడీమూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్‌ కావడం వెనుక చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది. మరి దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? పవన్, బాలయ్య ప్రత్యేకమా?పోలింగ్‌కు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ.. టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసింది. నిబంధనల ప్రకారం ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. దర్జాగా ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. దీనిపై ఈసీ కనీసం స్పందించలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదు. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ నోరు మెదపలేదు.

Result is against what Prashant Kishore said in five elections last year
పీకేవన్నీ తప్పుడు అంచనాలే

సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్‌’ వెబ్‌సైట్, చానల్‌ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్‌ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్‌ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్‌ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్‌ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్‌ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్‌ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్‌ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్‌ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్‌ స్పెషల్‌ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే.

EWS quota in all medical colleges
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్‌ కోటా!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం సూత్ర­ప్రాయంగా నిర్ణయించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్‌ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్‌ కాలేజీలు, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్‌ కాలేజీల్లోనే ఎన్‌ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్‌ కాలేజీల్లోని కనీ్వనర్‌ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కంటే ముందే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్‌ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్‌ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్‌ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్‌ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్‌ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది.

EVM votes are counted after postal ballots: andhra pradesh
ట్రెండ్‌ తెలియాలంటే నిరీక్షించాల్సిందే

సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్‌ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్‌ డ్రైవర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 24,918 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్‌ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్‌ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో గెజిటెడ్‌ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్‌ బ్యాలెట్‌ వెనుక రిటరి్నంగ్‌ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాల­ను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్‌ బ్యా­లె­ట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్‌ బ్యా­లెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లె­క్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొ­మ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.

Lok Sabha Election 2024: Haryana set to vote for 10 Lok Sabha seats on 25 may 2024
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్‌!

ఫైనాన్షియల్, కార్పొరేట్‌ హబ్‌గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్‌సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్‌ 9 చోట్ల, ఆప్‌ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్‌...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్‌లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ నాయబ్‌ సింగ్‌ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్‌ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్‌ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్‌ సింగ్‌ చౌతాలా తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్‌ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్‌... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్‌ దిగ్గజం భజన్‌లాల్‌ పెట్టిన హరియాణా జనహిత్‌ కాంగ్రెస్‌ను ఆయన కుమారుడు కుల్‌దీప్‌ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. దేవీలాల్‌ ముని మనవడు దుష్యంత్‌ చౌతాలా ఐఎన్‌ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్‌ తల్లి నైనా సింగ్‌ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్‌ కుంటుంబానికే చెందిన దేవీలాల్‌ తనయుడు రంజిత్‌ సింగ్‌ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి జై ప్రకాశ్, ఐఎన్‌ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్‌.. బీజేపీ హ్యాట్రిక్‌ గురి ఈ పారిశ్రామిక హబ్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్‌ ఎంపీ కృష్ణ పాల్‌ గుజ్జర్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. కాంగ్రెస్‌ నుంచి మహేంద్ర ప్రతాప్‌ సింగ్, జేజేపీ నుంచి నళిన్‌ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్‌తక్‌... కాంగ్రెస్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్‌ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్‌ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అరవింద్‌ కుమార్‌ శర్మ, కాంగ్రెస్‌ నుంచి దీపీందర్‌ సింగ్‌ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్‌ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్‌ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్‌ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్‌ లాల్‌ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ములానా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుణ్‌ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్‌పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్‌ వర్సెస్‌ మాజీ బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సునితా దుగ్గల్‌ను కాదని అశోక్‌ తన్వర్‌కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్‌ చేయడం విశేషం! కాంగ్రెస్‌ నుంచి పీసీసీ చీఫ్‌ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్‌ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది.

Bangladesh MP honey-trapped before being killed
వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్‌) విసిరి కోల్‌కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను శిలాంతి రెహమాన్‌గా గుర్తించారు. బంగ్లాదేశ్‌ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్‌ షహీన్‌కు ప్రియురాలు అని బంగ్లాదేశ్‌ పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌ ప్రాంతంలో అక్తరుజమాన్‌ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్‌ కోల్‌తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది. మరో నిందితుడు అమానుల్లా అమన్‌తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ను బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్‌ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్‌ అజీమ్‌ అనర్, అఖ్తరుజమాన్‌ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్‌ హవల్దార్‌ను బంగ్లాదేశ్‌ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్‌కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్‌ అద్దె ఇంట్లో అన్వరుల్‌ అజీమ్‌ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు.

BRS Leader KTR Fires On Congress Party
గ్యారంటీలను మరిచిన కాంగ్రెస్‌: కేటీఆర్‌

చౌటుప్పల్, నకిరేకల్‌: ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఆరు గ్యారంటీ స్కీంలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలో వచ్చారని.. ఆరు నెలలైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలేవీ అమలు కాలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. శుక్రవారం భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దామెరలో, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ వాళ్ల మాయమాటలు నమ్మితే గోస పడుతామని తాము ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఇప్పటివరకు చేయకపోగా దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ మరోసారి రైతులను మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ధాన్యం బోనస్‌ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి మాట తప్పారని.. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్‌ గ్యారంటీల విషయంలో రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్‌లు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 400కుపైగా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పక్కా 420 వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 1.5 లక్షల వివాహాలు జరిగాయని.. ఆ జంటలకు లక్ష రూపాయలతోపాటు 1.5 లక్షల తులాల బంగారాన్ని రేవంత్‌రెడ్డి బాకీ ఉన్నారన్నారు. గోల్డ్‌ మెడలిస్టు కావాలా.. బ్లాక్‌ మెయిలిస్టా.. బీఆర్‌ఎస్‌ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోల్డ్‌ మెడలిస్టు అని.. కాంగ్రెస్‌ నుంచి పోటీచేస్తున్న వ్యక్తి పెద్ద బ్లాక్‌ మెయిలిస్టని కేటీఆర్‌ ఆరోపించారు. ఎవరు కావాలో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కిషోర్, అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి: ‘ఎక్స్‌’లో కేటీఆర్‌సాక్షి, హైదరాబాద్‌: అసత్య వార్తలను ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్న సీఎం రేవంత్‌రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘మా బంధువుకు రూ.10 వేల కోట్ల కోవిడ్‌ డ్రగ్‌ కాంట్రాక్టు దక్కిందంటూ రేవంత్‌ గతంలో సిగ్గులేకుండా ఓ అబద్ధాన్ని తయారు చేశారు. ఇదే హాస్యగాడు సెక్రటేరియట్‌ కింద నుంచి నిజాం నగలను తవ్వుకెళ్లామనే అసత్య వాదనను సృష్టించారు. కేంద్ర హోంమంత్రి ఫేక్‌ వీడియోను కూడా సర్క్యులేట్‌ చేశారు. సీఎం హోదాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్‌ చేశారు. తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి..’’అని కేటీఆర్‌ విమర్శించారు.

Jaguar Land Rover to produce the iconic Range Rover in India
మేడిన్‌ ఇండియా రేంజ్‌ రోవర్‌

ముంబై: మేడిన్‌ ఇండియా రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యూకేలోని సోలహల్‌ వద్ద ఉన్న జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ప్లాంటులో తయారైన రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్‌ రోవర్‌ వెలార్, రేంజ్‌ రోవర్‌ ఇవోక్, జాగ్వార్‌ ఎఫ్‌–పేస్, డిస్కవరీ స్పోర్ట్‌ అసెంబుల్‌ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్‌ఆర్‌ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం.

Israel-Hamas war: ICJ orders Israel to halt its offensive on Rafah, Gaza in new ruling
International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి

ది హేగ్‌: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్‌ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్‌ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్‌ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్‌ అంటోంది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్‌ సలామ్‌ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్‌ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు.

Special Article On Pithapuram Assembly Constituency 2024
వంగా గీత బలం.. ప్యాకేజ్‌ స్టార్‌ బలహీనతలు ఇవే!

ఏపీలో పోలింగ్‌ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్‌ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్‌ క్లాస్‌ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్‌ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్‌ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్‌ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement