Top Stories
ప్రధాన వార్తలు
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్ విడుదల చేశారు. సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం స్టీమెర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎస్సార్సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన. దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
బ్రిజ్‌భూషణ్‌కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
పార్టీ సీనియర్ ఎంపీ, మాజీ రెజ్లింగ్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్‌కు గట్టి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని కైర్‌గంజ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు ఈసారి బీజేపీ మొండిచేయి చూపింది. గతంలో భూషన్‌పై జాతీయ స్థాయి రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కైర్‌గంజ్ నుంచి ఆయన కొడుకు కరణ్ భూషన్ సింగ్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.లోక్‌సభ అయిదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలు చేయడానికి తుదిగడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేడు అభ్యర్థని ప్రకటించింది. కాగా బ్రిజ్‌భూషన్ సింగ్ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. చివరి మూడు సార్లు పర్యాయాల్లో (2009, 2014, 2019) కైసర్‌గంజ్ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే బ్రిజ్‌భూషన్ గత రెండేళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై జాతీయ రెజర్లు చేసిన తీవ్ర ఆరోపణలు అప్పట్లో రాజకీయపరంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో గతేడాది రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవకాశాలను దెబ్బతీస్తాయనే ఆలోచనతో అభ్యర్థిని మార్చేందుకు మొగ్గు చూపింది. అయితే బ్రిజ్ భూషణ్ సింగ్‌కు స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిని బరిలో దింపింది.కరణ్ పేరుతోపాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ అభ్యర్థిని సైతం బీజేపీ ప్రకటించింది. రాయ్‌బరేలీలో ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది. ఇప్పటికీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. గతంలో ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లారు.
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్‌లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చెలరేగారు. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్‌ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది.
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామన్లు వారిని క్లిక్‌మనిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ పక్షులు కనిపించారంటే వెంటపడి మరీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అందరినీ ఫాలో అవుతూ తమ కెమెరాలకు పని చెప్తుంటారు. కత్రినా- విక్కీ దొరికిపోయారుబాలీవుడ్‌లో అయితే మరీనూ.. అనన్య పాండే, జాన్వీ కపూర్, అదితిరావు హైదరి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరారట!ఫోటోలు తీయొద్దుఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్స్ స్నేహ్, విశాల్ వెల్లడించారు. 'ఒకసారి కత్రినా.. తమ ఫోటోలు తీయొద్దని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత యష్ రాజ్ స్టూడియోస్‌కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశల్‌తో కలిసుండగా కూడా ఫోటోలు తీశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారుకానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది. మిగతావి డిలీట్ చేయమని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్‌తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.చదవండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్.. అంతేకాదు!
దుబాయ్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు.
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.
తప్పక చదవండి
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
సినిమా
రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్ చేశానంటే: అదితి
కోలీవుడ్‌లో కాబోయే బ్యూటిఫుల్ కపుల్స్ సిద్దార్థ్ -అదితి రావు హైదరీ. గత నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ కూడా మొదట అధికారికంగా ప్రకటన చేయలేదు. కొన్నిరోజుల తర్వాత మీడియాకు చెప్పారు. తాజాగా దీనిపై మొదటిసారి అదితి రావు హైదరీ రియాక్ట్ అయింది. ఇదే క్రమంలో మీడియా వాళ్లకు ఈ విషయాన్ని వెల్లడించడానికి గల కారణాన్ని కూడా ఆమె తెలిపింది. తను నటించిన 'హీరామండీ: ది డైమండ్ బజార్' వెబ్‌సిరీస్ ప్రమోషన్లో భాగంగా పలు విషయాలను పంచుకుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. 'ఆమె నాకు ఎస్ చెప్పింది' అని సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.తాజాగా ఇదే విషయంపై హైదరీ ఇలా తెలిపింది. ' అందరూ తమ జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను చాలా ప్రత్యేకంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో అందరిలా నేను కూడా నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటమే.. నిశ్చితార్థం తర్వాత మా అమ్మ కోరికమేరకే ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. మా పెళ్లి విషయం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకు ఫోన్లు చేశారు. వాళ్లందరికీ ఆమె సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నిశ్చితార్థం విషయం గురించి మీడియాకు చెప్పాలని ఆమ్మే సలహా ఇచ్చింది. ఆపై తెలిసిందే. వెంటనే నేను, సిద్ధార్థ్ సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేశాం.' అని ఆమె చెప్పింది.
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్‌తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్‌కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్‌మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు!
ఫొటోలు
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)
బ్లాక్ డ్రెస్‌లో అప్సరసలా.. మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ హీరోయిన్‌కి అరుదైన పురస్కారం
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
బిజినెస్
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు.
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి.
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి.
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్‌గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్‌లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
వీడియోలు
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి