Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishnareddy Counter To Amit Sha
‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్‌ షాకు తెలుసు. కూటమిలో పార్ట్‌నర్‌ కాబట్టే అమిత్‌ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు?  కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్‌కు ఉంది.  పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్‌ రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై  తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌  యాక్ట్‌  భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని  మెచ్చుకున్న  పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డివీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన  చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు  ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది?  

​​Harish Rao Counter To Rahulgandhi Nirmal Meeting Comments
రాహుల్‌ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్‌(ట్విటర్‌)లో హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

Blue corner notice issued against Prajwal Revanna
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసులు

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూ కార్నర్‌  నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్‌ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్‌ రేవణ్ణ ఎక్కడ  ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్‌  ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్‌ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూకార్నర్‌ నోటీసు పంపాలని సిట్‌(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణపై రెండుసార్లు లుక్‌ అవుట్‌ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్‌ తండ్రి హెడ్‌డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవి వైరల్‌ అయిన  అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్‌, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్‌ నోటీసులు అంటే?బ్లూ కార్నర్‌ నోటీసు ఇంటర్‌ పోల్‌  నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా  నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్‌, ఎల్లో, బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌, పర్పుల్‌. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి  సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్‌ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్‌’ నోటీసులు జారీ చేస్తారు.

Land Titling Act: Cid Investigation On Tdp Fake Campaign
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ

సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది        ‌              

Samantha Ruth Prabhu Shocking Pic Trending In Twitter
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?

ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?హీరోయిన్‌గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ‍్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి  ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

CJI Chandrachud Shares He Was Caned with teacher In Class 5
స్కూల్‌లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

ఖాట్మాండ్‌: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్వయంగా పంచుకున్నారు. చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేపాల్‌ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్‌లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్‌లో పాల్గోని మాట్లాడారు. ‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్‌లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్‌ నేర్చుకోవటంలో భాగంగా అసైన్‌మెంట్‌కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్‌ను  బతిమాలాడాను.  అయినా టీచర్‌ వినలేదు.బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.    

CSK suffer big blow as Matheesha Pathirana returns to Sri Lanka
IPL 2024: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ బౌలర్‌

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరానా ప్రస్తుతం  తొడ కండ‌రాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ధ్రువీకరించింది.టీ20 వరల్డ్‌కప్‌ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్‌ స్వదేశానికి రప్పించింది.ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే త‌రుపున ప‌తిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకాన‌మీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ సైతం ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్‌కేకు నిజంగా బిగ్‌ షాక్‌ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.  

CM jagan May 6th Election campain Schedule: repalle macherla machilipatnam
సీఎం జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ ఇదే

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్‌ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.    ఉదయం 10 గంటలకు  బాపట్ల  పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా  సెంటర్లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Fake Surveys By Outdated Journalists On Ap Elections
కొత్త పగటివేషగాడు వచ్చాడు

ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్‌ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి  బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- 

Ktr Counter To Revanth Reddy On Saree Comments
చీర కామెంట్స్‌... సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

సాక్షి,హైదరాబాద్‌: చీరకట్టుకొని జూబ్లీహిల్స్‌లో బస్‌ ఎక్కి టికెట్‌ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో కేటీఆర్‌ ఆదివారం(మే5) ట్వీట్‌ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్‌ కిట్‌ బంద్‌ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్‌ రేవంత్‌కు చురకలంటించారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all