Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

EC Key Commands On Postal Ballot Counting
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు

సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్‌ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Kolkata Knight Riders beat Srh by 8 wickets, to win third IPL title
ఫైన‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి.. ఐపీఎల్ 2024 విజేత‌గా కేకేఆర్‌

ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.కుప్పకూలిన ఎస్‌ఆర్‌హెచ్‌..టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ఆరోరా ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్‌ మూడు వికెట్లతో ఆరెంజ్‌ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(24) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌(20), క్లాసెన్‌(16) పరుగులు చేశారు.అయ్యర్‌, గుర్బాజ్ విధ్వంసం..అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌(52 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్యాట్ కమ్మిన్స్‌, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో తలా వికెట్ సాధించారు.

12 Injured After Turbulence Hits Qatar Airways flight To Dublin
ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు

డబ్లిన్‌: ‌ఖతర్‌ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్‌ వెళ్లిన ‌ఖతర్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్‌ అయింది.‌ ఖతర్‌ ఎయిర్‌వేస్‌ విమానం ల్యాండ్‌ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్‌, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్‌ మరణించిన విషయం తెలిసిందే.

Pm Modi High Level Meeting On Remal Cyclone
తీవ్ర తుపానుగా రెమాల్‌.. ప్రధాని హై లెవెల్‌ మీటింగ్‌

సాక్షి, ఢిల్లీ: రెమాల్‌ తుపానుపై ప్రధాని మోదీ హై లెవెల్‌ మీటింగ్‌ నిర్వహించారు. వెస్ట్‌ బెంగాల్‌లో తీరం దాటనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వెస్ట్‌ బెంగాల్‌కు జాతీయ విపత్తు దళం ద్వారా అన్ని రకాల సహాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించారు.

UIDAI Clarified On June 14th Dead Line
‘ఆధార్‌’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్‌’

న్యూఢిల్లీ: ఆధార్‌పై సోషల్‌ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్‌ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ పని చేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(ఉడాయ్‌) కొట్టిపారేసింది.ఆధార్‌లో కేవలం ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి మాత్రమే జూన్‌14 గడువని తెలిపింది. వివరాలు అప్‌డేట్‌ చేసుకోకపోయినా ఆధార్‌కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. కాగా, ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్‌ 14 వరకు పొడిగించింది. ఈలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది.

670 Died In Papua New Guinea Land Slide
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి

పోర్ట్‌మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్‌)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

Tollywood Director Shirin Sriram Allegations On Baby Movie Director Sai Rajesh
సాయి రాజేశ్‌ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్‌ డైరెక్టర్‌

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్‌ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్‌ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ టాలీవుడ్‌లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఈ విషయాలన్నీ శిరీన్‌ శ్రీరామ్ ప్రస్తావించారు.శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్‌ జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్య‌మంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు.

Tollywood Actress Hema Love Story Goes Viral After Bangalore Rave Party
నటి హేమ లవ్ స్టోరీ.. ఇంతకీ భర్త ఎవరో తెలుసా?

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు టాలీవుడ్ ‍ప్రముఖులు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. అయితే ఈ పార్టీకి టాలీవుడ్‌ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్‌ చేశారు. మొదటి తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.ఇదంతా పక్కనపెడితే.. టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది. ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది. హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే హేమ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ అతనెవరో తెలుసా? ఆ వివరాలేంటో చూసేద్దాం.నటి హేమ లవ్ స్టోరీతూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. తెలుగులో 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‍అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.. శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ. ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ కాగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది. తాను దూరదర్శన్‌లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది. అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసేవారని వెల్లడించింది. ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానని హేమ వివరించింది. కాగా.. వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీతో హేమ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

Minister Uttam Kumar Reddy Comments On BRS And BJP
సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం.. మంత్రి ఉత్తమ్‌ సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను వెయ్యి కోట్లు తీసుకున్నానని.. నీచపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘వినతి పత్రాలు తెచ్చి.. లోపలికి వెళ్లి భూములు సెటిల్‌మెంట్‌ మాట్లాడినట్టు కాదు. మేము అధికారంలోకి వచ్చే నాటికి సివిల్‌ సప్లైస్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, డీఫాల్డ్‌ చేసే మిలర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదు. డీఫాల్ట్‌ మిల్లర్లతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కై మాట్లాడుతున్నారు’’ అని ఉత్తమ్‌ దుయ్యబట్టారు.సన్న బియ్యం మీరు ఎంత ఇస్తే అంతా కొంటాం అంటూ కేటీఆర్‌, మహేశ్వర్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ విసిరారు. సివిల్‌ సప్లైస్‌ రూ.11 వేల కోట్ల నష్టాల్లోఉంది. మిల్లర్లపై చర్యలు తీసుకుంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను. ధాన్యం కొనుగోళ్లను గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాం. మేం రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి’’అని ఉత్తమ్‌ మండిపడ్డారు.కేటీఆర్, మహేశ్వర రెడ్డి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా కనీసం వాళ్లని కలవలేదు.. నాలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు.. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు.. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుంది.. టెండర్‌లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుంది. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం మాదే.. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు.డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోంది.. మిల్లర్ల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న వాళ్ళే మిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారు. బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం మాది కాదు. మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం. మహేశ్వర రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు’’ అంటూ ఉత్తమ్‌ దుయ్యబట్టారు.‘‘కిషన్‌రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారు. పార్టీలో ఓవర్ స్పీడ్‌గా పోవాలని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నాడు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో 1700 వచ్చింది. ఇప్పుడు 2400 వస్తోంది. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్‌ చెప్పారు.

Perni Nani Serious Comments On Election Commission
టీడీపీ వీడియో ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్‌ చేశారు.కాగా, పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.13వ తేదీన కేసు ఎందుకు పెట్టలేదు?..వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు. డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదు?. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?. టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాడ జరిగితే చూస్తూ ఊరుకుంటారా?’ అని ప్రశ్నలు సంధించారు.పోలింగ్‌ ఆగిందా?..టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలింగ్ స్టేషన్ 202లో ఒక గంటసేపయినా పోలింగ్ ఆగిందా?. నిజంగానే ఎమ్మెల్యేనే ధ్వంసం చేస్తే అధికారులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కనీసం టీడీపీ ఏజెంట్లు అయినా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. సిట్ అధికారులకైనా ఎమ్మెల్యేపై ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. కానీ లోకేష్ మాత్రం ఎమ్మెల్యే ఒక వీడియోను రిలీజ్‌ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసింది.ఈసీపై సెటైర్లు..కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారు. వాస్తవాలు ఏంటనేది మాత్రం ఇద్దరూ పట్టించుకోవటం లేదు. సీఐ నారాయణ స్వామి చౌదరికి గాయమైతే మొత్తం టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు ఫీలయ్యారు. ఘటన జరిగితే పది రోజులపాటు కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి?. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రెంటచింతల మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బయటకు రాకుండా చేయాలని, కారంపూడి మండలంలో టీడీపీకి సహకరించేలా సీఐ నారాయణ చౌదరిని నియమించారు. ఆ సీఐ అత్యంత వివాదాస్పదుడు. గతంలో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని సీఐగా ఎలా పంపించారు?. పదకొండు రోజుల తర్వాత పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. సిట్ బృందానికి కూడా ఈ కేసుల గురించి చెప్పలేదు. పిన్నెల్లి హత్యకు టీడీపీ తీవ్రంగా పని చేస్తోంది. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతీ పోలీసు అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement