Top Stories
ప్రధాన వార్తలు
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
ఇట్లు.. ఇటలీకి!
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్ తర్వాత సైలెంట్‌చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్ స్కామ్‌లోనూ దుబాయ్ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్‌లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు
శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.21 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. మేషం: ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం: నూతన ఉద్యోగాలు లబిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.తుల: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.వృశ్చికం: పరిస్థితులు అంతగా కలసిరాదు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.మీనం: కుటుంబంలో ఇబ్బందులు. సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,గత ఐదేళ్ల బడ్జెట్లో మూల ధన వ్యయం ఇలా..ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో) 2019–20 17,601 2020–21 20,690 2021–22 18,511 2022–23 7,581 2023–24 23,589 మొత్తం రూ. 87,972
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.
Lok Sabha Election 2024: దక్షిణాన కాషాయ జెండా
భువనేశ్వర్: దక్షిణ భారతదేశంలో ఈసారి కూడా బీజేపీయే అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వెలిబుచ్చారు. దేశమంతటా ఎన్డీఏకు స్థానాలు పెరుగుతాయని, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతదేశంలో బీజేపీ బలం మరింతగా పెరగనుందని జోస్యం చెప్పారు. ‘‘దళిత, ఓబీసీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో ఉన్న పార్టీ బీజేపీయే. కానీ ‘బీజేపీ పట్టణ పార్టీ, కేవలం ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ–బనియా పార్టీ’ అంటూ దుష్ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దక్షిణాదిన మాకు బలం లేదన్నది కూడా విపక్షాలు వ్యాప్తి చేసిన అలాంటి అపోహే. దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఇలాంటి అపోహలను ప్రచారంలో పెట్టాయి. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది? దక్షిణ భారతంలో బీజేపీయే అతి పెద్ద పారీ్టగా అవతరించింది. అప్పటితో పోలిస్తే అక్కడి ప్రజల మనసును మరింతగా గెలుచుకున్నాం. ఆ లెక్కన దక్షిణాదిన ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం. మా భాగస్వాములనూ కలుపుకుంటే అక్కడ ఎన్డీఏ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది’’ అన్నారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన 131 లోక్‌సభ స్థానాల్లో 2019లో బీజేపీకి 29 సీట్లు రావడం తెలిసిందే. తూర్పు భారతదేశంలో దశాబ్దాల అభివృద్ధి లేమిని పక్కా ప్రణాళికతో పదేళ్లలో తుడిచిపెట్టామని మోదీ అన్నారు. ‘‘మొత్తం తూర్పు భారతాన్నీ సాధికారపరిచాం. ఫలితంగా ‘రెడ్ కారిడార్’గా పిలిచే ఆ ప్రాంతం ‘కాషాయ కారిడార్’గా మారిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయనున్నాయి. పలు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని సారథ్యంలోని ఇండియా కూటమి ఖాతా కూడా తెరవలేవు’’ అని జోస్యం చెప్పారు. దాంతో భువనేశ్వర్, కోల్‌కతాతో పాటు ఢిల్లీలోనూ కొన్ని పారీ్టలకు ఇప్పట్నుంచే కంటిపై కునుకు కరువైందని బిజూ జనతాదళ్, తృణమూల్, కాంగ్రెస్‌లను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల ఆశీస్సులతో మేమీసారి రికార్డు స్థాయి విజయం సాధించబోతున్నాం. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాలు సాధించడం ఖాయం (4 జూన్, 400 పార్)’’ అని చెప్పారు. ‘‘ఉనికిపరంగానే గాక భావజాలపరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. ఎందుకంటే దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం’’ అని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌కు లారీల్లో నల్లధనం! ‘అదానీ–అంబానీ’ అవినీతి అంటూ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను కొన్నేళ్లుగా నిత్యం విమర్శిస్తూ వచి్చన రాహుల్ బాబా ఎన్నికలు మొదలవగానే ప్లేటు ఫిరాయించారు. ఆయన ప్రచారంలో ఎక్కడా వారి ప్రస్తావనే లేదు! హఠాత్తుగా ఎందుకీ మార్పు? ఎందుకంటే అంబానీ, అదానీలతో లోపాయకారీ లింకులున్నది కాంగ్రెస్ పారీ్టకే. తమకు లారీల నిండా డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడబోమన్న కాంగ్రెస్ అగ్ర నేత అ«దీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అదానీ, అంబానీలతో కాంగ్రెస్‌కు డీల్ కుదరడం, రాహుల్ తమను విమర్శించకుండా ఉండేందుకు వారిద్దరూ లారీల నిండా నల్లధనం పంపడం నిజమో కాదో చెప్పాలి! ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ నేతల ఆరోపణలూ పస లేనివే. అవి రెండూ స్వతంత్రంగా పని చేసే సంస్థలని స్వయానా అ«దీర్ చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. ‘ప్రత్యేక పౌరుల’ హోదాకు ఒప్పుకోను మైనారిటీ సంతుïÙ్టకరణ కోసం కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలనే నా ఎన్నికల ప్రసంగాల్లో బయట పెడుతున్నాను. అంతే తప్ప మైనారిటీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ కూడా వారికెప్పుడూ వ్యతిరేకం కాదు. కాకపోతే ‘ప్రత్యేక పౌరుల’ హోదాను ఎప్పటికీ అంగీకరించబోను. ఎందుకంటే ప్రజలందరూ సమానమే. కేవలం ఎన్నికల రాజకీయాల కోసం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి నిత్యం గండి కొట్టే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. రిజర్వేషన్లకు మతం ప్రాతిపదిక కారాదని అంబేడ్కర్, నెహ్రూతో సహా రాజ్యాంగ నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్ ఛాయలే! చివరికి టెండర్ల కేటాయింపు వంటివాటిలో కూడా మైనారిటీలకు రిజర్వేషన్లిస్తామని అందులో హామీలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉండగా పాకిస్తాన్‌తో సమర్థంగా వ్యవహరించకుండా జాతి ప్రయోజనాలనే పణంగా పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాహుల్ వ్యాఖ్యలను పాక్ నేతలు ప్రశంసిస్తున్న పరిస్థితి! మన వీర సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్ ఉగ్రవాదులు కాదని కాంగ్రెస్ నేతలంటున్నారు. పాక్ వద్ద అణుబాంబులున్నాయి గనుక ఆ దేశాన్ని గౌరవించాలని చెబుతున్నారు. సర్జికల్ దాడులకు రుజువులేవని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించడం, కాంగ్రెస్ కుట్రలను బయట పెట్టడం నా బాధ్యత. కాంగ్రెస్‌ది సంతుïÙ్టకరణ బాట. నాది అందరినీ సంతృప్తిపరిచే అభివృద్ధి బాట. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి పారీ్టల పేలవ ప్రచారం కూడా ఓ కారణం. వాటికి సొంత కార్యకర్తలు కూడా ఓటేయడం లేదు. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుంది. బీజేడీ పుట్టి మునుగుతోంది ఒడిశా ప్రజలు మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. నవీన్ పటా్నయక్ ప్రభుత్వంపై వారిలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అధికార బిజూ జనతాదళ్ మనుగడ ఇక కష్టమే. ఒడిశాలో బీజేపీ ఐదేళ్లుగా తీవ్రంగా కష్టపడి నంబర్ టూ నుంచి నంబర్‌వన్ స్థానానికి చేరింది. యూసీసీ హామీ నెరవేరుస్తాం ఉమ్మడి పౌర స్మృతి, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బీజేపీ మేనిఫెస్టో హామీలు. వాటిని నెరవేర్చి తీరతాం. జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముందుగా మేమేం చేయాలో సూచించాల్సిందిగా దేశ యువతనే అడగదలచుకున్నా. అందుకోసం ‘తొలి 100 రోజుల కార్యాచరణ’ను 125 రోజులకు పొడిగించాను. మాకు 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న విపక్షాల విమర్శలు నిరాధారం. నేను స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నా శ్రేయస్సు కూడా రాజ్యాంగ శ్రేయస్సులోనే ఇమిడి ఉంది. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే రాజ్యాంగం వల్లే. నేను స్ఫూర్తి, శక్తి పొందేదే రాజ్యాంగం నుంచి!బ్రాండ్ మోదీ!నేను కార్యసాధకున్ని. ‘బ్రాండ్ మోదీ’ అన్నది రెండు దశాబ్దాల పై చిలుకు ప్రజా జీవితంలో వారి నుంచి సంపాదించుకున్న విశ్వాస ఫలితం. అంతే తప్ప దానికోసం నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. నేనూ మనిíÙనే. తప్పిదాలు చేసుండొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశాలు మాత్రం నాకెప్పుడూ ఉండవు. మండెటెండల్లో కూడా నా సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వారి కళ్లలో నాపై కనిపించే తిరుగులేని విశ్వాసమే నాకు శక్తినిచ్చి నడిపిస్తోంది. 13 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి మాతృమూర్తి తన చివరి రోజుల్ని ప్రభుత్వాసుపత్రిలో గడిపిందంటే, అలాంటి దేశానికి మరే ఇతర బ్రాండూ అవసరం లేదని నా అభిప్రాయం. అతడు భిన్నమైన వ్యక్తి అని ఆ దేశం ఏనాడో అర్థం చేసుకుంది’’.రూ.250 కోట్ల అవినీతి కంటే 250 జతల బట్టలు మేలే! తాను అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తానంటూ రాహుల్ తదితరులు చేసే ఆరోపణలపై మోదీ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ దుస్తుల గురించే! నాకు 250 జతల బట్టలున్నాయని గతంలో గుజరాత్ మాజీ సీఎం అమర్‌సింగ్ చౌదరి ఆరోపణలు చేశారు. అప్పుడు నేను సీఎంగా ఉన్నా. అదే రోజు ఓ సభలో పాల్గొన్నా. ‘రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా, లేక 250 జతల బట్టలున్న ముఖ్యమంత్రా?’ అని వేదిక నుంచి ప్రజలనడిగా. 250 జతల బట్టలున్నా పర్లేదు గానీ అవినీతిపరుడు వద్దని వారంతా ముక్త కంఠంతో చెప్పారు. దాంతో విపక్షాలు ఇంకెప్పుడూ నాపై అవినీతి ఆరోపణలకు ధైర్యం చేయలేదు’’ అన్నారు. నిజానికి తనకెప్పుడూ అన్ని జతల బట్టల్లేవంటూ ముక్తాయించారు.
యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో భారత్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్ 60 శాతం, లిపిడ్ రెగ్యులేటర్స్ 58, యాంటీ అల్సర్స్ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్ 56 శాతం, కొరియా 18, యూరప్ 11 శాతం బయోసిమిలర్స్ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్–యూఎస్ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.
గాడ్ పవర్?
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్‌గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్‌కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది.
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట.
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
సినిమా
ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్!
సెలబ్రిటీలు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వాళ్ల లైఫ్ అంతా లగ్జరీ స్టైలే. సినీతారలు ఎక్కడికెళ్లినా కెమెరాల కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. దీంతో వారు బయటికి వచ్చారంటే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్ ప్రముఖులు అంతా ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పలువురు అగ్రతారలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే బాలీవుడ్ భామ శిల్పాశెట్టి సైతం తన ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె ఇటీవలే ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. శిల్పా చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించింది, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
మొత్తం లుక్కే మార్చేసిన రీతూ.. అషూ రెడ్డి హాట్ హాట్!
సోయగాలతో చంపేస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్రోజురోజుకీ హీట్ పెంచేస్తున్న అషూ రెడ్డికొడుకు పుట్టినరోజు.. అనసూయ ఫుల్ హ్యాపీ పోస్ట్గుర్తుపట్టలేనట్లు లుక్ మార్చేసిన రీతూ వర్మవావ్ అనిపించేలా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దక్ష నగర్కార్జిగేలు మనే డ్రస్సులో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rinku Asha Mahadeo Rajguru (@iamrinkurajguru) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Shwetha R Prasad 2.0 (@shwetharprasad) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Nivedhithaa Sathish (@nivedhithaa_sathish) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఆడవారు అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ సెలబ్రిటీలు అందం కోసమే ఖర్చు చేస్తారు.. అందంగా కనిపించేందుకే ఎక్కువ తాపత్రయపడతారు. కొందరైతే ప్లాస్టిక్ సర్జరీల దాకా వెళ్తారు. ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. పొరపాటున ఫేస్‌లో ఏదైనా మార్పు కన్పిస్తే చాలు నెటిజన్లు సెలబ్రిటీలను తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ వైఖరిపై బిగ్‌బాస్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.నెగెటివిటీ!'జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ముఖం పట్టుకుని నానామాటలు అనేస్తున్నారు. నటీనటులుగా, సెలబ్రిటీలుగా మేము జనాల్లోనే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకని ఎప్పుడూ నెగెటివిటీ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. యాక్టర్స్‌గా అందంగా కనిపించడం మా బాధ్యత. అందవిహీనంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారా? మా ప్రొఫెషనల్‌లో అందానికి పెద్ద పీట వేస్తాం. ఎప్పటికప్పుడు అందాన్ని పెంపొందించుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంతగానో కష్టపడతాం.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?నోటికొచ్చింది అనేస్తున్నారుశరీరంలోని మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల మేమెంత ఇబ్బందిపడుతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది తిడుతున్నారు. అప్పటికే మేమెంతో ఒత్తిడిలో ఉంటాం. దానికి తోడు మీ ట్రోలింగ్ వళ్ల ఇంకెంత హర్ట్ అవుతామో ఆలోచించారా? దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇంత బాధపెట్టడం మీకు న్యాయమేనా?' అని జాస్మిన్ ప్రశ్నించింది.చదవండి: స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)హీరో ఓ దొంగ. ఫ్రెండ్‌తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్‌గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)
క్రీడలు
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది.
రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంలో ఆ జట్టు పేసర్ యష్ దయాల్‌ది కీలక పాత్ర. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో గుజరాత్ తరపున జీరోగా మారిన దయాల్ ఇప్పుడు ఆర్సీబీ తరపున హీరోగా మారాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను యశ్ దయాల్‌కు ఇచ్చాడు. క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా వంటి డెంజరస్ ఆటగాళ్లు ఉండడంతో సీఎస్కే విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరని అంచనాలను దయాల్ తారుమారు చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం భయపడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి తన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని చంద్రపాల్ చెప్పుకొచ్చాడు.'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి యష్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్ ఉంది. అది నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. ఆ ఆన్లైన్ ట్రోలింగ్ అంతటితో అగిపోలేదు. మేము ఆ ట్రోలింగ్ చూడలేక మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. ఈ ఏడాది సీజన్ వేలంలో ఆర్సీబీ రూ. 5 కోట్లకు యశ్‌ను సొంతం చేసుకున్నాక కూడా ట్రోలు చేయడం మొదలెట్టారు.ఆర్సీబీ ఫ్రాంచైజీ డబ్బును చెత్తలో పడేసిందంటూ విమర్శించారని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దయాల్ తండ్రి చంద్రపాల్ పేర్కొన్నాడు.
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్‌రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్‌ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
బిజినెస్
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్‌కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్‌ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం.
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.అణువణువూ ఆదర్శమే..వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్ టాటా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్‌టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.అందరూ ఓటేయాలని పిలుపుముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్డీఎఫ్సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్‌లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం.
వీడియోలు
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఫ్యామిలీ
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షోని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. ఈ స్విమ్‌సూట్ ఫ్యాషన్ గత శుక్రవారమే సెయింట్ రెజిస్ రెడ్ సీ రిసార్ట్‌లోని రెడ్సీ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్ యాస్మినా క్వాన్జల్ వన్ పీస్ ఎరుపు రంగు స్విమ్‌సూట్, నీలరంగులో స్వీమ్సూట్లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్ ధరించారు. ఈ క్రమంలో డిజైనర్ క్వాన్జల్ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్. అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది.ఎన్నో సంస్కరణలు..ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.SAUDI ARABIA HOSTS A SWIMSUIT FASHION SHOW FOR THE FIRST TIME pic.twitter.com/eOcLRnv2K9— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 18, 2024 (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..)
బేబీ బంప్‌తో దీపిక క్యూట్‌గా, అపురూపంగా చూసుకున్న రణవీర్
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు. తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.దీపికా-రణవీర్జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్
కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్మ్యాన్గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్. ప్రతి ఐపీఎస్ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్ కప్ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్లో ఉందంటే..విరాట్‌ని డిఫెరెంట్ డిఫెరెంట్ స్టయిల్ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్ నైపుణ్యంతో విరాట్ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యి స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్ని ఎంచుకున్నట్లు హకీమ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్ హెయిర్లెస్గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్ స్టయిల్ని సెట్ చేశాడు హకీమ్. ఇక హకీమ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్ చేస్తాడు.కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్ స్టయిల్ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్‌కి విరాట్ కొత్త హెయిర్ స్టైల్ అని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.New hairstyle for T20 WC🙂👍🏻#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 16, 2024 (చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?)
న్యూస్ పాడ్‌కాస్ట్
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
భార్య కళ్ల ముందే భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: భార్య కాపురానికి రావడం లేదనే బాధతో ఓ యువకుడు ఆమె కళ్ల ముందే మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... కడప ఎర్రముఖపల్లి సర్కిల్లో నివసించే పసుపులేటి మణికంఠ (33) 2018 మే 10వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడాది పాటు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–14లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశారు. మణికంఠ పద్ధతులతో విసిగిపోయిన యువతి ఇబ్రహీంనగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మణికంఠ తీవ్ర నిరాశా నిస్పృహలతో గడపసాగాడు. భార్యను తనతో పాటు రమ్మని పిలవడానికి ఆదివారం రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రావాలని కోరాడు. నీ పద్ధతులు నచ్చకనే వేరుగా ఉంటున్నానని, నీవు మారవని రాలేనని భార్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన భార్య ఎప్పటికీ ఇక రాదని, ఈ జీవితం వృథా.. బతికి వేస్ట్ అనుకుంటూ భార్య చూస్తుండగా మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే మణికంఠ మృతి చెందగా ఈ విషయాన్ని బాధిత యువతి మణికంఠ బాబాయి వెంకటరమణకు తెలియజేసింది. వెంకటరమణ ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సవతి తల్లి కాదు రాక్షసి
యశవంతపుర: తల్లి లేని పాపను అమ్మలా చూసుకోవాల్సిన సవతి తల్లి ఈర్ష అసూయతో రాక్షసిలా మారింది. మూడేళ్ల చిన్నారిని కొట్టి చంపిన ఘటన బెళగావి జిల్లా కంగ్రాళి గ్రామంలో జరిగింది. వివరాలు.. సీఆర్పీఎఫ్లో జవాన్‌గా పని చేస్తున్న రాయణ్ణ మొదటి భార్య గతంలో చనిపోయింది. వీరికి ఒక పాప ఉంది. సప్నా అనే యువతిని రాయణ్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు వేరే రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నాడు. ఇంటి వద్ద సప్నా పసిపాపను నిత్యం హింసించేది. ఇదే రీతిలో సోమవారం కూడా పాపను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. పాప వాంతులు చేసుకుంటూ చనిపోయిందని సప్నా నాటకం ఆడింది. ఆమె హత్య చేసిందని పాప అవ్వ, చిన్నాన్న కేసు పెట్టారు.
టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బంధువు ఒకరు ఎటువంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి కారులో తీసుకువస్తున్న రూ.68.40 లక్షల నగదును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఏపీ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు లభించింది.దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వా«దీనం చేసుకొని, చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు తెస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్సీకి దగ్గరి బంధువుగా చెబుతున్నారు. ఆయన బెట్టింగ్‌లకు బుకీ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తారని, ఆ డబ్బంతా ఎన్నికల ఫలితాలపై పందేలు కట్టిన వారి నుంచి వసూలు చేసి తెస్తున్నదని సమాచారం.
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్‌హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్‌పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్‌ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్‌హౌస్‌ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్‌హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్‌లో తీసింది కాదని, ఆ ఫార్మ్‌హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.