Top Stories
ప్రధాన వార్తలు
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ .. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.
మోదీ మాస్టర్ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు.
మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్డ్ 2 సాఫ్ట్వేర్ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజమానులకే ఇచ్చాం. దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునేటప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి డాక్యుమెంట్లతో వెళితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి. పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్ఎస్ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతున్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్ డివిజన్, సర్వే జరగకపోవడం, రికార్డులు అప్డేట్ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్ ఆలోచన. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేసి ఆ హక్కు పత్రాలను పదిలంగా రైతన్నలకు అందచేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకుగానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది.
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్ వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుందివైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు.
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
అట్టావా: భారత్, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.శంకర్ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
సినిమా
బాటిల్ విసిరిన ఆకతాయి.. సింగర్ రియాక్షన్ ఇదే!
పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ ఇటీవల డెహ్రాడూన్‌లోని ఓ కాలేజీ ఫంక్షన్లో లైవ్ షోకు హాజరైంది. తన మధుర గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించింది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడుతూ అందరిలో హుషారు నింపింది. అక్కడున్నవారిని తనతో కలిసి పాడమని ఎంకరేజ్ చేసింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరాడు.బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది?తనవైపుగా ఏదో వస్తువు వస్తోందన్న విషయం గమనించి ఆమె రెండడుగులు వెనక్కు వేసింది. అయినా పాట పాడటం ఆపలేదు. కొన్ని సెకన్ల తర్వాత ఆమె.. నాపై బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది? ఈ షో ఆగిపోతుంది. ఈ షో ఆగిపోవాలనుకుంటున్నారా? అని అడిగింది. అందుకు అక్కడున్న జనాలు వద్దని ముక్తకంఠంతో బదులిచ్చారు. అదే ఉత్సాహందీంతో ఆమె అదే ఉత్సాహంతో షోని కంటిన్యూ చేసింది. ఈ షోకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైనా పట్టించుకోకుండా షో ముందుకు కొనసాగించిన సునిధి మంచితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ స్థానంలో మరెవరైనా ఉంటే మైక్ అక్కడే పడేసి వెళ్లిపోయేవారని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sunidhi Chauhan (@sunidhichauhan5)
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట .. ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.కాగా.. బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మూడో వివాహం కాగా.. ఆమె రెండో భర్త కెవిన్ ఫెడెర్‌లైన్‌తో ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వీరిద్దరు 2004 నుంచి 2007 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. బ్రిట్నీ స్పియర్స్ మొదట చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే విడిపోయింది. ఆ తర్వాత 2016లో నటుడు అస్గారితో డేటింగ్ చేయడం ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
రెండున్నర గంటల సినిమా కోసం నెలల తరబడి కష్టపడుతుంటారు సినీస్టార్స్. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసే కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సినిమా విజయవంతంగా నిర్మితమవుతుంది. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.అంబాసిడర్ కారులో..తాజాగా అలాంటి ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ పంచుకున్నాడు. 1984లో ఉత్సవ్ సినిమా వచ్చిందిగా.. అప్పుడు జరిగిందీ సంఘటన. నేను, నా భార్యగా నటించిన అనురాధ పటేల్, శశి కపూర్, అతడి కుమారుడు కునాల్ కపూర్.. మేమంతా హడావుడిగా అంబాసిడర్ కారులో బెంగళూరులోని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నాం.కారు అద్దాలు ధ్వంసంఇంతలో ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డంగా రావడంతో మా కారు ఢీ కొట్టింది. ఇది చూసిన గ్రామస్తులు వెంటనే మా కారువైపు పరిగెత్తుకొచ్చారు. కారు అద్దాలు పగలగొట్టారు. శశి కపూర్‌ను కాలర్ పట్టుకుని లాగారు. కునాల్‌ను కొట్టారు. మా వెంట ఉన్న నటుడు రాజేశ్‌ను జుట్టు పట్టుకుని లాగి తల నరికేస్తామని బెదిరించారు.చెట్టు కింద కూర్చుని చాయ్..మా కారు ఢీ కొట్టిన వ్యక్తి చెట్టు కింద కూర్చుని చాయ్ తాగుతూ నవ్వుతున్నాడు. అతడు తన భాషలో ఏదేదో మాట్లాడుతున్నాడు. అది మాకేం అర్థం కాలేదు.. కానీ చాలా భయమేసింది. తర్వాత అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకున్నాం అని పేర్కొన్నాడు. కాగా శేఖర్ సుమన్ నటించిన తొలి సినిమా ఉత్సవ్. ఈ మూవీలో నురాధ పటేల్‌తో పాటు రేఖ హీరోయిన్గా నటించింది.చదవండి: డబ్బు కోసమే పెళ్లి? వరలక్ష్మి స్ట్రాంగ్ కౌంటర్
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి.
ఫొటోలు
జల్సా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి? గుర్తుపట్టడం కష్టమే(ఫోటోలు)
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
బిగ్‌బాస్ విన్నర్ తేజస్వి బోల్డ్ లుక్స్ (ఫోటోలు)
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
క్రీడలు
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు.
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నిన్న (మే 4) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన విరాట్.. పొట్టి క్రికెట్లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఐపీఎల్ గెలుపుల్లో అత్యధిక పరుగులు (4039) చేసిన బ్యాటర్‌గా.. నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్ (14562)షోయబ్ మాలిక్ (13360)కీరన్ పోలార్డ్ (12900)విరాట్ కోహ్లి (12536)అలెక్స్ హేల్స్ (12319)విజయాల్లో (ఐపీఎల్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి (4039)శిఖర్ ధవన్ (3945)రోహిత్ శర్మ (3918)డేవిడ్ వార్నర్ (3710)సురేశ్ రైనా (3559)మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్, డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్‌రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్‌గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్‌తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్‌రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!
30 నవంబర్, 2017.. అండర్–11 జాతీయ చాంపియన్‌గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్‌లో ప్రపంచ చాంపియన్ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్ చాంపియన్ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరే చాలెంజర్‌గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్ లారెన్తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్ తండ్రి రజినీకాంత్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్ క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్‌లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్‌లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో..అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్ అన్నారు. గుకేశ్ క్యాండిడేట్స్ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గుకేశ్‌ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.అంచనాలకు అందకుండా రాణించి..కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్ గెలవడం కష్టమంటూ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్సన్ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.సాధారణంగా గుకేశ్ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్ చేసేవాడు. గేమ్ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.రెండోసారి ఈ మెగా టోర్నీలో ఏడో రౌండ్లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్యాండిడేట్స్ టోర్నీ 14 రౌండ్లలో ఈ ఒక్క గేమ్‌లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్ ఓడితే ఆ తర్వాతి రౌండ్లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.ఆత్మవిశ్వాసంతో..గుకేశ్ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్‌తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.తల్లిదండ్రులతో..ఒత్తిడిని అధిగమించి..గుకేశ్‌కు ఇది తొలి క్యాండిడేట్స్ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్ చెప్పాడు. అయితే గుకేశ్ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.అండర్ 12 వరల్డ్ చాంపియన్‌గా.. , క్యాండిడేట్స్ టోర్నీ గోల్డ్ మెడల్‌తో.. సవాల్‌కు సిద్ధం..గుకేశ్ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్ లారెన్తో గుకేశ్ తలపడతాడు.31 ఏళ్ల డింగ్‌కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది
బిజినెస్
2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
ఢిల్లీ: దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రెండు దశల్లో పూర్తయింది. ఇంకా ఐదు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 19న మొదలైన ఎలక్షన్స్ జూన్ 1తో ముగియనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 7 దశల్లో జరుగుతున్న ఎన్నికలు ఎంతోమందికి తాత్కాలికంగా ఉద్యోగాలు కల్పిస్తామని నిపుణులు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో సుమారు 9 లక్షల మంది తాత్కాలికంగా ఉపాధిని పొందనున్నట్లు వర్క్‌ఇండియా సీఈఓ, కో-ఫౌండర్ నీలేష్ డంగర్వాల్ పేర్కొన్నారు. ఇందులో పోలింగ్ బూత్ అధికారులు, క్లర్క్స్, సెక్యూరిటీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలు ఉంటాయి.ఎలక్షన్ సమయంలో అందుబాటులోకి వచ్చే ఈ తాత్కాలిక ఉద్యోగాలు జాబ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయా అనే ప్రశ్నకు.. టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ సమాధానమిచ్చారు. లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాలపై ఈ తాత్కాలిక ఉద్యోగాల ప్రభావం కొంత ఉంటుందని ఆయన అన్నారు.జీనియస్ కన్సల్టెంట్స్ CMD RP యాదవ్ మాట్లాడుతూ.. 1,00,000 మందికి పైగా తాత్కాలిక కార్మికులు కూడా ఎలక్షన్స్ సమయంలో అవసరమని పేర్కొన్నారు. ఫుడ్ క్యాటరింగ్, వాహనాల నిర్వహణ, షెడ్యూల్లు, పోస్టర్లు, మైక్రోఫోన్ల వంటి ప్రచార సామగ్రిని నిర్వహించడం.. సమావేశ నిర్మాణంలో సహాయం చేయడం వంటి వాటిలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.ఎలక్ట్రీషియన్లు, క్లీనర్లు, సోషల్ మీడియా క్యాంపెయినర్లు, ఈవెంట్ మేనేజర్లు, కంటెంట్ రైటర్లు, కంటెంట్ క్రియేటర్లు వంటి ఉద్యోగాలకు 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా డిమాండ్ ఉందని కూడా యాదవ్ పేర్కొన్నారు. వీరి జీతాలు రూ. 15000 నుంచి రూ. 40000 వరకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను నిరాశకు గురి చేశాయి. క్రితం రోజున భారీగా తగ్గి ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 4) మళ్లీ స్వల్పంగా ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 పెరిగి రూ. 71,830 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 ఎగిసి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి రూ.71,980 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 పెరిగి రూ.71,830 వద్దకు ఎగిసింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.71,830 లకు చేరుకుంది.చెన్నైలో తగ్గింపుదేశమంతా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరుగుదలను చూడగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,000 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.72,000 లకు దిగొచ్చింది.
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల ప్రైవేట్ మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్సీఆర్కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి.
వీడియోలు
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
లీడర్ VS చీటర్స్
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
పారిపోయిన సీఎం రమేష్
ఫ్యామిలీ
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
‘మంత్రాలకు, శాపాలకు ఏదైనాసరే.. రాయిగా మారిపోతుంది’ అనే మాటను పురాణగాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఈ బావిలోని నీళ్లు దేన్నైనాసరే నిలువునా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇంగ్లండ్‌లోని ‘పెట్రిఫైయింగ్ వెల్’ చరిత్ర ఓ మిస్టరీ. దీన్నే ‘మదర్ షిప్టన్ కేవ్’ అని కూడా పిలుస్తారు.నార్త్ యార్క్‌షైర్‌లోని అందమైన ప్రాంతాల్లో నేజ్బ్ర ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఆ నుయ్యి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా.. మరికొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీ కప్పులు, టెడ్డీబేర్ ఇలా ప్రతిదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతాకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులను ఇలా, ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియమ్స్‌లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్నినెలల పాటు ఉంచిన సైకిల్ రాయిగా మారిపోవడం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది.నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ్ల చాలవు. నిడ్ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం..1630 నుంచి పర్యాటకేంద్రంగా వాసికెక్కింది. అప్పటి నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రావెర్టైన్ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్ షిప్టన్ గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తుంది.ఆ గుహలోనే.. 1488లో అగాథ సూత్టేల్ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ బిడ్డ పేరు ‘ఉర్సులా సౌథైల్’ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్దపెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానిక కథనం. అంతేకాదు ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట.హెన్రీ Vఐఐఐ (1547) మరణం, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ (1666) వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలామంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు ‘మదర్ షిప్టన్ ’గా మారింది.ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరంపెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితో ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించినవారంతా ఆ నుయ్యి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలుపెట్టారు.ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంలా ఉందనే ప్రచారమూ సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది.. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా! అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనేదానిపై స్పష్టత లేదు.మదర్ షిప్టన్ చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలామంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారమూ ఊపందుకుంది.ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నింబధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అసలు ఈ నీరు ఎప్పటి నుంచి అలా మారింది? ఉర్సులా సౌథైల్ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలూ ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికీ ఈ గుహ వెనకున్న కథ మిస్టరీనే మిగిలిపోయింది. — సంహిత నిమ్మనఇవి చదవండి: మధిర టు తిరుపతి.. 'సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
ఇండియాలో ఫ్యాషన్ సీన్‌ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్లలో టాప్ ఆఫ్ ది ఆల్గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్‌కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్ల మేళవింపుతో పర్ఫెక్ట్గా ఉంటుంది.ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్‌కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్‌గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది."డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్‌లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక్స్ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ.
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్‌ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్‌వైట్‌గా పల్చగా ఉండే బ్రెడ్‌ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్‌ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్‌లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్‌లా పలచటి పొరలాంటి స్లైస్‌లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్‌లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్‌లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్‌లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్‌లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!)
క్రైమ్
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు.
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు.
Warangal: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
హసన్‌పర్తి: నగరంలోని వంగపహాడ్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.గది కిరాయి రోజుకు రూ.వెయ్యికాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది.