Top Stories
ప్రధాన వార్తలు
పవన్ ఏ దేశానికి వెళ్లారు?
సాక్షి, అమరావతి : ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతోపాటు సొంత పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఎక్కడకు వెళ్లారన్నదీ వారికీ తెలియక సతమతమవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గానీ, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గానీ పార్టీ నాయకులెవరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాగబాబు ‘ఎక్స్’ ట్వీట్ పెను దుమారం రేపినా..పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో, జనసేన పార్టీలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపైనా పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్‌లో ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..’ అంటూ ట్వీట్ చేశారు. మెగా – అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది.ఆ ట్వీట్‌పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగానే నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్‌ను ఒక రోజు బ్లాక్ చేసి, రెండో రోజు ఆ ట్వీట్‌ను డిలీట్ (తొలగించానంటూ) చేశానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది.
అంతకు మించి అరాచకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారితోపాటు అదుపులోకి తీసుకున్న వారిలో 75% మంది టీడీపీకి చెందినవారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్ – సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ – సెర్చ్ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్), ఎస్పీ/ పోలీస్ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి.
ఎన్నికల నైతికత నెలకొనేనా?
ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెబుతూ తిరిగారు. అనైతిక భాషను ఎవరి మీదా వాడటం కనిపించలేదు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది.ప్రపంచంలో ఓటు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం మొదలైన దగ్గరి నుండి సమాజ నైతిక జీవనంలో గణనీయంగా మార్పు వచ్చింది. అంతకుముందు గుంపు నైతికతను మతం బోధించే ప్రయత్నం చేసింది. కానీ ఆ నైతికతకు జవాబుదారీతనం అనేది ఏమీ లేదు. రాజ్యవ్యవస్థలో రాజులు, నియంతలు ప్రజలకు జవాబుదారీగా లేరు. కండబలం– అంటే నిర్మిత సైన్యబలం, ప్రజల మధ్య కల్పించిన భయ వాతావరణం రాజ్యాలను నడిపించాయి. భారతదేశంలో మతం–కులం ఒకదానికొకటి అండగా ఉండటం వల్ల, మత వ్యవస్థ ఎన్నడూ ఇక్కడ సోషల్ మొరాలిటీ(సామాజిక నైతికత)ని ప్రజల మధ్య ప్రచారం చెయ్యలేదు. కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని తద్వారా కుల మొరాలిటీని ప్రజలమధ్య ప్రచారం చేసి, ఉత్పత్తి శక్తులకు విద్య, మానవ సమానత్వం అందకుండా చాలా జాగ్రత్తగా నీతి రహిత సమాజ నిర్మాణాన్ని దైవ సృష్టి నిర్మాణంగా కొనసాగించారు. ఈ విధమైన నీతి రహిత సమాజ జీవనాన్ని ఎలక్షన్ మొరాలిటీ (ఎన్నికల నైతికత) ద్వారా మార్చవచ్చు అని అంబేడ్కర్ భావించారు. ఆ మార్పునకు మూలం రాజ్యాంగం.అయితే భారతదేశంలో 1952 నుండి చాలాకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు– సోషలిస్టుల మధ్య ఎన్నికల పోరాటం జరిగింది. కాంగ్రెస్ దేశంలో చాలా సులభంగా ఎన్నికల్లో గెలవడం వల్ల, కమ్యూనిస్టులు అసలు రాజ్యాంగం మీదనే నమ్మకం లేని ఎన్నికల పోరాటంలో ఉన్నందువల్ల ఎన్నికల మొరాలిటీపై అసలు చర్చ జరగలేదు. ఈ దశ అంతా కూడా ఉత్పత్తి కులాల్లో బాగా చదువుకున్న యువకులు ఎక్కువగా లేనందున ఎన్నికల మొరాలిటీపై పత్రికల్లో కూడా చర్చ జరగలేదు. కమ్యూనిస్టులలో సిద్ధాంత పట్టు ఉన్నప్పటికీ, శ్రమ జీవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నికల ద్వారా రాజకీయ నైతికతనీ, సామాజిక నైతికతనీ సమాజంలో పెంచవచ్చని వారు భావించలేదు. కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా ఆర్ఎస్ఎస్ పునాదిగా ఎదుగుతూ వచ్చిన జనసంఘ్/బీజేపీ ఎన్నికల వ్యవస్థను మతాధిపత్య రాజకీయంతో ముడెయ్యడం వల్ల దేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల మధ్య ఎన్నికల మొరాలిటీపై చర్చ జరగలేదు. ఈ క్రమంలో విభిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి ఎన్నికల మొరాలిటీపై చర్చ చేసే అవకాశం వాటికి అంతగా లేదు. కానీ రాష్ట్రాల స్థాయిలో ఉత్పత్తి కులాల నుండి వచ్చిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదిగాక, ఎన్నికల నైతికతపై కొంత చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. 2024 ఎన్నికల్లో నాయకులు ప్రచార సభలలో వాడిన భాషను ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వాడిన ‘నీ అమ్మ మొగుడు చేశాడా’ లాంటి భాష ఏ ప్రజాస్వామ్య దేశంలో ఉపయోగించినా ఆయన్ని ఎన్నికల నుండి బహిష్కరించడమే కాక, తీవ్రమైన శిక్ష విధించే విలువలు ఉంటాయి. పాకిస్తాన్ వంటి అస్థిరమైన ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి భాషను బహిరంగంగా వాడటాన్ని ప్రజల విలువలు ఒప్పుకోవు. కానీ ఇండియాలో ఇటువంటి భాష, దీని అనుసంధాన ప్రవర్తన ఎన్నికల రంగంలో మామూలుగా కనిపిస్తుంది. జగన్ ఇటువంటి భాషను బహిరంగ సభల్లో ఎవరి మీదా వాడటం కనిపించలేదు. అదే చంద్రబాబు ‘సైకో, సైకో’ అంటూ జగన్‌ను తిట్టగా చూశాం. ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. దీన్నే మనం మ్యానిఫెస్టో అంటాం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెప్పుతూ తిరిగారు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ప్రధానమంత్రిగా మోదీ దేశ స్థాయిలో కూడా తన మ్యానిఫెస్టో గురించి గానీ, తను గత పదేండ్లుగా చేసిన పనుల గురించి గానీ చెప్పలేదు. రాహుల్ గాంధీ మీద ‘శహజాదా’ (యువరాజు) అనే పదజాలంతో నిరంతరం దాడి చేశారు. అంతకంటే ఘోరంగా ముస్లింలను ఉద్దేశించి ‘ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు’ అనే పదజాలంతో దాడి చేయడం ఎన్నికల నైతికతకు పూర్తిగా భిన్నమైంది. ఈ దేశంలో ముస్లిమేతురులు, ముఖ్యంగా బీదవారు కూడా చాలామంది పిల్లల్ని కంటారు. ఆయనే స్వయంగా తన తల్లిదండ్రులకు ఆరుగురిలో ఒకరు. ఈ రచయిత తన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లల్లో ఒకడు. ఈ భాష మతం ఎన్నుకొని పుట్టని పిల్లలపై దాడి చేస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి భాష వాడినప్పుడు అలా ఎక్కువ సంతానం ఉన్న అన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో సైతం భయాందోళన మొదలవుతుంది. ఇది అటువంటి పిల్లలను జీవితాంతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎన్నికల నైతికతలో పిల్లల్ని, అమాయకుల్ని భయభ్రాంతుల్ని చేసే భాష అసలుండకూడదు. కానీ దేశ ప్రధానమంత్రే బహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే, ఆ భాషకు ఎన్నికల కమిషన్ నుండి కూడా చెక్ లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ కొనసాగడం కష్టం. క్రమంగా ఈ దేశ రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ ప్రమాదం ఇటువంటి ధోరణుల నుండే వస్తుంది. ఈ ఎన్నికల్లో రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ ప్రమాదమున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసింది. రాహుల్ గాంధీ ప్రతి బహిరంగ సభలో రాజ్యాంగాన్ని చూపిస్తూ బీజేపీ తిరిగి గెలిస్తే ప్రమాదముందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకు విరుగుడు రిజర్వేషన్లను కాపాడటం, పెంచడంలో ఉందని మొదటిసారి కాంగ్రెస్ ప్రచారం చేసింది. నిజంగానే ఆర్ఎస్ఎస్–బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని క్రమంగా రద్దు చేసే అవకాశముందా? ఈ రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక పక్క, ఆనాటి కమ్యూనిస్టులు మరో పక్క వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగం భారతీయ సంస్కృతిని (అంటే బ్రాహ్మణీయ సంస్కృతిని) ప్రతిబింబించదనీ, అది పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందనీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పింది. కమ్యూనిస్టులేమో శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగం కావాలి, ఇటువంటి బూర్జువా రాజ్యాంగం వద్దని ప్రకటించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్– బీజేపీ బయటకు చెప్పేది వారి అసలైన అభిప్రాయం కాదు. 400 పైన స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ రాజ్యాగ రక్షణకు మోదీ గ్యారెంటీ లాంటి వ్యక్తిగత ప్రకటనలు పనికిరావు. వంద సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏం చెబుతోంది అనేది లోతుగా చూడాలి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని పై కులస్థులతోపాటు ఓబీసీ అయిన మోదీ కూడా చాలాసార్లు మాట్లాడారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు అందరూ అనుకునే హిందూయిజం కాదు. సనాతన ధర్మం ప్రధానంగా వర్ణ ధర్మం (కుల వ్యవస్థ) కలిగివుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని బీసీ, ఎస్సీలు... మళ్లీ వర్ణ ధర్మం పాత పద్ధతిలో నెలకొల్పాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చెయ్యకుండా సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడం సాధ్యం కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ నిర్మాణాల్లో ఉన్న శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఆదివాసులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లోతు చూడకపోతే తాము మునిగి దేశాన్ని కూడా ముంచే అవకాశముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
దారి మళ్లనున్న తుపాను!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మూడు రోజులు తేలికపాటి వానలుప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఐఏఎస్‌లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అందరి కన్నూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.
కోల్‌కతాకే ‘ఫైనల్’ సత్తా
ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్‌కతా ముందుగా బంతితో సన్‌రైజర్స్‌ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్‌తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్‌రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్‌కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్‌లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్‌కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్‌తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 92/4 స్కోరు చేసింది. వరుణ్ దెబ్బతో.... ఇంకేం ఓవర్‌కు 9.2 రన్‌రేట్‌తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్‌కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్’లు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో నైట్‌రైడర్స్‌కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్‌కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్‌కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0.
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు.
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది.
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
మాచర్ల: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.
తప్పక చదవండి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- వారణాసిలో వార్ వన్ సైడే
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
సినిమా
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official)
క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానం పేరు చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవాల్ని చాలాసార్లు ఎదుర్కొంది. కొన్ని నెలల క్రితం జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వస్తే ఏకంగా మీదమీదకొచ్చేశాడు. అయితే గతంలో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి వల్ల చాలా భయపడ్డానని కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)'కొన్నిరోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో ఉన్నాను. మొదటి రోజు పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ దర్శకుడు.. పర్మిషన్ లేకుండా నా క్యార్‌వ్యాన్‌లోకి వచ్చేశాడు. సడన్‌గా తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అని కాజల్ తనకెదురైన భయానక అనుభవాన్ని బయటపెట్టింది.'సత్యభామ' అనే మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్న కాజల్.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. అయితే ఈమె చేతిలో ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాలైతే ఏం లేవు.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024
మళ్లీ హానీమూన్‌కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
బికినీలో కూల్‌గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్క్యూట్ స్మైల్‌తో మాయలో పడేస్తున్న దీపికా పిల్లివెనక అందాలు చూపిస్తూ కిక్ ఇచ్చేస్తున్న అమైరా దస్తూర్నడుము వయ్యారాలు.. జబర్దస్త్ వర్ష కిర్రాక్ పోజులుచిన్న పిల్లలా ఆడుకుంటున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Kanch (@akansharanjankapoor) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Likhita Yalamanchili (@likhita_yalamanchili) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
ఫొటోలు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్‌గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
క్రీడలు
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 21–10తో హువాంగ్ యు సున్–లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో నలుగురు భారత ప్లేయర్లు సతీశ్ కుమార్, ఆయూశ్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి, కార్తికేయ గుల్షన్ కుమార్ పోటీపడ్డా ఒక్కరు కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. నేడు జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో పీవీ సింధు తలపడుతుంది.
మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ జోడీగా...
న్యూఢిల్లీ: నెల రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు మెరుగు పర్చుకొని మూడో ర్యాంక్ నుంచి టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. గత ఆదివారం థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలవడంతో వారి ర్యాంక్‌లో మార్పు వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న భారత జోడీ రెండు వారాలపాటు అగ్రస్థానంలో కొనసాగి ఆ తర్వాత ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 23న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని ఏప్రిల్ 15వ తేదీ వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగి మూడో ర్యాంక్‌కు పడిపోయింది.
నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’
ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో... నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్‌లో రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేదెవరో..? నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్తాన్ ‘ఢీ’ మిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత జట్టు క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. తాజా సీజన్లో బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమించే దశ నుంచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి అబ్బురపరిచింది. డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తమ చివరి 6 లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
బిజినెస్
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,529 వద్దకు చేరింది. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టైటాన్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.నెస్లే, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎల్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
పెళ్లిరోజు గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య
పెళ్లిరోజున భర్త ఇచ్చిన డబ్బుతో భార్య ఏకంగా రూ.8.2 కోట్లు సంపాదించిన ఆసక్తికర సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళ తన భర్త హర్నెక్ సింగ్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త పాయల్‌కు బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు.ఆ డబ్బుతో పాయల్ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2 కోట్లు)ను గెలుచుకున్నారు.ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..‘నేను ఈ సిరీస్‌లో విజేతగా మారడానికి నా భర్త ఇచ్చిన డబ్బే కారణం. ఏప్రిల్ 20న మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు 1,000 ధిరమ్‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆన్లైన్లో డీడీఎఫ్ టిక్కెట్ కొనాలని అనుకున్నాను. 3 అనే అంకె ఎక్కువసార్లు వచ్చే లాటరీ నంబర్‌ను ఎంచుకున్నాను. దాంతో 3337ను సెలక్ట్ చేసుకున్నాను. ఈ లాటరీ పొందడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ వార్తను నాభర్తతో ఫోన్లో చెప్పినపుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు. ఇంకా వారికి వార్త తెలియదు. ఇంటికి వెళ్లాక చెప్తాను. నా పిల్లల భవిష్యత్తు నాకుముఖ్యం. ఈ డబ్బుతో వారికి మంది విద్యను అందిస్తాను’ అని ఓ మీడియా సంస్థతో చెప్పారు.గత పన్నెండేళ్లుగా పాయల్ డీడీఎఫ్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారని మీడియా సంస్థ తెలిపింది. ప్రతిసారి ప్రయాణాల నిమిత్తం ఎయిర్పోర్ట్ వెళ్తున్నపుడు డీడీఎఫ్ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటని పాయల్ చెప్పారు. కానీ ఈసారి మొదటగా ఆన్లైన్లో ఖరీదు చేశానన్నారు.
2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి దేశంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కోసం సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లను పెంచాలని చెబుతున్నారు. ఇది జరిగితే ఇండియా ఎకానమీ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే.. సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి ఏటా 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ 'ట్రిన్ న్గుయెన్' సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగావకాశాలు మందకొడిగానే సాగుతున్నాయి. మూడో సారి మోదీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగం పెద్ద సవాలుగా మారుతుందని పలువురు చెబుతున్నారు.గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని న్గుయెన్ రాశారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశం మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతంగా ఉంది. ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువ. ఉద్యోగావకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో.. అప్పుడే ఇతర దేశాలతో భారత్ పోటీ పడగలదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
దేశంలో బంగారం కొనుగోలు దారులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది.దీంతో తగ్గిన బంగారం ధరలు దేశంలో పలు ప్రధాన నగరాల్లోహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,840 గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,510 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,660గా ఉంది.
వీడియోలు
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం
కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు
ఫ్యామిలీ
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి.
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్ వేడుకలకు తన డిజైనర్‌వేర్ డ్రెస్‌లతో మిస్మరైజ్ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. పైగా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట డెమండ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్ అత్యంత లగ్జరియస్ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్ డైట్ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నెక్లెస్ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్ తోపాటు ఆమె కొత్త హెయిర్ స్టైల్ హైలెట్‌గా నిలిచింది. ఇక ముఖానికి కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మాస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) (చదవండి: కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!)
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు.
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?)
న్యూస్ పాడ్‌కాస్ట్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కొవ్వూరు: వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో ఎన్టీ రామారావుపై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా 1983, 1985 (మధ్యంతర ఎన్నికలు), 1989, 1994, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు వేరైనప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కృష్ణబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఆయన మరణానంతరం 2012లో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లోనూ, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో పునర్విభజన అనంతరం కొవ్వూరులోనూ కృష్ణబాబు రాజకీయంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన భార్య నాగమణి గతంలోనే మరణించారు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ సలహాదారు, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్.రాజీవ్‌కృష్ణ ఆయన అల్లుడు. కృష్ణబాబు మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, కొవ్వూరు మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన దొమ్మేరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్‌ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్‌టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్‌లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేశారు. జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్‌కు వచ్చారు.
మాటలతో మూటలు
సాక్షి, హైదరాబాద్: శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ చేసిన రూ.200 కోట్ల స్కామ్‌లో టెస్కాబ్ మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్ మెటీరియల్ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్ సంస్థగా మార్చడంలో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా, దర్యాప్తు నిమిత్తం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్ అధికారులు వాణీబాలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వాణీబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ‘ప్రియాంక’ సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు... ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్ తిలక్‌రోడ్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు రూ.6 కోట్ల మేర క్రెడిట్ తీసుకోవడంతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్ చేస్తుండటంతో తమ నగదు ఎక్కడికీ పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులు ఇచ్చారు. వాణీబాల సలహాతోనే ఫైనాన్స్ సంస్థగా... తన భర్త, కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణీబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీ స్కామ్‌కు ప్లాన్ చేసింది. ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ను ఫైనాన్స్ సంస్థలా మార్చేలా చేసింది. తొలినాళ్లల్లో తన సహోద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్లు తీసుకుంది. వీరికి సాలీనా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. దీంతో వారికి వాణీబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణీబాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తమకున్న ఫైనాన్స్ కంపెనీ విషయం చెప్పి..బ్యాంక్‌లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీవిరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. బ్యాంకు సిబ్బందినీ వినియోగించుకుంది జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణీబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాబ్‌కు రావాల్సిన డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమీషన్ల ఆశ చూపి, వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్‌కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్ సంస్థకు తరలి వెళ్లిపోతున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సీసీఎస్‌లో కేసు నమోదైన తర్వాత వాణీబాలను సస్పెండ్ చేసి, విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు, బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని తెలిసింది. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా, గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులు దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణీబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాలంటూ బ్రోచర్లు డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఎస్పీ లోగోతో బ్రోచర్లు ముద్రించింది. వాటిలో తమకు ఎస్పీ గ్రాఫిక్ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక డిజిటల్స్, శ్రీ ప్రియాంక గ్రాఫిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని తిలక్రోడ్తో పాటు జీడిమెట్ల, బెంగళూరులోని రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్‌ల్లో వీటి బ్రాంచ్‌లు ఉన్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మంగళవారం మరికొందరు బాధితులు సీసీఎస్‌కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితోపాటు సంబం«దీకులు, ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న సబ్రిజి్రస్టార్లకు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్‌పై జూలై మూడోవారంలో హియరింగ్ జరగనుంది. ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఉద్యోగ జీవితంలో సంపాదించింది మొత్తం పెట్టేశా మా బంధువు ఒకరు టెస్కాబ్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు దాదాపు రూ.60 లక్షల వరకు ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడి పెట్టారు. వారి ద్వారానే వాణీబాల నాకు పరిచయమైంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన నేను నా ఉద్యోగ జీవితంలో సంపాదించిన రూ.20 లక్షలు వారి వద్ద పెట్టుబడిగా పెట్టాను. సైదాబాద్ మనోహర్కాలనీలోని వాణీబాల ఇంటికి తాళం వేసి ఉండగా.. బ్యాంకు అధికారులు అక్కడే ఆమె సస్పెన్షన్ నోటీసు అంటించారు. సీసీఎస్ పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. – ఎం.శ్రీనివాసమూర్తి, ల్యాబ్ టెక్నీషియన్, కోటి గవర్నమెంట్ ఆస్పత్రి
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు.