Top Stories
ప్రధాన వార్తలు
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్‌లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్‌ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
సిడ్నీ: ప్రపంచంలో హీట్‌వేవ్ వల్ల సంభవించే మరణాల్లో అయిదో వంతు భారత్‌లోనేని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా హీట్‌వేవ్ కారణంగా 1.53లక్షల మందికిపైగా మరణిస్తుండగా ఇందులో ఐదో వంతు మంది భారత్‌లో చనిపోతుండడం కలవరం కలిగిస్తోంది. హీట్‌వేవ్ మరణాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా, రష్యా దేశాలున్నాయి. మొత్తం హీట్‌వేవ్ మరణాల్లో సగం ఆసియా నుంచే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 1990 నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హీట్‌వేవ్‌తో సంభవిస్తున్న మరణాలను యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మొత్తం మరణాల్లో 30 శాతం యూరప్‌లో సంభవిస్తున్నాయని తేలింది. ప్రభుత్వాలు హీట్‌వేవ్‌ల పట్ల సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసినప్పుడే మరణాలను అరికట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ పాలసీ, హీట్ యాక్షన్ ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ అండ్ గ్రీన్ స్ట్రక్చర్స్, సామాజిక మద్దతు కార్యాచరణ, పబ్లిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అవేర్నెస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వంటి చర్యలు హీట్‌వేవ్ మరణాలు నివారించడానికి తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు.రాష్ట్రంలో తుదిపోలింగ్ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు.‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్ పెరిగిందినాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు.
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్‌కు మాత్రమే ‘రిజర్వ్ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్ తరూబా (ట్రినిడాడ్)లో జూన్ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ రెండో సెమీఫైనల్ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్ ప్రొవిడెన్స్ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునేభారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.పైగా జూన్ 29న ఫైనల్ కాబట్టి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్‌కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.అదనపు సమయం..అయితే ‘రిజర్వ్’కు బదులుగా రెండో సెమీస్‌కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్ ఎయిట్’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).సూపర్-8కు అర్హత సాధించిన జట్లు👉ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates6:09 PM, May 15th, 2024పోలింగ్‌లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయంసమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారుచివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయిదీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారుబడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారుఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారుమంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారుచివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారుఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారువారంతా జగన్‌కే పట్టం కట్టారుజగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారుకులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారుహైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్ని మాత్రమే పెట్టారుఅసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించిందిఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు5:31 PM, May 15th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ5:06 PM, May 15th, 2024నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్యఅనకాపల్లి:ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలుమహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపుఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారిగతంలో వాలంటీర్‌గా విధులు నిర్వహించిన కుమారిఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు 4:12 PM, May 15th, 2024పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నానిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారుమా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారుపోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణంపల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారుమా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారుపురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగిందిఅంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు4:09 PM, May 15th, 2024పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబుపోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారుమాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారుటీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదుదీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారునన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారుచాలా దుర్మార్గపు చర్యలకు దిగారుపోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారుఅలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగిందిఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందిపోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారుసీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చుతన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు.
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని పేర్కొన్నారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవతరించనుందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ గ్యారంటీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ధ్వజమెత్తారు.డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.చదవండి: ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్ Live: Press Meet, 6 Ashoka Road, New Delhi. https://t.co/lynyvwj2XR— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 15, 2024
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ఎప్పటికీ భారత్‌దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్‌కతాలో బుధవారం(మే15) జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ స్పందించారు.పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు. ‘పీఓకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి గల కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు.అయితే పీఓకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీఓకే ప్రజలు భావిస్తున్నట్లున్నారు’అని జైశంకర్ అన్నారు. కాగా, ఇటీవల పెరిగిపోయిన ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీఓకే ప్రజలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్ పిరయడ్లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.స్టేటస్ అప్లికేషన్‌ను అడ్జెస్ట్మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
సినిమా
మెహరీన్‌పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్‌పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి. నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్‌లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్‌లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
సైకో థ్రిల్లర్‌గా 'దక్షిణ'.. ట్రైలర్‌తోనే భయపెట్టారు!
కబాలి ఫేమ్ సాయి ధన్షిక ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం దక్షిణ. మంత్ర, మంగళ సినిమాలతో మెప్పించిన ఓషో తులసి రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్‌పై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రిషవ్ బసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సనా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... 'ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే. తులసి రామ్ టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్. దక్షిణ సినిమాతో సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు' అంటూ అభినందించారు. కాగా.. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృందం కూడా పాల్గొన్నారు. ఈ సినిమా సైకో థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతోందన్న సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుందని నిర్మాత అశోక్ షింజే అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
ప్రపంచంలోనే అద్భుతమైన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టాప్‌లో ఉంటుంది. 2011-18 మధ్య దాదాపు ఎనిమిది సీజన్లు వస్తే అవన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనికి ప్రీక్వెల్‌గా 'హౌస్ ఆఫ్ డ్రాగన్' పేరుతో మరో సిరీస్ తీస్తే అది కూడా హిట్ అయింది. 2022లో తొలి సీజన్ రిలీజ్ కాగా, త్వరలో రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయగా, అది అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' రెండో సీజన్లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. జూన్ 16 నుంచి ఒక్కో వారం ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయనున్నారు. హెచ్‌బీవో మ్యాక్స్, జియో సినిమా ఓటీటీల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే తొలి సీజన్ చూసిన ప్రేక్షకులు.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్‌గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)
ఫొటోలు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
క్రీడలు
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్‌కు మాత్రమే ‘రిజర్వ్ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్ తరూబా (ట్రినిడాడ్)లో జూన్ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ రెండో సెమీఫైనల్ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్ ప్రొవిడెన్స్ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునేభారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.పైగా జూన్ 29న ఫైనల్ కాబట్టి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్‌కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.అదనపు సమయం..అయితే ‘రిజర్వ్’కు బదులుగా రెండో సెమీస్‌కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్ ఎయిట్’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).సూపర్-8కు అర్హత సాధించిన జట్లు👉ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
ఐపీఎల్-2024 ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఈసారి ఏకంగా 20 జట్లు ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జట్ల వివరాలను వెల్లడించాయి. ఇందులో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ శాంసన్‌లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదిరే ప్రదర్శనతో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ ఇద్దరూ స్థానం సంపాదించారు.అయితే, తుదిజట్టులో పంత్, సంజూలలో ఎవరు ఉండాలన్న అంశంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నాడు.సంజూ కంటే పంత్ బెటర్ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఐపీఎల్లో పంత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజూ శాంసన్ టాపార్డర్‌లో వస్తున్నాడు. పంత్ లెఫ్టాండర్. కాబట్టి మిడిలార్డర్లో అతడు ఉంటే జట్టు కూర్పులో వైవిధ్యం ఉంటుంది.టాపార్డర్‌లో ఇప్పటికే కాంబినేషన్ సెట్ అయింది. కాబట్టి వికెట్ కీపర్ కోటాలో పంత్‌ను తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఆడించవచ్చు’’ అని గంభీర్ విశ్లేషించాడు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లి ఉన్నారని.. అందుకే సంజూకు ఛాన్స్ దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు.ఫినిషర్‌గా రాణించగలడుఒకవేళ పంత్‌తో పాటు సంజూ శాంసన్నూ తుదిజట్టులో ఆడించాలనుకుంటే.. అతడిని ఆరు లేదంటే ఏడో స్థానంలో పంపిస్తే ఫినిషర్ రోల్ పోషించగలడంటూ గంభీర్ భిన్న రీతిలో స్పందించాడు. కాగా జూన్ 5 ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సంజూ హిట్టుఐపీఎల్-2024లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. మరోరెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కేరళ బ్యాటర్.. వ్యక్తిగతంగా 12 ఇన్నింగ్స్‌లో కలిపి 486 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ 13 మ్యాచ్‌లలో కలిపి 446 పరుగులు చేశాడు.అయితే, ఢిల్లీ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకుని కేవలం ఏడింట గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
బిజినెస్
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఏకకాలంలో ఎన్నోపనులు..!
ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్ టెక్నాలజీ కంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్‌మెంట్, సూపర్‌పొజిషన్స్ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్ రేణువులు ఎంటాంజిల్‌మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు.
గ్రీన్‌లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 22,262కు చేరింది. సెన్సెక్స్ 88 పాయింట్లు పెరిగి 73,185 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.02 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లోకి వెళ్లాయి. ఎస్ అండ్ పీ 0.48 శాతం లాభపడింది. నాస్డాక్ 0.75 శాతం పుంజుకుంది.టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది. యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది.
వీడియోలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
ఫ్యామిలీ
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
మిస్ యూఎస్ విజేతల వరుస రాజీనామాలు అమెరికాను షాక్ గురి చేసింది. అదీకూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే జరగడం పలు రకాల అనుమానాలకు లెవనెత్తింది. అయితే ఆ మోడల్స్ ఇద్దరిలో ముందుగా తన స్థానం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన మిస్ యూఎస్ఏ 2023 నోలియా వోగ్ట్ తన మానసిక ఆరోగ్య నిమిత్త రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, మరో మోడల్ మిస్ టీన్ యూఎస్ఏ 2023 తన వ్యక్తిగత విలువలు సంస్థతో సరిపోవడం లేదని చెబుతూ తప్పుకుంటున్నట్ల ప్రకటించింది. అయితే అసలు ఎందుకు ఆ ఇరువురు అందాల భామలు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వాటికి ఆ విజేతల తల్లులు వివరణతో తెరపడింది. ఆ బ్యూటీ క్వీన్స్ తల్లులైన బార్బరా, జాక్లైన్ వోగ్ట్, తమ కుమార్తెలు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్‌లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారు సంస్థకు సంబంధించిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాల(ఎన్డీఏ) కారణంగా వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి పెదవి విప్పడం లేదని చెప్పారు. తమ కుమార్తెలు సంస్థకు సంబంధించిన కొందరి వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. విజేతలుగా కిరీటాన్ని గెలుచుకున్నప్పటికీ వాళ్లు ఏం పొందలేదన్నది చెప్పాలనుకోవడం లేదని అన్నారు. వాళ్లు అక్కడ పలు దుర్భాషలకు, బెదిరింపులకు గురయ్యారు. తాము ఇలా బయటకొచ్చి చెప్పడానికి ప్రధాన కారణం ప్రధాన పోటీల్లో ఉండే వాస్తవాల గురించి మిగతా తల్లిదండ్రులు కూడా తెలసుకోవాలనే ఉద్దేశ్యంతోనేననిన్నారు. కాగా, మిస్ యూఎస్ఏ పోటీలు ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలు, కుంభ కోణాల్లో చిక్కుకుంది. అలాగే కొంతమంది పోటీదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి.(చదవండి: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..)
డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్‌లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్‌లో ఓ ఆహార విక్రేత డీజిల్‌తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్‌స్టామ్‌లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!)
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల చాలామంది నాన్‌స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్ ఫ్రైలు చేస్తే ఆయిల్ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.ఎందుకు మంచిది కాదంటే..నాన్‌స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత (కోటింగ్)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది. వచ్చే అనారోగ్య సమస్యలు..హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్‌లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు.
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్‌కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్‌పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్‌లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.