Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: CM YS Jagan Speech at Korukonda Junction
తుప్పు పట్టిన సైకిల్‌లో మిగిలింది బెల్‌ మాత్రమే: సీఎం జగన్‌

తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది.  చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?.  గతంలో ఎప్పుడూ చూడని విధంగా..  రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు.  పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌,  బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?..  నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్‌లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్‌ డ్యామేజ్‌ ఎంతలా అంటే..  ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్‌ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి..  తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్‌. సైకిల్‌కు పెడెల్‌ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్‌‌. మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్‌ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు.  నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా?  రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్‌ ఏదైనా బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా  ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్‌లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్‌ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్‌ 4వ తేదీ తర్వాత..  ఒక వారంలోనే ఆ బటన్‌లు అన్నీ క్లియర్‌ చేస్తాడు.  👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే  జగన్‌లాగా బాబు బటన్‌లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్‌లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు.  అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్‌ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

lok sabha election 2024: Phase 3 polling updates in telugu
LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్‌

updates మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది.అదాని గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదాని ఓటు వేశారు."India is progressing forward, and will continue to advance further", says Gautam Adani after casting his voteRead @ANI Story | https://t.co/hpPbbht3rK#GautamAdani #LokSabhaElection2024 #Gujarat pic.twitter.com/bADv7NlY6t— ANI Digital (@ani_digital) May 7, 2024మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.భారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 11 గంటల 25.41 శాతం పోలింగ్‌ నమోదైంది.అస్సాం-27.34%బీహార్-24.41% ఛత్తీస్‌గఢ్-29.90% దాద్రా అండ్‌ నగర్ హవేలీ, డామన్ అండ్‌ డయ్యూ- 24.69% గోవా-30.94% గుజరాత్- 24.35% కర్ణాటక-24.48% మధ్యప్రదేశ్-30.21% మహారాష్ట్ర-18.18% ఉత్తరప్రదేశ్-26.12% పశ్చిమ బెంగాల్-32.82%25.41% voter turnout till 11 am for phase 3 of #LokSabhaElections2024 Assam 27.34% Bihar 24.41% Chhattisgarh 29.90% Dadra & Nagar Haveli And Daman & Diu 24.69% Goa 30.94% Gujarat 24.35% Karnataka 24.48% Madhya Pradesh 30.21% Maharashtra 18.18% Uttar Pradesh 26.12%… pic.twitter.com/GFTTusnfGe— ANI (@ANI) May 7, 2024ఉత్తరప్రదేశ్‌ఓటు వేసిన అఖిలేష్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌,ఆయన భార్య మైన్‌పూరి ఎస్పీ అభ​ర్థి డింపుల్‌ యాదవ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని సైఫై పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.Samajwadi Party (SP) chief Akhilesh Yadav, his wife and SP candidate from Mainpuri Lok Sabha Seat, Dimple Yadav cast their votes at a polling station in Saifai, Uttar Pradesh(Source: Samajwadi Party)#LokSabhaElections2024 pic.twitter.com/3ZccxyCpxv— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్రబారామతి ఎన్సిపీ శరద్‌ చంద్ర పవార్‌ పార్టీ అభ్యర్థి సుప్రియా సూలే ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: NCP-SCP candidate from Baramati Lok Sabha seat, Supriya Sule casts her vote at a polling booth in Baramati NCP has fielded Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar from Baramati. #LokSabhaElection2024 pic.twitter.com/PuG30SmrEA— ANI (@ANI) May 7, 2024 పశ్చిమ బెంగాల్‌జంగీపూర్‌ పోలింగ్‌ కేంద్ర వద్ద ఘర్షణ చోటుచేసుకుందిటీఎంసీ బూత్‌ ప్రెసిడింట్‌, బీజేపీ అభ్యర్థి ధనుంజయ్‌ ఘోష్‌ గొడవపడ్డారుఅక్కడే ఉన్న పోలీసు సిబ్బంది గొడవను అడ్డుకున్నారు #WATCH | Murshidabad, West Bengal: During the third phase of voting for the Lok Sabha Elections, a TMC booth president clashed with BJP candidate Dhananjay Ghosh at a polling booth in Jangipur. #LokSabhaElections2024 pic.twitter.com/RF7U7NX5h3— ANI (@ANI) May 7, 2024 మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోందిభారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు ఉదయం 9 గంటల వరకు  పోలింగ్‌ శాతాలు.. అస్సాం-10.12%బీహార్-10.03%ఛత్తీస్‌గఢ్-13.24%దాద్రా అండ్‌ నగర్ హవేలీ, డామన్ అండ్‌ డయ్యూ- 10.13%గోవా-12.35%గుజరాత్- 9.87%కర్ణాటక-9.45%మధ్యప్రదేశ్-14.22%మహారాష్ట్ర-6.64%ఉత్తరప్రదేశ్-11.63%పశ్చిమ బెంగాల్-14.60%10.57% turnout till 9 am for phase 3 of #LokSabhaElections2024 Assam 10.12%Bihar 10.03%Chhattisgarh 13.24%Dadra & Nagar Haveli And Daman & Diu 10.13% Goa 12.35%Gujarat 9.87%Karnataka 9.45%Madhya Pradesh 14.22%Maharashtra 6.64%Uttar Pradesh 11.63%West Bengal 14.60% pic.twitter.com/YupOzbyDuQ— ANI (@ANI) May 7, 2024 మూడో విడత పోలింగ్‌ కొనసాగుతోంది మహారాష్ట్ర లాథూర్‌లో  రితేష్‌ దేశ్‌, జెనిలియా దంపతులు ఓటు వేశారుRiteish Deshmukh, Genelia Deshmukh cast their vote in Maharashtra's LaturRead @ANI Story |https://t.co/uCjksBo9b5#RiteishDeshmukh #GeneliaDeshmukh #Vote #Maharashtra #LokSabhaElections2024 pic.twitter.com/nUhRlrO05L— ANI Digital (@ani_digital) May 7, 2024 మధ్యప్రదేశ్‌మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు#WATCH | Madhya Pradesh Governor Mangubhai Patel and his family cast their votes at a polling booth in Navsari, Gujarat.BJP has fielded its sitting MP CR Paatil from the constituency. He faces Congress' Naishadhbhai Bhupatbhai Desai here.#LokSabhaElections2024 pic.twitter.com/j8SJsiCncb— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్రఎన్సిపీ శరద్‌ చంద్ర పవార్‌ చీఫ్‌ శరద్‌ పవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు#WATCH | NCP-SCP chief Sharad Pawar leaves from a polling booth in Baramati after casting his vote. NCP-SCP has fielded Supriya Sule from the Baramati seat. NCP has fielded Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar from Baramati#LokSabhaElection2024 pic.twitter.com/U2mKdkQS67— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్ర:షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని, ప్రణితి షిండే,  మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు వేశారు.#WATCH | Solapur: Congress Solapur Lok Sabha candidate Praniti Shinde and Former Maharashtra CM Sushil Kumar Shinde cast their votes at a polling booth in Solapur. BJP has fielded Ram Vitthal Satpute from Solapur. BJP's Dr.Jaisiddeshwar Shivacharya Mahaswamiji is the sitting MP… pic.twitter.com/6468jda0Af— ANI (@ANI) May 7, 2024కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఓటు వేశారు.#WATCH | Former Karnataka CM BS Yediyurappa and his sons - state BJP chief BY Vijayendra and sitting MP & party candidate from Shimoga, BY Raghavendra - cast their votes at a polling booth in Shivamogga.Congress has fielded Geetha Shivarajkumar and BJP's K.S. Eshwarappa is… pic.twitter.com/U6HQw0J2zU— ANI (@ANI) May 7, 2024ఓటు వేసిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi shows his inked finger after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat#LokSabhaElections2024 pic.twitter.com/OI0LzIJ0dQ— ANI (@ANI) May 7, 2024 అహ్మదాబాద్‌లోని నిశాన్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో మోదీ ఓటు చేశారు.Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/5r6Hsm1AZ3— ANI (@ANI) May 7, 2024 బీజేపీ నేత  హరనాథ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఎటా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారుBJP leader Harnath Singh Yadav casts his vote at a polling booth in Etah, Uttar PradeshBJP has fielded Rajveer Singh, the son of former Uttar Pradesh CM and BJP leader Kalyan Singh from the Etah Lok Sabha constituency. He is pitted against SP's Devesh Shakya and BSP's Mohammad… pic.twitter.com/8e3f1zIdAu— ANI (@ANI) May 7, 2024 మధ్య ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు  ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.భోపాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి  పోలింగ్‌ కేంద్రంలో  బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్‌ యాదవ్‌ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ  ట్వీట్‌..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024  లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర,  కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్   ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23  దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్‌ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్‌ షా(గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్‌ మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), ఎస్పీ సింగ్‌ బఘేల్‌(ఆగ్రా)మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(విదిశ), దిగ్విజయ్‌సింగ్‌(రాజ్‌గఢ్‌), ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్‌ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్‌ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్‌ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈరోజు పోలింగ్‌ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్‌ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్‌ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్‌ 4న చేపడతారు.రాష్ట్రం               సీట్లుగుజరాత్‌           25కర్ణాటక             14మహారాష్ట్ర          11ఉత్తరప్రదేశ్‌         10మధ్యప్రదేశ్‌          9ఛత్తీస్‌గఢ్‌            7బిహార్‌                5అస్సాం               4బెంగాల్‌              4గోవా                  2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్‌        2 

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి  ప్రచారం చేస్తున్న వైస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్‌ మోషన్‌ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన  కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు  బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న‌ సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు ఈసీ బ్రేక్‌మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన‌ బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420..  అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్‌సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్‌సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు  ⁠ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు⁠తనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్‌ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్‌లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో ప్రచారంవిశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్‌లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్‌  ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని  ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 

Ksr Comments On AP Power Projects
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను  తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్‌ఈజెడ్‌లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్‌ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్‌పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్‌కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Actress Ileana Comments On Telugu Movie Chances
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా

కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్‌' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్‌ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్‌ ఏంటో తెలుసా..?)దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్‌ టోలన్‌ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది.  తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

IPL 2024 MI VS SRH: Jasprit Bumrah Son Angad Makes First Public Appearance, Photos Go Viral
తండ్రిని ఎంకరేజ్‌ చేసేందుకు వచ్చిన జూనియర్‌ బుమ్రా..!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్‌ వర్మ (37 నాటౌట్‌) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్‌లో స్కైకు ఇది రెండో సెంచరీ. Angad bumrah is here !!! So cute ,,#MIvSRH #bumrah #RohitSharma @Jaspritbumrah93 pic.twitter.com/EzxEdHwRPI— Randhir_45 (@Mr_Randhir_45) May 6, 2024ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు హార్దిక్‌ పాండ్యా (4-0-31-3), పియూశ్‌ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‌కు ఎగబాకింది. ఈ సీజన్‌లో ముంబై మరో రెండు మ్యాచ్‌లు (మే 11న కేకేఆర్‌తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్‌గా ఇంకా ఔట్‌ కాలేదు. ఏదైనా మహాద్భుతం​ జరిగితే తప్ప ముంబై ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.జూనియర్‌ బుమ్రా వచ్చాడు..ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్‌ బుమ్రా. అంగద్‌.. తన తల్లి సంజనా గణేశన్‌తో కలిసి తన తండ్రి జస్ప్రీత్‌ బుమ్రాను ఎంకరేజ్‌ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. వీఐపీ స్టాండ్స్‌లో సంజనా.. అంగద్‌ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్‌ తొలిసారి పబ్లిక్‌లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్‌ ముంబై ఇండియన్స్‌ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జూనియర్‌ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్‌ శర్మ (11) వికెట్‌ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్‌ నిన్నటి మ్యాచ్‌ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు. 

Alia Bhatt Embraced 'The Garden Of Time' In Custom Sabyasachi Saree
మెట్‌ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్‌! ఏకంగా 163 మంది..

మెట్‌ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో ఒకటి. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో రెండోసారి బాలీవుడ్‌ భామ అలియా భట్‌ రెడ్​కార్పెట్​పై మెరిసింది. భారతీయ సంస్కృతిని చాటేలా ప్రత్యేకమైన సబ్యసాచీ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా కెమెరాల అటెన్షన్‌ ఆమె ధరించిన చీరవైపే దృష్టిసారించాయి. ఈ చీరను గ్లాస్‌ బీడింగ్‌, రత్నాలతో చేతి ఎంబ్రాయిడరీతో డిజైన చేశారు. పుదీనా ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ చీరలో అలియా అందర్నీ మిస్మరైజ్‌ చేసింది. ముఖ్యంగా పొడవాటి కొంగు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.ఎవరు డిజైన్‌ చేశారంటే..అలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. ఈ ఏడాది మెట్ గాలా 2024 "గార్డెన్ ఆఫ్ టైమ్" అనే థీమ్‌కు సరిపోయేలా భారతీయ సంస్కృతిని చాటేలా అలియా చీరను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. పైగా చీర కంటే గొప్ప డిజైనర్‌వేర్‌ లేదని తన వేషధారణతో చెప్పకనే చెప్పింది. అంతేగాదు ఈ శారీకి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా ఉండటమే గాక, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది.alia bhatt wearing a custom sabyasachi saree for the met gala 2024 — it is detailed with florals delicately hand embroidered! 💕 pic.twitter.com/zhvM2RdgKV— ☁️ (@softiealiaa) May 7, 2024ఈ చీరను ఏకంగా 163 మంది..అలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్‌ను కవర్ చేసిందంటే..ఈ చీర ఎంత పెద్దగా ఉందో చెప్పొచ్చు. ఈ ఈవెంట్‌లో మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్‌లలో కనిపిస్తే.. అలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి. అభిమానులు సైతం అద్భుతంగా ఉన్నావంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ చీర వెనుక ఏకంగా163 మంది చేతి కళాకారుల శ్రమ ఉంది. వాళ్లంతా దాదాపు  గంటలు శ్రమించి ఆ చీరను ఇంత అందంగా ఆ వేడకలోని థీమ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. దీన్ని ఇటలీలో తయారు చేశారట. ఈ మెగా మెట్‌ గాలా ఈవెంట్‌లో ఆరుగజాల అందమైన చీరతో అక్కడున్నవారందరీ మనుసులను గెలుచుకుంది అలియా. you are KIDDING me ALIA BHATT!!!!! pic.twitter.com/UNGe9Wu4Gd— kp (@earthlykisssed) May 7, 2024(చదవండి: సమ్మర్‌లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి! 

This is the story behind Raghu Ramakrishna Raju Assembly seat
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు

స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే..  సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్‌ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు.  సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్‌ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు.  గెలుపు కోసం ఆపసోపాలు  గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్‌మెంట్‌ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం.  అసమ్మతి సెగలు  టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్‌రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్‌ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్‌లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్‌ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Bombay High Court granted bail to Jet Airways founder Naresh Goyal for two months
నరేష్‌ గోయెల్‌కు బెయిల్‌ మంజూరు.. ఏం జరిగిందంటే..

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్‌ చేయాలని తెలిపింది.నరేశ్‌ గోయెల్‌ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్‌ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్‌ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్‌ చికిత్స గడువును పొడిగిస్తే  ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్‌ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్‌..! కారణం..జెట్‌ ఎయిర్‌వేస్‌ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్‌ ఇచ్చారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all