Top Stories
ప్రధాన వార్తలు
వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను కిందపడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీవారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో, లేదో కానీ, దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దదిగా కనిపిస్తుంది.ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్ కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ కు దగ్గరకు చేరడం, దానిని ఆయన ఎడిట్ చేసి తమకు అనుకూలమైన మేర ఎన్నికల కమిషన్ కు పంపడం, వెంటనే కమిషన్ స్పందించడం.. ఇవన్ని చూస్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్లిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ ను విచారిస్తారా? లేదా? అనేది చూడాలి.మే పదమూడో తేదీన జరిగిన ఈ ఘటన వీడియో ఎనిమిది రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియోలు లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా? కాదా? అనే దానిని దృవీకకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్ పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీలు జత కట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లితే కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా? లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందా? అనే సందేహాలు వచ్చే అవకాశం ఉంది.ఈవీఎంలను కిందపడేసి పాడు చేసే యత్నాలకు సంబంధించి అనే ఈ వీడియోలను ఈసీ అధికారికంగా విడుదల చేసి ఉండవచ్చు. అప్పుడు ఎమ్మెల్యే అయినా, మరొకరు అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా సెలెక్టివ్ గా వీడియో లీక్ కావడంలో ఆంత్యర్యం ఏమిటి? దానిని ఎవరైనా ఈసీ వర్గాల నుంచి తస్కరించి బయటపెట్టారా? లేక అధికారులు ఎవరైనా లీక్ చేశారా? లేదా పిన్నెల్లి లాయర్ అనుమానించినట్లు అదేమైనా ఫేక్ వీడియోనా? అనేది తేలాలి.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబందిత పాల్వాయి గ్రామం వద్ద టీడీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు శ్రద్ద చూపలేదట. ఈసీకి ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా చర్య తీసుకోలేదు. అక్కడ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా తరిమేసి దొంగ ఓట్లను వేయించుకోవడం, బలహీనవర్గాలవారిని ఓటింగ్ కు రాకుండా భయపెట్టడం వంటి సంఘటనలు ఏమి చెబుతాయి! ఆ సమాచారం తెలిసిన పిన్నెల్లి అక్కడకు వెళ్లి ఆవేశపడి ఉండవచ్చు. కానీ దానివల్ల ఈవీఎం. ఏమీ పాడుకాలేదు. అక్కడ రీపోలింగ్ కూడా అధికారులు పెట్టలేదు. అలాంటటప్పుడు ఈవీఎం ద్వంసం అని ప్రచారం చేయడం అర్దరహితం. టీడీపీ వారు కూడా ఇలాగే మరో ఆరేడు, చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు.ఆ ఘటనలలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై మాత్రం విపరీత ద్వేషపూరిత ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ద్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలన్నిటిని బహిరంగపరచి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ ను కొట్టి బయటకు లాగడం, తదితర దృశ్యాలను కూడా విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి.తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీ పై ఆరోపణలు చేస్తూ సిఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించి ఇంటెలెజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీలు లేదని నానా రచ్చ చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఫలానా అధికారి కావాలని కానీ, ఫలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు.చంద్రబాబు మాదిరి గొడవలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా ఏదైనా అవసరం వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటకాగడానికి విశ్వయత్నం చేసింది అందరికి అర్ధం అయిపోతోంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్టు అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్లు భ్రీఫ్ డ్ మి అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ముప్పైసార్లు చార్జీషీట్ లో చంద్రబాబు పేరు వచ్చినా, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దానిని అంతటిని కుట్రగా ప్రచారం చేశారే కానీ, జరిగింది తప్పు అని చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.అదే కాదు. కొద్ది నెలల క్రితం పుంగనూరు, అంగళ్లు వద్ద జరిగిన గొడవలలో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి.. కొట్టండి.. అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే, అదంతా పోలీసుల తప్పు గా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. పుంగనూరులో అయితే చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేయడం, రాళ్లు విసరడం చేస్తే ఒక పోలీస్ కానీస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. అయినా ఈనాడు మీడియా పోలీసులదే తప్పన్నట్లు, టీడీపీ నేతలను అరెస్టు చేయడం అక్రమం అనేట్లుగా దారుణ ప్రచారం చేసింది.ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇవన్ని ఉదాహరణలే. అలాగే ఇతర చోట్ల ఈవీఎం లను కింద పడేస్తే టీడీపీ వారిపై పెట్టిన కేసులకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసుల సెక్షన్లకు చాలా తేడా ఉందట. ఎమ్మెల్యేపై అతి కఠినమైన సెక్షన్లు పెట్టడం కూడా కుట్రగానే చూస్తున్నారు. హైకోర్టు ఈ కేసులో తాత్కాలిక స్టే ఇచ్చింది. అది వేరే విషయం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడకపోలేదు. ఉదాహరణకు గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే బాంబుల శివారెడ్డిగా పేరొందారు. వేరేప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో బూత్‌ల వద్ద బాంబులు విసిరారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి బాక్స్‌లలో నీళ్లు పోశారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన మద్దతుదారుడు ఒకరు ఏకంగా ఒక ఈవీఎం నే అపహరించుకుని వచ్చారన్న కేసు నమోదు అయింది.గతంలో 1999 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రముఖ నేత కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణిస్తే, ఆయనపై కేసు విచారణే జరగకుండా చంద్రబాబు అప్పటి కేంద్ర హోం మంత్రి అద్వాని ద్వారా మేనేజ్ చేయగలిగారు అప్పుడు ఆ కేసును బీజేపీ సహకారంతో కప్పిపుచ్చగలిగారు. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చికాకు సృష్టిస్తున్నారు. తమకు కావల్సిన పోలీసు అదికారులను ఈసీ ద్వారా పోస్టు చేయించుకుని గందరగోళం చేస్తున్నారు. ఈసీ ఇంతగా దిగజారిపోవడం ఇటీవలికాలంలో ఇదే అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో అనేకం జరిగినా, బలహీనవర్గాలవారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పు అయినా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటు అయింది.దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిదికాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంతదూరం అయినా వెళ్లి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్ధిపై పలు కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం జరుగుతోంది. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూత్‌ల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుందీ కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాలలో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీవారి అరాచకాలపైన అనే సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీనవర్గాలవారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందినవారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ముకాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్దం చేసుకోవచ్చు.పిన్నెల్లి పరార్ అనే బ్యానర్ కథనాలు రాసే ఈ పెద్దలు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పీఎస్ గా ఉన్న వ్యక్తి విచారణకు హాజరుకాకుండా అమెరికాకు పరారైతే మాత్రం సమర్థిస్తూ వార్తలు ఇస్తారు. చంద్రబాబుపై అవినీతి కేసు వస్తే నిర్లజ్జగా అది అక్రమ కేసు అని డబాయించడానికి రామోజీరావు బృందం చేసిన ప్రయత్నం చూశాక, వారు ఇంతేలే అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. ఆ రోజుల్లో చంద్రబాబును అరెస్టు చేస్తారా అని గగ్గోలు పెట్టిన ఈనాడు అర్జంట్ గా పిన్నెల్లిని తీసుకువెళ్లి జైలులో పెట్టాలని, ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని వీరే తీర్పు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో బెయిల్ పొందేవరకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తప్పుడు వార్తలు రాసిన ఈనాడు రామోజీరావు నుంచి ఇంతకన్నా ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని ఆశించడం తప్పే అనుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు.
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్‌టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
SRH: ఒక్క విభాగంలో బాగుంటే సరిపోదు.. అది డేంజరస్ టీమ్: గంభీర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల గురించి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్ఆర్హెచ్లో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని.. జట్టు విజయాల్లో వారి పాత్ర కూడా కీలకమేనని పేర్కొన్నాడు.కాగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడుతుందా అన్నట్లుగా పేలవంగా ఆడిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో మాత్రం దుమ్ములేపుతోంది. జూలు విదిల్చిన సింహంలా పరుగుల వేట మొదలుపెట్టి అద్భుత విజయాలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా దంచికొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు.ఇక లీగ్ దశలో సన్‌రైజర్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. కానీ కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది.అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా 159 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లు కూడా తేలిపోవడంతో కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు,స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్లు సాధిస్తున్న కారణంగా వారి బ్యాటింగ్ లైనప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వారి బౌలింగ్ లైనప్ కూడా అంతే విధ్వంసకరంగా ఉంది.కేవలం ఒక్క విభాగంలో రాణించినంత మాత్రాన ఐపీఎల్లో ఏ జట్టూ రాణించలేదు’’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమని.. తమదైన రోజున ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో వాళ్లు ఎల్లప్పటికీ ప్రమాదకారులుగానే ఉంటారని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న కేకేఆర్ ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26 న ఫైనల్లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది.చదవండి: నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య దీపిక భావోద్వేగం
సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పార్టీ నాయకత్వానికి ముందు చెప్పడంలేదా? తానే పీసీసీ చీఫ్ కావడంతో పార్టీకి చెప్పక్కర్లేదని రేవంత్ అనుకుంటున్నారా? సమాచారం తెలియకే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారా? పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెరగడానికి కారణం ఏంటి? గత కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందు కనీసం పార్టీలో సీనియర్లతో అయినా చర్చించరా అంటూ అవేదన వెళ్ళగక్కుతున్నారు. ఏ అంశం మీదైనా ప్రభుత్వం సడెన్‌గా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గుడ్డిగా సమర్దించాలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట సదరు సీనియర్ నేతలు.కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చినట్లుగా అవుతోంది. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా బదులివ్వాలి కదా అని ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అనడంతో.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మాకు ముందుగా చెబుతున్నారా అని సీఎంఓ కార్యాలయంలోని ఆ నేతను ప్రశ్నించారట సీనియర్లు. మూడు రోజుల క్రితం సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడంతో, దొడ్డు వడ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్నస్థాయిలో కౌంటర్స్ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకు మాట్లాడటంలేదని అడిగితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేముందు మాకు కనీస సమాచారం అయినా ఇస్తే.. దాని వల్ల తలెత్తే ఇబ్బందులను అంచనా వేసుకుని ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధం అవుతాం కదా అని రివర్స్ అవుతున్నారట కొందరు సీనియర్ వరి ధాన్యం కొనుగోలు విషయం మాత్రమే కాదు, రైతు బంధు, కరెంటు వంటి పలు విషయాలలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలను కౌంటర్ చేయడానికి తమకు సమాచారం ఇచ్చేవారే లేరని పార్టీ నాయకులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే సీఎం కావడంతో ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు సీఎం రేవంత్‌ను కలవడానికి అవకాశం లేకుండాపోతోంది. దీంతో విపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తోచక, తమకు ఎందుకులే అనుకుని కొందరు నేతలు సైలెంట్ అవుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఎవరైనా సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే సీఎంకు సలహా ఇచ్చారట. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం సహజంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కాని టీ.కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి ఓ నేత ఉండేవారు. ఏదైనా అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందో లేక తర్వాతో..పార్టీ తీసుకోవాల్సిన లైన్‌పై నాయకులకు క్లియర్‌గా వివరించేవారు. అయితే ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసేందుకు సీఎం రేవంత్‌కు సన్నిహతుడైన ఓ కీలక నేతకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయనకే సమన్వయం బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బలపడుతున్న రెమాల్ తుఫాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫానుకు 'రెమాల్'గా నామకరణం చేశారు. ఈ తుఫాను ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్ తీరం దాతుతుందని సమాచారం.రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుందని, దీంతో బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్యకారులు ఎవరూ సముద్రం మీద వెళ్లకూడదని వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పెద్దగా ఉండకపోవచ్చు.పశ్చిమబెంగాల్లో జూన్ 1 చివరి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపైన తుఫాను ప్రభావం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తుఫాను నేపధ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చెయ్యాలని ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. కోల్‌కతా, హౌరా, నదియా మొదలైన ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే సూచనలు ఉండటం వల్ల ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు.
TG: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంజూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లుజులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపుజులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ఆగస్టు 5న తుది విడత సీట్ల కేటాయింపుఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ..తెలంగాణలో రెండు విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ జరగనుంది.జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంజూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లుజూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపుజులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లుజులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు పాలిసెట్‌లోనూ ఇంటర్నల్ స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఉంటుంది. జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదలవుతాయి.
హానీట్రాప్‌లో బంగ్లాదేశ్ ఎంపీ.. హత్యకు రూ.5 కోట్ల సుపారీ
బంగ్లాదేశ్‌లో అధికార షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. చికిత్స కోసం మే12న అనర్ భారత్కుచ్చిన ఆయన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో తన స్నేహితులు గోపాల్ బిస్వాస్‌తో కలిసి ఉంటున్నారు. అనంతరంఅనర్ కనిపించకుండా పోయిన మే 14న.. దారుణ హత్యకు గురయ్యారు. న్యూటౌన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గుర్తుపట్టని స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.కాగా 56 ఏళ్ల అజీమ్‌ను హంతకులు ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం వ్యక్తిని గుర్తుపట్టకుండా చేసేందుకు మాంసం, ఎముకలు, చర్మాన్ని వేరుచేసి శరీరాన్ని ముక్కలుగా చేశారు. శరీర భాగాలన్నింటిని ప్లాస్టిక్ సంచుల్లో వేర్వేరుగా ప్యాకింగ్‌చేసి ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లు తేలింది. తర్వాత కోల్‌కతా అంతటా పడేసిననట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముక్కలు చేసిన భాగాలను ఎక్కడెక్కడ పడేశారన్న విషయం తెలియరాలేదు.ఈ కేసును పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు, బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఎంపీని ఆయన పాత స్నేహితుడే రూ. 5 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేష్‌లో ఉంటున్న అమెరికా పౌరసత్వం ఉన్న జీహాద్ హవ్లాదార్.. మరికొందరు కలిసి ఎంపీని అంతమొందించినట్లు తేలింది. కోల్‌కతా శివారులోని న్యూ టౌన్ ప్రాంతంలో అజీమ్ చివరిసారిగా కనిపించిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఆయన స్నేహితుడే అద్దెకు తీసుకున్నాడు. జీహాద్ హవ్లాదా్ర్ను శుక్రవారం ఉదయం కల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు అన్వర్‌ను చంపడానికి గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హంతకుల్లో ఒకరితో పరిచయం ఉన్న శిలాస్తి రెహమాన్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెనే బంగ్లాదేష్ ఎంపీని హానీ-ట్రాప్ చేసి హత్య చేసేందుకు హంతకులకుసహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో ఎంపీ హనీ ట్రాప్‌లో పడినట్లు తేలింది. అతడిని మహిళ ప్రలోభపెట్టి ఫ్లాట్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీలో మహిళతో అనర్ ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు కనిపించింది.ఇక హంతకుల్లో ఒకరైన యూఎస్ పౌరుడు అఖ్తరుజ్జమాన్‌కు, శిలాస్తి రెహమాన్‌కు పరిచయం ఉన్నట్లు తేలింది. ఇతడే ఎంపీని చంపేదుకు నిందితులకు రూ. 5 కోట్లు చెల్లించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖ్తరుజ్జమాన్ పరారిలో ఉన్నారు. అతడు అమెరికాలో ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
మొదటిసారి భారత్‌కు రానున్న యూకే కంపెనీ.. తగ్గనున్న ఈ కార్ల ధరలు
యూకే వాహన తయారీ సంస్థ 'ల్యాండ్ రోవర్' మొదటిసారి భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల తయారీని ప్రారంభించనుంది. కంపెనీ యూకే వెలుపల తన వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. భారతదేశం బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్ కావడంతోనే సంస్థ ఈ డెసిషన్ తీసుకుంది.రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కోసం ఒక కొత్త అసెంబ్లింగ్ లైన్ మహారాష్ట్రలోని పూణేలోని టాటా మోటార్స్ తయారీ కేంద్రంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో ఏటా రెండు షిఫ్టులలో 10,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రేంజ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 160 శాతం పెరిగాయి. అంటే భారతీయులు రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి భారత్ ఒక ప్రధానమైన మార్కెట్ అని రేంజ్ రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ గెరాల్డిన్ ఇంఘమ్ పేర్కొన్నారు.భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు స్థానికంగా తయారైన తరువాత ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇవి రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
పిల్లలు వద్దని కండీషన్ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: కవిత
బాల్యంలోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది కవిత. అప్పటినుంచే యాక్టింగ్ ఆమెను అక్కున చేర్చుకుంది. సిరిసిరిమువ్వ సినిమాతో తెలుగులో తన ప్రయాణం మొదలైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించింది.ఎదురుకట్నం ఇచ్చి మరీ..నా భర్త దశరథరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. నేను హీరోయిన్గా 60 రోజులు కష్టపడి సంపాదించేంత డబ్బును ఆయన ఒక్కరోజులో ఖర్చుపెట్టేస్తాడు. అలా అని నా డబ్బు అస్సలు ముట్టుకోడు. పెళ్లి(1983లో వివాహం జరిగింది)కి ముందు నా భర్తకు ఒక కండీషన్ పెట్టాను. నేను పిల్లల్ని కననని చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నా అనుకున్నారు. పిల్లలు వద్దని..పెళ్లయ్యాక మా అత్తగారేమో త్వరగా పిల్లలు కావాలని అడిగేది. నాకు పిల్లలు వద్దమ్మా అని అమ్మతో చెప్పాను. ఎందుకని అడగ్గా.. పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా అనేశాను. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బతికాను. అతడిని మర్చిపోలేకే అలా మాట్లాడాను. దీంతో అందరూ.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయమని సూచించారు.పాప పుట్టాకే..కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయ్యాను. రోజూ తమ్ముడి ఫోటో చూస్తూ ఏడ్చేదాన్ని. అది చూసి నా భర్త నన్ను వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాడు. పాప పుట్టాకే నా జీవితం సంతోషమయమైంది. మొత్తం నాకు ముగ్గురు సంతానం. కరోనా వల్ల భర్త, కుమారుడు కన్నుమూశారు అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది.చదవండి: ఫేక్ బేబీ బంప్ అంటూ ట్రోల్స్.. గట్టిగా బుద్ధి చెప్పనున్న హీరోయిన్!
తప్పక చదవండి
- ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
- BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
- స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- కేన్స్‌లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
- విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
- మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
- 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
సినిమా
మరి ఎక్కడ తినమంటారు సార్?: టాలీవుడ్ నటుడు ఆసక్తికర ప్రశ్న
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల్లో ఇంత పెద్దఎత్తున హోటల్ యజమాన్యాలు నిర్లక్ష్యం బయటపడడంతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది.తాజాగా ఈ దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ట్వీట్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లో కుదరని సమయాల్లో ప్రముఖ రెస్టారెంట్స్‌కు వెళ్తుంటారు. ఇలా భాగ్యనగరంలో హోటల్ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఆహార ప్రియులు భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. Sirr.. Mari ekkada thinamantaru..? Intilonaaa ..? https://t.co/Vs8r0kd83A— Brahmaji (@actorbrahmaji) May 23, 2024
‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: డర్టీ ఫెల్లోనటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులునిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: జి.యస్. బాబుదర్శకత్వం: ఆడారి మూర్తి సాయిసంగీతం: డాక్టర్. సతీష్ కుమార్.పి.సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్. ఎడిటర్ : జేపీవిడుదల తేది: మే 24, 2024ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్మెంట్స్ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా యాడ్ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అయితే ప్లాష్‌బ్యాక్ సీన్లు మాత్రం కాస్త గందరగోళానికి గురి చేస్తాయి. కథ ప్రస్తుతం జరుగుతుందా లేదా ప్లాష్ బ్యాక్ చెబుతున్నారా అనేది కొన్ని చోట్ల అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్ సాంగ్... హీరోయిన్లతో రొమాన్స్ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. అయితే అతను మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనేది చూపించకుండా.. డైరెక్ట్‌గా డాన్‌గానే చూపించడంతో ఆ పాత్రకు అనవసరపు ఎలివేషన్స్ ఇచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్ మూవీ. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సిద్దు, డర్టీ ఫెల్లో పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదరగొట్టేశాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. డాక్టర్. సతీష్ కుమార్.పి సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తో పాటు మరో పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
పిల్లలు వద్దని కండీషన్ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: కవిత
బాల్యంలోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది కవిత. అప్పటినుంచే యాక్టింగ్ ఆమెను అక్కున చేర్చుకుంది. సిరిసిరిమువ్వ సినిమాతో తెలుగులో తన ప్రయాణం మొదలైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించింది.ఎదురుకట్నం ఇచ్చి మరీ..నా భర్త దశరథరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. నేను హీరోయిన్గా 60 రోజులు కష్టపడి సంపాదించేంత డబ్బును ఆయన ఒక్కరోజులో ఖర్చుపెట్టేస్తాడు. అలా అని నా డబ్బు అస్సలు ముట్టుకోడు. పెళ్లి(1983లో వివాహం జరిగింది)కి ముందు నా భర్తకు ఒక కండీషన్ పెట్టాను. నేను పిల్లల్ని కననని చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నా అనుకున్నారు. పిల్లలు వద్దని..పెళ్లయ్యాక మా అత్తగారేమో త్వరగా పిల్లలు కావాలని అడిగేది. నాకు పిల్లలు వద్దమ్మా అని అమ్మతో చెప్పాను. ఎందుకని అడగ్గా.. పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా అనేశాను. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బతికాను. అతడిని మర్చిపోలేకే అలా మాట్లాడాను. దీంతో అందరూ.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయమని సూచించారు.పాప పుట్టాకే..కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయ్యాను. రోజూ తమ్ముడి ఫోటో చూస్తూ ఏడ్చేదాన్ని. అది చూసి నా భర్త నన్ను వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాడు. పాప పుట్టాకే నా జీవితం సంతోషమయమైంది. మొత్తం నాకు ముగ్గురు సంతానం. కరోనా వల్ల భర్త, కుమారుడు కన్నుమూశారు అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది.చదవండి: ఫేక్ బేబీ బంప్ అంటూ ట్రోల్స్.. గట్టిగా బుద్ధి చెప్పనున్న హీరోయిన్!
'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్లు పూర్తి చేసుకోగా, చాలామంది నటీనటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా మూడో సీజన్లో పెద్దగా అంచనాల్లేకుండా పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన పునర్నవి.. ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: 'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్)హైదరాబాద్‌కి చెందిన పునర్నవి.. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అలా బిగ్‌బాస్ 3వ సీజన్లో ఏకంగా 11 వారాల పాటు ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె నడిపిన ప్రేమ కహానీ గురించి చాలామందికి తెలుసు. అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలామంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి.. ఆ తర్వాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. యూకేలో ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడితో ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇతడు బాయ్ ఫ్రెండ్ లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!)
ఫొటోలు
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
ఎర్ర చీరలో కుందనపు బొమ్మలాగా మెరిసిపోతున్న బేబీ భామ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
క్రీడలు
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
టీమిండియా దిగ్గజ బ్యాటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు మాజీ క్రికెటర్ అంబటి రాయుడుపై మండిపడుతున్నారు. కోహ్లిపై విద్వేష విషం చిమ్మటం ఇకనైనా మానుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభం నుంచి వరుస ఓటముల పాలైనా.. తర్వాత తిరిగి పుంజుకుని అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది ఆర్సీబీ. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో సీఎస్కేను చిత్తు చేసింది.అంబరాన్నంటిన సంబరాలుఈ క్రమంలో కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలోనూ ఆర్సీబీ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సీఎస్కేను విమర్శిస్తూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు.ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో చెన్నై ఆటగాళ్లు ఐదు అంటూ తాము ఐదుసార్లు ట్రోఫీ గెలిచామన్నట్లుగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు..సీఎస్కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లేనా?‘‘ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్టు నుంచి మీకొక రిమైండర్’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మండిపోయింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ చేరినంత మాత్రాన.. సెలబ్రేషన్స్ విషయంలో రెచ్చిపోతే ఎవరూ టైటిల్ గెలవరు. కేవలం సీఎస్కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లే అని భావించకూడదు’’ అని మరోసారి పుండు మీద కారం చల్లాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కోహ్లి ఫ్యాన్స్ అంబటి రాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 వరల్డ్‌కప్‌నకు ఎంపిక కాని కారణంగా ఇప్పుడు ఇలా కోహ్లిని, అతడి టీమ్‌ను టార్గెట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకున్న రాయుడుఅయినప్పటికీ అంబటి రాయుడు వెనక్కి తగ్గలేదు. మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకుని చివాట్లు తింటున్నాడు. తాజాగా.. ‘‘ఆర్సీబీకి మద్దతుగా ఏళ్లకు ఏళ్లుగా ఆ జట్టుతోనే ఉన్న అభిమానులను చూసి నా గుండె తరుక్కుపోతోంది.మేనేజ్మెంట్, కెప్టెన్లు కేవలం వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే ఇప్పటికే ఆర్సీబీ ఎన్నోసార్లు టైటిళ్లు గెలిచేది.ఇప్పటికైనా జట్టు ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా భావించే ఆటగాళ్లను తీసుకోవాలని మేనేజ్మెంట్పై ఒత్తిడి తీసుకురండి. అలా అయితే మెగా వేలం నుంచే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది’’ అని అంబటి రాయుడు కోహ్లి, ఆర్సీబీ ఫ్యాన్స్‌పై ఎక్స్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించాడు.కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ఇందుకు స్పందించిన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ‘‘61 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మీరు.. 80 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన కోహ్లి గురించి ఇలా మాట్లాడటం అస్సలు బాగాలేదు సర్!.. ఒక్కసారి ఐపీఎల్‌ను పక్కన పెడితే మీ కెరీర్లో మీరేం సాధించారో చెప్పండి. కోహ్లి 2011 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడు. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. రిటైర్మెంట్పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరేం చేశారు?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.చదవండి: నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య దీపిక భావోద్వేగం
టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024
చెలరేగిన విండీస్ కెప్టెన్.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో వెస్టిండీస్ తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో జమైకా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాండెన్ కింగ్(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైర్స్(34), ఛేజ్(32) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో ఫెహ్లుక్వాయో, బార్ట్‌మన్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. కొయిట్జీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(87) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటకి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. కరేబియన్ బౌలర్లలో ఫోర్డే, మోటీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మెకాయ్ రెండు, ఛేజ్, జోషఫ్ చెరో వికెట్ సాధించారు.
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024
బిజినెస్
టెస్లా కొనుగోలు దారులకు మస్క్ అనూహ్య ఆఫర్
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ బంపరాఫర్ ప్రకటించారు. టెస్లా ‘మోడల్ వై’ (Model Y) కొనుగోలు దారులకు 0.99శాతం ఏపీఆర్(యాన్యువల్ పర్సెంటేజ్ రేట్) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ మే 31వరకు కొనసాగుతుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల నుంచి పోటీ, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు టెస్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.ఈ తరుణంలో టెస్లా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో టెస్లా మోడల్ వైపై మోడల్ వై భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వాహనదారులు జీరో పర్సెంట్ వడ్డీతో టెస్లా కారును కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించారు. దీంతో వడ్డీ చెల్లించే అవసరం లేకుండా టెస్లా కారును సొంతం చేసుకోవచ్చు.తాజాగా, అమెరికాలో మోడల్ వైపై 0.99% ఫైనాన్సింగ్‌తో భారీ తగ్గింపుతో పరిమిత కాల ఆఫర్‌ను అందిస్తున్నట్లు టెస్లా అధికారికంగా తెలిపింది. సాధారణంగా ఈ వడ్డీ 5 నుండి 7శాతం వరకు ఉంటుంది. కానీ మస్క్ వాహన కొనుగోలు దారులకు 0.99 శాతం వడ్డీకే టెస్లా వై మోడల్ కారును అందిస్తున్నారు. టెస్లా వెబ్సైట్ ప్రకారం, నిబంధనల మేరకు టెస్లా మోడల్ వై కొనుగులు దారులు 4,250వేల డాలర్లు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 72 నెలల టెన్యూర్ ఫైనాన్స్ అందిస్తుంది. ఎలాంటి బెన్ఫిట్ లేకుండా నెలకు 603 డాలర్ల ఈఎంఐ చెల్లించాలి. అర్హతగల కొనుగోలుదారులు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కేవలం 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్‌లోని మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను కనుగొంది’ అన్నారు.ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖడాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది.
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పారిస్‌లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్లో మస్క్ రిమోట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు.
హిండెన్‌బర్గ్‌ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
వీడియోలు
కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు
జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..
టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్
Viral Video: భళీ..భళీరా..భళీ
బాబూ.. ప్ట్.. నాలుగు సీట్లేనా! విజయసాయిరెడ్డి సెటైర్లు
చంద్రబాబుపై పునూరు గౌతమ్ రెడ్డి సెటైర్లు
రేవంత్ ఓ జోకర్
కొల్లాపూర్ ఘటనపై జూపల్లి రియాక్షన్
కవిత బెయిల్ పై ఉత్కంఠ
జూన్ 4 తరువాత ఎక్కడివాళ్ళు అక్కడే.. బాబు, పవన్ పై గౌతమ్ రెడ్డి కామెంట్స్
ఫ్యామిలీ
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?)
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
గతంలో చనిపోయిన మనిషి శరీరం వ్యర్థం ఎందుకూ పనికిరాదు అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుతం అలా కాదు. చనిపోయిన (నిబంధనల ప్రకారం) వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణ దానం చేయవచ్చు. లేదంటే మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు నిమిత్తం దానం చేయవచ్చు. తాజాగా ఒక సంస్థ మానవుల మలాన్ని దానం చేయాలని కోరుతోంది. ఇందుకు వారికి కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది షాకింగ్‌గా అనిపించినా, మీరు చదివింది నిజమే. ఎందుకో తెలుసుకోవాలటే ఈ కథనాన్ని చదవాల్సిందే.అమెరికా, కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే సంస్థ వైద్య పరిశోధనలు, ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయిత ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది.మానవ మలాన్ని కంపెనీ ఏమి చేస్తుంది?ఆరోగ్యకరమైన, కలుషితంకానీ, వ్యాధి-నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారినుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాదిరకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారి తీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.There's a man currently paying $500 per 💩 sample on a hunt to try and find the "0.1% of people with healthy, unperturbed, disease-resistant microbiomes". He's screened over 1 million people and still hasn't found what he's looking for. https://t.co/xyEyL1NXcp https://t.co/9Rt2hZdYzI pic.twitter.com/m0ZXQB7kcR— Katherine Champagne (@keccers) March 18, 2024 ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తోంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్ల ఒక్కో శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తారు. రోజూ మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు 180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) చెల్లించనుంది. అయితే దాదాపు 10లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1 శాతం కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది, తద్వారా వారు ఈ "అధిక నాణ్యత గల మలం దాతలను" పరిశోధకులతో కనెక్ట్ చేస్తుంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ ,వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్ ప్రకారం, సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే, సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయనీ, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తర తరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయోమ్ పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1 శాతం మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు, వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్లో ఉన్న ఒక వీడియోలో “స్టూల్ డోనార్” కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరినైనా కాపాడవచ్చని వివరించింది. అలాగే సెలక్ట్ అయిన డోనార్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్‌కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్‌నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు.
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.