Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Modi Cabinet 2024:  all eyes now on portfolio allocation
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్‌!

న్యూఢిల్లీ, సాక్షి: కేం‍ద్రంలో కొత్త కేబినెట్‌ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క​ ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్‌ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ మీద తొలి కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్‌ చేశాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్‌ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్‌లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం.

YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumour
వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు

ఎఎస్సార్‌, సాక్షి: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్‌ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

JK Bus Attack: NIA to probe massive hunt for terrorists
జమ్ము కశ్మీర్‌: డ్రోన్‌ల సాయంతో ఎన్‌ఐఏ ‘ఉగ్ర’ వేట

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్​లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్​ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్​కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్​లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్​లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు.

Union Minister Kishan Reddy Reacts On AP Political Attacks
ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్‌

న్యూఢిల్లీ, సాక్షి: ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైక బీజేపీ సీనియర్‌, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైనా సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు. ‘‘ఎన్నికలైపోయాయి, ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం. పేద ప్రజలకు కోట్లాది ఇల్లు నిర్మిస్తాం. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు’’ అని విమర్శించారాయన. .. రాబోయే రోజుల్లో తెలంగాణలో 88 సీట్లు టార్గెట్‌గా పని చేస్తామని, తెలంగాణలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారాయన. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా .. తెలివి తక్కువగా మాట్లాడుతోంది. మాకు బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బదిలీ అయ్యాయి’’ అని అన్నారు. ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం’’ అని కేనంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Imad Wasim Accused Of Deliberately Wasting Balls Defeat vs India T20 WC 2024
కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్‌ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్‌పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన మరోసారి పాక్‌ను విజయానికి దూరం చేసింది.చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. భారత్‌ను 119 పరుగులకే కట్టడి చేసింది.నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్‌ రెండు, షాహిన్‌ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్‌ చేస్తూ.. పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.ఉద్దేశపూర్వకంగానే?ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్‌కు ఇ‍న్నింగ్స్‌ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్‌ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్‌ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇమాద్‌ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’‌ మ్యాజిక్‌కు చిత్తై చెత్త స్ట్రైక్‌రేటు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌ ఇమాద్‌ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్‌ ఇన్నింగ్స్‌ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్‌ విమర్శించాడు.‌ చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్‌ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc)

emmanuel Macron Dissolves Parliament Calls Snap Election On June 30
ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్‌ యూనియన్‌(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్‌ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్‌ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్‌ రెనాయిసెన్స్‌ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్‌ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్‌ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్‌ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్‌ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్‌ ప్రజలపై ఉ‍న్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అ‍న్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్‌ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది.

Video Of Locals In US Enjoying Pani Puri Goes Viral Internet Reacts
మినిమం 30.. తగ్గేదేలే..! ఇది కదా పానీ పూరీ మజా....వీడియో వైరల్‌

భారతదేశంలో అత్యంత ఇష్టమైన,అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్‌ ఫుడ్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పానీ పూరీ. ఖట్టా-మీఠా ఇలా వివిధ రకాల రుచులు, స్టఫ్ఫింగ్స్‌తో .. అసలు ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్‌ చాలామందికి. అలాంటి పానీ పూరీ తాజాగా, అమెరికావాసులను కూడా ఫిదా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Curry Corner (@currycornermn) మిన్నియాపాలిస్‌ వాసులు అక్కడి భారతీయ రెస్టారెంట్ , కర్రీ కార్నర్‌ వద్ద పానీ పూరీ తెగ లాగించేస్తూ మురిసిపోతున్నారు. ‘ఆహా తినరా మై మైరచి అంటున్నారు. మరికొందరైతే మాటల్లేవు.. అంటూ పానీ పూరీని ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. పానీపూరి ప్యూర్‌ లవ్‌ అని అని ఒక ఇన్‌స్టా యూజర్‌ కామెంట్‌ చేశాడు. మినిమం 30 పూరీలు ఏగబిగిన లాగించేయాల్సిందే.. 20కి పైగా పానీ పూరీలు తింటూ ఉంటే.. అలా కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోతే ఉంటే అప్పుడు గానీ పానీ పూరీ తినడంలోని మజా అర్థం కాదు.. ఇలా పలు కామెంట్లు సందడి చేస్తున్నాయి. పాపులర్‌ పానీ పూరీని మిన్నియాపాలిస్ వాసులకు పరిచయం చేశాము అంటూ సదరు రెస్టారెంట్ ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్‌ చేసిన ఈ రీల్‌ ఏకంగా 3.9 మిలియన్ల వీక్షణలు, 90వేలకు పైగా లైక్స్‌ సాధించింది.

BalaKrishna Daughter Produces A Movie With Boyapati
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్‌ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్‌ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్‌ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్‌, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ చేశాడు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋Happy Birthday Balayya Babu ❤️‍🔥Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️Presented by… pic.twitter.com/Oj9b1j9bvS— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024

apple starts world wide conference facts about apple co
రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!

ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్‌ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమం సోమవారం (జూన్ 10) నుంచి జరగనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్‌ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ ఐప్యాడ్‌లో వినియోగిస్తున్న రెటీనా డిస్‌ప్లేను శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తోంది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్‌ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్‌ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్‌ విలువ 35 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్‌ డాలర్‌(ప్రస్తుతం రూ.83).

AP New Cabinet 2024: Pawan Kalyan Really Demand For Deputy CM
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్‌?!

విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్‌లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్‌ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్‌ కోసం పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్‌ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్‌ ఈ మాట అన్నారని సదరు వెబ్‌సైట్‌ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్‌ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్‌ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్‌ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement