Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule At Repalle
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న(సోమవారం) మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

KSR Comment On Amit Shah AP Election Campaign Speeches
అందుకేనా అమిత్‌ షా అలా మాట్లాడింది!

ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజకీయ నేతలు ఎంతటి గొప్ప నటులో అర్ధం చేసుకునే సన్నివేశం అని చెప్పాలి. ఈ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్ లు రద్దు చేస్తారంటూ చెప్పిన నకిలీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు స్పందించి కొంతమందిని అరెస్టు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు  ఉన్నారు. ఇది మంచి విషయమే.తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా ఎన్నికలలో గెలవాలని దష్ట తలంపుతో ఉన్నవారికి ఇది గుణపాఠమే అవుతుంది. ఇంతవరకు ఓకే. కానీ.. అదే కేంద్ర మంత్రి పక్కన అలాంటి కేసులో ఉన్న ఒక వ్యక్తి నిలబడితే.. ఆ వ్యక్తిని ఆ మంత్రి పొగుడుతుంటే ఏమని అనాలి? ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్య లోపమా? లేక వ్యక్తులలో నిజాయితీ,నిబద్దత లేనితనమా ?అంటే ఏమి చెబుదాం. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక ఐవీఆర్ఎస్ ద్వారా లక్షల మందికి తప్పుడు సమాచారాన్ని పంపించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడుగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన తనయుడు లోకేష్ రెండో నిందితుడుగా ఉన్నారు. వీరిద్దరూ కాకుండా ఇంకో పది మందిపై కూడా కేసు నమోదైంది. ఇది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ పెట్టిన కేసే. హోం మంత్రి అమిత్ షా పై తప్పుడు వీడియో సృష్టిస్తే  దేశవ్యాప్తంగా  హడావుడి చేసి కొందరిని ఇప్పటికే అరెస్టు చేస్తే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు ఫోన్ కాల్ సృష్టించి ప్రచారం చేసినట్లు  అభియోగాలు ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు కేంద్ర  హోం మంత్రి పక్కన ఎలా ప్రచారంలో పాల్గొనగలుగుతారు. ఆ తదుపరి సాయంత్రానికే ఏపీ డీజీపీని బదిలీ చేయడం జరిగింది. అంటే.. ఏమిటి అర్ధం?.అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసినవారు జైలకు వెళతారు. అదే ఏపీ ముఖ్యమంత్రి పై తప్పుడు ఆడియోలు సృష్టిస్తే ,నిందితులపై కేసు నమోదు చేస్తే.. ఏకంగా డీజీపీనే బదిలీ అవుతారు.  కూటమి నేతలు చంద్రబాబు,పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఒత్తిడికి లొంగే వారు డీజీపీని బదిలీ చేశారని జనం అనుకోరా?. ఇది డబుల్ స్టాండర్స్ కాదా? అంటే ఏమి చెబుతాం.విశేషం ఏమిటంటే ఆ చంద్రబాబు నాయుడుకు అమిత్ షా సర్టిఫికెట్ ఇవ్వడం. ఆయన వచ్చి జగన్ పై విమర్శలు చేయడం. 2019 ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షాపై రాళ్లదాడి చేసి అవమానించారు. దేశ ప్రధాని మోదీని ఏకంగా టెర్రరిస్టు, మంచివాడు కాదు.. అసలు మోడీ దేశంలో ఉండడానికే తగడు అని దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిద్దరి సరసన దర్జాగా కూర్చోగలుగుతున్నారు. ఈ ఘట్టాలలో ఎవరు కరెక్టు అనుకోవాలి?. చంద్రబాబు ఏమైనా తన ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు ,క్షమాపణ కోరినట్లు తెలిపారా?.. అంటే అదేమీ లేదు. మరి దేనికి చంద్రబాబు వారి వద్దకు వెళ్లి బతిమలాడుకున్నారు. బీజేపీవారు ఎందుకు లొంగిపోయారు అంటే.. అదే బ్రహ్మ రహస్యం.  పోలవరం ప్రాజెక్టు గురించి అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారు.అంటే వేరే వారు వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారా? ఏపీలో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీతో జతకట్టామని అమిత్ షా చెబితే నమ్మడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు. 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత ఎన్ని రకాలుగా చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించారో  తెలియదా?. ఇప్పుడు వచ్చి కొత్త కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు?.  గత ఐదేళ్లలో ఏపీలో ఉన్న ప్రశాంతత మరెక్కడైనా ఉందా?. కేవలం టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియానే ఏ చిన్న ఘటన జరిగినా.. చిలవలు, పలవలు చేసి ప్రచారం చేయడం మినహాయించి మరేయితర ఘటనలు ఏమీ జరగలేదని చెప్పాలి. అమరావతి రాజధాని చేయడానికి కూటమి కట్టామని అంటున్నారు. అప్పట్లో ఈ అమరావతి , పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడుకు ఏటీఎంలు అయ్యాయని, ప్రధాని సహా పలువురు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు బహుశా అమిత్ షా మర్చిపోయి ఉండొచ్చు. ధర్మవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అదేదో తెలుగుదేశం పార్టీవారు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా చదివినిట్లు  ఉంది తప్ప.. బీజేపీ భావజాలానికి తగ్గట్లుగా మాట్లాడినట్లు అనిపించదు.  కీలకమైన విశాఖ నగరానికి వ్యతిరేకంగా అమిత్ షాతో కూడా మాట్లాడించినట్లు అనుకోవాలా?.జగన్ పై ఏదో అవినీతి ఆరోపణలు చేయాలి కనుక చేసినట్లు ఉంది తప్ప, ఎన్నికల కోసం.. టీడీపీని సంతృప్తిపరచడం కోసం ఉపన్యసించినట్లు ఉంది తప్ప, అమిత్ షా సొంత ఆలోచనలకు తగ్గట్లు మాట్లాడలేదు. ఏపీలో అవినీతి గురించి మాట్లాడడానికి ముందు అమిత్ షా కొన్నింటికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.  2019 లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్‌ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కనుకొన్నట్లు సీబీటీడీ ప్రకటించిందా?లేదా?.. ఆ కేసు ఇంతవరకు అతీగతి లేకుండా పోయిందేమిటి?.. మోదీని, అమిత్ షా ను సంతోషపెడితే ఎంతటి కేసు అయినా హుష్ కాకి అవుతుందా?ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మనీలాండరింగ్ తదితర ఆరోపణలపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబు ఏదో దాటవేత జవాబులు ఇస్తూ తప్పించుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు కూర్చుంది?.స్కిల్ స్కామ్ తో సహా పలు కుంభకోణాలలో చంద్రబాబు పాత్ర  ఉందని కేసులు నమోదు అయితే.. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అమిత్ షా జనానికి సుద్దులు చెబుతున్నారు. చంద్రబాబు చాలా అభివృద్ది చేశారట. జగన్ వచ్చాక జరగలేదట. ఇదే మాట గతంలో ఎన్నడూ ఎందుకు చెప్పలేదు?. అప్పట్లో చంద్రబాబు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేశారే. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా వంద లేఖలు రాసి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించారే. అవన్నీ మర్చిపోయారా?..ఇవన్నీ ఎందుకు.. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మాజీ ఎంపీ సుజనా చౌదరి బిజెపి పక్షాన ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమం నుంచి పోటీచేస్తున్నారు.  వందల కోట్లకు ఎగనామం పెట్టడమే కాకుండా కొన్ని చీటింగ్ కేసులలో కూడా ఉన్న మరో మాజీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. అంతకుముందు వీళ్లు టీడీపీలో ఉన్నారు. బీజెపీలో చేరగానే వాషింగ్ మెషిన్ వేసి శుద్ది చేసేశారని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.  దేశం అంతటా ఇదే కథ నడుపుతున్న బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుకు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న నానుడి గుర్తుకు వస్తుంది.శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతాం అని కూడా షా చెప్పారు. అహా ఎంత గొప్ప మాట అండి.ఇప్పుడు తిరుమల పవిత్రతకు ఏమీ భంగం రాలేదు. బీజేపీ వాళ్లు వచ్చి ఏ చిచ్చు పెట్టకుండా ఉంటే చాలు.తెలంగాణలో రెచ్చిపోయి ముస్లిం రిజర్వేషన్  లు రద్దు చేస్తామని ప్రసంగించే అమిత్ షా.. ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తినట్లులేరు. ఏమిటి దీని భావం. ఏపీలో తెలుగుదేశం కూటమిలో ఉన్నందున ముస్లింలను మోసం చేయడానికి ఇక్కడ ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారా?. ఇదేనా మీ నిబద్దత. ఇది ప్రజలను వంచించడం కాదా?తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా ముస్లింలు  రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా?. వాటి గురించి నోరు ఎత్తకుండా వెళ్లిపోవడంలో ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించకపోరు.ఏది ఏమైనా చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేకపోయినా, ఏదో బలమైన  ఒత్తిడి కారణంగా బీజేపీ ఈ కూటమిలో కలవడానికి అంగీకరించినట్లు అనిపిస్తుంది. అందుకే ఏదో  మొక్కుబడిగా నాలుగుముక్కలు మాట్లాడి అమిత్  షా వెళ్ళినట్లు భావించవచ్చా?!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Judgment on Kavitha bail petitions
కవిత బెయిల్‌ తీర్పులపై ఉత్కంఠ

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్‌ కోర్టు.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్‌ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్‌ కోరారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్‌ కోరారు. కేవలం ఇతరుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్‌ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్‌ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్‌ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్‌ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా.  

Mudragada Padmanabham Serious Comments On Pawan Kalyan
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్‌ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్‌ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్‌ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

IPL 2024 LSG VS KKR: RAMANDEEP SINGH TAKES ONE OF THE GREATEST CATCHES OF IPL
ఐపీఎల్‌ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్‌-లక్నో మ్యాచ్‌ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రమన్‌దీప్‌ సింగ్‌ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అర్శిన్‌ కులకర్ణి ఆడిన షాట్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్‌ సింగ్‌ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్‌ చేసే డైరెక్షన్‌ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్‌ అర్శిన్‌ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్‌ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్‌ స్టార్క్‌, పక్కనే ఫీల్డింగ్‌ చేస్తున్న  రసెల్‌ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్‌ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్‌ (6 బంతుల్లో 25 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్‌ రాణా (3.1-0-24-3), వరుణ్‌ చక్రవర్తి (3-0-30-3), రసెల్‌ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో నరైన్‌, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్‌ సాల్ట్‌ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్‌), రఘువంశీ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 3, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, యుద్‌వీర్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం​ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్‌ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

several diseases in Rafah Israel retaliate to Hamas rocket attack
రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. 19 మంది మృతి

ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ, మానవతా సాయం కోసం ఒప్పందంపై చర్చల ప్రయత్నాలు జరుతున్న సమయంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులో హమాస్‌ బలగాలు రాకెట్ల దాడితో తెగపడ్డాయి. హమాస్‌ బలగాలు చేసిన రాకెట్ల దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్‌ సైనికులు మరణించగా, పలువురు గాయడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రఫా​ నుంచి దాదాపు పది రాకెట్లు కెరెమ్ షాలోమ్ సరిహద్దు ప్రయోగించబడ్డాయని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. మరోవైపు హమాస్‌ రాకెట్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం చేసిన దాడిలో 19 మంది మృతి చెందినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు.  హమాస్‌ రాకెట్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దును మూసివేసినట్లు ప్రకటించింది. గాజాకు మానవతా సాయం, ఆహారం,  వైద్య సామాగ్రి అందించడానికి వినియోగించే పలు సరిహద్దుల్లో కెరెమ్‌ షాలోమ్‌ ఒకటి. ఇక..కాల్పుల విరమణ, మానవతా సాయానికి సంబంధించి ఆదివారం హమాస్‌ మిలిటెంట్ల డిమాండ్‌ను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. ఖతర్, ఈజిప్ట్‌, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నాలు  చేస్తున్నా  ఇజ్రాయెల్‌ మాత్రం గాజాలోని కీలకమైన రఫా నగరంపై తమ దాడి కొనసాగిస్తామని తేల్చిచెబుతోంది.

Delhi Police seized 15 tones of spurious spices arrest three individuals
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్‌ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్‌ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్‌ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్‌ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్‌ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్‌చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్‌ యాసిడ్‌.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు ఇటీవల తెలిపారు.

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో మీ భూమికి భద్రత’  అంటూ రామోజీరావు(రారా)కు చెందిన ఈటీవీ అన్నదాత ప్రసారం చేసిన కార్యక్రమం
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు

సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్‌సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్‌ టూ సేమ్‌! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్‌ అయితే ‘మీ భూములు జగన్‌ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్‌ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్‌ చేసిన వారికి... ‘దిసీజ్‌ ప్రైవేట్‌ వీడియో’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు.  గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్‌ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌కుమార్‌ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు.   చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్‌ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్‌ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్‌ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్‌ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్‌ హయాం­లో వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్‌ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే  ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజ­ల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు.   ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్‌లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్‌’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు.   ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్‌ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోగానీ ఆన్‌లైన్‌ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్‌ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది.  

Upcoming OTT Release Movies In Telugu May 2nd Week
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృ‍ష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‪‌గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)నెట్‍‌ఫ్లిక్స్ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10అమెజాన్ ప్రైమ్ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09 హాట్‌స్టార్ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ 58 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10జియో సినిమామర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10సోనీ లివ్అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లేద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10సన్ నెక్స్ట్ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10ఆపిల్ ప్లస్ టీవీడార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all