Top Stories
ప్రధాన వార్తలు
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎస్సార్సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన. దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది.
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 2nd May.. చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి4:43 PM, May 2nd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలిజనసేనకు ఈసీ ఝలక్1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలుఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది. బాబుపై అన్నా రాంబాబు ఫైర్12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్ కుమార్11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్..ప్రజలంతా సీఎం జగన్ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్, పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు పులకించిపోయారు.. ఎండల నుంచి ఉపశమనం పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి తిరుమలలో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా సుమారుగా అరగంట పాటు భారీ వర్షం పడింది. శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలలో వర్షం పడిందికాగా, ఏపీలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు.
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్‌తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.కాగా, ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ.. కోర్టుకు వెల్లడించింది.ఇదే సమయంలో జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ తెలిపింది.
GHMC: మేయర్ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ గత రెండు రోజులుగా మేయర్ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు.
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల
సాక్షి, అమరావతి: ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’.. ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ చీల్చిచెండాడారు. ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్ జగన్ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది. ⇒ టెన్త్, ఇంటర్ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది. ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని షరతులు విధించింది. ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది. ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది. ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది. ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు.
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- జయహో జోయా
- ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
సినిమా
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్. గోల్డెన్ స్టూడియోస్ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్వీ ఉదయకుమార్ మాట్లాడుతూ ప్రూఫ్ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్‌గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.అయితే మేకింగ్ స్టైల్ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్ ఉండాలి.. ఇంటర్వెల్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్ సరిగా సెట్ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్‌కు తగినట్లుగా చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్ వదన్, మెమ్గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్ సంగీతం అందించారు.
రూ.39 లక్షలు బాకీ.. ఇంకా ఇవ్వలేదు: నటి ఆవేదన
సెట్స్‌లో తనకు చుక్కలు చూపించారని బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ ఇటీవల శుభ్ షాగుణ్ సీరియల్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను గదిలో పెట్టి బంధించారని వాపోయింది. తన పారితోషికం కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చింది.గూండాల్లా ప్రవర్తించారుకృష్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. నిర్మాత కుందన్ సింగ్ నన్ను గదిలో బంధించాడని చెప్పలేదు. ఆ బ్యానర్లో పని చేసిన వాళ్లు నన్ను గదిలో లాక్ చేశారు. అయితే అతడు చెప్పడం వల్లే వాళ్లు ఈ పని చేశారు. రెండుసార్లు గదిలో బంధించి వేధించారు. గూండాల్లా ప్రవర్తించారు. ఇప్పుడతడు దీన్ని ఎలా కవర్ చేయాలా? అని ఆలోచిస్తున్నాడు. నేను ముంబైలోని మధ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందన్నాను. కానీ అది గోరెగావ్‌లోని ఫేమస్ స్టూడియోలో జరిగింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది.వాళ్లు కనిపించనేలేదుకుందన్ చాలా తెలివైనవాడు. బేటా బేటా అంటూ అందరినీ కాకాపట్టేవాడు. అక్టోబర్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపేశాడు. అయితే సీరియల్ యూనిట్‌కు చెందిన స్వాతి తనవాల నాకు అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకావని హామీ ఇచ్చింది. నన్ను గదిలో బంధించిన ప్రభాత్, సమీర్‌లపై చర్యలు తీసుకుంది. వాళ్లు ఎప్పుడూ నాకు సెట్స్‌లో మళ్లీ కనిపించనేలేదు. 12 గంటల పని..కానీ డబ్బుల కోసం మాత్రం ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండేవాళ్లం. షెహజాదాది కూడా ఇదే పరిస్థితి.. తనకూ పైసలివ్వకుండా వేధించారు. ఓసారి తనే నన్ను కాపాడాడు. ఇప్పటికీ డిప్రెషన్ నుంచి బయటపడలేదు. డాక్టర్లను, థెరపిస్టులను కలుస్తూనే ఉన్నాను. రోజుకు 12 గంటలపాటు పని చేయించుకున్నారు.. రెమ్యునరేషన్ మాత్రం ఆపేశారు. నాకు రూ.39 లక్షలు బాకీ ఉన్నారు. నాకే కాదు ఇంకా చాలామందికి వారు డబ్బులివ్వలేదు' అని కృష్ణ ముఖర్జీ చెప్పుకొచ్చింది.
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సింగర్ ఉమా రామనన్ కన్నుమూశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న ఆమె అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో విజయవంతంగా రాణించారు. ఉమకు ఆమె భర్త ఏవీ రామనన్, కుమారుడు విఘ్నేశ్ రామనన్ ఉన్నారు.కాగా.. ఉమ 1977లో శ్రీ కృష్ణ లీల సినిమా కోసం ఎస్వీ వెంకట్రామన్ స్వరపరిచిన మోహనన్ కన్నన్ మురళి అనే పాటతో ఆమె ప్రయాణం ప్రారంభించింది. విజయలక్ష్మి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె ఏవీ రామమన్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఇళయరాజా రచించిన పూంగతావే చొచ్చా తకవై పాట తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆమె శంకర్ గణేష్, టీ రాజేందర్, దేవా, ఎస్ఏ రాజ్‌కుమార్, మణి శర్మ, శ్రీకాంత్ దేవా, విద్యాసాగర్ వంటి సింగర్స్‌తో కలిసి పనిచేశారు. హిందీ చిత్రం ప్లేబాయ్ కోసం ఉమా ఒక పాట పాడారు. ఇళయారాజాతో కలిసి ఎక్కువగా పాటలు పాడారు. Woke up to the sad news of the death of my most fav singer,Uma Ramanan.Highly under-rated singer,she didn't get a fair share of her fame compared to her contemporaries.Every song of hers is a super hit,from 'Poongathave Thazthiravai...' Condolences to AV Ramanan sir. Om Shanthi!+ pic.twitter.com/5ahzsg9KYI— Ramesh रमेश ரமேஷ் (@Udumalai_Ramesh) May 2, 2024
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్‌కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఫొటోలు
బ్లాక్ డ్రెస్‌లో అప్సరసలా.. మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
Kamakshi Bhaskarla: ‘పొలిమేర 2’ హీరోయిన్‌కి అరుదైన పురస్కారం
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
బిజినెస్
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి.
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి.
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్‌గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్‌లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్!
భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.👉 #GST revenue collection for April 2024 highest ever at Rs 2.10 lakh crore👉 #GST collections breach landmark milestone of ₹2 lakh crore 👉 Gross Revenue Records 12.4% y-o-y growth👉 Net Revenue (after refunds) stood at ₹1.92 lakh crore; 17.1% y-o-y growthRead more… pic.twitter.com/Ci7CE7h35o— Ministry of Finance (@FinMinIndia) May 1, 2024
వీడియోలు
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు
చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్