Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Election Campaign In Hindupur
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.    

Times Now Exclusive Interview With Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
YS Jagan Interview: క్లీన్‌ స్వీప్‌ ఖాయం

సాక్షి, అమరావతి : ‘రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సుపరిపాలన అందించాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాం. అర్హతే ప్రామాణికంగా, వివక్ష చూపకుండా.. అవినీతికి తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. విప్లవాత్మక సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడానికి దారితీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్‌ జగన్‌ను టైమ్స్‌ నౌ గ్రూప్‌ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ నవికా కుమార్‌ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.నవికా: రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మీ చెల్లెళ్లు మీ మీద పోరాటానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరితో పోరాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? సీఎం జగన్‌: మా ప్రభుత్వంపై పోరాటానికి వస్తున్న ప్రతి ఒక్కరితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కాంగ్రెస్‌ పార్టీ రిమోట్‌ కంట్రోల్‌ కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు నా చెల్లెలు షర్మిలను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నా చెల్లిని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ ఓటర్లలో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని వాళ్లు భావిస్తు న్నారు. మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతి రేకత లేదు. ప్రజాస్వామ్యంలో 50 శాతానికి పైగా ఓట్లతో గెలిచాం. చెప్పినవి చేసి చూపించాం. అందువల్ల ప్రజలు మాతోనే ఉన్నారు. దేవుడి దయతో మేం స్వీప్‌ చేయబోతున్నాం.నవికా: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని మీరు అంటున్నారు. ఈ విషయం బీజేపీకి తెలియదంటారా?సీఎం జగన్‌: ఈ ప్రశ్న మీరు ఆ పార్టీ వాళ్లను అడగాలి.నవికా: మీరు పరాజయం పాలవ్వబోతున్నారనే బీజేపీ మీతో పొత్తు పెట్టుకోలేదా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని మీరేమైన నిరాశకు గురయ్యారా?సీఎం జగన్‌: పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఈ రెండు జాతీయ పార్టీలు అప్రధానం. వాళ్ల పార్టీ, వాళ్లకు ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకున్నారు. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొన్ని సందర్భాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చాం. ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది అనిపించినప్పుడు ఆ బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. ఉదాహరణకు మైనార్టీల హక్కులకు విఘాతం కలిగించే బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. సీఏఏకు వ్యతిరేకంగా మేం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.నవికా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే మీరు ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది. ఈ క్రమంలో హోదా అంశంపై ఏదైనా భరోసా లభించిందా?సీఎం జగన్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒప్పుకుంది. కానీ.. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా అన్యాయం చేసింది. పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన మేరకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని మేం నమ్మాం. కానీ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలు చెలగాటం ఆడాయి. ప్రత్యేక హోదాను సాధించడమే ప్రధాన అజెండాగా మేం అడుగులు ముందుకు వేశాం, వేస్తున్నాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తాం.నవికా: పూర్తి మెజార్టీతో కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే హోదా వస్తుందని భావిస్తున్నారా?సీఎం జగన్‌: ఇది నిజం. అందరికీ ఇది తెలిసిన అంశమే.నవికా: మెజార్టీ లేక సంకీర్ణం.. కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు భావిస్తున్నారు? సీఎం జగన్‌: జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. జాతీయ మీడియా చేసిన సర్వేలు కొన్ని సార్లు నిజం కావచ్చు. కాపోవచ్చు.  నవికా: రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని మీరు అనుకుంటున్నారా?సీఎం జగన్‌: రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరిని నేను దగ్గరగా చూశాను. వ్యక్తిగతంగా రాహుల్‌ గాంధీ, మోదీతో పోల్చి చూస్తే.. మైనార్టీలకు వ్యతిరేకం అని తప్పితే మిగతా అంశాల్లో మోదీనే మంచివారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి మరణించాక నా కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో అందరికీ తెలుసు. ఆ వేధింపులకు నేనే సాక్షి. ఈ క్రమంలో ఏ విధంగా రాహుల్‌ గాంధీ మంచివాడని అనాలి?నవికా: రాజకీయాల్లో ఉన్నత ఆశయాలు ఉన్నాయని చెబుతున్నారు మీరు.. అందుకే మీ చెల్లెళ్లు్ల మీ నుంచి దూరమయ్యారా? మీరు పార్టీలోకి రానివ్వకపోవడంతోనే వేరే పార్టీల వైపు వెళ్లారా?సీఎం జగన్‌: వాళ్లను తీసుకొస్తే అది కుటుంబ రాజకీయంగా మారిపోతుంది. ఒకే కుటుంబలోని ఒక జనరేషన్‌ నుంచి ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటే అది పార్టీ అవ్వదు. మరేదో అవుతుంది. నాకు స్పష్టమైన విజన్‌ ఉంది. పార్టీ వారసత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజలకు మంచి చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. వారసత్వం అనేది వేరే ప్రస్తావన. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలంటే.. ఎవరైనా వస్తే సంతోషంగా మాట్లాడుకోగలగాలి. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని సరదాగా ఉండాలి. అంతేగానీ ప్రతి చోట రాజకీయం అంటే ఎలా? ఒక కుటుంబం నడిపే పార్టీ ఎప్పటికీ బతకదు.నవికా: మీ చెల్లెలితో మీ అనుబంధం ఎలా ఉండేది?సీఎం జగన్‌: దురదృష్టవశాత్తు ఆమె చంద్రబాబుతో కలిసింది. ఆయన చెప్పినట్టే రాజకీయాలు చేస్తోంది. మా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. ఆ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తోంది. (నవికా: ఆమె మీ కుటుంబమే కదా..) మా కుటుంబ సభ్యురాలు అయి ఉండి కూడా.. బయటకు వెళ్లడం, రాజకీయ శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది.నవికా: మీ ఇద్దరి విషయంలో.. రెండు వైపులా మీ తల్లి ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?సీఎం జగన్‌: ఈ రోజు రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు చేయట్లేదు అనేది కాదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచిని మేము చెబుతున్నాం. ఇక్కడ జగన్‌ ఒక వైపు.. మిగిలిన వారందరూ మరో వైపు ఉన్నారు. ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలుపుతారు. అలాంటి రాజకీయమే నడుస్తోంది. కుటుంబ రాజకీయాలు ఇక్కడ పని చేయవు.నవికా: చంద్రబాబు చెప్పినట్టే.. ఆయనకు ఏమి అవసరమో అదే.. మీ చెల్లెలు చేస్తున్నారని ఎలా చెబుతున్నారు? కాంగ్రెస్‌ పార్టీలోని సభ్యులు ఆమెకు ఆశలు కల్పించి ఉండొచ్చుకదా?సీఎం జగన్‌: ఇక్కడ వాస్తవం ఏమంటే.. ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. (నవికా: మీరేమైనా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారా? తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంలో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాప్‌ చేశారని చెబుతున్నట్టు) ఎవరైనా ఎందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలి. ఆమె నా సొంత చెల్లెలు. అందుకే ఏం జరిగిందో ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఎవరు ఆడిస్తున్నారో.. ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలుసు.నవికా:  నారీ శక్తిని విశ్వసిస్తున్న దేశంలో.. తండ్రి వారసత్వం వాటా కొడుకులకు మాత్రమే కాదు.. కూతుళ్లకు వర్తిస్తుందంటే మీరు ఏమంటారు?సీఎం జగన్‌: దీనినే సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారసత్వం కోసం పోరాటం జరగట్లేదు. మా నాన్న 2009లో అందరినీ విడిచి వెళ్లిపోయారు. మనం 2024లో మాట్లాడుకుంటున్నాం. దాదాపు 15 ఏళ్లు అవుతుంది నాన్న వెళ్లిపోయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా నా ఐదేళ్ల పాలనను ప్రజలు చూశారు. నా పాలనను విశ్వసిస్తే వారే ఓటు రూపంలో నాకు మద్దతుగా నిలుస్తారు. లేకుంటే వేరే వైపు చూస్తారు. ఆ పోరాటమే నడుస్తోంది గానీ, వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది?నవికా:  ఏపీలో కాంగ్రెస్, ఎన్‌డీఏ, జగన్‌ ముక్కోణపు పోటీలో ఉన్నారు? ఏమైనా మీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారా?సీఎం జగన్‌: ఈ రోజు నేను చెప్పే మాటలను (మార్క్‌) గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ రండి. కాంగ్రెస్‌కు నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్యే పోటీ.నవికా:  2019 ఎన్నికల్లో మీరు రికార్డు విజయం సాధించారు. 175 శాసనసభ స్థానాల్లో 151 స్థానాలు, 25లో 22 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలవబోతున్నారు?సీఎం జగన్‌: ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం అనేది ముఖ్యమైనది. గత ఎన్నికల్లో మేము 49.96 శాతం ఓట్లు సాధించాం. ఈ సారి దేవుడి దయతో 2019లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకుంటామని నాకు బలమైన నమ్మకం ఉంది. మీరు మంచి విశ్లేషణ చేస్తారు.. మీరే ఆ రోజు టీవీలో నంబర్లు చూస్తారు.నవికా:  దేశంలో ప్రత్యర్థి పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి? దీనిపై మీరు ఏమంటారు?సీఎం జగన్‌: నేను దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు వేరే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.నవికా:  ఏపీలో బీజేపీ పొత్తును మీరు టార్గెట్‌ చేశారు. 2014లో కలిసి పోటీ చేసిన వాళ్లు.. తిరిగి 2024లో వస్తున్నారు? మీరు దీనిని అవకాశవాద పొత్తుగా ఎందుకు చూస్తున్నారు?సీఎం జగన్‌: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తుంది. అదే పార్టీ విజన్‌ను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మార్గదర్శకంగా ఉంటుంది. పాలనా పని తీరును కూడా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో నేరవేర్చామా లేదా అని పోల్చి చూడాలి. ఇదే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లను అడిగేందుకు మన అర్హతను నిర్ణయిస్తుంది. ఇప్పుడు కూటమిగా వస్తున్న వాళ్లే.. గతంలో చంద్రబాబు సంతకంతో రకరకాల హామీలతో కరపత్రం ముద్రించి 2014లో ప్రతి ఇంటికీ పంపించారు. కూటమి నాయకుల ఫొటోలతో ముద్రించారు. ఇదే విషయాన్ని నా ప్రతి బహిరంగ సభలోనూ ప్రజలకు చెబుతున్నాను. వాళ్ల మేనిఫెస్టోను చూపించి.. అందులోని  వాగ్ద్ధానాలను చదివి.. ఇవన్నీ 2014 ఎన్నికల తర్వాత అమలు చేశారా? లేదా? అంటూ ప్రజలనే అడుగుతున్నాను. అందులో నెరవేర్చిన ఒక్క హామీనైనా చెప్పమంటున్నాను. చెప్పడానికి అందులో ఒక్కటంటే ఒక్కటీ లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో ఆ కూటమి ప్రజలను మోసం చేసింది. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం నుంచి తుడిచి పెట్టుకుపోయాడు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల్లో మేము గెలిచాం. మళ్లీ అదే కూటమి.. అదే చంద్రబాబు.. కొత్త మేనిఫెస్టోతో వచ్చారు.నవికా:  ఐదేళ్ల మీ పాలనను ప్రజలు చూశారు. చంద్రబాబు కంటే మీరు మెరుగైన పాలన అందించారని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?సీఎం జగన్‌: చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ మేం 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్రికరణశుద్ధితో అమలు చేశాం. మా మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకే ఇచ్చి.. అందులో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం అందాయో టిక్‌ చేయమని చెప్పాం. మొదటి ఏడాదిలోనే దాదాపు 86, 87 శాతం హామీలు అమలు చేస్తే.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారని ప్రజలే చెబుతున్నారు. అది మా ప్రభుత్వం, మా పార్టీపై ప్రజలకున్న విశ్వసనీయత. అదే మా నమ్మకం.నవికా:  చంద్రబాబు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాక సభలు నిర్వహించారు. అదే సమయంలో మీరూ సిద్ధం సభలు పెట్టారు. చంద్రబాబుకు ప్రజల నుంచి సానుభూతి రాకూడదనే మీరు సిద్ధం సభలు నిర్వహించారని ప్రతిపక్షాలు అంటే మీరేమంటారు?  సీఎం జగన్‌: (నవ్వుతూ..) నేను సిద్ధం సభలు పెట్టినట్టే వారూ రాజకీయ సభలు పెట్టారు. కానీ జగన్‌ సిద్ధం సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారి సభలకు ఎవరూ రాలేదు. దానికి నేనేం చేయగలను.. ఈ ప్రశ్న వారినే అడగాలి. జగన్‌ అంత జనాన్ని ఎలా ఆకట్టుకుంటున్నాడు.. మీరెందుకు ప్రజలను ఆకట్టుకోలేకపోయారని వారినే అడగండి.నవికా:  మీ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య మీ కుటుంబంలో వివాదాస్పదంగా మారింది. ఆ హత్య కేసులో ఆయన భార్య, మీ చెల్లెళ్లు కూడా గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తులో న్యాయం జరగలేదంటున్నారు. సీఎం జగన్‌: ఈ అంశం మా కజిన్స్‌ మధ్య ఉంది. మా కజిన్‌ సిస్టర్‌ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మరో కజిన్‌ బ్రదర్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆరోపణలు కజిన్‌పై చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఘటన జరిగినప్పుడు ఇవేమీ లేవు. కానీ సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీనికంతటికీ కారణం చంద్రబాబే.నవికా:  ప్రతి సమస్యకు చంద్రబాబుతో సంబంధం ఉంటుందా?సీఎం జగన్‌: ఇక్కడ జరుగుతున్నది జగన్, చంద్రబాబు మధ్య పోరాటం. జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తున్నారు. జగన్‌ ఎప్పుడూ ఒంటరి కాదు.. నా వెనుక ప్రజలున్నారు. ఇలాంటప్పుడు నాపై వ్యతిరేకత ఎందుకొస్తుంది! ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇతర పార్టీల అవసరం ఏముంది?  నవికా:  రాజకీయ ప్రతీకారంతో అనుకోండి, లేదా మరేమైనాగానీ మీపై ఉన్న సీబీఐ కేసుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. అవి మీ ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయనుకుంటున్నారా?సీఎం జగన్‌: నాపై ఉన్న కేసులు నా ప్రభుత్వంలో, నా పాలనలో నమోదైనవి కాదు. మా నాన్న చనిపోయినప్పుడు.. నేను రాజకీయంగా వారికి ఎక్కడ అడ్డు తగులుతానో అని భయపడి చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి కుట్రతో పెట్టిన కేసులు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నాపై అక్రమ కేసులు బనాయించడానికి చేసిన ఆరోపణలు ఏ కాలానికి సంబంధించినవి? అప్పటికి నేను ఎమ్మెల్యేను కాను, ఎంపీనీ కాను. పైగా అప్పట్లో నేను  హైదరాబాద్‌లో కూడా లేను. ఆ సమయంలో నేను ఏ ఒక్క  మంత్రితోగానీ ఏ ఒక్క ఐఏఎస్‌ ఆఫీసర్‌తోగానీ ఏ ఒక్క ఐపీఎస్‌ అధికారితో గానీ  ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది వాస్తవం. నవికా:  కాంగ్రెస్‌ నుంచి బయటకు రావడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయా? సీఎం జగన్‌: అవును, నిజానికి నా జీవితంలో 16 నెలలు ఎవరు చెల్లిస్తారు? నన్ను జైల్లో పెట్టారు, కారణం ఏంటి?నవికా:  కేంద్రంలోని బీజేపీ తన ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు కేంద్ర ఏజెన్సీలను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌ చెబుతోంది, మీరేం చెబుతారు?సీఎం జగన్‌: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఏం చేసింది? నాపై నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ. 2004 నుంచి 2009 వరకు నా తండ్రి ముఖ్యమంత్రి. ఇప్పుడు 2024 వచ్చింది. కాంగ్రెస్‌ ఏం చేసింది.. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని చెడు కోసం వాడుకుంటున్నారు. ఇలా చేయడం దురదృష్టకరం. ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి, అది అర్థం చేసుకోవడం లేదు.నవికా:  ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎందుకు? రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్, మమతా బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు ఉండటం వల్ల ఇండియా కూటమి మీకు అంత అనుకూలం కాదనుకున్నారా?సీఎం జగన్‌: ఈ రెండు జాతీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో అప్రధానమైనవి అనేది మనం ముందుగా గుర్తించాలి. ఎవరైనా వాటితో కలిసి ఎందుకు పోటీ చేయాలనేది ప్రాథమిక ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంశాల వారీగా కేంద్రానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుంది. దేనికి మద్దతివ్వాలి.. దేనికి ఇవ్వకూడదనేది మేం ఆలోచించుకుంటాం.నవికా: ఒకవేళ ఎన్‌ఆర్‌సీ వస్తే మద్దతిస్తారా?సీఎం జగన్‌: మద్దతు ఇవ్వం.నవికా: జగన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా తనకంటూ సొంత గుర్తింపుతోనే ముందుకు వెళ్లాలనుకుంటోందా? దానికి మీరు పూర్తిగా కట్టుబడి ఉన్నారా?సీఎం జగన్‌: కచ్చితంగా. విశ్వసనీయత, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయాలలో విశ్వసనీయత ప్రధానమైనదని నేను గట్టిగా నమ్ముతాను. ప్రజల కోసం ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధం.నవికా:  ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏమనుకుంటున్నారు. చాలా సమావేశాల్లో ఆయనతో కలిసి మీరు పాల్గొన్నారు. ఈ మధ్య ఆయన చాలా పొత్తులు పెట్టుకున్నారు. మీరెలా భావిస్తున్నారు?సీఎం జగన్‌: రాజకీయాల్లో మోదీని, రాహుల్‌ గాంధీలను చూశాం. అయితే మైనార్టీలకు వ్యతిరేకం వంటి కొన్ని విషయాల్లో మోదీతో మేం విభేదించవచ్చు. కానీ ఆయన మంచి నాయకుడే.నవికా: రాహుల్‌ గాంధీ గురించి చెప్పాలంటే ఏం చెబుతారు. మీరొక భారతీయ పౌరుడిగా చెప్పండి.సీఎం జగన్‌: నేను ఇప్పటికే ఈ విషయంపై చెప్పాను. ఒక వేళ రాహుల్‌ మంచి నాయకుడైతే ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ నాకు చేసిన అన్యాయాన్ని బట్టి రాహుల్‌పై నా అభిప్రాయం నాకుంది. నాకైతే రాహుల్‌ అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేదు.నవికా: మూడు రాజధానుల అంశం గురించి ఏమంటారు?సీఎం జగన్‌: ఆ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా నేను ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తాను.నవికా: ఎన్నికల్లో మీకెన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటున్నారు? 151 సంఖ్యను దాటుతామని అనుకుంటున్నారా? బీజేపీకి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? సీఎం జగన్‌: మా పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. నన్ను నమ్మండి. నంబర్స్‌ చూస్తూ ఉండండి.నవికా: ప్రధాన మంత్రి ఎవరవుతారని అనుకుంటున్నారు?సీఎం జగన్‌: అది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అందరూ చెబుతున్నది, టీవీల్లో చూస్తున్నదానిని బట్టి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్పిస్తోంది. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ సెఫాలజిస్ట్‌(విశ్లేషకుడు)ను కాదు. ఒక వేళ ఎవరైనా ఏదైనా చెబితే అది కేవలం ఒక అంచనా మాత్రమే.నవికా: మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంత కంటే గొప్పగా ఏం చేస్తారు? సీఎం జగన్‌: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ పెద్ద హామీయే. అవన్నీ చేస్తాం.నవికా: మీ సోదరిని మిస్‌ అవుతున్నారా?సీఎం జగన్‌: కచ్చితంగా మిస్‌ అవుతున్నాను(భావోద్వేగంతో). దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడికిపోతాయి?నవికా: ఆమె విషయంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారా?సీఎం జగన్‌: దురదృష్టవశాత్తు ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఈ పరిస్థితి మారచ్చు.. మారకపోవచ్చు.నవికా:  వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మోదీ అన్నట్టు.. రాజకీయాలు, కుటుంబం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?సీఎం జగన్‌: ఆయన ఏ సందర్భంగా అన్నారో నాకు తెలియదుగానీ మోదీ అన్న మాటలను నేను బలంగా నమ్ముతున్నాను. కుటుంబాన్ని బేలెన్స్‌గా చూసుకోవాలన్నది నా బలమైన నమ్మకం. అయితే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే పార్టీని నడపలేం. అలాంటప్పుడు అప్రమత్తంగా లేకపోతే పార్టీ నష్టపోతుంది. పులివెందులలో నేను నామినేషన్‌ వేసినప్పుడు ఈ అంశంపై స్పష్టంగా చెప్పాను. కడప నుంచే ఆమె (షర్మిల) ఎంపీగా పోటీ చేస్తోంది. ఇదే స్థానం నుంచి నా కజిన్‌ ఎంపీగా ఉండి నా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా నేను ఉన్నానంటే అది దేవుడి దయ. ఈ పదవి అణగారిన, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలకు మేలు చేయడానికి లభించిన అవకాశం. నేను డబ్బు సంపాదించుకోవడానికో లేక నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికో కాదు. వారు నా నుంచి అలాంటివి ఆశలు పెట్టుకోకూడదు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాను.నవికా: ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు మీకు ఎన్నికల్లో పోటీదారు అనుకుంటున్నారా? చంద్రబాబు జైలుకెళ్లి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందనుకుంటున్నారా? లేక ఉచిత పథకాలు ఫలితాలిస్తాయని అనుకుంటున్నారా?సీఎం జగన్‌: ఇవన్నీ కాదు. మా ఐదేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఇస్తున్నవి ఉచిత పథకాలుగా చూడకూడదు. అవి సామాజిక పెట్టుబడి. పరిపాలన, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గొప్ప సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మారాయి. స్కూల్స్‌ అప్‌గ్రేడ్‌ అయ్యాయి. మూడో తరగతి నుంచే పిల్లలు టోఫెల్‌ గురించి ఆలోచిస్తున్నారు. ఆరో తరగతి నుంచే డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ వచ్చాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. ఐబీ సిలబస్‌ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2025 నుంచి ఒకటో తరగతిలోనే ఐబీ సిలబస్‌ బోధిస్తాం. 2035 నుంచి మా పిల్లలు ఐబీ సర్టిఫికెట్‌ పొందుతారు. ఇవన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో మార్పు వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా దాదాపు 600 రకాల సేవలు ఇంటి వద్దకే అందుతున్నాయి. ప్రతి సర్టిఫికెట్, ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సేవ.. వలంటీర్‌ ద్వారా ఇంటి గుమ్మం ముందుకే వస్తున్నాయి. విలేజ్‌ క్లినిక్, రైతుల కోసం రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), ఇంగ్లిష్‌ మీడియం స్కూల్, నవీకరించిన పాఠశాలలు, నవీకరించిన సిలబస్‌.. ఇలాంటివేవీ గతంలో లేవు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను అధికారంలోకి రాక ముందు, ఇవన్నీ చేయక ముందు ఏదైనా సంక్షేమ పథకంలో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా, వివక్ష చూపకుండా అర్హులందరికీ చేరుతుందంటే ఎవరూ నమ్మే వారు కాదు.నవికా: మరి మీ చెల్లి వాళ్లతో పనిచేస్తోంది. పవర్‌ పాలిటిక్స్‌లో ఆమె ఏ విధంగా రాణిస్తుందనుకుంటున్నారు? షర్మిలకు సునీత కూడా తోడయ్యారు.సీఎం జగన్‌: వాళ్లకు వాళ్ల వ్యక్తిగత కారణాలున్నాయి. అయితే వాళ్లు ఎంచుకున్న మార్గం, సమయం రెండూ సరైనవి కావు. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్‌లో ఒకరు మాత్రమే రాజకీయాలను లీడ్‌ చేస్తారు. మిగిలిన వాళ్లు లీడ్‌ చేసే వారికి మద్దతుగా నిలుస్తారు. రెండో జనరేషన్‌ రాజకీయాల్లోకి రాకూడదు. దీన్ని నమ్ముతాను. ఈ క్రమంలో వారిని రాజకీయాల్లోకి రావద్దనే సూచించాను. వ్యాపారాలు, ఇంకా వాళ్లకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాను. రాజకీయాల్లోకి వచ్చి కుటుంబంలో సంబంధాలు దెబ్బతినేలా చేయొద్దని కోరాను. రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకుని మన మధ్యే చిచ్చుపెట్టి సంబంధాలను కలుషితం చేస్తారని చెప్పాను. మనలో మనమే ప్రత్యర్థులుగా మారిపోతామని తెలియజేశాను.నవికా: వారి వెనకాల చంద్రబాబు ఉన్నారని మీరు నమ్ముతున్నారా?సీఎం జగన్‌:  అవును. నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చంద్రబాబు వాళ్లను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి పేరును కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్‌లలో పెట్టింది. అక్రమ కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసింది. నాపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ కేసులో కో పిటీషన్‌ వేసింది టీడీపీ. నా తండ్రి బతికి ఉన్నన్ని రోజులు, నేను ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు నేను నిజాయితీపరుడిని. నేను ఆ పార్టీ వీడిన వెంటనే నా తండ్రి, నాపైనా అవినీతి మరక వేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ రోజుకూ వారు నాపై మోపిన తప్పుడు కేసులపై పోరాటం చేస్తున్నాను.నవికా: అందుకే చంద్రబాబు నాయుడినిజైలుకు పంపించారా?సీఎం జగన్‌: చంద్రబాబు నాయుడు చేయకూడని పని చేశారు. స్కిల్‌  స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు. అలా అతను చేసి ఉండకూడదు. ఆయన స్కామ్‌లో ప్రమేయం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కోర్టుల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలతో వాదనలు జరిగాయి. అందుకే కటకటాల వెనక్కి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాలతో కోర్టులు ఏకీభవించాయి. అందుకే అతను 52 రోజులు జైలులో ఉన్నాడు.నవికా: చివరికి బెయిల్‌ వచ్చింది కదా?సీఎం జగన్‌: బెయిల్‌ పొందడం అనేది హక్కు. అది జైలులోకి వెళ్లిన ఎవరికైనా.. ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. అంతేగానీ, సరైన సాక్ష్యాలు లేకుంటే చంద్రబాబు జైలుకి వెళ్లేవారు కాదేమో! చంద్రబాబుపై కేసుల్లో ఎక్కడా రాజకీయ కోణంలో వ్యవహరించలేదు.నవికా:  మీపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. దానికి మీరేమంటారు?సీఎం జగన్‌: దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా (డీబీటీ) ప్రజల ఖతాల్లో జమ చేశాను. ప్రజల ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలతో సహా ఆధారాలు ఉన్నాయి. మరి అవినీతి చేశానని వారు ఎలా అంటారు? 90 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.నవికా: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు మీరు మద్దతిస్తారా?సీఎం జగన్‌:  కచ్చితంగా మద్దతిస్తాం. ఇప్పటికే మద్దతిచ్చాంనవికా:  యూనిఫాం సివిల్‌ కోడ్‌కు మద్దతిస్తున్నారా? సీఎం జగన్‌: మేం మద్దతివ్వడం లేదు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. 

AP Politics And Election Live Updates On May 4th
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 4th May...9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్‌ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్‌లోకేష్‌ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల‌ సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్‌..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్‌ వివాదాస్పద ‍వ్యాఖ్యలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం  7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు  పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి  3.50 గంటలకు  నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి  కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను  వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు  దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్‌ పాండ్యా

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్‌ ముందు తలవంచింది. శ్రేయస్‌ అయ్యర్‌ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్‌ తర్వాత వికెట్‌ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్‌ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్‌ చేతిలో ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్‌ కేకేఆర్‌ స్కోర్లు👉టాస్‌: ముంబై.. తొలుత బౌలింగ్‌👉కేకేఆర్‌ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వెంకటేశ్‌ అయ్యర్‌(కేకేఆర్‌- 52 బంతుల్లో 70 రన్స్‌)👉ముంబై ఇండియన్స్‌ టాప్‌ స్కోరర్‌: సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56 రన్స్‌)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024

3 arrested by Canada police in Sikh activist Nijjar deceased case
నిజ్జర్‌ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్‌ చేసినట్లు‌ ​పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి  5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు  కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్‌ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉ‍న్న గురునానక్ సిక్‌ గురుద్వారా సాహిబ్‌ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో  ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Telangana Police to reopen Rohith Vemula case
రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్‌ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా మాదాపూర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్‌ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్‌ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

2 crore case without progress
కందికుంట అడ్డంగా దొరికినా..

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్‌ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్‌ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ  కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్‌ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు   భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారి (ఆర్‌వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్‌వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్‌వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ  ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్‌ అయి  ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది.   – ఈ నెల 2వ తేదీన  అనంతపురం టూటౌన్‌ సీఐ  క్రాంతికుమార్‌‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు  సంబంధించి సీజ్‌చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్‌వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్‌ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం.  – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్‌ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి 

Special article over chandrababu Propaganda of lies
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న 

Vishnu Manchu speaks about Kannappa co star Akshay Kumar
కన్నప్పకి బై బై 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్‌ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో అక్షయ్‌ కుమార్‌ జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్‌ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్‌.   

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all