Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How TDP got majority in villages where YSRCP is doing well
మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?

ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్‌ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి. – దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోట»ొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాసాక్షి, అమరావతి: ‘‘మేం జగన్‌కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్‌ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్‌సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్‌ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్‌ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్‌ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్‌సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్‌ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్‌కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైఎస్సార్‌పార్టీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.

Five trekkers from Karnataka die in Uttarakhand’s extreme weather conditions
మంచుకొండల్లో మృత్యుఘోష

శివాజీనగర: హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉత్తరకాశీలో తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్‌ చేస్తున్నవారిలో కర్ణాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో 5 మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ముమ్మరంగా సహాయక చర్యలు మంగళవారం రాత్రి నుంచి అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్ణాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్‌ (37) వినయ్‌ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్‌.నాయుడు (64), సతి గురురాజ్‌ (40), సీనా (48)తో పాటుగా పలువురిని కాపాడినట్లు తెలిపారు. 9 మంది అదృశ్యం? బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్‌ ప్రసాద్‌ (55), అనిత (61), ఆశా సుధాకర్‌ (72), పద్మనాభ్‌ కేపీఎస్‌ (50), వినాయక్‌ (52) అదృశ్యమైనట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు ప్రకటించారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెల 29 నుంచి ట్రెక్కింగ్‌ ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌ ద్వారా వారు హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వెళ్లినట్లు తెలిసింది. వారు జూన్‌ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్‌ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో వారు చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరువాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. #TrekkingTragedy 9 #Bengalureans, who were part of a 22-member trekking team, #died following bad weather at Sahastra Tal in #Uttarakhand.#Rescue operations launched 👇#Karnataka’s revenue minister @krishnabgowda rushes to rescue site. pic.twitter.com/dKDNufdjiw— TOI Bengaluru (@TOIBengaluru) June 5, 2024

Officials did not count EVM with 737 votes in Pedakurapadu constituency
వెలుగులోకి మరో ‘కౌంటింగ్‌’ మాయ

అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్‌లో ఉన్న 56వ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్‌ ఏజెంట్లు తెలిపారు.దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్‌ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్‌లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.అయితే, 56వ పోలింగ్‌ బూత్‌లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్‌సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

T20 World Cup 2024: Rohit Sharna completes 600 sixes in international cricket
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడు

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 499 ఇన్నింగ్స్‌ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో క్రిస్‌ గేల్‌ (553), షాహిద్‌ అఫ్రిది (476), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (398), మార్టిన్‌ గప్తిల్‌ (383) టాప్‌-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్‌ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్‌ చేశారు. హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌ (10), కర్టిస్‌ క్యాంపర్‌ (12), గెరాత్‌ డెలానీ (26), జాషువ లిటిల్‌ (14) రెండంకెల స్కోర్‌ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్‌ స్టిర్లింగ్‌ (2), హ్యారీ టెక్టార్‌ (4), జార్జ్‌ డాక్రెల్‌ (3), మార్క్‌ అదైర్‌ (3), బ్యారీ మెక్‌ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్‌ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌ హర్ట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్‌ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్‌తో కలిసి తొలిసారి ఓపెనింగ్‌ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతి​కి బంతి బలంగా తాకడంతో రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Warangal-Khammam-Nalgonda Graduate MLC Vote Counting
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

సాక్షి, నల్గొండ: వరంగల్‌ -ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్‌ కౌంటింగ్‌ సాగుతోంది. మొదటి రౌండ్‌లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న.. రెండో రౌండ్‌లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆయనకు 34,575 ఓట్లు పోల్‌ అయ్యాయి.రెండో రౌండ్ ఫలితాలుకాంగ్రెస్ అభ్యర్థి నవీన్(తీన్మార్ మల్లన్న)కు వచ్చిన ఓట్లు: 34,575బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 27,573బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 12,841స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు వచ్చిన ఓట్లు: 11,018నల్గొండలోని దుప్పలపల్లిలో నిన్న(బుధవారం) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Complaint Against Infosys For Onboarding Delay
ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్​లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్‌లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్‌లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్‌ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్​లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్‌ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది.

Kajal Aggarwal talks about Satyabhama movie
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్‌ మారాలా?

‘‘నన్ను టాలీవుడ్‌ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్‌ఫుల్‌ నేమ్‌. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్‌ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్‌ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్‌ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్‌ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్‌ ఉన్న పవర్‌ఫుల్‌ ΄ోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్‌ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్‌ సహజంగా ఉంటాయి. రామ్‌ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్‌ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్‌ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్‌ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్‌ కెరీర్‌ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్‌ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్‌ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను.

YSRCP social media convenor is a victim of TDP harassment
టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బలి

పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టు­కో­లేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ యలమంచిలి ప్రవీణ్‌ (30) ఆత్మహత్య చేసుకు­న్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యా­­రావుపేటకి చెందిన ప్రవీణ్‌ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలి­పిన వివ­రాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజ­యా­నికి అహర్నిశలు శ్రమించాడ­న్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్‌ ఇంటి మీద తెలుగుదేశం కార్య­కర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలా­డు­తూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్‌ బంక్‌ వైపు వస్తే కొడతా­మని, బైక్, కారు తగల­బెట్టే­స్తామని హెచ్చరించారు. బుధ­­వారం ఉదయం ప్రవీణ్‌ విజయరాయి పెట్రో­ల్‌ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బ­య్య­చౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్‌సీపీ స్టిక్కర్‌ తీసే­వరకు బీభ­త్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయ­పడి, వేధింపులు భరించలేక ప్రవీ­ణ్‌.. తన ఇంటి సమీపంలోని తోట­లో చెట్టుకు ఉరే­ç­Üుకుని ఆత్మ­హత్య చేసు­కున్నాడు. ప్రవీణ్‌ తల్లి­దండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశ­రావు, కుటుంబ­సభ్యులు కన్నీరు­మున్నీ­రుగా విలపిస్తున్నా­రు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసు­కున్న ప్రవీణ్‌ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలి­తీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్య­కర్తలను టార్గెట్‌ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తు­వులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.

Who Will Be In Cabinet Of TDP Janasena BJP coalition Govt
ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వా­ములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవు­తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్‌కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.పాతవారికే పెద్దపీటటీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు.

Verdict of people in Lok Sabha Elections is different from 2023 Assembly results
లోక్‌సభ ఎన్నికల్లో లెక్కలు తారుమారు

సాక్షి, హైదరాబాద్‌: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్‌ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌ 2,3 స్థానాలకే పరిమితమైంది. బీఆర్‌ఎస్‌కు 2 స్థానాల్లోనే రెండో స్థానం లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్‌ఎస్‌ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్‌ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్‌ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్‌ఎస్‌కే మెజారిటీ రావడం గమనార్హం. బీజేపీ వైపు బీఆర్‌ఎస్‌ ఓటర్ల మొగ్గు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్‌ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్‌ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్‌ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ మూడోస్థానంలో నిలిచింది. కరీంనగర్‌ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్‌ సెగ్మెంట్‌లో మాత్రం కాంగ్రెస్‌ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్‌ఎస్‌ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్‌ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్‌లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ గెలిచిన 18 సీట్లలోనూ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం కాంగ్రెస్‌ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సీన్‌ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్‌ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్‌ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్‌ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రెండో స్థానం దక్కింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్‌ఎస్‌ నిలిచింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement