Top Stories
ప్రధాన వార్తలు
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఇక.. రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు.
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?
టీ20 వరల్డ్‌కప్-2024లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధరణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జట్టు బలమెంత? బలహీనతలు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌నకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెలల ముందు అమెరికాలోని న్యూయర్క్‌లో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వరల్డ్‌కప్‌లో నసావు మైదానం వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్- కెనడా, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నసావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కెనడా చేసిన 137 పరుగులకే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. నసావు వికెట్ ఎలా ఉందో ఈ గణాంకాలు చూస్తే మనకు అర్ధమవుతుంది. అస్సలు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. దక్షిణాఫ్రికా, భారత్ వంటి మేటి జట్లు కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అంతేకాకుండా ఆటగాళ్లు గాయాల బారిన కూడా పడుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రాకసి బౌన్సర్ వల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్‌పై రోహిత్ శర్మ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉపయెగించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి.
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు.
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది.
Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!
మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూసి తీరాల్సిందే. లేదంటే చాలా అంటే చాలా మిస్సవుతారు. పోస్టర్ చూడగానే ఇదేదో పిల్లల మూవీ అనుకుంటారేమో. మొత్తం చూసిన తర్వాత మీ చిన్నారుల్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే అంతలా మిమ్మల్ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. ఓటీటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు! జస్ట్ రూ.45 లక్షల బడ్జెట్‌తో తీశారు. 2018లో రిలీజైన ఈ మూవీలో అంతలా ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉంది? ఓవరాల్ రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 2 వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'పిహు' సినిమా విషయానికొస్తే.. పిహు (పిహు మైరా విశ్వకర్మ) రెండేళ్ల పాప. ఉదయం నిద్రలేచేసరికి తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని పడి ఉంటుంది. ఆమె నిద్రపోతోందేమో అని పిహు అనుకుంటుంది. చాలాసార్లు లేపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ పాప వల్ల కాదు. అలానే పిహు చిన్నపిల్ల కావడంతో బయటకు రాలేక ఇంట్లోనే చిక్కుకుపోతుంది. ఫ్రిడ్జ్, గ్యాస్, వాటర్ ఫిల్టర్, ఇస్తీ పెట్టె లాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల అన్నింటిని ఆన్ చేసి పెట్టేస్తుంది. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సిట్చ్యూయేషన్ నుంచి పిహు ప్రాణాలతో బయటపడిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.సాధారణంగా చిన్నపిల్లల సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయి. 'పిహు' మాత్రం మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు వణికిపోయేలా చేస్తుంది. ఇందులో కొత్తగా ఏం ఉండదు. ఓ పాప, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ లాంటివి ఆన్ చేసేసి ఇవేంటి ఇంత డేంజర్ అనుకునేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలని ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పడాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది.(ఇదీ చదవండి: శర్వానంద్ 'మనమే' సినిమా రివ్యూ)ఈ మూవీ అంతా అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లోనే షూట్ చేశారు. కానీ చూస్తున్నంతసేపు ఏ మాత్రం బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా? పిహుకి ఏం కాదుగా అని మనం టెన్షన్ పడేలా చేస్తుంది. కేవలం గంటన్నరే ఉంటుంది. కానీ మూవీ పూర్తయిన తర్వాత మనల్ని పిహు పాత్ర వెంటాడుతుంది. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేసి పడేసింది. ఎలా ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేశారో గానీ మూవీ చూసిన తర్వాత మాత్రం పాప క్యూట్‌నెస్, యాక్టింగ్‌కి ఫిదా అయిపోతాం.చాలామంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా.. వస్తువులతో ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారు. కానీ అవి ఎంత ప్రమాదం అనేది పిల్లలకు కచ్చితంగా చెప్పాలి బాబోయ్ అని 'పిహు' చూసిన తర్వాత మీకు పక్కా అనిపిస్తుంది. ఇప్పటికే మీకు పిల్లలున్నా, త్వరలో పిల్లల్ని ప్లాన్ చేస్తున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అర్జెంట్‌గా ఈ మూవీ చూడండి. హిందీలో అందుబాటులో ఉంది. వేరే భాష అని కంగారు పడాల్సిందేం లేదు. ఈ మువీలో డైలాగ్స్ కంటే సీన్స్ ఎక్కువ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తప్పక చదవండి
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు
- ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
- తిండి మానేసి ఛాన్సులిమ్మని బతిమాలుకున్నా..: నటుడు
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
- ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
- మోదీ ప్రమాణా స్వీకారోత్సవానికి అతిధులుగా మహిళా లోకో పైలట్లు!
సినిమా
ఆమెతో జోడీయే ఇష్టపడ్డారు.. నేను ప్రేమించిన నటిని తిట్టిపోశారు!
స్క్రీన్ మీద కనిపించే కొన్ని జంటలను ప్రేక్షకులు ఇష్టపడతారు. రియల్ లైఫ్‌లో కూడా వారిని జోడీలాగే చూడాలనుకుంటారు. అలా కాకుండా వేరొకరిని ప్రేమిస్తే అస్సలు సహించలేరు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి కున్వర్ అమర్జీత్- చార్లీ చౌహన్ జంటకు ఎదురైంది. దిల్ దోస్తీ డ్యాన్స్ అనే సీరియల్లో కున్వర్ రేయాన్ష్ సింఘానియా పాత్రలో నటించాడు. ఈ రోల్‌తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆన్‌స్క్రీన్‌లో ఆమెతో.. ఆఫ్ స్క్రీన్‌లో మరొకరితో..ఇందులో అతడు నటి శక్తి మోహన్‌తో జోడీ కట్టాడు. వీళ్లు రియల్ లైఫ్‌లో కూడా జంటగా కలిసుంటే చూడాలని ముచ్చటపడ్డారు ఫ్యాన్స్. కానీ కున్వర్.. మరో నటి చార్లీ చౌహన్తో ప్రేమలో పడ్డాడు. ఇది అభిమానులకు మింగుడుపడలేదట. మీ జోడీ బాగోలేదని ముఖం మీదే చెప్పారట! దీని గురించి కున్వర్ మాట్లాడుతూ.. దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్లోని నా పాత్రను ప్రేక్షకులు ప్రేమించారు. తనను ద్వేషించారుఅందులో నాతో జోడీ కట్టిన అమ్మాయినే ప్రేమించాలని భావించారు. కానీ అప్పుడు నేను చార్లీతో లవ్‌లో పడ్డాను. దీంతో జనాలు ఆమెను ఎక్కువ ద్వేషించారు. తిట్టుకున్నారు. మేము దాదాపు నాలుగేళ్లు కలిసున్నాం. తర్వాత పరిస్థితులు కూడా మారిపోవడంతో విడిపోయాము అని చెప్పుకొచ్చాడు. కాగా వీళ్లిద్దరూ కలిసున్నప్పుడు నాచ్ బలియే ఐదో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: 550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
హీరో శివ రాజ్‌కుమార్‌పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ను బావమరిది కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గలో శివ భార్య గీత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ బాధలో ఉండగానే బావమరిది, బీజేపీ నేత కుమార బంగారప్ప హేళనలు ఆయన అభిమానులను మరింత వేదనకు గురిచేశాయి. కుమార బంగారప్ప ఇంటిని హీరో శివరాజ్ కుమార్ అభిమానులు శనివారం ముట్టడించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ కుటుంబాల గురించి కుమార ఇటీవల చులకనగా మాట్లాడారు. అది తమకు బాధకు గురి చేసిందని, ఆయన బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని అభిమానులు పట్టుబట్టారు. బెంగళూరులో సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటి గేట్ లోపలికి చొరబడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ రాజ్‌కుమార్ ఫొటోలను ప్రదర్శించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరుతుండగా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంటి నుంచి వెళ్లాలని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆ తరువాత కేఎస్ఆర్పీ పోలీసులతో అధిక భద్రత కల్పిపించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీప పార్కు చుట్టుపక్కల నిల్చున్నవారిని సైతం నిర్బంధించారు. హేళనగా కుమార పోస్టు తన సోదరుడు, మంత్రి మధు బంగారప్ప, సోదరి గీతాను, గీతా భర్త శివరాజ్‌కుమార్ గురించి సోషల్ మీడియాలో హేళనగా రాశారు. శివరాజ్‌కుమార్ నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. మా గ్రామ జాతరలో నృత్యం చేసే పనికి దరఖాస్తు వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నా చెల్లెలు గీతా.. సినిమా డ్యాన్సర్ కాబట్టి ఊరికే ఉండాల్సిన పని లేదు. దొడ్డమనె వ్యవహారం చాలా ఉంటుంది. వేరేవారికి అవకాశం లభించరాదు. బెదిరించడం, భయపెట్టడం, హుషార్ అనే మాటలు ఏమున్నా గొంతు లోపలే, నాలుగు గోడల లోపలే ఉండాలి. మా సైన్యం ఆన్‌లోనే ఉంటుంది అని హెచ్చరికలు చేశారు.pic.twitter.com/6YPDJcjkmh— Kumar Bangarappa (@kumarbangarappa) June 4, 2024
550 సార్లు రీ-రిలీజ్ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్... ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన 'ఓం' ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్ చేయడం అనేది ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్' పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్లో 'అర్జున్‌పండిట్' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్ చేశారు.
ఫొటోలు
క్రీడలు
39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చెత్త రికార్డు..ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.వెస్టిండీస్ అరుదైన రికార్డు..టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులోకి గేమ్ ఛేంజర్! ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో- దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తోంది. ఈ బ్లాక్‌బ్లాస్టర్ క్లాష్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఐర్లాండ్‌పై విజయం సాధించి సమరోత్సహంతో భారత్ బరిలోకి దిగనుండగా.. పసికూన చేతిలో ఓడిన పాక్ మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. న్యూయర్క్ వికెట్ స్పిన్‌కు అనుకూలించడంతో పాటు పాక్‌పై కుల్దీప్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. అదే విధంగా కుల్దీప్ కూడా ఇటీవల అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఒక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.మరోవైపు పాకిస్తాన్ కూడా ఓ మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ స్ధానంలో ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తుది జట్లు(అంచనా)భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
తొలి ఎమ్ఎమ్ఎ ఫైటర్‌గా రికార్డు.. ఎవరీ పూజా తోమర్?
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది. లూయిస్విల్లే వేదికగా శనివారం జరిగిన గేమ్‌లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను 30-27, 27-30, 29-28 తేడాతో ఓడించి పూజా విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై పూజా పై చేయి సాధించగా.. రెండో రౌండ్లో మాత్రం అమండా డోస్ శాంటోస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి పూజా వరుస కిక్‌లతో అమండా డోస్ శాంటోస్‌ను వెనక్కి నెట్టింది. దీంతో మూడు రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా.. యూఎఫ్‌సీ ఛాంపియన్‌గా నిలిచింది.ఎవరీ పూజా?28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించింది. పూజా వుషు( చైనీస్ యుద్ధ కళ)తో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని పూజా ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳- She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024
WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు.
బిజినెస్
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
సంకలనాలు కలిగిన పిండి మిశ్రమాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. అవి తక్కువ పన్ను రేటు చట్టంలో పేర్కొనని ఆహార పదార్థాల తరగతి కిందకు వస్తాయని పేర్కొంది.ఇడ్లీ, ధోక్లా, దహీ వడ వంటి వంటకాలకు పిండి మిశ్రమాలను విక్రయించే గాంధీనగర్‌కు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. ఈ పిండి మిశ్రమాలను 5 శాతం పన్ను రేటు ఉన్న కేటగిరీ కింద వర్గీకరించాలని కంపెనీ వాదించింది.చట్టంలో పేర్కొనని నిష్పత్తిలో మసాలా దినుసులు, ఇతర పదార్ధాలతో పిండి మిశ్రమాలు తక్కువ పన్ను రేటును క్లెయిమ్ చేయలేవని అథారిటీ మే 29న ఒక ఉత్తర్వులో తెలిపింది. గుజరాత్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ గతంలో ఇచ్చిన ముందస్తు తీర్పును ఈ నిర్ణయం సమర్థించింది.
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్‌పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్‌బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు.
వీడియోలు
52 మందితో మోడీ క్యాబినెట్
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్
డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
మంత్రి పదవి ఎవరెవరికి ?
ఫ్యామిలీ
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్‌హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్‌హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని నీట్‌గా మారుస్తుంది.ఈ డివైస్‌లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్‌ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్‌హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్‌తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్‌తో సెన్సిటివ్ స్కిన్‌కి, మూడో లెవెల్ ఆప్షన్‌తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్‌తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్‌తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..
తుమ్ములు కొందరికి చిన్నగా వస్తే..మరికొందరికి పెద్దగా వస్తాయి. పెద్ద సౌండ్‌తో ఫోర్స్‌గా వచ్చే తుమ్ములతో చెవులు మూసుకుపోయినట్లు ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేగానీ ఏకంగా పొట్ట చీల్చుకుని ప్రేగులు రావడం చూశారా..?. ఔను ఓ వ్యక్తికి పెద్దగా ఫోర్స్‌గా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి ఏకంగా పొట్లలోని ప్రేగులు బయటకొచ్చాయట. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి రెస్టారెంట్ వెళ్లాడు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా హఠాత్తుగా పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తర్వాత కొద్దిపాటి దగ్గు కూడా వచ్చింది. అంతే కొద్దిసేపటికి పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిచిపోయి, నొప్పితే విలవిలలాడాడు. ఏం జరిగిందని భార్య పరిశీలించి చూస్తే అతని పొట్ట భాగం నుంచి పెద్ద ప్రేగులు పోడుచుకుని వచ్చినట్లుగా బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన అతడి భార్య వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేయడంతో.. వాళ్లు వెంటనే బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సైతం అతడి కేసుని చూసి షాక్‌కి గురయ్యారు. ఇది అత్యంత అరుదైన కేసు అని అన్నారు. అయితే ఈ ఘటనలో బాధితుడు అదృష్టవశాత్తు పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోలేదని అన్నారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి పెద్ద ప్రేగును జాగ్రత్తగా ఉదరకుహరంలోకి చేర్చారు. పొత్తికడుపు ఎనిమిది కుట్లు వేశామని, తెరుచుకునే అవకాశమే లేదని తెలిపారు. అసలు ఇలా ఎందుకు జరిగిందంటే..? సదరు వ్యక్తి గత కొంతకాలం ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడ్డాడని అన్నారు. ఇటీవలే ఉదర శస్త్ర చికిత్స చేయించుకోవడంతో, ఇలా జరిగిందని వైద్యులు వివరించారు. వామ్మో..పొట్టకు సర్జరీ చేయించుకున్నవాళ్లు తుమ్ము, దగ్గు వంటివి రాకుండా జాగ్రతపడటం మేలు కదా..లేదంటే అంతే పరిస్థితి.(చదవండి: బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్‌లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్‌లో రెస్టారంట్‌ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు.
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్‌లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్‌లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్‌డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మిర్యాలగూడలో గ్యాంగ్‌వార్
మిర్యాలగూడ అర్బన్: సినిమాల ప్రభావంతో నేటి యువత విలనిజమే హీరోయిజంగా ఫీలవుతున్నారు. దీంతో బయట కూడా సినిమాల్లో లాగా అనుకరిస్తూ పెడదోవ పడుతున్నారు. చిన్నచిన్న గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. బర్త్‌డేలకు కూడా డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తమ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నిత్యం ఏదో ఒక వీధిలో గ్యాంగ్వార్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దారి తప్పుతున్న యువతను గాడిలో పెట్టేదెవరు..? అని వారి చేష్టలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.మత్తుకు బానిసలుగా మారుతున్నారిలా..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గుర్తించే అవకాశం ఉండేది. దీంతో ఆ పిల్లాడికి పలు ఉదాహారణలతో మంచి విషయాలపై అవగాహన పెంచేవారు. ఈవిధంగా కుటుంబం నుంచే క్రమశిక్షణ నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాలు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలను గమనించేవారు లేకుండా పోతున్నారు. దీంతో పిల్లలు ఏం చేస్తున్నారు..? అతడి మానసిక స్థితి ఏవిధంగా ఉంది..? అని పరిశీలించేవారు లేకపోవడంతో ముందుగా స్నేహితులతో సరదాగా సిగరెట్, గుట్కా వంటి వాటికి అలవాటు పడుతూ క్రమంగా గంజాయి తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మిర్యాలగూడలో గంజాయికి బానిసైన యువకులు సుమారు 2 వేలకు పైగానే ఉంటారని సమాచారం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసికస్థితిని అర్ధం చేసుకుని వారికి సరైన దిశానిర్ధేశం చేయడం వలన యువత మత్తుకు బానిసలు కాకుండా.. పెడదోవ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.మిర్యాలగూడలో ఇటీవల జరిగిన గ్యాంగ్వార్లు..👉 మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న వైన్స్ వద్ద ఇటీవల రాత్రి సమయంలో కొందరు యువకులు కలిసి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. దీంతో ఆ యువకుడికి తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.👉రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో రాత్రి సమయంలో తల్లీకుమార్తె నడుచుకుంటూ వెళ్తుండగా.. మత్తులో ఉన్న యువకులు వెకిలి చేష్టలు చేయడంతో వారు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.👉 పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఓ వీధిలో గత నెల ఫుట్‌బాల్ ఆటలో తలెత్తిన వివాదంలో రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.👉 పట్టణంలోని తాళ్లగడ్డ, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, బాపూజీనగర్‌లో ప్రతి రోజు ఏదో గొడవ జరగుతుండగా.. గొడవలు పడిన వారు మత్తులో ఉన్నప్పుడే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.పట్టించుకోని పోలీసులు ..రోజురోజుకు పెరుగుతున్న గ్యాంగ్వార్లను అరికట్టాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగానే పలువురు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విడిపిస్తుండటంతో సదరు యువకులు మరింత పెట్రేగిపోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ముందుకుపోతే నుయ్యి.. వెనుకకు పోతే గొయ్యి అన్న చందంగా మారిందని, పోలీసులు కూడా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నారని పోలీస్ శాఖ సిబ్బందే చెబుతుండటం విశేషం.యువకుడిపై విచక్షణారహితంగా దాడిమిర్యాలగూడ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చెలరేగి ఓ యువకుడిపై మరికొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గాయాలపాలైన యువకుడు శనివారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దుయువత క్రమశిక్షణతో తమ చదువులు, కెరియర్‌పై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారి మానసికస్థితి, వారి ప్రవర్తనను గమనిస్తూ పెడదోవ పట్టినట్లు తెలిస్తే వెంటనే వారికి ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు మంచి జీవితం ఇచ్చిన వారమవుతాం. యువత చెడుమార్గం పట్టి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు.– రాజశేఖరరాజు, మిర్యాలగూడ డీఎస్పీ