Top Stories
ప్రధాన వార్తలు
వెబ్ కాస్టింగ్ హైజాక్! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తి ‘పచ్చ’పాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్థారిస్తోంది. విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ పోలింగ్ బూత్ వీడియోలను ఎడిట్ చేసి విడుదల చేయడం ఏమిటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్‌కు చేరిపోయాయి? అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటవేత వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదులను నిర్ఘాంతపరుస్తోంది. నిష్పాక్షికంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా? అని విస్తుపోతున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితోపాటు పోలింగ్ రోజు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్.శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ నుంచి క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల వరకూ అందరూ టీడీపీ అక్రమాలకు అండగా నిలిచినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్ సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంత చేసినా గెలవలేమనే నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడేలా పథకాన్ని రూపొందించాయి. పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వెబ్ కాస్టింగ్‌పై ‘పచ్చ ముఠా’ పెత్తనం ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియను చంద్రబాబు ముఠా హైజాక్ చేయడం విస్మయం కలిగిస్తోంది. వెబ్ కాస్టింగ్‌పై ఈసీకి నియంత్రణ లేదా? ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులైన ప్రైవేట్ వ్యక్తులకు అందుబాటులోకి తెచి్చందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని 46,389 ఎన్నికల కేంద్రాలకుగానూ 31,380 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డ్ చేశారు. అత్యంత సమస్యాత్మక 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలతోపాటు ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను చంద్రబాబు ముఠా తమ గుప్పిట్లోకి తీసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ వీడియో రికార్డింగ్ అంటూ నారా లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేయడం అందుకు నిదర్శనం. తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఈసీ చెబుతోంది. అలాంటప్పుడు ఎలా లీక్ అయింది? వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు పొక్కడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం వెబ్ కాస్టింగ్ పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉంటుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ అయ్యే వీడియోలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. వెబ్‌కాస్టింగ్ లింక్ ను జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాటిని కలెక్టర్‌తోపాటు ఐజీ, ఎస్పీ పరిశీలిస్తారు. వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ కోసం ప్రైవేట్ ఏజెన్సీలను వినియోగించారు. పోలింగ్ తరువాత వెబ్ కాస్టింగ్ హార్డ్ కాపీని ప్రైవేట్ ఏజెన్సీ కలెక్టర్‌కు అందచేస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ వర్గీయులు కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి చొరబడ్డారు. ‘స్వామి’ భక్తి... 7 ఈవీఎంలు ధ్వంసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పల్నాడులో క్షేత్రస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకు పురందేశ్వరి సమరి్పంచిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించారు. రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్ ఎల్.శివశంకర్ కూడా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డీఎస్పీ పల్లపురాజు, మాచర్ల సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, ఎస్సై ఎం.రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ ద్వారా టీడీపీ కథ నడిపింది. అత్యంత వివాదాస్పదుడైన నారాయణస్వామిని కారంపూడి సీఐగా నియమించడమే అందుకు నిదర్శనం. టీడీపీ రౌడీమూకలు వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నా, పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రేక్షక పాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం దాడులతో విరుచుకుపడ్డారు. సీఐ నారాయణ స్వామి పరిధిలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం గమనార్హం. ఆయన పరిధిలోనే పాల్వాయి గేటు కూడా ఉంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సీఐ నారాయణస్వామి పరిధిలో ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు. కౌంటింగ్ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పిన్నెల్లిపై కుట్రపూరిత కేసు.. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో సీఐ నారాయణ స్వామి పూర్తిగా చంద్రబాబు సేవలో తరిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా గురువారం రాత్రి కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించగా అప్పటికప్పుడు మరో తప్పుడు కేసు నమోదు చేయడం నారాయణ స్వామి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పది రోజుల క్రితం ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో పిన్నెల్లి సోదరులను తాజాగా నిందితులుగా చేర్చడం గమనార్హం. పల్నాడులో పచ్చ ముఠాలు పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో మొత్తం 23 గంటల రికార్డింగ్‌లో ఎడిట్ చేసిన రెండు నిమిషాల వీడియో క్లిప్ మాత్రమే విడుదల కావడం వెనుక పచ్చ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తోపాటు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్.శివశంకర్ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారారని వెల్లడవుతోంది. పల్నాడు జిల్లా కమాండ్ కంట్రోల్ నుంచే వెబ్ కాస్టింగ్ రికార్డింగ్‌ను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి లీక్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏడు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రౌడీమూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్ కావడం వెనుక చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది. మరి దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? పవన్, బాలయ్య ప్రత్యేకమా?పోలింగ్‌కు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ.. టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసింది. నిబంధనల ప్రకారం ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్ బూత్‌లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబరు 197లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దర్జాగా ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. దీనిపై ఈసీ కనీసం స్పందించలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదు. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ నోరు మెదపలేదు.
LS 2024: కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్
Updates ఢిల్లీ:ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓటు వేశారు.ఆయన ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi pic.twitter.com/chqk73Ydxs— ANI (@ANI) May 25, 2024 ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఓటు వేశారు.#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్:పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్, అనంత్‌నాగ్- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు.#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti along with party leaders and workers sit on a protest. She alleged that the police have detained PDP polling agents and workers without any reason. pic.twitter.com/dPJb4dolKQ— ANI (@ANI) May 25, 2024 ఓటేసిన తెలంగాణ గవర్నర్ రాంచీ:జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఢిల్లీ:ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు#WATCH | Delhi minister & AAP leader Atishi casts her vote for #LokSabhaElections2024, at a polling booth in Delhi pic.twitter.com/AdfX0qlvkW— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Delhi: Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh casts his vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Ranchi. pic.twitter.com/UoaWLUxEg7— ANI (@ANI) May 25, 2024 ఒడిశా:బీజేడీ నేత వీకే పాండియన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పొలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | 5T Chairman and BJD leader VK Pandian casts his vote for the sixth phase of #LokSabhaElections2024 and third phase of Odisha Assembly elections, at a polling booth in Bhubaneswar. pic.twitter.com/WBOdNJ4ZSX— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంబీర్ ఓటు వేశారు.#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq— ANI (@ANI) May 25, 2024 జమ్మూ కశ్మీర్జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజౌరీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంత్ నాగ్-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెస్స్ (జేకేఎన్సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.#WATCH | Jammu and Kashmir BJP President Ravinder Raina casts his vote at a polling booth in RajouriJammu and Kashmir National Conference (JKNC) has fielded Mian Altaf Ahmad from the Anantnag-Rajouri Lok Sabha seat. PDP has fielded Mehbooba Mufti from this seat.… pic.twitter.com/LmEFuMkIOt— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో దిగారు.ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్‌ను పోటీకి దింపింది.#WATCH | Delhi BJP president Virendraa Sachdeva casts his vote at a polling booth in Mayur Vihar Phase 1. BJP has fielded Harsh Malhotra from East Delhi Lok Sabha seat. AAP has fielded Kuldeep Kumar#LokSabhaElections2024 pic.twitter.com/I9ftlwnS12— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీన్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj casts her vote for the sixth phase of #LokSabhaElections2024 , at a polling station in Delhi.AAP has fielded Somnath Bharti from the New Delhi Lok Sabha seat. pic.twitter.com/hCM2o3wqjx— ANI (@ANI) May 25, 2024 ఢిల్లీ:విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | External Affairs Minister Dr S Jaishankar casts his vote at a polling booth in Delhi, for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/SbWDv9jWZc— ANI (@ANI) May 25, 2024 హర్యానా:హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మీర్జాపూర్ గ్రామంలో ఓటు వేశారు.#WATCH | Haryana CM Nayab Singh Saini, his wife Suman Saini show their inked fingers after casting their votes at a polling booth in his native village Mirzapur, Narayangarh pic.twitter.com/TojCp0ygbU— ANI (@ANI) May 25, 2024ఢిల్లీ:ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులుఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్ఢిల్లీ:కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుUnion Minister Hardeep Singh Puri, his wife Lakshmi Puri show their inked fingers after casting their votes at a polling booth in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/j9norx9jL1— ANI (@ANI) May 25, 2024 ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరంమహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీPrime Minister Narendra Modi tweets "I urge all those who are voting in the 6th phase of the 2024 Lok Sabha elections to vote in large numbers. Every vote counts, make yours count too. Democracy thrives when its people are engaged and active in the electoral process. I specially… pic.twitter.com/bqM3ba2Okq— ANI (@ANI) May 25, 2024 ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీ- కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.పురీలో సంబిత్ పాత్ర- అరూప్ పట్నాయక్ పోటీ పడుతున్నారు.హర్యానాలోని కార్నాల్‌లో మనోహర్ లాల్ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు. హర్యానా: హర్యానా మాజీ సీఎం, కర్నాల్ బీజేపీ అభ్యర్థి మనోహర్ లాల్ కట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కర్నాల్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Former Haryana CM and BJP candidate from Karnal Lok Sabha seat, Manohar Lal Khattar casts his vote at a polling booth in Karnal, HaryanaCongress has fielded Divyanshu Budhiraja from this seat. pic.twitter.com/owrFUNtzXy— ANI (@ANI) May 25, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది.Voting for the sixth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 58 constituencies across 8 states and Union Territories (UTs) today. Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/leDZIY9HIa— ANI (@ANI) May 25, 2024 కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం కానుందిలోక్సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.#WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling booth in Ranchi to cast their votes; voting will begin at 7 amJharkhand's 4 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/nPm398UfeM— ANI (@ANI) May 25, 2024 హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rajouri, J&KJammu and Kashmir's Anantnag-Rajouri constituency constituency will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/15zvuLK08k— ANI (@ANI) May 25, 2024 మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.#WATCH | #LokSabhaElection2024 | Preparations, mock polls underway at a polling booth in Rohtak, HaryanaHaryana's 10 constituencies will undergo polling in the 6th phase of the 2024 general elections. pic.twitter.com/p2Cws1ktcr— ANI (@ANI) May 25, 2024 హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే.
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024
May 25th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 24th AP Elections 2024 News Political Update8:00 AM, May 25th, 2024వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యచిత్తూరుఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యమృతుడు పుంగనూరు శేషాద్రిమదనపల్లెలోని శ్రీవారి నగర్లో ఈ ఘటన జరిగింది.తెల్లవారుజామున నివాస గృహంలోకి చొరబడిన దుండగులు హత్య చేసి పరారుకేసు నమోదు చేసుకొని విచారిస్తున్న పోలీసులు 7:25 AM, May 25th, 2024బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లైలో టీడీపీ అనుచరులుడ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు టీడీపీ నేతలు, కార్యకర్తలే. బెంగళూరు రేవ్ పార్టీలో పచ్చ బ్యాచ్‌కు లింక్. చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు కీలక వ్యక్తులురేవ్ పార్టీకి వీరే డ్రగ్స్ సప్లయర్స్. చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులుపూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024 7:00 AM, May 25th, 2024వెబ్ కాస్టింగ్ హైజాక్! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్ బటన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలుప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు 6:50 AM, May 25th, 2024పీకేవన్నీ తప్పుడు అంచనాలేగతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితంప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకేఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్ ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు 6:40 AM, May 25th, 2024ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?పోలింగ్‌కు రెండు రోజుల ముందు కారంపూడి సీఐగా నారాయణస్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోని సీఐ అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు 6:30 AM, May 25th, 2024మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రఅందుకు ఈసీలోని కొంతమంది సహకారం చంద్రబాబు, పవన్‌లకు మరో 10 రోజులే కలలుగనే అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కు బాసట వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే
సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్ఆర్ కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటరి్నంగ్ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాలను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్‌లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్
Rasi Phalalu: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు..!
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.విదియ సా.6.39 వరకు, తదుపరి తదియ నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.35 వరకు, తదుపరి మూల, వర్జ్యం: సా.6.39 నుండి 8.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.30 నుండి 7.07 వరకు అమృతఘడియలు: తె.4.33 నుండి 5.24 వరకు(తెల్లవారితే ఆదివారం). మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం: నూతన పరిచయాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.కర్కాటకం: వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.సింహం: బంధువులతో తగాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కన్య: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.మకరం: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. గృహయోగం. చర్చలు సఫలం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా పడతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. రుణయత్నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
తప్పక చదవండి
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- హైదరాబాద్‌పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
- జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
సినిమా
కాంబినేషన్ కుదిరింది
‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గుప్తాఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది.‘‘మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్ తేజ్‌కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.
పెట్స్‌తో శ్రీవల్లి ఫోటోలు.. విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
గతేడాది యానిమల్తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ జోడీగా కనిపించనుంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పుష్పలో శ్రీవల్లిగా సినీ ప్రియులను అలరించింది. దీంతో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్ డాగ్స్, క్యాట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందని రాసుకొచ్చింది. మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నా అంటూ పోస్ట్ చేసింది.అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక దిగిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్ డాగ్ కూడా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఫ్యాన్స్ శ్రీవల్లి బ్యూటిఫుల్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫోటోల్లో విజయ్ దేవరకొండ పెట్‌డాగ్ కూడా కనిపించడంతో ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలో రష్మిక చాలాసార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు రూమర్స్ కూడా వచ్చాయి.Anytime I find a fur ball around me.. it feels like a universal compulsion for me to spend a good amount of time with them.. and I was going through my gallery from since forever and these are some lovely moments I haven’t been able to share with you.. ❤ so here.But on the… pic.twitter.com/ETEWkTNxpB— Rashmika Mandanna (@iamRashmika) May 24, 2024
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై స్టార్ జోడీ..!
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జంటగా నటించిన చిత్రం 'మిన్సార కనవు'. 1997లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికీ దాదాపు 27 ఏళ్లు పూర్తవుతోంది.తాజాగా ఈ జోడీ మళ్లీ తెరపై జంటగా సందడి చేయనుంది. టాలీవుడ్ చిత్రనిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ 27 ఏళ్ల కాజోల్, ప్రభుదేవా నటించడం సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచుతోంది. వీరితో పాటు ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసి.. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
'మీ రేటు కార్డ్ సిద్ధం చేస్తాం'.. రెడీగా ఉండమని చెప్పాడు: హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురై ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఏదో ఒక సందర్భంలో రివీల్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ నటి తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి మహి విజ్ ఆ షాకింగ్ సంఘటనను వెల్లడించింది.తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కోఆర్డినేటర్‌గా చెప్పుకునే వ్యక్తి నుంచి తనకు కాల్ రావడంతో ముంబయిలోని జుహూ వెళ్లానని తెలిపింది. అతని కారులోనే తన సోదరితో కలిసి వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అతను మాకు ఆల్బమ్‌లోని కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ ఆల్బమ్‌లో మీ ఫోటో కూడా ఉంచుతాం.. మీ రేట్ కార్డ్ సిద్ధంగా ఉంటుందని మాతో అన్నాడని తెలిపింది.అయితే దీనిపై మొదట్లోనే నెగెటివ్‌గా ఆలోచించవద్దని.. ఒక్క రోజు షూటింగ్‌కి రేటు కార్డు ఎంత అని అడిగాను.. దానికి అతని బదులిస్తూ.. మేడం మీరు క్రూయిజ్‌కి వెళ్తారా? దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మాతో అన్నాడు. దీంతో వెంటనే తప్పుడు వ్యక్తిని కలిశానని మాకు అర్థమైంది. కారు వెనకసీట్లో కూర్చున్న మా సోదరి అతన్ని జుట్టు పట్టి లాగింది. దీంతో వెంటనే కారు నుంచి దిగి అక్కడి నుంచి వచ్చేశామని మహి విజ్ తెలిపింది. క్రూయిజ్ షిప్లో అందరిముందు అశ్లీలనృత్యం చేసేందుకు సంప్రదించాడని మాకు అర్థమైందని మహి వెల్లడించింది.కాగా.. బాలికా వధు సీరియల్లో నందినిగా.. లాగీ తుజ్సే లగన్లో నకుషా పాత్రలతో మహి విజ్ మంచి పేరు తెచ్చుకుంది. ఢిల్లీలో జన్మించిన ఆమె 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబయి వచ్చింది. అయితే బుల్లితెర ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించే కంటే ముందే మహి తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కనిపించింది. తెలుగులో సిద్ధార్థ్ నటించిన తపన చిత్రంలో మహి నటించింది.
ఫొటోలు
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
క్రీడలు
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024
రాజస్తాన్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది.
చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్‌లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్‌లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్‌లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు.
టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన..
అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా,ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌లను సైతం ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి పాక్ సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్
బిజినెస్
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది.
భారత్ చైనాను ఎలా అధిగమిస్తుందంటే?.. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫార్ములా
ఇండియా కేవలం చైనాతో భౌగోళిక సరిహద్దును పంచుకోవడమే కాకుండా.. ఆర్ధిక వ్యవస్థలో కూడా ప్రత్యర్థిగా కూడా ఉంది. చైనా జీడీపీ భారత్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ. అయితే భారత్ భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.పారిశ్రామిక రంగంలో చైనాను అధిగమించేందుకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు. పౌరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ఆదాయంతో పాటు ఏటా లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే మన దేశం చైనాను తప్పకుండా అధిగమిస్తుందని అన్నారు.మానవ వనరుల ఉత్పాదకతను పెంచడానికి 'ఏఐ'ను తగినంతగా ఉపయోగించాలి. సాధారణ ఏఐ ప్రజల సామర్థ్యాన్ని పెంచుతూ సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇది మన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.దేశీయ తయారీని పెంచడానికి భారత ప్రభుత్వం ఈ దశాబ్దం ప్రారంభంలో సుమారు రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి, భారతదేశ వార్షిక జీడీపీ వృద్ధి శాతం 9కి చేరుకోవచ్చు. చైనా వృద్ధి రేటు 3.5 శాతానికి పడిపోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగితే చైనాను భారత్ అధిగమించగలదని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
బిలినీయర్, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' ఇటీవల ఎక్స్(ట్విటర్)లో ఓ యూజర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఎన్ బార్క్స్‌డేల్ అనే యూజర్ ట్విటర్లో వచ్చిన మార్పులు గురించి, చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. ''ఐ లవ్ ట్విటర్ అంటూ.. ఇప్పటివరకు ఇందులో చెత్త ఫీచర్ ఏమిటంటే, నేను యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరంగా అనిపించే ట్వీట్‌ని చూస్తాను, ఆపై ఫీడ్ రిఫ్రెష్ అవుతుంది. దాన్ని మళ్ళీ కనుగొనలేకపోతున్నాను'' అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎంతోమందికి ఎదురైంది. ఇది సరైనదేనా అంటూ ప్రశ్నించారు.యూజర్ ప్రశ్నకు మస్క్ రిప్లై ఇస్తూ.. అవును, మేము దీన్ని సరి చేస్తున్నాము, కాబట్టి మీరు ఆసక్తికరమైన పోస్ట్‌లను చూడటానికి వెనుకకు స్క్రోల్ చేయవచ్చు'' అని ట్వీట్ చేశారు. తన ప్రశ్నకు రిప్లై ఇచ్చిన ఇలాన్ మస్క్‌కు.. బార్క్స్‌డేల్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Yeah, we’re fixing this so you can scroll back to see interesting posts— Elon Musk (@elonmusk) May 23, 2024
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు.
వీడియోలు
వైఎస్ఆర్సీపీ దే అధికారం.. టచ్ లో కేంద్ర బీజేపీ నేతలు
వైసీపీ గెలుస్తుందన్న జీవిఎల్.. బీజేపీ నేత రియాక్షన్
Magazine Story: జెండా పీకేస్తారా..!
బిర్రుగా బీరు ఏస్తున్న జంట
సోషల్ మీడియా అసాంఘిక శక్తులు బలి తీసుకున్న జీవితాలు
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 25 May 2024
ఆరోగ్యశ్రీ ఆగలేదు.. పచ్చ మీడియా కుట్ర
తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక విషయాలు
ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఫ్యామిలీ
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్‌లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్‌కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్‌లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్‌కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్‌మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్‌ను స్టూడెంట్స్‌తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్‌కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్‌మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద.
వరల్డ్ ఫ్యామస్ మీమ్ డాగ్ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు
సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినా జపనీస్ కుక్క(19) ఇకలేదు. సోషల్ మీడియాలో మీమ్స్ ఐకాన్ కబోసు "డాగీ" కన్నుమూసింది. ఈవిషయాన్ని కబోసు యజమాని అత్సుకో సాటో ప్రకటించారు. "మే 26 ఆదివారం నాడు కబో-చాన్‌కు వీడ్కోలు పార్టీ"ని నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో డాగ్ లవర్స్, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆర్ఐపీ కబోసు సందేశాలు వెల్లువెత్తాయి.Rest in Peace, Doge 💔Doge मीम के पीछे का, करोड़ों लोगों के चेहरों पर मुस्कान लाने वाला जापानी कुत्ता काबोसु (kabosu) 18 साल की उम्र में मर गया, लेकिन काबोसु हमेशा ज़िंदा रहेगा। ❤Miss u kabosu 😥Kabuso the dog behind this meme died , RIP Doge 💔 pic.twitter.com/LLDfWp7xcU— Jayesh Jha (@imjayeshjha) May 24, 2024క్రిప్టోకరెన్సీ డాగ్కాయిన్ను, సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్గా షిబా ఇను కబోసు పేరుగాంచింది. లుకేమియా , కాలేయ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే అన్నం తిని పుష్కలంగా నీళ్ళు తాగిందనీ, గాఢ నిద్రలో ప్రశాతంగా కన్నుమూసిందని సాటో తెలిపారు. 2022లో లుకేమియా , కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు.
బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్‌కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్‌తో కాపురానికి పంపించారు. విచక్షణ కోల్పోయి..రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్‌ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్‌ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్‌కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందు ముందే.. కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య
కోటపల్లి: మండలంలోని సర్వాయిపేట గ్రా మానికి చెందిన ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన ఘటన మండలంలో సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేటకు చెందిన కోట రాజేశ్ (40), నాయిని చీకటి (28) కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. వెలమపల్లి జాతీయ రహదారి పక్కన గల ఇటుకల కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలో వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటుకల కంపెనీలో పనిచేసే మిగతా కూలీలు సామగ్రి భద్రపరిచేందుకు వెళ్లి గుర్తించారు. స్థానికులకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబీకులు ఇరువురి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కారణలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రమాదం గురించి వైర్‌లైస్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్, అశ్వినీ అనే ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.