Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan_Gajuwaka
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్‌

విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. మీటింగ్‌కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్‌ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్‌ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్‌ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. వైస్‌ఆర్‌సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్‌టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్‌, రేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్‌ వివరించారు. సీఎం జగన్‌ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలువిశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేస్తా.. జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచేఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండిలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిసస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారుప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండివెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయాబాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటిప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదుగాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్‌ అమ్మేయమన్నట్లేగాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందిఇక్కడ టీడీపీ, ఎన్‌డీఏ గెలిచిందంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారుప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్‌ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారుఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి  

Land Title Act Total Picture
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..

సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గెజిట్‌ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అప్పిలేట్‌ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్‌ రిజిస్ట్రేషన్, అప్పిలేట్‌ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్‌ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్‌ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం  కోసం ప్రొఫెసర్‌ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్‌ టైటిల్‌ ఆఫ్‌ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్‌ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్‌ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్‌లైన్‌లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్‌ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్‌ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్‌ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ యాక్ట్‌’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్‌ విడుదల చేసింది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్‌ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్‌ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్‌ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్‌ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్‌ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్‌ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్‌ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్‌ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్‌ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్‌ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్‌ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్‌ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్‌ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్‌. దీన్ని అప్పిలేట్‌ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్‌ అథారిటీ లేదా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్‌ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్‌ టైటిల్‌ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్‌ టైట్లింగ్‌ ఆఫీసర్, అప్పిలేట్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్‌ రిజిస్టర్‌ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఈ సమస్యకు చెక్‌ పెడుతుంది.

IMD Issues Heavy Rain Alert In Hyderabad
హైదరాబాద్‌లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్‌

మండుటెండలతో అల్లాడిన హైదరాబాద్‌కు మరో చిక్కొచ్చి పడింది. వేడి చల్లారుతుందనుకుంటే.. వరుణదేవుడు అంతకు మించిన ప్రతాపం చూపించాడు. సాయంత్రం 5.30గంటల నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా ఉదృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడప్పుడే ఆఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. టూవీలర్లు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.హైదరాబాద్‌కు వార్నింగ్‌అయితే రాబోయే సమయంలో హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్‌ హైదరాబాద్‌ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. వాతావరణాన్ని అంచనా వేసే వెబ్‌సైట్లు అక్యువెదర్‌ ప్రకారం ఈ సాయంత్రమంతా హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతం, ఉత్తర తెలంగాణకు తీవ్ర వర్షం పొంచి ఉన్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఏపీలో వర్షాలు పడతాయని, సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడతాయని అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే భారీగా వర్షాలు కురుస్తున్నాయిహైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉందని.. రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లితో పాటు మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.Heavy rains in #hyderabad #HyderabadRains pic.twitter.com/RD2sRYF8yS— Aditya ✪ (@Glorious_Aditya) May 7, 2024 సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది.  నేటి వరకు ఎండలతో బెంలేతెత్తిన జనానికి..  ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా ఈదురుగాలులు భయపెట్టించాయి. The First respite for this Blazing Summer 🌞 #Hyderabad #thunderstorms #Rains pic.twitter.com/aHQENktyuA— Vikrant 🇮🇳🇮🇳 (@KauVikk) May 7, 2024  

Supreme Court Freezes Order Cancelling Hiring Of Bengal Teachers
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మందికి పైగా ఉపాధ్యాయుల నియామకాల్ని రద్దు చేస్తూ ఇచ్చిన కోలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సీబీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని, అయితే అభ్యర్థులపై లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది.25 వేలకుపైగా ఉపాధ్యాయుల2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్‌ లెవల్‌ సెలెక్షన్‌ టెస్ట్‌ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ కోల్‌కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు వారు అందుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.ప్రజల విశ్వాసం కోల్పోతేకోల్‌కతా హైకోర్టు తీర్పుపై వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. ప్రజల విశ్వాసం కోల్పోతే ఇంకేమీ మిగలదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర అధికారులను నిలదీసిన కోర్టుమొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు కొత్త పోస్టులను ఎలా విడుదల చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎలా నియమిస్తారంటూ రాష్ట్ర అధికారులను కోర్టు నిలదీసింది. సరైన రికార్డులు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు లేకపోవడంపై సుప్రీం కోర్టు సంబంధిత అధికారులను మందలించింది.  

Rajamouli Comments On The Bahubali Animations Series
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌ అంటూ యానిమేషన్‌ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్‌ సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్‌ మాకు లభించింది. యానిమేషన్‌ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్‌లో సిరీస్‌ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్‌ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్‌ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్‌ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్‌, ఫైట్స్‌, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్‌లో అది వర్కవుట్‌ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్‌ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్‌ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌  యానిమేషన్‌ సిరీస్‌  డిస్నీప్లస్ మే 17న  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది

Bjp Lined Up Its Star Campaigners For Odisha Election
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం

ఒడిశాలో ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష‍్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్‌లో రోడ్‌షో, మే 11న బొలంగీర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్‌పూర్, కోరాపుట్‌లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు.  అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్‌ ద్వయం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర‍్యటనలు చేయనున్నారు.

IPL 2024 Good News For KKR: Star Player Set Rejoin Team Ahead Of Play Offs
Play Offs: స్టార్‌ ఓపెనర్‌ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్‌!

ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్‌ అయ్యర్‌ సేన.కేకేఆర్‌ ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, సునిల్‌ నరైన్‌ ‌విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్‌ నరైన్‌ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఫిలిప్‌ సాల్ట్‌ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్‌ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌  బ్యాటర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్‌ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్‌- నరైన్‌ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్‌.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్‌ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్‌ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Techie Got Promoted in April Now She Loss Job
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.

Anant Sharma Slams City Infra And Weather
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్‌ అసహనం

దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి.  ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్‌, క్రియేటీవ్‌ హెడ్‌ అనంత్‌ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్‌ వేదికపై అనంత్‌ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్‌ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.   Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్‌ఫ్రా, బ్యాడ్‌ వెదర్‌, బ్యాడ్‌ వాటర్‌. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్‌ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు.  అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు.  మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all