Top Stories
ప్రధాన వార్తలు
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కనెక్టవిటీ పెంచామని అన్నారు.ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జూన్ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.సీఎం జగన్‌పూర్తి ప్రసంగం 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించాం.2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం.మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు .ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన.బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద.అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులు.విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?.అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాంఅక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం.అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్.ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు.సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం.విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.గతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?.పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం.రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ.స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా..జగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగా నిలిచాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాం.ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం.పేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం.ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్.విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాంఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాంమూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశాం.ఎగ్జిక్యూటివ్‌క్యాపిటల్‌గా విశాఖనుఉద్దాన సమస్యను పరిష్కరించాం.కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం.జూన్ 4న మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు.మీ బిడ్డ అధికారంలో వెంటనే మళ్లీ మొత్తం అందస్తాం.చంద్రబాబు దగ్గర ప్రజల నుంచి దోచేసిన సొమ్ము చాలా ఉంది.దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతాడుబాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించండి.ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి.మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి.ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.ఎన్సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది.
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్‌పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్‌కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్‌నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్‌డ్రైవ్‌ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్‌కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్‌ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్‌ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్‌ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్‌పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్‌కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్‌మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?)దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్ టోలన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
సినిమా
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్‌పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.20 ఏళ్ల సెలబ్రేషన్స్ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB— Allu Arjun (@alluarjun) May 7, 2024
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?)దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్ టోలన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
పదేళ్ల తర్వాత మళ్లీ చాన్స్.. ఆనందంలో ప్రగ్యా జైస్వాల్
‘కంచె, ఆచారి అమెరికా యాత్ర, అఖండ’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఖుషీగా ఉన్నారు. ఆమె ఆనందానికి కారణం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో చాన్స్ రావడమే. పదేళ్ల క్రితం చేజారిన అవకాశం ఇప్పుడు రావడంతో ప్రగ్యా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ– ‘‘అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా తీశారు. ఆ మూవీ కోసం 2014లో ఆడిష¯Œ ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం నాకు రాలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డాను. అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు అక్షయ్‌గారి ‘ఖేల్ ఖేల్ మే’లో నటించే చాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ముదాస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాప్సీ, వాణీ కపూర్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... హిందీలో ‘టిటూ ఎమ్బీఏ’ (2014) చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రగ్యా. బాలీవుడ్లో ఆమెకు అది తొలి చిత్రం. పదేళ్లకు ప్రగ్యా మళ్లీ హిందీలో అవకాశం తెచ్చుకున్నారు.
ఫొటోలు
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
కూల్ లుక్‌తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోనున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైన హిట్‌మ్యాన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 2007 ఎడిషన్ నుంచి వరుసగా అన్ని ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. తొలి ప్రపంచకప్ ఛాంపియన్ జట్టైన టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆతర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలోనూ భాగమయ్యాడు. తదుపరి ప్రపంచకప్ ఎడిషన్ హిట్‌మ్యాన్‌కు తొమ్మిదో ఎడిషన్ కానుంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్ కూడా తొలి ఎనిమిది ఎడిషన్లలో పాల్గొన్నాడు. బంగ్లా ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రాబోయే ప్రపంచకప్‌లో షకీబ్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. వయసు పైబడిన రిత్యా అతను ప్రపంచకప్ ఆడతాడో లేదో తెలీదు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. హిట్‌మ్యాన్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 39 మ్యాచ్‌లు ఆడాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ పేరిట ఉన్నాయి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది.తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. కెనడాతో తలడనుంది.మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది.
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్‌ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో అంతకు ముందు మ్యాచ్‌లోనూ ధోని డారిల్ మిచెల్‌తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్‌గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.
IPL 2024: కేకేఆర్ బృందానికి చేదు అనుభవం
కేకేఆర్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని కోల్‌కతాకు బయల్దేరిన వీరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024రెండు సార్లు వీరు ప్రయాణిస్తున్న చార్టర్ విమానం దారి మళ్లింపునకు గురైంది. నిన్న సాయంత్రం నుంచి కేకేఆర్ బృందం గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతుంది. పలు ట్విస్ట్‌ల అనంతరం ఇవాళ (మే 7) తెల్లవారుజామున కేకేఆర్ టీమ్ వారణాసిలో ల్యాండైంది.Update at 1:20 AM: Flight diverted to Varanasi after another failed attempt at landing in Kolkata due to bad weather. Current status: At the Lal Bahadur Shastri International airport tarmac— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. కేకేఆర్ టీమ్ మే 5న ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని నిన్న (మే 6) సాయంత్రం 5:45కు లక్నో నుంచి కోల్‌కతాకు బయల్దేరింది. వీరు రాత్రి 7:25 గంటలకంతా కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి ఉండింది.అయితే నిన్న సాయంత్రం నుంచి కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేకేఆర్ బృందం సేఫ్‌గా ల్యాండింగ్ కావడానికి కుదర్లేదు. రాత్రి 8:45 వరకు వీరు గాల్లోనే చక్కర్లు కొట్టారు. 8:46కు వీరి విమానం గౌహతికి డైవర్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. 9:30 ఆ మధ్యలో వీరు గౌహతిలో ల్యాండ్ అయ్యారు.ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న కేకేఆర్ బృందానికి రాత్రి 9:43 గంటలకు మరో మెసేజ్ వచ్చింది. కోల్‌కతాలో ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ వచ్చింది. రాత్రి 11 గంటల్లోపు అక్కడ ల్యాండవుతామన్నది ఆ మెసేజ్ సారాంశం.అయితే కేకేఆర్ బృందానికి ఈసారి కూడా చుక్కెదురైంది. కోల్‌కతాలో మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండింగ్ కుదర్లేదు. దీంతో వీరు గాల్లోనే యూ టర్న్ తీసుకుని ఇవాళ తెల్లవారుజామున వారణాసికి చేరుకున్నారు. ఉదయం 3 గంటల ప్రాంతలో కేకేఆర్ టీమ్ వారణాసిలోని తాజ్ హోటల్లో దిగినట్లు కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇవాళ (మే 8) మధ్యాహ్నం 1:15 గంటలకు వీరు మరోసారి కోల్‌కతాలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈసారైనా విజయవంతంగా ల్యాండ్ అవుతారో లేదో వేచి చూడాలి.ఇదిలా ఉంటే, కేకేఆర్ టీమ్ మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 11న ముంబైతో.. 13న గుజరాత్.. 19న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. కేకేఆర్ టీమ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌పై కర్చీఫ్ వేసుకుని కూర్చుంది. ఈ జట్టుతో పాటు రాయల్స్‌కు కూడా ప్లే ఆఫ్స్‌కు క్లియరెన్స్ సాధించింది.
రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్‌కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్‌కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్‌కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్‌కప్-2024లోనూ భారత్‌ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
బిజినెస్
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్‌గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్‌ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్‌ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్‌ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్‌ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్‌కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్‌లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే.
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,459కు చేరింది. సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగి 73,896 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.03 శాతం లాభపడింది. నాస్డాక్ 1.19 శాతం ఎగబాకింది.బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు సోమవారం 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
నరేష్ గోయెల్‌కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు.
వీడియోలు
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
బాబును చీల్చి చెండాడిన మహిళలు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
ఫ్యామిలీ
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్‌కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్ డువాన్ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్‌లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్‌కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్ ఫాలో అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..)
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కోదేశంలో ఒక్కో ఆచారం, సాంప్రదాయం పాటిస్తారు. వీటిల్లో కొన్ని మన భారతీయ సాంప్రదాయాలను పోలి ఉంటాయి. మరికొన్ని భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవవధువు పాయసం చేసి అత్తింటి వారి నోటిని తీపి చేస్తుంది కదా. కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు అత్తింటి వారిని మెప్పించాలి. అలాంటి ఇంట్రస్టింగ్ ఆచారాన్ని గురించి తెలుసుకుందాం. జాంబియాలోని బెంబా తెగలో ప్రీవెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు, వధువు తరపు కుటుంబం రకరకాల వంటలను తయారు చేస్తుంది వరుడు కుటంబం కోసం. దీన్నే ఇచిలంగా ములి (అగ్నిని చూపడం) అంటారు. పెళ్లికొడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక. ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది. ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా భావిస్తారు.This is a tradition in Zambia. New Bride must cook different types of native meals for her in-laws and show them what their son will be eating before they can accept her. So what will the groom do?pic.twitter.com/2fy4f1Rco0— Figen (@TheFigen_) May 6, 2024న్షిమా: మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసి గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి, చికెన్, ఇతర కూరగాయలతో వడ్డిస్తారు. ఈ విందుకోసం సుమారు 40కి పైగా జాంబియన్ వంటకాలు సిద్దం చేస్తారట. ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం, ఆతిథ్యం ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. అలాగే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిని చూడ్డానికి వెళ్లడం,మధ్య వర్తి రాయ‘బేరా’లు కూడా ఉంటాయి. అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్‌ను తీసుకొస్తారు. ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి, అమ్మాయికి పూసలు, డబ్బులు కానుకగా ఇస్తాడు. ఆ తరువాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు.
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
పనివేళ్లల్లో కాస్త 'టీ బ్రేక్' ఎంతో హాయినిస్తుంది. కడుపులో కాసింత టీ పడగానే హమ్మాయ్యా..! అనిపిస్తుంది. వెంటనే ఉత్సాహంగా పనిచేసుకుంటాం. కాస్త సమోసాలు, పేస్ట్రీలు, వంటి ఇతర స్నేక్స్ ఐటెమ్స్ ఏం తిన్నా.. ఆ తర్వాత కచ్చితంగా 'టీ' సిప్ చేయాల్సిందే. అలాంటి చాయ్‌లను ఎన్నో రకాలుగా తయారు చేసి అందిస్తున్నాయి పలు కేఫ్‌లు. వాటిల్లో 'ఇరానీ చాయ్' టేస్ట్ మాత్రం అందరి మనసులను దోచుకుంది. సరదాగా బయటకు వెళ్లి తాగాలనుకుంటే ఇరానీ చాయ్ సిప్ చేస్తే చాలు అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. మరీ ఆ ఇరానీ చాయ్ ఎక్కడ నుంచి మన నగరానికి వచ్చింది..? దాని మూలం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!ఇరానీ చాయ్ హిస్టరీ..జొరాస్ట్రియన్ ఇరానియన్లు పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పుడూ..ఈ చాయ్ పరిచయమయ్యిందని చెప్పొచ్చు. వీళ్లు మన దేశానికి 18, 19వ శతాబ్దాలలో వచ్చారట. అయితే 18వ శతాబ్దంలో వచ్చినవారిని పార్సీలు అనిపిలిచేవారట. వారు గుజరాత్, బొంబాయిలలో స్థిరపడిపోయారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన వాళ్లు మాత్రం వివిద ప్రాంతాలకు చెదిరిపోయారు. పార్సీలు ప్రధానంగా గుజరాతీ మాట్లాడుతుండగా, తర్వాత వచ్చినవారు మాత్రం ప్రధానంలో పార్సీలోనే సంభాషించడంతో వాళ్లని ఇరానియన్లు లేదా ఇరానీలుగా గుర్తించారు. వారు వస్తూ..వస్తూ..తమ మాతృభూమికి సంబధించిన ప్రత్యేకమైన చాయ్ రుచిని చూపించారు. అలా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఈ వలసదారులు కేఫ్‌లను ఏర్పాటు చేయడంతో దీని రుచి ప్రజలకు పరిచయమయ్యింది. వాళ్లు మొదట బొంబాయి,పూణే నుంచి హైదరబాద్‌కు వలస రావడం జరిగింది. అలా మన హైదరాబాద్ ఈ ఇరాన్ కేఫ్‌లకు సెంటర్‌గా మారింది. అందువల్లే దీన్ని హైదరాబాదీ చాయ్ లేదా ఇరానీ దమ్ చాయ్ అని పిలుస్తారు. ఇక హైదరాబాద్‌లో ది బెస్ట్ ఇరానీ చాయ్‌లు ఏవంటే..ది బెస్ట్ ఇరానీ చాయ్‌లు..గ్రాండ్ హోటల్హైదరాబాద్లోని కోటీలో 1935లో ఈ హోటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రద్దీగా ఉండే ఫేమస్ హోటల్‌గా స్థిరపడిపోయింది. ఈ హోటల్ బిర్యానీతో సహా అనేక స్థానిక డిలైట్లకు ప్రసిద్ధి చెందింది. ఈ చాయ్‌ని వారు సంప్రదాయ పద్ధతిలో చిక్కటి క్రీమ్ మాదిరిగా తయారు చేస్తారు. ధర వచ్చేసి రూ. 150/-కేఫ్ నీలోఫర్ఇరాన్కు చెందిన నిజాం కోడలు ఈ కేఫ్‌కి నామకరణం చేసిందట. ఇది 1978 నుంచి ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌లకు ఫేమస్. ఇక్కడ తాజాగా కాల్చిన బన్ మాస్కా తోపాటు రిచ్ మలైతో కూడిన కడక్ చాయ్ లభిస్తుంది. ఇక్కడ ఇరానీ చాయ ధర రూ. 100/-కేఫ్ బహార్ఇది రంజాన్ సమయంలో బిర్యానీ, హలీమ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు, క్రీమ్ బన్స్,రుచికరమైన కబాబ్‌లతో కూడిన తాజా టీ వంటి వాటి కోసం ప్రజలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కూడా ఇరానీ చాయ ధర రూ. 150/-బ్లూ సీ టీ అండ్ స్నాక్స్..నగరంలో మరొక ప్రసిద్ధ ఇరానీ బ్లూ సీ 1989లో ప్రారంభమైంది. ఇది దిబెస్ట్ టీ కేఫ్‌లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ సర్వ్ చేసే ఇరానీ చాయ్ చాలా చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఎగ్ పఫ్‌లు, సమోసాలు, పేస్ట్రీలు, జామ్ రోల్స్ వంటివి కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ మాత్రం ఇరానీ చాయ్ కేవలం రూ. 50/-నిమ్రా కేఫ్ఓల్డ్ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. నాంపల్లి రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఉంటుంది. ఇది ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఇరానీ చాయ్ ధర రూ. 100/-(చదవండి: మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..)
న్యూస్ పాడ్‌కాస్ట్
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో మరింత సంక్షేమం.. మరింత అభివృద్ధి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... నవరత్నాల పథకాలన్నీ కొనసాగింపు..ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్‌రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాంతులు చేసుకున్న కోరుట్లవాసి వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ ఫర్నిచర్ ధ్వంసం