Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mumbai Indians win toss, choose to bowl first against KKR
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ స్ధానంలో నమాన్‌ ధీర్‌ వచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.తుది జట్లుముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి 

Cm Jagan Speech In Kanigiri Public Meeting
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్‌

సాక్షి, ప్రకాశం జిల్లా:  ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు.‘‘రూ.వెయ్యి పెన్షన్‌ను రూ.3వేలు చేసింది మీ బిడ్డ జగన్‌. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్‌ ఇచ్చాడు.. మీ బిడ్డ జగన్‌.. 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ ఇస్తున్నాం. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్‌ అడ్డుకున్నాడు. బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. చంద్రబాబు చేసిన పనివల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పెన్షన్లు ఇచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ పంపించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.‘‘పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగింది. ఆ నెపాన్ని కూడా దుర్మార్గ చంద్రబాబు మనపై నెడుతున్నాడు. పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. పెంచిన అమ్మ ఒడి. మీ  జగన్‌ అధికారంలో ఉంటేనే.. కాపునేస్తం, ఈబీసీ నేస్తం. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ. మీ జగన్‌ అధికారంలో ఉంటేనే.. రైతు భరోసా, సున్నావడ్డీ. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు. అప్పుడే సూపర్‌ సిక్స్‌లో పెన్షన్‌ హామీని ఎత్తేశాడు. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే.. లకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడు’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనేకనిగిరి సిద్ధమా.. ఎండాకాలమైనా, తీక్షణమైన ఎండలున్నా ఇవేవీ కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ.. మీ అందరి ప్రేమానారాగాలకి మీ బిడ్డ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుమరో 10 రోజుల్లో కురుక్షేత్ర  మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటే వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొ    రపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మనం వేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివినేను ప్రతిఒక్కరినీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబునాయుడు గారికి ఓటు వేస్తే... సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ.. ఓ వల మాదిరిగా ప్రజల మీద వేస్తాడు. అదే జరిగితే, మళ్లీ చంద్రముఖిని మనమే నిద్రలేపుతాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ వదల బొమ్మాలీ వదల అంటూ పశుపతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి రక్తం తాగుతాడని గుర్తుపెట్టుకోవాలి.అవ్వా, తాతల మీద బాణం గురిపెట్టిన బాబుఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వా తాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. ఆ చంద్రబాబు వారి బృందాన్ని నేరుగా అడుగుతున్నాను... ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, పెన్షన్ల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని మీరు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు... 2019 ఎన్నికల వరకూ, ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత? అని ఈ సభలో నేరుగా అడుగుతున్నాను. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని అడుగుతున్నాను?చంద్రబాబు హయాంలో పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమేఓ అవ్వా, ఓ తాత, ఓ అన్నా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా?..ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ, వారు వివక్షకు లోనవుతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే ఇస్తే...మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా ఎంత మందికి పెన్షన్లు ఇస్తున్నాడో తెలుసా?..అక్షరాలా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు.ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అందిస్తున్నాడు. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రూ. 3వేల పెన్షన్ అవ్వాతాతలకు  మీ బిడ్డే నేరుగా ఇంటికే పంపుతున్నాడు. చంద్రబాబు నాయుడుగారి పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ అందేది. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచీ అవ్వాతాతలకు అప్పటిదాకా ఇంటివద్దకే అందుతున్న పింఛన్, సూర్యోదయానికి ముందే, ఒకటో తారికు వచ్చే సరికే, అవ్వాతాతల ఇంటికే, మనవలూ మనవరాళ్ల రూపంలో వాలంటీర్లు వచ్చి, చిక్కటి చిరునవ్వులతో గుడ్మార్నింగ్ చెబుతూ వారికి మంచి చేసే కాలం... ఈ చంద్రబాబు పాపిష్టి కళ్లు పడేంత వరకూ బాగా కొనసాగింది.ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో, అప్పుడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత, వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని కేంద్ర ఎన్నికల కమీషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అని... వాళ్లతో ఉత్తర్వులు ఇప్పించాడు.ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగిపోలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఈ పెద్దమనిషి ఏం చేసాడో తెలుసా..అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా, వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. ఎన్నికల కమిషన్ అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఇంతటి ఎండలో క్యూలో నిలబడి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే..ఈ పెద్దమనిషి చంద్రబాబు ...ఆయన దౌర్భాగ్యపు పని చేసి, ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నాడు. చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో చూస్తే..వీళ్లంతా మనుషులేనా అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు.14 ఏళ్లలో అవ్వాతాతల మీద ప్రేమ చూపించని బాబునేను ఇవాళ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను....ఒకటే చెబుతున్నాను. చంద్రబాబు పరిపాలన 14 ఏళ్లు మీరు చూసారు. మీ బిడ్డ 58 నెలల పాలన కూడా చూసారు. ఈ 58 నెలల కాలంలో పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తున్న పరిస్థితులు చూసారు.  మీ అందరి సమక్షంలో పెద్దమనిషి చంద్రబాబును నిలదీసి అడుగుతున్నాను. 14 ఏళ్లు పరిపాలన చేసాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసానని తానే చెప్పుకుంటాడు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, వారి కష్టాలు చూడటం కానీ, వారికి తోడుగా నిలబడాలని కానీ ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతున్నాను.ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితులు లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు కళ్లు పడేంత వరకూ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే అందుతూ ఉంది.మళ్లీ ప్రమాణం చేసిన వెంటనే అవ్వాతాతల కోసమే సంతకంనేను ఇవాళ ప్రతి అవ్వకూ తాతకూ చెబుతున్నాను. అవ్వాతాతా..ఒక్కనెల ఓపికపట్టండి. జూన్ 4వ తారీకు దాకా ఓపికపట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్ట మొదటి రోజే నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతాను అని అవ్వాతాతలకు చెబుతున్నాను. మళ్లీ జూన్ 4వ తారీకునే వాళ్ల మనవలు, మనవరాళ్లుగా  వాలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి అవ్వాతాతలకు చిక్కటి చిరునవ్వుతో పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు మీబిడ్డ తెస్తాడు.ఇది నామాట..జగన్ మాట.. మీ బిడ్డ మాటమీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్లీ వాళ్ల ఇంటికి పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ పెంచిన ఆ అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ నా అక్కచెల్లెమ్మలకు ఒక చేయూత, ఒక సున్నా వడ్డీ, నా అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించుకునే కార్యక్రమం, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ కాపునేస్తం, ఈబీసీ నేస్తం వస్తుంది.మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ వాహన మిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లానేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, మళ్లీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్లీ గవర్నమెంట్ బడుల్లో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో, క్లాస్ రూములలో ఐఎఫ్ పీ బోర్డులు, డిజిటల్ బోధన. మళ్లీ జగన్ అధికారంలో ఉంటేనే అక్కచెల్లెమ్మలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్కచెల్లెమ్మలకు అండగా కళ్యాణమస్తు, షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన రైతుభరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నావడ్డీ, 9 గంటలపాటు పగటి పూటనే ఉచిత విద్యుత్, ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయండి...మీ జగన్ అధికారంలో ఉంటేనే నాడునేడుతో బాగుపడే హాస్పటళ్లు, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్...ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ. మళ్లీ ఇంటికే పౌరసేవలు, మళ్లీ ఇంటికే పథకాలు, ఇంటికే పెన్షన్లు. మళ్లీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే..నా అక్కచెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి చేతుల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం జరుగుతుంది.చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా?మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు సీఎంగా చేసారు. 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఆ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా మంచి ఉందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతున్నాను.బాబు రాకముందే అవ్వాతాతలకు అవస్ధలు14 ఏళ్లు ఏ పేదవాడికీ ఏమీ చేయని చంద్రబాబు...ఇప్పుడు ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూసారా?. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేసారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా?. చంద్రబాబు రాకమునుపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనకా, వాననకా తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటున నిజంగా వస్తే, చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.చంద్రబాబు విఫల హామీలుచంద్రబాబు మోసాలు, మాయలు, మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందిరికీ చూపిస్తాను. ఇది మీ అందరికీ గుర్తుందా (టీడీపీ 2014 మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫొటోలతో, ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపిన ఈ పాంప్లెట్ గుర్తుందా?. 2014లో ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించి,  ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకుని, గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసి, పరిపాలన చేసిన తర్వాత, నేను ఇవాళ అడుగుతున్నాను. ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని మీరే సమాధానం చెప్పండి.  ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు...మొదటి సంతకంతోటే మాఫీ అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు.. జరిగిందా? ముఖ్యమైన హామీ...ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతున్నాను..మాఫీ ఎవ్వరికైనా జరిగిందా?. ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు చేసిన మరో ముఖ్యమైన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. మీకు లేదా మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు పుట్టారు కదా...మీ వాళ్లలో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసాడా అని అడుగుతున్నాను.మరో ముఖ్యమైన హామీ ఇంటింటికీ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు జరిగిందా? సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా...మన కనిగిరిలో కనిపిస్తోందా?అందరూ ఆలోచన చేయండి.. చంద్రబాబు పంపిన పాంప్లెట్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?ప్రత్యేక హోదా అమ్మేసిన వ్యక్తి – బాబుపోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదికూడా అమ్మేసాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతామా?. వాళ్లంతా కలిసి ఇప్పుడు ఏమంటున్నారు. ఇదే ముగ్గురు మళ్లీ కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా?  ఇంటింటికీ బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట...నమ్ముతారా?అబద్దాలకు రెక్కలు కడుతున్న చంద్రబాబుఆలోచన చేయండి...కొత్తకొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నారు. ఇలాంటి వాళ్లను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను విలువలు విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నాను.వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండివాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన బడులు, వారి చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు అన్నా.. రెండు బటన్లు తమ్ముడు, రెండు బటన్లు చెల్లీ ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మరిచిపోయినా.. మన గుర్తు ఫ్యాను. అక్కడ మేడ మీద ఉన్న అక్కలు, అవ్వలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ.. మన పార్టీ అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అని తెలియజేస్తూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి డి నారాయణ, ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు పాల్గొన్నారు.       

Cm Jagan Election Campaign Meetings Schedule On May 4th
సీఎం జగన్‌ రేపటి ప్రచార సభల షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్‌ శుక్రవారం విడుదల చేశారు.సీఎం జగన్‌ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు  హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 

CM YS Jagan Full Speech At Kanigiri YSRCP Election Campaign Public Meeting
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Super Cm Wife Transfer In Odisha amid General Elections
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్‌ షాక్‌

భువనేశ్వర్‌: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్‌.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితుడికి వీకే పాండియన్‌ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్‌ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్‌  ఐఏఎస్‌ అధికారిగా గత ఏడాది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. పాండియన్‌ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి. 

Assam Cm Himanta Sensational Comments On Rahul Gandhi
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్‌లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్‌లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్‌. ఒకవేళ పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Special article over chandrababu Propaganda of lies
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు

సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు  తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు  వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను  మించిపోయేలా యాక్టింగ్ చేసేసి   వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు   గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు ఎంత మేలు  ఎంత మేలు  చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల టీడీకోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న 

Revanna File Petition For Pre Arrest Bail In Bengaluru Court
ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్‌

బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్‌ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్‌ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్‌ స్కాండల్‌) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్‌ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. 

Aa Okkati Adakku Movie Review And Rating In Telugu
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ

టైటిల్‌: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్‌ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్‌సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్‌ గణేష్‌(అల్లరి నరేశ్‌) ప్రభుత్వ ఉద్యోగి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్‌ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్‌తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్‌బ్యాక్‌.. క్లైమాక్స్‌లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్‌ కానీ.. త్రివిక్రమ్‌ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగించాయి.  ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్‌ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్‌ పెట్టి..కథంతా సీరియస్‌గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్‌ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్‌గాను నడిపించలేకఓ యాక్షన్‌ సీన్‌తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్‌ హీరో రేంజ్‌లో బిల్డప్‌ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్‌ మూడ్‌లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్‌ రివీల్‌ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్‌ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్‌ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు.  కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్‌ ఉన్నా.. డైరెక్టర్‌ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్‌కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్‌ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.  బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్‌, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది.  గోపీసుందర్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all