Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Try To Create Chaos Clashes Again With Chalo Macherla
మాచర్లలో మరో టెన్షన్‌.. భారీ కుట్రకు ప్లాన్‌!

ఎన్నికల పోలింగ్‌ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్‌, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్‌ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ వాతావరణం నెలకొందక్కడ.

Bengaluru Police Investigate Another Angle In Rave Party Case
బెంగళూరు: రేవ్‌పార్టీ ముసుగులో వ్యభిచార దందా?

బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్‌ రాకెట్‌ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్‌ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్‌ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్‌ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్‌ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్‌ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్‌ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్‌ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్‌ ఫలితాలు ఇవాళేడ్రగ్స్‌ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్‌ ఇచ్చారని ప్రకటించారు.

Karan Thapar Troubled Prashant Kishor Over Election Prediction
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త

ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌థాపర్‌ ది వైర్‌ తరఫున ప్రశాంత్‌ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్‌ థాపర్‌ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్‌ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్‌ థాపర్‌ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్‌ కిషోర్‌ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్‌సైట్‌లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్‌ కిషోర్‌ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్‌ థాపర్‌.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్‌ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్‌ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్‌ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్‌ థాపర్‌ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024

Ap Elections 2024 May 23rd Political Updates Telugu
May 23rd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 23rd AP Elections 2024 News Political Updates..10:22 AM, May 23rd, 2024సిట్‌ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్‌ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్‌ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్‌ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్‌ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్‌ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్‌ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని అంబటి డిమాండ్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలించి రిగ్గింగ్‌ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్‌.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్‌ ఎక్స్‌ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్‌ చేసిన టీడీపీ రౌడీలు వెబ్‌ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్‌ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్‌ గ్యాంగ్‌ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

Different Style Political Campaign At Delhi For Lok Sabha Election
ఢిల్లీలో ఢిపరెంట్‌ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?

బహుళ భాషలు, బహుళ ప్రాంతాల్లో ప్రజలున్న ఢిల్లీలో విభిన్న రీతుల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మినీ ఇండియాలాంటి ఢిల్లీని ద‌క్కించుకునేందుకు బీజేపీ, ఇండియా కూట‌మి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.బీజేపీ ఏకంగా వివిధ రాష్ట్రాల సీఎంల‌ను ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దింపింది. అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న దేశ‌రాజ‌ధానిలో ఆయా ప్రాంతాల‌కు సీఎంల‌ను పంపుతూ ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. క్యాపిటల్‌లో ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పార్టీలు డిఫ‌రెంట్ క్యాంపైన్ చేయ‌డ‌మే ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌త్యేక‌త‌..ఢిల్లీలో ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేర‌డంతో చివ‌రి నిమిషం వ‌ర‌కు ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ, ఇండియా కూట‌మి అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగిసస్తున్నాయి. ఢిల్లీలో ప్రధానంగా యూపీ, బీహార్‌, ఉత్త‌రాఖండ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో నివ‌సిస్తుండ‌గా, ప‌రిమిత సంఖ్య‌లో ద‌క్షిణాది ప్ర‌జ‌లున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంల‌ను పార్టీలు రంగంలోకి దింపాయి.రాజ‌స్థాన్ సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ రాజ‌స్థాన్ ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌లు అధికంగా నివ‌సిస్తున్న ప్రాంతాల్లో సీఎం పుష్క‌ర్ ధామి విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఓపెన్ టాప్ జీపుల్లో అభ్య‌ర్థుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ త‌మ పార్టీకి మ‌ద్ద‌తివ్వాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ త‌మ రాష్ట్రాల మాండ‌లికంలో మాట్లాడుతూ వారితో క‌నెక్ట్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు. రాష్ట్రాల‌లో తాము అందిస్తున్న ప‌థ‌కాలు, మోదీ గ్యారంటీలు ప్ర‌చారం చేశారు. దేశ‌వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంద‌ని, ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయ‌మ‌ని వారు చెబుతున్నారు.ఇటు బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా త‌మ ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌ను ప్ర‌చారంలోకి దింపాయి. రాజ‌స్థాన్ సీఎంగా ప‌నిచేసిన అశోక్ గెహ్ల‌ట్‌, స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా ఢిల్లీలో ప్ర‌చారం నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్‌ల‌ను ఢిల్లీలోని రాజ‌స్థాన్‌వాసుల‌కు వివ‌రించారు. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌ సైతం ఆమ్‌ ఆద్మీ పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారంచేశారు. ఇటు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి మ‌ల్లు ర‌వి సైతం ఢిల్లీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల‌ని అభ్యర్థించారు.చోటా భార‌త్‌ను త‌ల‌పించే ఢిల్లీలో ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం ఒక్క నాయ‌కుడి వ‌ల్లే అయ్యేది కాదు. అందుకే ఆయా రాష్ట్రాల‌, భాష‌ల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల‌లో వారి భాష మాట్లాడే నాయ‌కుడిని పంపి త‌మ‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మ‌రి ఓట‌రు దేవుళ్లు ఎవ‌రిని క‌రుణిస్తారో.. ఏ భాష‌లో స‌మాధాన‌మిస్తారో చూడాల్సి ఉంది.

Harish Rao Political Counter Attack To Congress
కాంగ్రెస్‌ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్‌ రావు ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడేది లేదు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాగా, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి హత్యపై హరీష్‌ రావు స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా హరీష్‌ రావు..‘కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బి.ఆర్.ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బి.ఆర్.ఎస్ నాయకులు హత్యకు గురికావడం,… https://t.co/zyNPsWtIvr— Harish Rao Thanneeru (@BRSHarish) May 23, 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Karnataka: Family Of 4 Died Due To Suspected LPG Cylinder Leak In Mysore
అయ్యో పాపం.. గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి కుటుంబం

మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసివారిది 10 ఇన్‌ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్‌ వాసన వస్తోంది.ఒక రోజంతా అలాగేసోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్‌కాల్‌ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్‌, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్‌ సిలిండర్లను విచారణ కోసం సీజ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్‌ రమేశ్‌ బానోత్‌ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్‌ లీక్‌ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది.

I think we were 20 runs short with the bat: Faf du Plessis:
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్‌

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్‌ రౌండ్‌ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్‌(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్‌ పరాగ్‌(36), హెట్‌మైర్‌(26), పావెల్‌(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్‌ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్‌ పిచ్‌ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ​మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపో​యామని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024

Nikesh Arora of Palo Alto is second highest paid CEO
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్‌ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్‌కామ్‌ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్‌ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్‌ అరోరా వేతనం 151.43 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్‌ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్‌ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నికేశ్‌ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది.

Sajjanar Clarity On TGSRTC Viral Logo
TGSRTC ఫేక్‌ ప్రచారంపై సజ్జనార్‌ క్లారిటీ

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్‌ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్‌లో ఒకటి వైరల్‌ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్‌ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్‌ ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్‌సైట్లు అలా లోగోను డిజైన్‌ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్‌ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement