Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page
Advertisement

ప్రధాన వార్తలు

Andhra Pradesh Lok Sabha And Assembly Election Results 2024 Live Updates
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

AP Election 2024 Counting And Results Updates7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్‌లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్‌వైజర్‌ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్‌ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్‌ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్‌ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్‌ బ్యాలట్‌ టేబుల్‌ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. పోస్టల్‌ బ్యాలట్‌ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్‌ పోలీసులుకౌంటింగ్‌ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్‌ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్‌ ముగియడంతో ఫలితాల కోసం జూన్‌ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్‌సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.

Lok Sabha Election Results 2024 Live Updates
కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

Live Updates...👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్‌ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌ ధన్గర్‌ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. #WATCH | Uttar Pradesh: Congress candidate from Mathura, Mukesh Dhangar says, "...INDIA Alliance will form a government. There is no doubt about it...This victory (Dhangar's victory) will be of the people of Brij. This will 1000% be the victory of Banke Bihari and Maa Yamuna."… pic.twitter.com/IP6Def2u81— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్‌ రూమ్స్‌ #WATCH | Karnataka: Strong room being opened in Bengaluru district ahead of the counting of votes for the #LokSabhaElections2024The counting of votes will begin at 8 am. pic.twitter.com/ACGhbarIbx— ANI (@ANI) June 4, 2024 👉మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్‌ వద్ద పార్టీల ఏజెంట్స్‌, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. #WATCH | Madhya Pradesh: Strong room being opened in Indore district ahead of the counting of votes for the #loksabhaelections2024phase5 Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. (Source: Madya Pradesh I&PR) pic.twitter.com/ntfmwhTEPC— ANI (@ANI) June 4, 2024 👉కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. #WATCH | Tamil Nadu: Congress candidate from Sivaganga Lok Sabha seat Karti Chidambaram arrives at a counting centre in Karaikudi, Sivaganga districtVote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/fKLk5uJf3u— ANI (@ANI) June 4, 2024 👉కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మనీష్‌ తివారీ కామెంట్స్‌.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్‌ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. #WATCH | Congress MP and party candidate from Chandigarh Manish Tewari says, "..It is Tuesday, Hanuman's day. People have expressed their opinions. The opinions are locked in the EVMs. The EVMs will open and the opinion will come out. Whatever the people's decision will be,… pic.twitter.com/yptpWNkKN4— ANI (@ANI) June 4, 2024 👉దేశంలో 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 👉బరిలో 53 మంది మంత్రులు 53 మంది సిటింగ్‌ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్‌ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. #WATCH | Delhi: Congress worker Jagdish Sharma says, "I have already said 6 days ago that the election has been looted, it (counting of vote) is just a formality because the people of the country believe in the Constitution system. All Congress party leaders will come but I will… pic.twitter.com/vzkn3YrKT4— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంపు.. హర్యానా, గుజరాత్‌, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు #WATCH | Security heightened at a counting centre in Jind, Haryana. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/YXFo7YXRhU— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Raebareli, Uttar Pradesh. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/iq06WWob5Q— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Bhubaneswar, Odisha. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/NhoU4qURN0— ANI (@ANI) June 4, 2024#WATCH | Security heightened at a counting centre in Purba Medinipur, West Bengal. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/bgdJ3KPgou— ANI (@ANI) June 4, 2024 👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 👉ఏకగ్రీవమైన సూరత్‌ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Telangana Lok Sabha Election Results 2024 Live Updates
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం

Updates ఖమ్మంలోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటుప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుకౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్దఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లుపాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లుమధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారుకంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాతగెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుందిఅనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభంఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ లీడర్లలో టెన్షన్‌హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపుచొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్‌మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌:ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధంహైదరాబాద్మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమొత్తం 158 టేబుల్స్19 లక్షల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంమొత్తం 178 టేబుల్స్ ఏర్పాటువీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారుమొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయిమొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయిఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంనల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటునల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465పోలైన ఓట్లు 12,77, 137నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39నల్లగొండ వివరాలుఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లుమిర్యాలగూడ 264(19)సూర్యాపేట 271(20)నల్లగొండ288(21)కోదాడ296(22)హుజూర్ నగర్ 308(22)నాగార్జునసాగర్ 306(22)దేవరకొండ 328(24) నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుచివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లుభువనగిరి లోక్ సభ స్థానంమొత్తం ఓటర్లు 18,08, 585పోలైన ఓట్లు 13,88,680అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లుఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)భువనగిరి 257(19)నకిరేకల్ 311(23 రౌండ్లు)ఆలేరు 309(23)జనగామ 278(20)భువనగిరి స్థానంలో పోలింగ్‌ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడుహైదరాబాద్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతఫలితాలు కోసం ఎదురు చూస్తున్నాబీజేపీ 400 సీట్లు గెలుస్తాం#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తినాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలుఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంమొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుకౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లుప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్‌ మహబూబ్ నగర్పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్బరిలో 31 మంది అభ్యర్థులు.నాగర్ కర్నూల్వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపుఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్బరిలో 19 మంది అభ్యర్థులు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుందిఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయిఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారుప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)అభ్యర్థులు 42 మందిఅసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్ చెన్నూర్ నియోజకవర్గం 14 16 బెల్లంపల్లి నియోజకవర్గం 14 16మంచిర్యాల నియోజకవర్గం 14 21 ధర్మపురి నియోజకవర్గం 14 19రామగుండం నియోజకవర్గం 14 19మంథని నియోజకవర్గం 14 21పెద్దపల్లి నియోజకవర్గం 14 21పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ప్రకటించారు.గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.కంటోన్మెంట్‌ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.65.67శాతం పోలింగ్‌ నమోదైంది.లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు.ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు.ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్‌ హాల్‌ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్‌ ఉంటాయి.మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.ఒక్కో టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు.ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్‌ లెక్కింపును ప్రారంభిస్తారు.అదే సమయంలో ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్‌ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.2.18లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉంది.

Counting of Votes for the Seven Seats in Delhi
ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లు మొదలు కానున్నాయి.ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర బ్యాలెట్ పేపర్‌లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు. మే 25న ఢిల్లీలో జరిగిన లోక్‌సభ పోలింగ్‌లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Obstacles in postal ballot Vote Counting
కూటమితో కుమ్మక్కు!

కూటమి నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారా.. కౌంటింగ్‌కు తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారా..? నేడు జరగనున్న ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. దౌర్జాన్యాలకు స్కెచ్‌ వేశారా..? అంటే జిల్లా వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. సాక్షి టాస్‌్కఫోర్స్‌: కౌంటింగ్‌లో అక్రమాలు.. దౌర్జనాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వీ సెట్‌లో నేడు ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్‌ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారుమారు చేసి.. కూటమికి అనుకూలంగా మార్చే కుట్ర అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేసినట్లు తెలిసింది. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్‌ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు. వీలైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే లక్ష్యంగా.. అధికారులంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు జరగనున్న కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకునేందుకు పథకం వేసినట్టు సమాచారం. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపేందుకు స్కెచ్‌ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు. టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలి్పంచారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యర్థే కదా? అన్నీ టేబుల్స్‌ వద్ద ఏజెంటు ఉండకపోతే ఎలా? అని ప్రశి్నస్తున్నారు. అయినా వారికి ఎన్నికల అధికారి ససేమిరా అన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలగం కోసం కొత్త ఎత్తుగడ కౌంటింగ్‌ కేంద్రలో అక్రమాలు, దౌర్జన్యాలకు బలగం ఉండేలా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్‌ ఏజెంట్‌ ఫామ్స్‌ని కొనుగోలు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైనా ఆ పార్టీ తరుఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్‌ అభ్యరి్థకి టేబుల్‌కి ఒకరు చొప్పున ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి తమ ఏజెంట్‌ ఫామ్స్‌ని కూటమి అభ్యర్థులకు విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ ఏజెంట్‌ ఫామ్స్‌తో కూటమి నేతలు కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్‌లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

AP Elections Results 2024 Photos
కట్టుదిట్టంగా ఏపీ కౌంటింగ్‌ డే (ఫొటోలు)

Horoscope Today: Rasi Phalalu On 04-06-2024 In Telugu
June4: ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు, ప్రయత్నాలు సఫలం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి రా.9.03 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: భరణి రా.10.05 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.8.26 నుండి 9.57 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు, అమృతఘడియలు: సా.5.36 నుండి 7.09 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. మేషం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.వృషభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.కర్కాటకం: చిత్రమైన సంఘటనలు. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.కన్య: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.తుల: పనులు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.వృశ్చికం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.ధనుస్సు: పనులు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కీలక నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.మకరం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.కుంభం: సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.మీనం: ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

CM YS Jagan Tweet On Counting Of AP Elections
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024

Sajjala Ramakrishna Reddy About YSRCP Victory
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ బోగస్‌ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్‌ నౌ, దైనిక్‌ భాస్కర్‌ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్‌ పూర్తయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ తీసుకునే వరకు కౌంటింగ్‌ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయ­మంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయ­త్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయ­పడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమ­యంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్‌ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్‌ హాల్‌ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్‌లో కౌంటింగ్‌ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఖచ్చితంగా కౌంట్‌ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్‌లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్‌ పూర్తయి డిక్లరేషన్‌ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్‌ ఏజెంట్లతో జూమ్‌ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Chandrababu Spreading Fake Propaganda On Jagan Reddy Stone Pelting
దాడి మీ కళ్లకు కనిపించలేదా?

సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పైకి జనం మధ్య నుంచి రాయి విసరడం.. అది సీఎం కనుబొమ్మపై తగలడం.. కుట్లు పడటం.. కళ్లెదుటే కనిపిస్తున్నా, చంద్రబాబు, గురివింద రామోజీ మాత్రం తప్పును ఒప్పు చేయాలని పడరాని పాట్లు పడుతున్నారు. నిస్సిగ్గుగా దోషులను వెనకేసుకొస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేక దుష్ప్రచారానికి మరోమారు తెర లేపారు. 2018లో పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన విషయంలో చంద్రబాబు, రామోజీలు వక్రీకరణే లక్ష్యంగా బరితెగించారు.సీఎం జగన్‌పైకి రాయి విసిరిన కేసులో నిందితుడు వేముల సతీశ్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు పలుకులు వల్లించి తాను టీడీపీ గూటి చిలుకనని చెప్పకనే చెప్పాడు. ఆ కట్టుకథను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచురించడం ద్వారా ఈ కుట్ర అంతా తమ పర్యవేక్షణలో సాగుతోందని రామోజీరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పక్కా పన్నాగంతో పదునైనా రాయితో దాడికి పాల్పడ్డారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిరూపించారు.వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా విశ్లేషించారు. కానీ పోలీసులు తనకు తుపాకీ గురిపెట్టి మరీ అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని సతీశ్‌ చెప్పడం పచ్చ నాటకంలో ఓ భాగం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో, పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. అయినా పచ్చ మీడియా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఇంతగా యత్నిస్తోందంటే.. ఈ హత్యాయత్నం వెనుక కుట్రదారుల పాత్ర­ను మరుగున పరిచేందుకేనని స్పష్టమవుతోంది. పన్నాగం ప్రకారమే హత్యాయత్నంసీఎం జగన్‌ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్‌ అమలు చేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 13న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌లోకి ప్రవేశించక ముందే సతీష్‌ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్‌ వద్ద పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయిని ఎంపిక చేసుకుని తన ప్యాంట్‌ జేబులో వేసుకుని మరీ వివేకానంద స్కూల్‌ వద్దకు వచ్చాడు. మరి కొంతమందితో కలసి అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్‌ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్నారు.ఆ వెంటనే సతీష్‌ ఆ రాయిని బలంగా సీఎం వైఎస్‌ జగన్‌పైకి గురిచూసి విసిరారు. సీఎం తలలో సున్నిత భాగంపై దాడి చేయడం ద్వారా ఆయన్ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని అమలు చేసేందుకే సతీష్‌ ఆ దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ రాయి సీఎం జగన్‌ తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది. సాంకేతిక ఆధారాలతో నిర్ధారణముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు­లో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్‌ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్‌ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యా­యత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2ల పాత్ర­ను నిర్ధారించాయి.అనంతరం పోలీసులు ఏప్రిల్‌ 17 సాయంత్రం 5 గంటలకు ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరి­పేటలోని కేజీఎఫ్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్‌ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయమే..పదునైన కాంక్రీట్‌ రాయితో సీఎం జగన్‌ కణతపై దాడి చేయాలన్నదే నిందితుడు సతీశ్‌ లక్ష్యమన్నది స్పష్టమైంది. పదునైన రాయి కణతపై తగిలినా తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాపాయం సంభవించేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ – న్యూరో సైన్స్‌ (నిమ్‌హాన్స్‌– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగా­ధి­పతిగా డాక్టర్‌ కేవీఆర్‌ శాస్త్రితోపాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ఆ విషయంలో ఏకాభి­ప్రాయం వ్యక్తం చేశారు.కణత భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. అది తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. తద్వారా కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసేది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయితో దాడి చేశారు. ఆ కాంక్రీట్‌ రాయి తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తు అది ఎడమ కనుబొమ్మపై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. కుట్రదారుల పాత్ర కప్పిపుచ్చేందుకే..సీఎం జగన్‌పై హత్యయత్నం కేసులో తెరవెనుక కుట్రదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెర వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకోసం మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేషించాల్సి ఉందన్నారు. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.దాంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవడంతో చంద్రబాబు హడలిపోతున్నారు. అందుకే పోలీసులపైనే తిరిగి అసత్య ఆరోపణలు చేసే కుట్రకు తెరతీశారు. తద్వారా పోలీసులు ఆత్మరక్షణలో పడి ఈ కేసులో కుట్రదారుల పాత్రపై దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయేలా చేయాలన్నది వారిద్దరి లక్ష్యం. అందుకే పోలీసులు తన తలకు తుపాకి గురిపెట్టి అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని, లేకపోతే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని నిందితుడు వేముల సతీశ్‌తో చెప్పించారు.తాము చెప్పినట్టు చెబితే రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పారన్నాడు. సతీష్‌.. తాము చెప్పినట్టు చెప్పడంతో రామోజీరావు తన పత్రికలో ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అసలు ప్రధాన నిందితుడు తాను హత్యాయత్నం చేశానని ఎప్పుడైనా అంగీకరిస్తాడా..!? ఏదో అబద్ధం చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించాలనే యత్నిస్తాడు. మరి ఆ మాత్రం తెలియకుండా ఈనాడు రామోజీరావు సతీశ్‌ చెప్పిన కట్టుకథను అంత ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరం. తద్వారా ఆ కట్టుకథ వెనుక తామే ఉన్నామని చెప్పకనే చెబుతోంది.న్యాయస్థానంలో ఆ రోజు ఎందుకు చెప్పలేదు?చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు నిందితుడు సతీశ్‌ న్యాయమూర్తి వద్ద ఆ విషయాలు ఎందుకు చెప్పలేదని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీసులు ఆ విధంగా బెదిరించి ఉంటే న్యాయమూర్తి ఎదుటే చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఉంది. కానీ ఆ రోజు చెప్పనే లేదు. బెయిల్‌పై విడుదలయ్యాక బయటకు వచ్చి టీడీపీ అనుకూల మీడియా ముందే ఆ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే పోలీసులు నిందితుడు సతీశ్‌ను ఆ విధంగా బెదిరించలేదన్నది సుస్పష్టం. అదంతా టీడీపీ పన్నాగమేనన్నది తేటతెల్లమవుతోంది.ఈసీ ఆధ్వర్యంలోనే పోలీసుల దర్యాప్తుటీడీపీ, ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన మరో అంశం... సీఎం జగన్‌పై హత్యా­యత్నం కేసును పోలీసులు ఈసీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే రాష్ట్రంలో పోలీసులతో పాటు మొత్తం అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నారు. ఈసీ వ్యక్తం చేస్తున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సతీశ్‌ ద్వారా పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేయించడం అంటే ఈసీనే నిలదీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిందితుడు సతీశ్‌ ఈసీనే నిందించాలిగానీ పోలీసులను కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.2018లోనూ ఇదే దుష్ప్రచార కుట్రపాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం కేసును కూడా టీడీపీ, పచ్చ మీడియా ఇదే రీతిలో వక్రీకరించేందుకు యత్నించడం గమనార్హం. టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ రెసారెంట్‌లో పనిచేసే జనుపల్లి శ్రీనివాస్‌ అరచేతిలో పట్టేంత పదునైన కత్తితో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలోకి శ్రీనివాస్‌ను ప్రవేశపెట్టడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమైంది. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజే ఉన్నారు.దాంతో ఈ హత్యాయత్నం వెనుక తమ కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని భావించిన టీడీపీ వెంటనే ఆ ఉదంతాన్ని వక్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే వైఎస్‌ జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే ఆయన అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాస్‌ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదే అసంబద్ధ వాదనను వినిపించడం విభ్రాంతికరం. కానీ టీడీపీ దుష్ప్రచారం బెడిసికొట్టింది. వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకే ఆ దాడికి పాల్పడ్డారన్నది తేటతెల్లమైంది. అయినా సరే చంద్రబాబు, రామోజీ తీరు మార్చుకోలేదు. నాడు, నేడు కూడా వక్రీకరణలు, కుట్రలే వారి రాజకీయంగా స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement