Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Navaratnalu Plus Manifesto More security for middle class
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు ప్లస్‌’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల  అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే.  

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May..‘జగన్‌ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు  నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

Warangal Khammam Nalgonda Graduates MLC By Election Notification Out
TG: ‘మండలి’ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, సాక్షి: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది.  ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.  

IPL 2024: SRH To Take On RR Today At Uppal Stadium, Hyderabad
ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం

ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు హైదరాబాద్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ​్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.  ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఒక్క గుజరాత్‌ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: అన్మోల్‌ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్‌ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: రోవ్‌మన్ పావెల్]

Colombia Cut Ties With Israel For having a genocidal President
ఇజ్రాయెల్‌కు షాక్‌.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’

కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు  ఆగవని  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని  అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్  ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని  బెంజమిన్‌ నెతన్యాహుతో తమ   దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు  తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు  ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా  అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో  గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్‌ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్‌ మిలిటెంట్లకు పెట్రో  రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్‌ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్‌ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్‌ మిలిటెంట్లు అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్‌ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్‌ చెరలోనే ఉన్నారు. అక్టోబర్‌ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్‌ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

J&J subsidiary proposing paying Rs 54,000 cr over 25 years for cancer allegations
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు

జాన్సన్ అండ్‌ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్‌ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్‌ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్‌ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్‌ చాప్టర్‌ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్‌ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. 

Man Gives Triple Talaq to Wife in Moving Train
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్‌లో ట్రిపుల్‌ తలాక్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ  ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్‌ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్‌ అసద్‌ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని ఆమె తెలిపారు. 

TDP Chandrababu Fake Promise To Unemployed Youth
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల

సాక్షి, అమరావతి:  ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకా­రం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యో­గం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’..  ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్‌ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్య­త్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.  నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్‌ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్‌ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ చీల్చిచెండాడారు.  ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.  ⇒ టెన్త్, ఇంటర్‌ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.  ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని షరతులు విధించింది.  ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.  ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.  ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.  ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. 

Mahesh Babu Pens A Note On Her Father Movie Completes 50 Years
నాన్నను అలా చూడటం ఇప్పటికీ గుర్తుంది: మహేశ్ బాబు

సూపర్ స్టార్‌ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 1974లో రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై మే 1వ తేదీ నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. నాన్న నటించిన చిత్రంపై ప్రశంసలు కురిపించారు.మహేశ్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' నాన్నగారిని తెరపై గంభీరమైన లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చూసినా మొదటిసారి చూసినట్లే ఉంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం, తెలుగు సినిమాపై నా ప్రభావాన్ని గుర్తుచేసుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఈ ఏడాది గుంటూరు కారంతో అభిమానులను అలరించిన మహేశ్‌బాబు.. నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది.  #50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️ pic.twitter.com/CdhAfSr0OI— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2024

CM YS Jagan Fires On Chandrababu At Bobbili Eluru Payakaraopeta
ఇవ్వడమే జగన్‌కు తెలుసు: సీఎం జగన్‌

జగన్‌ను చంపేస్తే తప్పేమిటంటున్నాడు..మీ బిడ్డ జగన్‌ను ఓడించలేమని, ఆ పేద అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారి కుటుంబ సభ్యులు మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఎంత ప్రలోభపెట్టినా తన మాటలు నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు నోట జగన్‌ను చంపేస్తే ఏమవుతుంది? అన్నమాట వినిపిస్తోంది. నాడు వైఎస్సార్‌ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. నేడు జగన్‌ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు. రాజకీయాల్లో ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?– బొబ్బిలి సభలో సీఎం జగన్‌తట్టుకోలేకపోతున్నారు..పేదల గురించి జగన్‌ మాట్లాడుతుంటే పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వదినమ్మకు చాలా బాధగా, విపరీతమైన కోపంగా ఉంటుంది. జగన్‌ ఎప్పుడూ పేదలు.. పేదలు అంటుంటే విని తట్టుకోలేక­పోతున్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేదలు ఒక ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారు. కులం పరంగా, ఫలానా పార్టీ పట్ల అభిమానం వల్ల కావొచ్చు.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటికి వెళ్లాక మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.– ఏలూరు సభలో  సీఎం జగన్‌దీవించండి..బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్‌ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానీని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.  సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘జగన్‌ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు చంద్రబాబూ! జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే చంద్రబాబుకు తెలియదు. వందేళ్ల క్రితం బ్రిటీష్‌ హయాంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు చేపట్టిన సర్వేతో పక్కాగా రికార్డులు సృష్టించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. రైతన్నలు కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రీ సర్వే ద్వారా సరిహద్దు రాళ్లను నాటించి రికార్డులు అప్‌డేట్‌ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసి రైతన్నలకు ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలేగానీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. మనం అమలు చేసిన పథకాల గురించి చెబుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది. గత 59 నెలల కాలంలో ఎన్నడూ లేని విప్లవాత్మక సంస్కరణలను మీ బిడ్డ తెచ్చినందుకే ఆయనకు కోపం వస్తోంది. ఈ ఎన్నికల్లో బాబును ఓడించడమంటే పేదలను గెలిపించడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నేరప్రవృత్తికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని, వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయాలు ముడిపడి ఉంటాయని ధ్వజమెత్తారు. సొంతమామ ఎన్టీఆర్‌ను, వంగవీటి రంగాను, పింగళి దశరథరామ్‌ను, ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతోనే కడ తేర్చారన్నారు. బుధ­వారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివిమరో 13 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. ఓటుతో మీ తలరాతలు మారతాయి. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబుకు ఓటు వేయడమంటే  కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. పేదలంటే బాబు ముఠాకు కోపం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. మీ బిడ్డ ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని.. ఆయనకు మనమీద ఎందుకంత పిచ్చికోపం వస్తోందంటే.. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ బిడ్డ విప్లవాలు తెచ్చాడు కాబట్టే. నేను చెబుతున్న విష­యాలు గతంలో ఎప్పుడైనా అమలు జరిగాయో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్‌ను చంపితే ఏమవుతుందంటున్న బాబుమీ జగన్‌ ప్రజలకు ఏం చేశాడో గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడు­తున్నాడో మీరంతా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చి­రెడ్డి­పాలెంలో ఇదే పెద్దమనిషి రేపు జగన్‌ను చంపితే ఏం జరుగుతుంది? అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మానసిక పరిస్థితి, ఆ ఆలో­చనలు ఎలా ఉన్నాయో గమనించాలని కోరుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ..! ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అని నేను అడుగుతుంటే నీ సమాధానం అదా?అక్కచెల్లెమ్మలే రక్షించుకుంటారు.. అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్‌కు తోడుగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జగన్‌కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ! వారి జగన్‌ను వారే రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్‌ ప్లస్, జడ్‌ డబుల్‌ ప్లస్‌ సెక్యూరిటీ అక్కర్లేదయ్యా. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ బటన్‌లే నాకు శ్రీరామరక్ష. పిల్లలు బాగుండాలని ఇచ్చిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఆరాటపడుతూ అందించిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఇవన్నీ నాకు రక్ష అని చంద్రబాబుకు చెబుతున్నా. నా అవ్వాతాతలకు మంచి చేస్తూ ఇంటివద్దే అందించిన పెన్షన్లతో దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రార్థనలే వారి బిడ్డ జగన్‌కు శ్రీరామరక్ష. మంచిని అందుకున్న నా రైతన్నలు ఆ భూమాత, పంచ భూతాల సాక్షిగా చేస్తున్న ప్రార్థనే నాకు శ్రీరామ రక్ష. జగన్‌ మార్కు సామాజిక న్యాయంఅసెంబ్లీ, ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 100 స్థానాల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,  మైనార్టీలకు టికెట్లు ఇచ్చాం. మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే నాలుగు పదవులు ఆ వర్గాలకే కేటాయించి గౌరవించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు వారికే కల్పిస్తూ చట్టం తెచ్చాం. ఇంత సామాజిక న్యాయం, తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలి. బాబు వ్యాఖ్యలు నేరప్రవృత్తికి నిదర్శనంఆ రోజు నా తండ్రి రాజశేఖరరెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్ననుద్దేశించి ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్‌...!’ అన్న నీ వ్యాఖ్యలను నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబాబూ. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడుతనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.పేదలకు పథకాలు అందాలా.. లేదా?చంద్రబాబును అడుగుతున్నా.. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్‌ రాష్ట్రంలో 90 శాతం మంది పేదలకు ఈ రోజు మంచి చేయడం కొనసాగాలా.. వద్దా? ఎవరు మేలు చేశారు? నిజమైన నాయకుడు ఎవరో ఆలోచన చేయాలని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలు 1.44 కోట్లు. అంటే జనాభాలో 90 శాతం. వీరందరూ పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా? లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు జనాభాలో 95 శాతం ఉన్నారు. వీరికి పథకాలు అందాలా లేదా? ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజుల చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు వసతి దీవెన అందాలా.. లేదా? పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు 1.05 కోట్ల మంది పేదలు కాదా? వీరందరికీ పథకాలు అందాలా.. లేదా? రాష్ట్రంలో అవ్వా­తాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు 66 లక్షల మందికిపైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైతు భరోసాతో 55 లక్షల మంది రైతన్నలకు అండగా నిలిచాం. మరో 60 లక్షల మంది అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తీసుకుంటున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. ఇప్పుడు చెప్పండి.. వీరంతా పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా లేదా?ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది. జగన్‌ మీ భూములు కాజేస్తాడంటూ ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. జగన్‌ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు– పాయకరావుపేట సభలో సీఎం జగన్‌మీ బిడ్డ తెచ్చిన కొన్ని విప్లవాలివీ..⇒ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్‌ కానుక విప్లవమా? కాదా?⇒ గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బడి తెరిచే సమయానికే విద్యా­కానుక, బైజూస్‌ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీలు లాంటివి విప్లవమా? కాదా?⇒ తొలిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివి విప్లవాలు కాదా?⇒ మీ పిల్లలను బడికి పంపించండమ్మా.. మీకు తోడుగా మీబిడ్డ ఉన్నాడంటూ అమ్మఒడి అందిం­చడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ⇒ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా,  సున్నా­వడ్డీ­తో­­పాటు 31లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలోనే మహిళా పోలీస్, భద్రత కోసం దిశ యాప్, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మీ జగన్‌ కాదా? ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? ⇒ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, జీఎల్‌టీ, ఆక్వా రైతులకు రూపా­యి­న్నరకే కరెంట్, ఆయిల్‌పామ్‌ రైతులకు మెరుగైన ధర ఇచ్చిందెవరు? ఇవన్నీ విప్లవాలు కాదా?⇒ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షలదాకా ఉచిత వైద్యం, ఆపరేషన్‌ తరువాత విశ్రాంతి సమ­యంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటివి అమలు చేసింది మీ బిడ్డ పాలనలో కాదా? ఇవన్నీ వైద్య రంగంలో విప్లవాలు కాదా? ⇒ మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం, వాహన­మి­త్ర, చేదోడు, తోడు, ఎంఎస్‌ఎంఈలకు సంపూర్ణ మద్దతు, లా నేస్తం లాంటివి తెచ్చిందెవరు?⇒ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దే అందుతు­న్నాయి. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి 60–70 ఇళ్లకు పెన్షన్‌ నుంచి పౌరసేవలు, పథకాలు, రేషన్‌ దాకా డోర్‌ డెలివరీ అవుతు­న్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్‌ క్లినిక్, నాడు–నేడుతో మారిన ఇంగ్లీష్‌ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఉన్నాయా? ⇒ మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్‌ ఇచ్చే డబ్బులు లంచాలు, తిరుగుళ్లు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, పిల్లలు బాగుండాలని 130 సార్లు బటన్‌ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా అందించడం ఓ విప్లవాత్మక చరిత్ర కాదా?అబద్ధాలకు రెక్కలు...చంద్రబాబు తన అబద్ధాలు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్‌ను అడ్డుకుని మనపై నెపం వేస్తున్నాడు. ఏ రోజైనా ఆయన అవ్వాతాతల బాధలు, కష్టాలను పట్టించుకున్నాడా? ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా? తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయించి ఇంటివద్దే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకున్నాడు. ఆ అవ్వాతాతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో మీబిడ్డపై నెపం మోపుతున్నాడు.ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?⇒ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పనిగానీ, పథకంగానీ గుర్తుకొస్తుందా? ఆ పెద్దమనిషి తన జీవిత కాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేసిందిలేదు. 2014లోనూ ఇదే మాదిరిగా హామీలిచ్చి వంచించాడు. ఒక్కసారి వాటిని గుర్తుచేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా చంద్రబాబును నమ్ముతారేమో మీరే చెప్పండి.⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానంటూ ఏకంగా రూ.14,205కోట్లు  ఎగనామం పెట్టాడు. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా ఎవరికైనా ఒక్క రూపాయి అయినా బ్యాంకులో జమ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏ ఒక్క ఇంటికైనా 60 నెలల్లో రూ.2వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్నాడు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ మాఫీ అన్నాడు. జరిగిందా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? మన బొబ్బిలి, పాయకరావుపేటలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. ⇒ ఇప్పుడు మళ్లీ మోసగించేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు. 

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all