Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

pothina mahesh fires on chandrababu and pawan kalyan
‘కాపులను పవన్ కల్యాణ్‌ ఎదగనీయటం లేదు’

సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో  మాట్లాడారు.‘‘చెప్పింది చేసి చూపించిన  గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్‌. సీఎం జగన్‌.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్‌. పేదల పట్ల సీఎం జగన్‌కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం​ లేదు.  పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి...14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్.  ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్‌పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్‌.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు.  చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది....నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?.  అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?...చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?.  పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్‌గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే...2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్‌కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’ అని పోతిన మహేష్‌  ధ్వజమెత్తారు. 

Pm Modi Taking Inspiration From Goebbels Says Jai Ram Ramesh
గోబెల్స్‌ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్‌ నియంత హిట్లర్‌ మంత్రి జోసెఫ్ గోబెల్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికలపై ఓ ఛానల్‌ ఇంటర్వ్యూ జైరాం రమేష్‌ మాట్లాడూత.. రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మోదీ ప్రచార విలువల గురించి  జోసెఫ్ గోబెల్స్ గురించి చదివి, ఆయన నుండి ప్రేరణ పొంది ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు.‘మీరు ఒక అబద్ధాన్ని పదే పదే  చెప్పి, దానిని పునరావృతం చేస్తూ ఉంటే, చివరికి ప్రజలు దానిని విశ్వసిస్తారు’ అని గోబెల్స్ పేర్కొన్నారని జైరాం గుర్తు చేశారు.ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో బెదిరిస్తున్నదని మోదీ చేసిన వ్యాఖ్యలపై జైరాం మాట్లాడుతూ..  మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేసినంత కాలం సత్యం నశించి పోతుందని అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ న్యాయ పత్రంలో వారసత్వపు పన్ను గురించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ బీజేపీ మాత్రం వారసత్వపు పన్ను గురించి మరోలా ప్రచారం చేస్తోందని జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు.

Delhi Police Notices To Cm Revanth Reddy Over Amit Shah Fake Video
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్‌ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్  ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే  తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్‌ హ్యాండీలో అమిత్‌ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది

Karnataka MLA HD Revanna rలeacts on prajwal revanna controversy
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్‌డీ రేవణ్ణ

బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్‌ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.  ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తం‍డ్రి ఎమ్మెల్యే హెడ్‌డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం  చేసిన కుట్ర. ఇక ఆ వీడియో​లు నాలుగైదేళ్ల కిందటివని అ‍న్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్‌ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ గురించి  తెలియదు’ అని హెచ్‌డీ  రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్‌ వంటి అనేక విచారణలు తాము  ధైర్యంగా  ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్‌ భారత్‌ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్‌ బృందం విచారణ వేగవంతం చేసింది.

FM Sitharaman Says India GDP Must Expand To Cater To The Demands Of The People Further
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో  పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.

NEET aspirant hangs self in Rajasthan's Kota 9th suicide this year
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన

దేశంలోనే ‘కోచింగ్‌ హబ్‌’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం  సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. సిబ్బంది సుమిత్‌ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్‌ లాక్‌ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి.  తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.

12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai
చికెన్‌ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత

ముంబై: చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు  ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

శివం దూబే (PC: IPL.com)
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

Gutta Amit Joined In Congress Party
బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో​ షాక్‌ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్‌ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి పార్లమెంట్‌ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

Tendulkar Batted At No 4: Sehwag Sensational T20 WC Message For Virat Kohli
T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్‌ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్‌ టోర్నీలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడని సెహ్వాగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్‌ జోడీ గురించి మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా నా ఆప్షన్‌. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.మిడిల్‌ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్‌ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్‌ ప్లేలో తను ఇన్నింగ్స్‌ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్‌ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్‌, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్‌ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్‌ టెండుల్కర్‌ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్‌.. ‘‘2007 ప్రపంచకప్‌ టోర్నీలో సచిన్‌ టెండుల్కర్‌ తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేశాడు.మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్‌ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్‌ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్‌ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్‌ ఈవెంట్లో కోహ్లి రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌ లేదంటే.. శుబ్‌మన్‌ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్‌ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement