Top Stories
ప్రధాన వార్తలు
‘కాపులను పవన్ కాల్యాణ్ ఎదగనీయటం లేదు’
సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘చెప్పింది చేసి చూపించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్. పేదల పట్ల సీఎం జగన్‌కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి. ..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్. ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్‌పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ...నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?. అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?. ..చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?. పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్‌గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే...2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్‌కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు.
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.
చికెన్ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత
ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.
T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్‌మన్ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్
అనకాపల్లి, సాక్షి: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు.‘‘జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్.(అందుకు సిద్ధం అని సమాధానం వచ్చింది)మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవిందా.. గోవిందా. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా. గ్రాఫిక్స్ రాజధాని కూడా గోవిందా.. గోవిందా. సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను వదిలేశారు. కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్‌గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్‌కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్లో ఉండే కిట్లను ధరించనున్నారు.
తప్పక చదవండి
- ‘కాపులను పవన్ కాల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!
సినిమా
అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) View this post on Instagram A post shared by Jyotika (@jyotika)
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్‌గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia)
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
సినిమాల్లో శృంగార సన్నివేశాలు అనగానే.. హా ఏముంది ఈజీనే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెరపై చూసే దానికి తెరవెనక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాల్నే 'మంగళవారం' ఫేమ్ నటి దివ్య పిళ్లై బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అనే వాటి గురించి చాలా ఓపెన్‌గా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.'రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ సెట్స్‌లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మైండ్‌లో వేరే ఆలోచన ఏం ఉండదు' (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'అలానే ముద్దుని భలే ఎంజాయ్ చేయడం లాంటిది కూడా ఏం ఉండదు. దీనిబట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. అలానే రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సహ నటుడితో కలిసి ముందు డిస్కస్ కూడా చేసుకోవాలి. సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు' అని దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది.దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం 'బజూకా' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్)
స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ప్రధానపాత్రను పోషించిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో అజిత్ క్యామియో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. కాగా విడాముయర్చి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి 'మార్క్ ఆంటోని' చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో నటుడు అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. ఇందులో ఆయనకు జంటగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నటి 'సిమ్రాన్' కాగా మరొకరు 'మీనా' అని తెలిసింది. కాగా నటి సిమ్రాన్ ఇప్పటికే అజిత్‌తో కలిసి వాలి, అవళ్ వరువాళా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించగా, నటి మీనా సిటిజెన్, విలన్ చిత్రాల్లో అజిత్‌తో జత కట్టారు. దీంతో తాజాగా ఇద్దరూ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఆయన సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారికంగా త్వరలో వెలువడే అవకాశం ఉంది.
బిజినెస్
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.02 శాతం లాభపడింది. నాస్డాక్ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.
కేవైసీతోనే.. ఫండ్స్‌లో పెట్టుబడులు
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? గతంలో ఎప్పుడో కేవైసీ (నో యువర్ కస్టమర్) చేసి ఉన్నారా..? అయితే ఒక్కసారి మీరు మీ కేవైసీ స్థితిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు మరో విడత కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన తరుణం వచి్చంది. ఇందుకు విధించిన ఏప్రిల్ 1 గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్న పథకాలు కాకుండా.. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం కేవైసీని అప్డేట్ చేసుకోవడమే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి తిరిగి కేవైసీ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. కొంత మంది ఇన్వెస్టర్లు మినహా చాలా మందిలో దీనిపై స్పష్టత లేదు. కేవైసీ చేసేందుకు ప్రయత్నించకపోవడం, ఏ డాక్యుమెంట్లు కావాలో అవగాహన లేకపోవడమే ఈ అయోమయానికి కారణమని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్టర్ సర్వీసెస్ హెడ్ అబ్దుల్లా చౌదరి అంటున్నారు. మ్యూచు వల్ ఫండ్స్ సంస్థల వెబ్సైట్ నుంచే ఆన్లైన్లో సులభంగా కేవైసీని మరోసారి చేసుకోవచ్చని తెలిపారు. చెక్ చేసుకోవాల్సిందే.. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తిరిగి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అంటే లేదన్నదే సమాధానం. అసలు ఎవరు కేవైసీ ప్రక్రియను తిరిగి నిర్వహించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఆన్లైన్లో తమ కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకుంటే కానీ తెలియదు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సీవీఎల్ను కేవైసీ కోసం ఉపయోగిస్తుంటారు. కనుక సీవీఎల్కేఆర్ఏ డాట్ కామ్ సైట్‌కు వెళ్లాలి. లేదంటే ఎన్డీఎంఎల్ కేఆర్ఏ, క్యామ్స్ (సీఏఎంఎస్) కేఆర్ఏ లేదా కార్వీ కేఆర్ఏ ద్వారా తమ కేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. సీవీఎల్కేఆర్ఏ పోర్టల్‌కు వెళ్లి పైన కనిపించే మెనూ ఆప్షన్లలో కేవైసీ ఇంక్వైరీ సెలక్ట్ చేసుకోవాలి.తర్వాత వచ్చే విండోలో పాన్ నంబర్ నమోదు చేయాలి. ఐ యామ్ హ్యూమన్ పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ స్థితి అక్కడ కనిపిస్తుంది. కేవైసీ వ్యాలిడేటెడ్.. అని ఉంటే తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం మీరు అప్పటికే సమర్పించిన కేవైసీ ఆధార్ ఆధారితమైనది. మొబైల్, ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉన్నట్టు. కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. మళ్లీ కేవైసీ అవసరం లేదు. కేవైసీ రిజిస్టర్డ్.. అని ఉంటే మీరు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ (ఓవీడీ) ఆధారంగా కేవైసీ చేసినట్టు. అంటే ఆ సమయంలో ఆధార్ ధ్రువీకరణ చేయలేదు. మొబైల్, ఈ మెయిల్ ధ్రువీరణ చేసినట్టు. అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, ఇప్పటి వరకు పెట్టుబడులు లేని కొత్త సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఆన్ హోల్డ్.. మొదట సమర్పించిన కేవైసీ ఓవీడీ ఆధారితం కాదని దీనర్థం. లేదంటే ఈ మెయిల్, మొబైల్ నంబర్ మనుగడలో లేవని అర్థం. ఈ స్థితి చూపిస్తుంటే, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణకు అనుమతి లేదని తెలుసుకోవాలి. వీరు తాజాగా కేవైసీ సమర్పించాలి. రిజెక్టెడ్ ఆన్ హోల్డ్ 10–15 రోజుల పాటు ఉన్న తర్వాత రిజెక్టెడ్గా మారుతుంది. వీరు కూడా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు నిర్వహించలేరు. అంటే తాజాగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పటికే ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకోలేరు. తాజాగా కేవైసీ సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ కేవైసీ వ్యాలిడేటెడ్ అనే స్థితి ఉన్న వారు మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా తాజా కేవైసీ సమర్పించడం మంచిది. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ అయితే.. పాన్ నంబర్ నమోదు చేసి, క్యాపెచా కోడ్ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో మీరు చేయాల్సినది ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎన్డీఎంఎల్ కేఆర్ఏ వద్ద కేవైసీ నమోదు చేయని వారు ఇక్కడ కేవైసీ చేయడానికి వీలు పడదు. అదే సీవీఎల్–కేఆర్ఏలో అయితే మీ వివరాలు సమర్పించిన అనంతరం.. కేవైసీ ఎక్కడ నమోదై ఉన్నది కూడా చూపిస్తుంది.అంటే సీవీఎల్ కేఆర్ఏ/ఎన్డీఎంఎల్ కేఆర్ఏ/డాటెక్స్ కేఆర్ఏ/క్యామ్స్ కేఆర్ఏ/ కార్వీ కేఆర్ఏ వీటిల్లో ఎక్కడ నమోదైతే కేవైసీ స్టేటస్ కాలమ్‌లో అక్కడ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ఎక్కడ నమోదై ఉందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదంటే మీ పెట్టుబడులు కలిగిన ఫండ్ హౌస్ (ఏఎంసీ) పోర్టల్‌కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ లేదా సెబీ నమోదిత ఆర్టీఏ (రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్) హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. కేవైసీ అప్డేట్కేవైసీ స్థితి తెలుసుకున్న తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌కు అయినా వెళ్లి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీని సమర్పించొచ్చు. ఇలా ఒకసారి కేవైసీ అప్డేట్ అయితే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడుల్లోనూ అదే ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, సంస్థ పోర్టల్‌కు వెళ్లి తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.ప్రొఫైల్ సెక్షన్లో కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ‘రిజిస్టర్డ్’ లేదా ‘ఆన్హోల్డ్’ చూపిస్తుంటే ఎం–ఆధార్ లేదా డిజిలాకర్ ఖాతా నుంచి ఈ–ఆధార్ సమర్పించొచ్చు. దీంతో యూఐడీఏఐ ద్వారా వచ్చే ఓటీపీని సమర్పించిన అనంతరం కేవైసీ వ్యాలిడేట్ అవుతుంది. కేవైసీ రిజిస్టర్డ్ అనే స్థితితో ఉన్న వారు మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, తాజాగా కేవైసీ సమర్పించేంత వరకు సాధ్యపడదు. అప్పటి వరకు పెట్టుబడులు లేని మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. అప్పుడు ఆయా సంస్థ కేవైసీని పరిశీలిస్తుంది. వ్యాలిడేటెడ్ అని ఉంటేనే వారు ఆమోదిస్తారు. రిజిస్టర్డ్ అని ఉంటే మాత్రం కేవైసీ సమర్పించాలి. నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీ సమర్పించే వారు ఆధార్ కాపీపై క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దాన్ని సిస్టమ్ రీడ్ చేయలేదు. అలాంటప్పుడు అది వ్యాలిడేట్ కాదు. ఎప్పుడో ఆధార్ తీసుకున్న వారి డాక్యుమెంట్‌పై క్యూఆర్ కోడ్ మసకగా మారుతుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఎన్ఆర్ఐల పరిస్థితి?భారతీయులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) కేవైసీ అంత సులభం కాదు. ఇతర దేశాల్లో నివసిస్తూ, భారత మొబైల్ నంబర్ కలిగి లేని వారు.. ఆధార్ ఆధారిత ఓటీపీ స్వీకరణ, నమోదు చేయలేరు. దీంతో ఎన్ఆర్ఐల కేవైసీ స్థితి ‘రిజిస్టర్డ్’గానే కొనసాగొచ్చు. దీంతో అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇకమీదటా పెట్టుబడులను ఎన్ఆర్ఐలు కొనసాగించుకోవచ్చు. ఎన్ఆర్ఐలు భారత్‌లో జారీ అయిన మొబైల్ నంబర్ కలిగి ఉంటే, ఆన్లైన్లో ఆధార్ ఆధారితంగా కేవైసీని సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదంటే వీరు కొత్త సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ అధికారికంగా చెల్లుబాటయ్యే ఇతర డాక్యుమెంట్ల సాయంతో కేవైసీ సమర్పించడమే మార్గం. తిరిగి కేవైసీ.. ఏ డాక్యుమెంట్?అధికారికంగా చెల్లుబాటయ్యే ఏ డాక్యుమెంట్ (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఎంఎన్ఆర్ఈజీఏ కార్డ్) సాయంతో తిరిగి కేవైసీ చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ సాయంతో కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడమే అత్యుత్తమం. ఇతర డాక్యుమెంట్‌తో కేవైసీ చేస్తే కనుక, కొత్త మ్యూచువల్ ఫండ్ సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేవైసీ సమర్పించాల్సి వస్తుంది. అదే ఆధార్‌తో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు.
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain)
వీడియోలు
అమిత్ షా ఫేక్ వీడియో రేవంత్ రెడ్డికి నోటీసులు
పిఠాపురంలో పవన్ పరిస్థితిపై విజయ్ బాబు విశ్లేషణ ...!
జగన్ ను ఎందుకు ఓడించాలి?
పచ్చ మేనిఫెస్టోలో.. పచ్చి అబద్దాలు
ఎవరు హీరో... ఎవరు విలనో మీరే తేల్చుకోండి..
బాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!
బాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!
మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం
వేడెక్కిన రాజకీయం
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం