Top Stories
ప్రధాన వార్తలు
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
May 31th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 31th AP Elections 2024 News Political Updates..8:55 AM, May 31st, 2024స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌తిరుపతి జిల్లా..అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుహర్షవర్ధన్ రాజు కామెంట్స్..స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.ఔటర్ కార్డెన్లో మూడు మొబైల్ పార్టీస్‌తో నిరంతర పహారా కొనసాగుతోంది.స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు. 8:40 AM, May 31st, 2024తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌అనంతపురం..తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకంఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డికాగా, రాంభూపాల్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం 8:00 AM, May 31st, 2024ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటవైఎస్సార్ జిల్లా..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటచాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరుఅరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం 7:45 AM, May 31st, 2024విశాఖలో పోలీసుల కార్డెన్ సెర్చ్..విశాఖపట్నం.. పీఎం పాలెం..ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.కార్డన్ సెర్చ్‌లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. 7:30 AM, May 31st, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటంకేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టుఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సవరణ పిటిషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం 7:00 AM, May 31st, 2024స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’! ఆ మేరకు టీడీపీ బేరసారాలు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడఅవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.Suspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్‌లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.
ఈ రాశి వారికి ఇంటా బయటా అనుకూలం.. శుభవార్త వింటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.47 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శతభిషం ఉ.5.50 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.4.08 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: ఉ.11.46 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.16 వరకు, అమృతఘడియలు: రా.8.41 నుండి 10.11 వరకు; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 5.28, సూర్యాస్తమయం : 6.26. మేషం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.మిథునం: చేపట్టిన కార్యాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.సింహం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.కన్య: ఇంటాబయటా అనుకూలం. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృశ్చికం: కుటుంబసభ్యులతో కలహాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు: ఆకస్మిక ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి.మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.కుంభం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మీనం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ
యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా థియేటర్లు డల్‌గా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ ప్రవర్తన వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది. మరి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విటర్ లో ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!)యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించిన సినిమా ఇదని అంటున్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ల్యాగ్ లేకుండా సినిమాని తీశారని మెచ్చుకుంటున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్, మాస్ డైలాగ్స్ బాగున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా బోర్ కొట్టనప్పటికీ.. డైరెక్షన్ ఔట్డేటెడ్గా ఉందని అంటున్నారు. విశ్వక్సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవడం మైనస్ అయిందని చెబుతున్నారు. డ్రామా పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివకార్తికేయన్? వీడియో వైరల్)ST : #GangsofGodavari pic.twitter.com/sUNH7IikFY— అభి (@Abhiiitweets) May 30, 2024Good first half. Although not a brand new story it has a racy screenplay without any lag, that will definitely work in the films favor. Not a boring moment so far. Second half will be key. #GangsofGodavari— T 🌸 (@PinkCancerian) May 31, 2024#GangsofGodavari good first half 👍... Vishwak sen just killed it🔥— Gautam (@gauthamvarma04) May 31, 2024"aadu modati moodu potlu ammoruki vadilesadu ayya"interval fight🔥but scene process cheskone time ivvatledu. Basically, Pushpa fasttrack chesthe ela undo ala undi. 1st half mottam oka movie teeyochu. Crisp runtime ani kurchunattu unnaru, really bad editing.#GangsofGodavari— Mirugama Kadavula (@Kamal_Tweetz) May 30, 2024Jr tho teeyalsina movie.. inka bagundediViswak’s mass feast #GangsofGodavari 1st half 3.25/5— AN (@anurag_i_am) May 30, 2024
AP: స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’!
సత్తెనపల్లి: జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లను పంపేలా కూటమి నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్ల నియామకానికి గురువారంలోగా వివరాలు పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బి లత్కర్ సూచించారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోపాటు మరో 93 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పోటీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎరవేసి వారి తరఫున కూడా తమవారిని నియమించుకునే వ్యూహాన్ని పల్నాడు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది. స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థులు సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరఫున తమ అనుచరులను ఏజెంట్లుగా నియమించుకున్నట్టు తెలిసింది. లెక్కింపు కేంద్రం లోపల తమ వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారని, అందుకు ప్రధాన కారణం రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు అధికారులు ప్రకటించగానే తమకు సమాచారం ఇచ్చేలా నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్లు అనుచర వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇలాంటి ప్రలోభాలను నిలువరిస్తారా! లేక చేతులు ఎత్తేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. వ్యూహాత్మకంగా స్వతంత్రులుగా రంగంలోకి.. టీడీపీకి చెందిన కొందరినీ ముందుగానే వ్యూహం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. ఇప్పుడు వారి తరఫున కూడా ఏజెంట్లుగా తెలుగు తమ్ముళ్లే వెళ్లబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీల నుంచి 9 మంది బరిలో ఉంటే ఆరుగురు స్వతంత్రులున్నారు. స్వతంత్రులతో పాటు కొందరు బరిలో ఉన్న అభ్యర్థులనూ ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా చివరి ఘట్టమైన కౌంటింగ్ కేంద్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, అనుకూలంగా లేకపోతే గొడవలకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
TRUMP: ‘హుష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హుష్‌మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు.
నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
న్యూయార్క్: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం’లో జరిగే మ్యాచ్ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్ అటాక్’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఐసన్ హోవర్ పార్క్ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్, పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. సుదీర్ఘ సాధన... తొలి రోజు ఫిట్నెస్ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ ప్రాక్టీస్ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉండగా భారత్ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు.
Lok Sabha Election 2024: హిమాచల్‌ప్రదేశ్‌లో.. బీజేపీకి పరీక్ష!
హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్పూర్ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్ సింగ్ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సురేశ్ కుమార్ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.హమీర్పూర్ కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్ కొడుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్పూర్ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
తప్పక చదవండి
- విమానం 8 గంటలు లేట్.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
- మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
- ఆర్వో శ్రీలేఖపై ఈసీ వేటు
- T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
- ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
- Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడుల్లో 53 మంది మృతి
- రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
సినిమా
నయనతార ప్లేస్‌లో త్రిష?
తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్జే శరవణన్‌తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది.వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
టప్పా టప్పా.. పెళ్లి పాటప్పా
టప్పా టప్పా.. అంటూ పాట అందుకున్నారు శర్వానంద్, కృతీ శెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మనమే’ చిత్రంలో పెళ్లి సమయంలో వచ్చే ‘టప్పా టప్పా..’ అంటూ సాగే పాట విడుదల అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. కాగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన యూనిట్ గురువారం ‘టప్పా టప్పా..’ అంటూ సాగే మూడవ పాటని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘‘అందరూ ఎంజాయ్ చేసే వెడ్డింగ్ సాంగ్‌ని అందించారు హేషమ్. ఈ పాటలో శర్వానంద్, కృతీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది.
సినిమా విడుదలకి ముందే యానిమేషన్ రిలీజ్ ప్రయోగమే: నాగ్ అశ్విన్
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదల కాకముందే యానిమేషన్ సిరీస్‌ను రిలీజ్ చేయడం మా ప్రోడక్షన్ హౌస్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం.. చెప్పాలంటే ఇదొక ప్రయోగమే. నాలుగైదేళ్లుగా దీని కోసం పని చేస్తున్నాం’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు.వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో భైరవగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన వాడిన కారు పేరు బుజ్జి. కాగా బుజ్జి–భైరవ 2డీ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘కల్కి 2898 ఏడీ’ మూవీ రిలీజ్‌కి ముందే ఒక యానిమేషన్ సిరీస్ లాంచ్ చేయాలనే ఐడియా నచ్చింది. ఇందుకోసం ‘ఛోటా భీమ్’తో పాటు ఎన్నో యానిమేషన్ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ సంస్థతో కలిసి పని చేశాం. ఈ ఐదేళ్లలో వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్, వైజయంతీ మూవీస్ అనే మూడు డిఫరెంట్ కంపెనీలను నడిపించాం’’ అన్నారు.
అండమాన్‌లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్‌కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్‌లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.
ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..విలవిలాడుతున్న జనం (ఫొటోలు)
ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్ భార్యను చూశారా? (ఫోటోలు)
తిరుమలలో బిగ్‌బాస్ సందీప్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ (ఫోటోలు)
భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్.. స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
క్రీడలు
మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాక్ బ్యాటర్ ఆజమ్ ఖాన్‌కు ఓ భయానక అనుభవం ఎదురైంది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిప్పులు చెరిగే వేగంతో ముఖంపైకి దూసుకొచ్చిన బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్ వికెట్ సమర్పించుకున్నాడు.ఆజమ్ అదృష్టం కొద్ది బంతి గ్లవ్స్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒకవేళ బంతి ఆజమ్ ఖాన్ శరీరం లేదా తలకు తాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆజమ్ ఔటయ్యాక కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. అంతలా రాకాసి బౌన్సర్ అతన్ని బయపెట్టింది. పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. వుడ్ రాకాసి బౌన్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.
రాణించిన రషీద్, సాల్ట్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరే గ్రూప్‌ల్లో ఉన్నాయి. పాక్.. భారత్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్‌ల మెగా సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.
నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
న్యూయార్క్: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్ స్టేడియం’లో జరిగే మ్యాచ్ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్ అటాక్’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఐసన్ హోవర్ పార్క్ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్‌మన్, పోలీస్ కమిషనర్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. సుదీర్ఘ సాధన... తొలి రోజు ఫిట్నెస్ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్ పార్క్‌లో ఈ ప్రాక్టీస్ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉండగా భారత్ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు.
బిజినెస్
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి.
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 22,556 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 దిగజారి 73,885 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి.టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, విప్రో, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
దిగివచ్చిన బంగారం, వెండి!
బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.వెండి ధరదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి.
వీడియోలు
విజయవాడ సెంట్రల్ లో ఎగిరేది YSRCP జెండా
ఈసీపై పేర్నినాని ఫైర్
సమస్యల వలయంలో తెలంగాణ ప్రభుత్వం
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
రాకెట్ ప్రయోగం విజయవంతం
ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
చట్టం మీ చుట్టమా ?
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..ఈసీ డబుల్ గేమ్
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
ఫ్యామిలీ
Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్!
అద్భుతాలు ఆకాశం నుంచి ఊడిపడవు. ఆలోచనల్లో నుంచి పుడతాయి. దిల్లీకి చెందిన ఆర్యన్ చౌహాన్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద విజయం సాధించడానికి ఆ ఆలోచనలే కారణం. కొత్తదనాన్ని ఆవిష్కరించే ఆలోచనలు అవి. కొత్త తరం ఆలోచనలు అవి...ఇరవై రెండు సంవత్సరాల ఆర్యన్ చౌహాన్ ట్రాక్ రికార్డ్ ‘ఆహా’ అనేలా ఉంటుంది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే స్టార్టప్‌లకు సహాయపడే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రసిద్ధ జెరోమ్ ఫిషర్ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీకి ఎంపికైన తక్కువ మందిలో ఆర్యన్ ఒకడు.కోవిడ్ సమయంలో స్వదేశానికి తిరిగివచ్చాడు ఆర్యన్. ఆ సమయంలో అతడి మనసు నిండా కొత్త స్టార్టప్ ఆలోచనలు నిండి ఉన్నాయి. అయితే ఏమీ చేయలేని అనిశ్చితి బయట నెలకొని ఉంది. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఆర్యన్. 2021లో ‘జీవోవ్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు.తన తల్లితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘జీవోవ్’ పేరుతో రెండో కంపెనీ స్టార్ట్ చేశాడు. టెక్–ఫస్ట్ అ్ర΄ోచ్తో డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచే కంపెనీ ఇది. పర్సనలైజ్ రెమిషన్ ΄్లాన్స్ నుంచి నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) పరికరాల వరకు కంపెనీలో ఎన్నో ఉంటాయి. ఇంతకీ ఆర్యన్‌కు ‘జీవోవ్’ ఆలోచన ఎలా వచ్చింది?‘డయాబెటిస్ బాధితులను దగ్గరి నుంచి చూశాను. మా తాతయ్యలు ఇద్దరూ డయాబెటిస్తో బాధలు పడ్డారు. ఆ సమయంలోనే ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నాను’ అంటాడు ఆర్యన్. క్రానిక్ కేర్ బిజినెస్‌గా ్ర΄ారంభమైన ‘జీవోవ్’ కంపెనీ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్స్, సైకాలజిస్ట్‌లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే కంపెనీ 70,000లకు పైగా వినియోగదారులతో విజయపథంలోకి వచ్చింది.ప్రొడక్ట్‌ను క్రియేట్ చేయడం నుంచి మార్కెట్లో విజయవంతం చేయడం వరకు ఆర్యన్‌లో అద్భుత సామర్థ్యం ఉంది. వేగంగా నేర్చుకునే తత్వం, నిర్మాణాత్మక పనివిధానం అతడి సొంతం. ఏ ్ర΄ాజెక్ట్ చేపట్టినా విజయవంతం చేయాలనే పట్టుదలతో పనిచేస్తాడు. నెవర్–సే–డై స్పిరిట్ ఆర్యన్‌ను క్వాలిటీ ఫౌండర్‌ని చేసింది’ అంటాడు ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’ ఫౌండర్ కునాల్ బహల్. కునాల్ బహల్ జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థి.‘జీవోవ్’కు ముందు కునాల్‌తో కలిసి పనిచేశాడు ఆర్యన్. ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’లో ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డీ2సీ సెగ్మెంట్లను లీడ్ చేశాడు. ‘ఇది చాలు’ అనుకోవడం లేదు ఆర్యన్ చౌహాన్. ‘జాయిన్ ది రెవల్యూషన్’ నినాదంతో నెక్ట్స్ గ్రోత్ పేస్పై దృష్టి పెట్టాడు.
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’.
అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!
సాధారణంగా ఉపగ్రహాలు లోహంతో తయారు చేస్తారు. అవి వాతావరణంలో పొరపాటున కాలిపోతే హానికరమైన చెత్తను సృష్టిస్తున్నాయి. ఈ శిథిలాల కార్యాచరణ ఇతర ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకకు గణనీయమైన ముప్పుని కలిగిస్తాయి. అందుకని ఈ సమస్యకు చెక్‌పెట్టేలా జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఉప్రగ్రహ్నాన్ని అభివృద్ధిచ చేశారు. దేనితో అంటే..ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ పరిశోధకులు లిగ్నోశాట్ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్ని క్యోటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించగలిగారు. 2020 ఏప్రిల్ నుంచి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే పనిలోపడ్డారు. ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకుమాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అందించగలవని పరిశోధకులు చెబుతున్నారు. చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్ చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించనుంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి డెలివరీ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకునే సామార్థ్యం ఉందా లేదా వంటి పలు టెస్ట్‌లు చేస్తారు. అందుకోసం డేటాని పంపించి పరిశీలిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది గనుక విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్..ఎంతకు అమ్ముడయ్యాయంటే..)
చిట్టి పికాసో: చిట్టి చేతులు అద్భుతం చేస్తున్నాయి!
పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు కుంచె పట్టకుని పెయింటింగ్‌ల గీసేస్తున్నాడ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ చిట్టి చేతులు అద్భుతమైన చిత్రాలు చిత్రీస్తున్నాయి. పైగా అవి ఎంత ధర పలుకుతున్నాయో వింటే ఆశ్చర్యపోతారు. ఎవరా చిన్నారి? అంటే..?జర్మనీకి చెందిన రెండేళ్ల లారెండ్ స్క్వార్ట్ అనే చిన్నారి అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్నాడు. వాటిలో పలు రకాల జంతువులపాలు కనిపిస్తాయి. ఆ చిన్నారి ఆర్ట్ ప్రయాణం గతేడాది సెలవులు నుంచి ప్రారంభమయ్యిందని తల్లి లిసా చెబుతోంది. తన కొడుకుకి రంగుల ప్రపంచం అంటే ఇష్టమని, ఆ అభిరుచి ఇలా కళాత్మక చిత్రాలను గీసేలా చేయించిందని అంటోంది ఆ చిన్నారి తల్లి. కొడుకు లారెంట్ పెయింటింగ్స్‌లో ఏనగులు, డైనోసార్లు, గుర్రాలు, వంటి గుర్తించదగిన జంతు బొమ్మల నైరూప్య రూపాల సమ్మేళ్లనం కనిపిస్తోందని చెబుతోంది. తన కొడుకు ప్రతిభకు ఫిదా అయ్యి.. అతడి పేరు మీదుగా పేయింటింగ్లను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది లిసా. ఈ వీడియోలకు విపరీతమైన జనాధరణ ఉండటమే గాక ఏకంగా రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేగాదు వాటిని ఆన్లైన్లో విక్రయించడం మొదలు పెట్టింది ఆ చిన్నారి తల్లి లిసా. ఏప్రిల్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో అతిపెద్ద ఆర్ట్ ఫెయిర్‌లో అరంగేట్రం చేసిన తర్వాత నుంచి తన కొడుకు పేయింటింగ్ కలెక్షన్లతో తమ ఇల్లు నిండిపోయింది అంటోంది. అంతేగాదు లారెంట్ ఎప్పుడెప్పుడు రెస్ తీసుకుంటాడు, ఏ సమయాల్లో చిత్రాలు గీస్తాడు వంటి వాటి గరించి కూడా సోషల్ మీడియలో షేర్ చేస్తుంది. అయితే లారెంట్.. ఆ ఆర్ట్ ఫెయిర్‌లో తను వేసిన పేయింటింగ్లను గుర్తుపట్టడం తమకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఆ చిన్నారి తల్లి ఆనందంగా చెబుతోంది. ఇంతకీ ఈ చిట్టి బుడతడు లారెంట్ వేసిన పేయింటింగ్స్ ఎంతకీ అమ్ముడయ్యిందో వింటే షాకవ్వుతారు. సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతాయట. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Laurent Schwarz (@laurents.art) (చదవండి:
న్యూస్ పాడ్‌కాస్ట్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రూ. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో (టెస్కాబ్) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ముసుగులో రూ.200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణీబాల, ఆమె భర్త, కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్.శ్వేత గురువారం తెలిపారు.వాణీబాలతోపాటు ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షలను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అధిక వడ్డీ ఆశచూపి..: ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్‌లోని తిలక్ రోడ్లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్‌ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర వ్యాపారాలు కూడా చేసిన ఆయన.. వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమ వద్ద నగదు డిపాజిట్ చేస్తే ఏడాదికి 24% చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు.అలాగే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్‌లకు విక్రయించడం మొదలెట్టారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్గా మారిన ఈ సంస్థలో కొనసాగారు. రాష్ట్ర స్థాయి పోస్టు అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు. శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్‌గా చేరా రు.వాణీబాల టెస్కాబ్‌లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేసింది. దీంతో 147 మంది రూ. 26 కోట్ల డిపాజి ట్లు చేశారు. అలాగే టెస్కాబ్‌లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయించుకుంది. రశీదులన్నీ వేరే సంస్థ పేరుతో..: తమ వద్ద పె ట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి నేతాజీ, శ్రీహర్షలు ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసిచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించింది. విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కోరాలని నిర్ణయించింది.
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. సన్‌సిటీ బండ్లగూడ జాగీర్‌లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్‌తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్‌ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్‌కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు.
నా కెరీర్లో ఇదో కొత్త ప్రయత్నం: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.‘మేజర్’ చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో భారీ స్టంట్స్ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్ గేమింగ్, వర్చ్యువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను.ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు.