Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election campaign Schedule For Kurnool
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ నెల 9న ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు సిటీలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎస్వీ కాంప్లెక్స్‌ రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్‌ రోడ్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు

ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరి­పాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయ­పడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్‌ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్‌’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన షేక్‌ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్‌మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పి.శరత్‌బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్‌ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్‌ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్‌పై వెళ్తున్నవైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జుల నగే­ష్‌పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్‌ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్‌ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయం­తోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ మహిళా విభా­గం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీఎం జగన్‌పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

Sunrisers Hyderabad won by 10 wickets
సన్‌రైజర్స్‌ విధ్వంసం

250 పరుగుల లక్ష్యమైనా సన్‌రైజర్స్‌ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కెప్టెన్ రాహుల్‌ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ సీజన్‌లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్‌ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్‌ తరహాలో ట్రవిస్‌ హెడ్, అభిõÙక్‌ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్‌లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్‌ ఛేదించిపడేసింది. రైజర్స్‌ ఛేజింగ్‌ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ బ్యాటింగ్‌ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్‌ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం హైదరాబాద్‌ కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రవిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 89 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్‌–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. రాహుల్‌ విఫలం... భువనేశ్వర్‌ చక్కటి బౌలింగ్‌ వల్ల లక్నో ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్‌ (2), స్టొయినిస్‌ (3)లను పెవిలియన్‌ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సన్వీర్‌ సింగ్‌ అద్భుత క్యాచ్‌లు కారణంగా నిలిచాయి. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రాహుల్, కృనాల్‌ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ అవుట్‌ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా ఏ దశలోనూ రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్‌ రనౌట్‌ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్‌ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు. మెరుపు వేగంతో... 8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్‌రైజర్స్‌ ఒక్కో ఓవర్‌లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్‌ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్‌ చెలరేగిపోయారు. యశ్‌ ఓవర్లో అభిషేక్‌ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్‌ ఓవర్లో హెడ్‌ 3 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. నవీనుల్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్‌... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశ్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్‌ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్‌ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్‌ వేసిన పదో ఓవర్‌ నాలుగో బంతిని అభిõÙక్‌ సిక్స్‌గా మలచడంతో ఉప్పల్‌ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) నటరాజన్‌ (బి) కమిన్స్‌ 29; డికాక్‌ (సి) నితీశ్‌ (బి) భువనేశ్వర్‌ 2; స్టొయినిస్‌ (సి) సన్వీర్‌ (బి) భువనేశ్వర్‌ 3; కృనాల్‌ పాండ్యా (రనౌట్‌) 24; పూరన్‌ (నాటౌట్‌) 48; బదోని (నాటౌట్‌) 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–12–2, కమిన్స్‌ 4–0–47–1, షహబాజ్‌ 2–0–9–0, విజయకాంత్‌ 4–0–27–0, ఉనాద్కట్‌ 2–0–19–0, నటరాజన్‌ 4–0–50–0. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 75; హెడ్‌ (నాటౌట్‌) 89; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 167. బౌలింగ్‌: గౌతమ్‌ 2–0–29–0, యశ్‌ ఠాకూర్‌ 2.4–0–47–0, బిష్ణోయ్‌ 2–0–34–0, నవీనుల్‌ హక్‌ 2–0–37–0, బదోని 1–0–19–0. ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X బెంగళూరు వేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Several key leaders of the coalition are on the brink of defeat
బాబు, పవన్‌, బాలయ్య, కిరణ్‌.. కూటమి ప్రముఖుల ఎదురీత

సాక్షి, అమరావతి : ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక గుంపుగా వస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలోని ప్రముఖ నేతలు తమ సొంత స్థానాల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గాల్లోనే వీళ్లంతా ఓటమి బాటలో పయనిస్తుండడం ఆసక్తికరంగా మారింది. పైకి వీరంతా గంభీరంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా గెలిచే పరిస్థితిలేదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎప్పుడూలేని విధంగా కుప్పం ప్రజలు వణికిస్తున్నారు.ఈసారి ఆయన గెలవడం కష్టమనే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించినా పెద్దగా మార్పురాలేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని చేజార్చుకోవడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లోనూ చంద్రబాబు తొలిసారి భంగపడడంతోనే ఆయన ఓటమికి బీజంపడింది. దీంతో కుప్పంలో గెలవడమే తప్ప ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరగక తప్పలేదు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే మకాం వేసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆమె ఇలా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. శాంతిపురం మండలంలో ఈసారి చంద్రబాబుకు గట్టి షాక్‌ తగిలే పరిస్థితి ఉంది. బెంగుళూరు నుంచి 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ని రెండునెలలుగా కుప్పంలో ఉంచి పనిచేయిస్తున్నా గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులో కనిపించడంలేదు. సీఎంగా చేసినప్పుడు కూడా కుప్పం గురించి ఆయన పట్టించుకోలేదనేది స్థానికుల నిశ్చితాభిప్రాయం. ఆయన్ను కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించినా చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేయలేకపోయారు. వైఎస్‌ జగన్‌ వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా చంద్రబాబు కట్టుకోలేదు. కేవలం తనకు ఓట్లేసే మిషన్లుగా అక్కడి జనాన్ని ఆయన చూశారు. దీన్నిబట్టే ఆయనకు కుప్పంపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అక్కడి ప్రజలు గమనించారు.మరోవైపు.. అభివృద్ధితోపాటు ప్రజలకు ఎలాంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్‌ జగన్‌పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఇవే తన చివరి ఎన్నికలు కాబట్టి తనను గెలిపించాలంటూ ఆయన అభ్యర్థిస్తుండడాన్ని బట్టి ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోందని స్పష్టమవుతోంది. పిఠాపురంలో పవన్‌కు నాన్‌లోకల్‌ గండంజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా పిఠాపురంలో గెలుపునకు చాలా దూరంలో ఉన్నారు. ఒక్కసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన దీనంగా ప్రాథేయపడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సినిమా స్టార్‌ కాబట్టి చూడ్డానికి రావడం తప్ప ఓటు వేస్తారా లేదా అనే దానిపై జనసేన నాయకులకే నమ్మకం కలగడంలేదు.నాన్‌ లోకల్‌ కావడం, కేవలం కులం ఓట్ల ప్రాతిపదికనే పవన్‌ అక్కడ పోటీచేస్తుండడం ఆయనకు పెద్ద మైనస్‌ పాయింట్లుగా మారాయి. పవన్‌ తమ ఎమ్మెల్యే అయితే ఆయన్ను కలవడం కుదరదని, తమకు ఏమైనా సమస్య వస్తే వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాకపోవడంతో ఎంతవరకూ నమ్మవచ్చనే అనుమానాలూ జనంలో ఉన్నాయి.అయితే, జబర్దస్త్‌ షో ఆర్టిస్టులు, సినిమా వాళ్లు, పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు పిఠాపురంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తూ హడావుడి చేయడం అక్కడి జనానికి వినోదం పంచుతోంది. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ పైకి పవన్‌ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపాయకారీగా టీడీపీ కేడర్‌ను సైలెంట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంత హంగామా చేసినా జనంలో మాత్రం పవన్‌ గెలుపునకు దోహదపడే అంశాలు కనిపించడంలేదు. ఈసారి బాలయ్యకూ నిరాశే..హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి గట్టెక్కడం కష్టంగా మారింది. మైనారిటీలు ఎక్కువగా ఉండ­డంతో వారు ఈసారి బాలయ్యకు ఝలక్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి రెబల్‌ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి టీడీపీ ఓట్లను భారీ సంఖ్యలో చీల్చే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ కేడర్, ద్వితీయశ్రేణి నేతల్లోనూ బాలకృష్ణ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వల్ల ఉపయోగం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఆయన ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గెలిపించడమే తప్ప వారిక్కడ లేకుండా తమపై పెత్తనం చేయడంపై వారిలో అసహనం కనిపిస్తోంది. దీనికితోడు వైఎస్సార్‌సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ ఓట్లలోనూ భారీ చీలిక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ కంచుకోట బద్దలవుతుందని గట్టిగా వినిపిస్తోంది.ఓటమి అంచున ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు..ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్య నేతలైన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న­పాత్రుడు, అశోక్‌­గజపతిరాజు కుమార్తె అదితిలు సైతం ఈ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. » తరచూ నియోజకవర్గాలు మార్చే నేతగా ముద్రపడిన గంటా శ్రీనివాసరావును భీమిలి జనం నమ్మడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే భూ కుంభకోణాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారింకా మరచిపోలేదు. గంటా గెలిస్తే తమ భూములు ప్రమాదంలో పడతాయనే ఆందోళన ఉంది. అలాగే, గెలిచినా నియోజక­వర్గాన్ని పట్టించుకోరనే వాదనా ఉంది. వీటికి­తోడు విశాఖను పరిపాలనా రాజధా­నిగా చేసే విషయంలో ఆయన వైఖరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గంటా గెలవడం సాధ్యంకాదని చెబుతున్నారు. » నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న­పాత్రుడు కూడా ఎదురీదుతున్నారు. వివాదాలు, నోటి దురుసుతనంతో ఆయన ప్రజల ఆదరణ కోల్పోయారు. » ఎవరూ పోటీచేయడానికి ముందు రాకపో­వ­డం­తో చీపురుపల్లి బరిలో నిలుచున్న కళా వెంక­ట్రావుకు గెలుపు ఆశలేలేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్య­నారాయణను ఎదురొడ్డి కళా నిలబడడం అసా«­ద్యమని ఆదిలోనే తేలిపోయింది. ఆయ­న మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు. » ఇక విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి సెంటిమెంటునే నమ్ముకుని తనను గెలిపించాలని కోరుతున్నా స్థానికంగా అంత స్పందన రావడంలేదు. ఆమె గెలిచినా కోటకే పరిమితమవుతారని అందుబాటులో ఉండరనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ రెబల్‌గా మీసాల గీత ఉండడం, ఆమె చీల్చే ఓట్లు గణనీయంగా ఉండే అవకాశం ఉండ­డంతో అదితికి ఓటమి తప్పదంటున్నారు. » అనకాపల్లిలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన ప్రజలకు దూరమై చాలాకాలం కావడంతో ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. » రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డోన్‌లో కోట్ల సూర్యప్రకాశరెడ్డి గెలుపు అవకాశాలకు దూరంగానే ఉన్నారు. » మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఎంత ప్రయత్నిస్తున్నా గెలుపు ఊపు రావడంలేదు. తాయిలాలపైనే నమ్మకం పెట్టుకున్నా అది కూడా నెరవేరే సూచనలు కనిపించడంలేదు. రెండోసారి మంగళగిరి ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.సీఎం రమేష్, సుజనా, కిరణ్, పురందేశ్వరి, నాదెండ్ల..పొత్తులో సీట్లు దక్కించుకుని బీజేపీ తరఫున అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి, తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనబలం, కులబలంతో గెలవొచ్చని వారు బరిలోకి దిగినా అందుకు అవకాశాలు లేకపోవడంతో వారికి కళ్లెదుటే ఓటమి సాక్షాత్కరిస్తోంది.

 Daily Horoscope: Rasi Phalalu On 09-05-2024 In Telugu
Horoscope Today: ఈ రాశి వారికి వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.10 వర కు, తదుపరి విదియ, నక్షత్రం: కృత్తిక ప.1.07 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.4.15 నుండి 6.20 వరకుు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ప.10.46 నుండి 12.10 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17. మేషం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.మిథునం: రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.కన్య: ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.తుల: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.మీనం: వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

Original documents of e-stamps are given to public by AP Govt
ఏపీ జిరాక్సులు కాదు.. ఒరిజినల్‌ డాక్యుమెంట్లే ఇస్తున్నారు

సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్‌ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒరిజినల్‌ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్‌ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్‌ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్‌–జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్‌ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్‌ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్‌ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్‌ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్‌.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్‌.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్‌సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్‌ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్‌ మీడియాలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్‌ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్‌ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్‌ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్‌ అయ్యాక ఒరిజనల్‌ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్‌ ఇవ్వడం లేదు, జిరాక్స్‌ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్‌ చేశారు. వెంటనే డాక్యుమెంట్‌ ఇచ్చారు. రిజిస్ట్రార్‌ ఆఫీసులో డాక్యుమెంట్‌ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్‌ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్‌ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధా­నంలో డాక్యుమెంట్లు ఇవ్వ­డం లేదని చెబుతున్నా­రని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా

chandrababu naidu shades in elections
నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఇందుకోసం ఎవరినైనా వెన్ను­పో­టు పొడుస్తారు.. విమర్శిస్తారు.. వ్యతిరేకిస్తారు. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తా­రు. మళ్లీ అవసరమైతే తాను తిట్టినవారి ఒళ్లోనే చేరతారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా బుధవారం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించిన విజయవాడ రోడ్డుపైనే నాడు టీడీపీ నేతలు ప్రధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేత­లు నల్ల జెండాలు ఎగరవేస్తూ ‘గో బ్యాక్‌ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు విజయవాడ బెంజి సర్కిల్‌లో నల్లచొక్కా తొడుక్కొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు ఆరు నె­లలు ముందే బీజేపీని వ్యతిరేకించి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం గమనార్హం. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డిఅయినా కరుస్తారనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. నాడు ఎన్నికల ముందు బాబు డ్రామా.. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరి మంత్రి పదవులు కూడా తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే జోన్‌ ఇలా ఏ ముఖ్యమైన హామీని సాధించలేకపోయింది. ఇలా అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరారు. అప్పట్లో ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’ అంటూ చంద్రబాబు వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రధాని మోదీ సైతం ‘చంద్రబాబు చేస్తున్నది అమరా­వతి నిర్మాణం కాదు.. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు’ అంటూ విమర్శించారు. అంతేకాకుండా ‘పోలవరం ప్రాజెక్టును డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు వాడుకుంటున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నాడు ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు అధికారమే పరమావధిగా పొత్తు పెట్టు­కోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు.. దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ.59,000 కోట్ల రఫెల్‌ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తోంది. మోదీ జీ మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు. 2019 ఫిబ్రవరి 8న తన ట్విట్టర్‌లో మీకూ, బ్రిటిష్‌ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్‌ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా? నాలాంటి సీనియర్‌ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లోకి వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్‌ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా? –2019 ఫిబ్రవరి 2న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి. 2018 జూన్‌ 9న నెల్లూరు సభలో బీజేపీకి ఒకటే చెబుతున్నా.. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్‌.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు. 2018లో శృంగవరపుకోటలో నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడు భయపడలేదు. భయమనేది నా జీవితంలో లేదు. 2018 మార్చి 6న విజయవాడలో విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. –2018 మార్చి 7న వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలు.. » అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచు­కునే ఆశ నాకు లేదు. ళీ ఎన్టీఆర్‌ ఏపీకి కాంగ్రెస్‌ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే టీడీపీ ఆవిర్భవించింది. కానీ, ఈ రోజు కాంగ్రెస్‌ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కొవాల్సిన చంద్రబాబు అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్టకాంగ్రెస్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. » చంద్రబాబుకు ఏమైంది? ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? మీరు (చంద్రబాబు) సీనియర్‌. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ, మీరు సీనియర్‌.. కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరిని తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం. –2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ » కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెంచుతూ, ఎక్కువ నిధులు పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుల (చంద్రబాబు)కు ఒక ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూటర్న్‌ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. » ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూటర్న్‌ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హెరిటేజ్‌ (సంస్కృతి) మంచి పాలనతో అభివృద్ధి చెందాలని. కానీ యూటర్న్‌ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్‌ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు. – 2019 ఏప్రిల్‌ 1న రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Sai Pallavi special poster is released from Tandel Movie
Tandel: ప్రేమ కబుర్లు

మొబైల్‌లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘తండేల్‌’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. సత్యభామ ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all