Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Speech At Rajampet Campaign Meeting
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్‌

అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన. ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలతో సర్టిఫైడ్‌ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు             

CM YS Jagan Interview Created Sensation
ఇది క‌దా క్రేజ్ అంటే.. సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూకి మిలియన్ల వ్యూస్

సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూను చూసింది.అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న వేర్వేరు సందేహాలను టీవీ 9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్ వెళ్లలచెరువు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు.  బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్‌ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న

'No Fundamental Right To Campaign': ED Opposes Arvind Kejriwal Bail
కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ పేర్కొంది. కనీసం రాజ్యాంగపరమైన లేదా చట్టబద్దమైన హక్కు కూడా కాదని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్‌ మంజూరు కాలేదని తెలిపింది. తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు పంపడం జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడింది.అయితే కేజ్రీవాల్‌ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది.  త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది. అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్‌  మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే  ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. 

TDP MP candidate Sribharat Says Visakhaptnam Is Best For Capital
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు

అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్‌ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ  కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు  సిమాచలం. ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడుచూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి  దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు.  ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న 

Punjab Kings opt to bowl in must-win tie against RCB
పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ కీల‌క పోరు.. యువ ఆట‌గాడు అరంగేట్రం

ఐపీఎల్‌-2024లో మ‌రో కీల‌క పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున విద్వాత్ కవేరప్ప ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు పంజాబ్ స్టార్ పేస‌ర్ ర‌బాడ దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో లియామ్ లివింగ్‌స్టోన్ తుది జ‌ట్టులో వ‌చ్చాడు. మ‌రోవైపు ఆర్సీబీ ఒకే ఒక మార్పు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ స్ధానంలో  లాకీ ఫెర్గూసన్ జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చాడు. ఇక ప్లే ఆఫ్ రేసులో నిల‌బ‌డాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో(వికెట్ కీప‌ర్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసోవ్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప

Vikrant Massey Heated Argument With Cab Driver On Camera, Watch
క్యాబ్‌ డ్రైవర్‌తో 12th ఫెయిల్‌ హీరో గొడవ, వీడియో వైరల్‌

బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ '12th ఫెయిల్‌'తో హీరో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో క్యాబ్‌ డ్రైవర్‌ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్‌. నేనొక క్యాబ్‌ డ్రైవర్‌ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్‌లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్‌ కెమెరాను విక్రాంత్‌ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్‌ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్‌ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్‌ డ్రైవర్‌.. యాప్‌లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్‌.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్‌ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్‌ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్‌ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్‌ స్టంట్‌.. స్క్రిప్ట్‌ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు.    View this post on Instagram           A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!

మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

 Indian student missing in Chicago family in Hyderabad worried
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు

అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం  కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన  25 ఏళ్ల రూపేష్‌ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్  4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు  తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు"  రూపేష్‌ తండ్రి సదానందం  తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి  ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని  స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.    

Want To Serve People May Be Through Rajya Sabha Says Robert Vadra
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా

ఢిల్లీ: అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అమేథీ బరిలోకి 'కిషోరి లాల్ శర్మ'ను దింపింది. ఈ తరుణంలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.అమేథీ ఎంపీ టికెట్ కేఎల్ శర్మకు కేటాయించడం వల్ల.. వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొంతకాలం తరువాత తాను ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో చేరుతానని స్పష్టం చేశారు.రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికీ సమాధానం చెప్పడానికి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ మీద మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానిగా ఇలాంటి మాట్లాడటం తగదని పేర్కొన్నారు.ప్రధాని మోదీ ఏది ఆరోపించినా వాటిని రుజువు చేయాలి. రుజువు చేయని పక్షంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాహుల్, ప్రియాంకా ఇద్దరూ ప్రజలకు సేవ చేయడానికి పాటుపడుతున్నారు. ఈ సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేదని వాద్రా అన్నారు.#WATCH | Robert Vadra says "...I do not want to come to politics to give a reply to anyone. I want to serve the people of the country, so maybe it is through Rajya Sabha. I will keep working for the people across the country and will travel to Amethi, Raebareli, and Morabadab as… pic.twitter.com/kUvzDHieEi— ANI (@ANI) May 9, 2024

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all