Top Stories
ప్రధాన వార్తలు
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు.
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్ చేశారు.
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంలో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్సీపీ.. పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.కాగా, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరువాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు
సాక్షి, గుంటూరు: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతు పవనాలు ఈ రోజు(ఆదివారం) ప్రవేశించాయని.. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందినేడు రాయలసీమలోకి ప్రవేశించగా, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్సీపీ, 10–12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.
ప్లీజ్.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న రవీనా టండన్
గతేడాది కేజీఎఫ్-2లో అలరించిన స్టార్ నటి రవీనా టాండన్. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముంబయిలో రవీనా టాండన్, తన డ్రైవర్లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్‌పై గొడవకు దిగారు. అ తర్వాత రవీనా టాండన్ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. Actress Raveena Tandon's driver accused of rash driving & crashing into 3 women in Bandra, Mumbai. Injured's family claim Raveena in an inebriated state got off the car along with her driver & further assaulted the victims on the road. Crowds turned aggressive leading to heated… pic.twitter.com/PdbgLMueFz— Nabila Jamal (@nabilajamal_) June 2, 2024What's this #RaveenaTondon aunty!? pic.twitter.com/qA1IWAB1qf— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) June 2, 2024
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి.
Mahabubnagar MLC Bypoll Updates: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
counting Updatesమహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయంబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. హరీశ్ రావు శుభాకాంక్షలుమహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024 మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్‌రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
తప్పక చదవండి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
- ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
సినిమా
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరి బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్‌లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్‌లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ.
మాస్ కా దాస్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, డీజే టిల్లు భామ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో రిలీజైంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ.5.2 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. రూ.8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.రెండో రోజు సైతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే జోరును కొనసాగించింది. కాస్తా తగ్గినప్పటికీ రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.8.2 కోట్ల నికర కలెక్షన్స్ రాగా.. రూ.11.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. కాగా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం థియేటర్లలో శనివారం 25.89 శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు.
'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్!
బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్ అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17 షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించారు.అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్ బోగిలో టికెట్ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
ఫొటోలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)
క్రీడలు
T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రికార్డు..
టీ20 వరల్డ్‌కప్-2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు.అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అమెరికా మిడిలార్డర్ బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్(65), ఆరోన్ జోన్స్(94 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.చెత్త రికార్డు..ఈ మ్యాచ్‌లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. జెరెమీ గోర్డాన్‌ను ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఊచకోత కోశారు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన జోర్డాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్‌లో మాత్రం జోర్డాన్ పూర్తిగా తేలిపోయాడు.యూఎస్ఎ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోర్డాన్.. ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో జోర్డాన్ రెండు నో బాల్స్, రెండు వైడ్స్‌తో సహా 3 సిక్స్‌లు, రెండు బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా గోర్డాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ బౌలర్ ఇజ్రాతుల్లా దౌలత్‌జాయ్ పేరిట ఉండేది.2012 పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై దౌలత్‌జాయ్ ఒకే ఓవర్లో 32 పరుగులిచ్చాడు. ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో గోర్డాన్ మరో 4 పరుగులిచ్చి ఉంటే బ్రాడ్‌ను అధిగిమించేవాడు.
Paris Olympics: ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న అమిత్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ పారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించాడు. సెకండ్ వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో చైనా బాక్సర్ చువాంగ్ లియూను ఓడించి విశ్వ క్రీడల్లో పాల్గొనేందుకు బెర్తు ఖరారు చేసుకున్నాడు.బ్యాంకాక్ వేదికగా ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చువాంగ్‌ను 5-0తో చిత్తు చేశాడు అమిత్ పంఘాల్. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించాడీ వరల్డ్ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత.కాగా భారత్ నుంచి ఈసారి విశ్వ క్రీడల్లో పాల్గొనబోయే రెండో పురుష బాక్సర్‌గా అమిత్ పంఘాల్ నిలిచాడు. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు నిషాంత్ దేవ్ 71 కేజీల విభాగంలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), లవ్లీనా బొర్గొహెయిన్(74 కేజీలు) ఒలింపిక్ బెర్తులు ఖరారు చేసుకున్నారు.
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాం.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ కాగా భారత్‌లోని గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు👉వేదిక: డలాస్👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్👉కెనడా స్కోరు: 194/5 (20)👉అమెరికా స్కోరు: 197/3 (17.4)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా View this post on Instagram A post shared by ICC (@icc)
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.టీమిండియా తరఫున అరంగేట్రంభారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.రాణించలేక అవకాశాలు కరువుకానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.ఐపీఎల్-2024 ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్. అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
బిజినెస్
మన బంగారం విదేశాల్లో ఎందుకు? ఆసక్తికర కారణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూకే నుంచి సుమారు 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని బదిలీ చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ పరిణామాల అనంతరం టన్నుల కొద్దీ మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారు అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం..వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి హామీగా, విలువ నిల్వగా బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. చరిత్రాత్మకంగా, గోల్డ్ స్టాండర్డ్ యుగంలో ఈ నిల్వలను డిపాజిటర్లు, నోట్ హోల్డర్లకు వాగ్దానాలను చెల్లించడానికి ఉపయోగించేవారు. నేడు, ఇవే బంగారం నిల్వలు ఆయా దేశాల కరెన్సీల విలువకు మద్దతు ఇస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయి.బంగారం నిల్వలు ఎందుకు?కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉండటం దేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.మన దగ్గరున్న బంగారం ఎంతంటే..2024 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తన కరెన్సీకి మద్దతుగా కలిగి ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం స్థానికంగా బ్యాంకింగ్ విభాగం ఆస్తిగా ఉంది. మొత్తంగా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల్లో ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై, నాగపూర్ లోని హై సెక్యూరిటీ వాల్ట్ లలో భద్రపరుస్తారు.827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్ లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇది దాని విదేశీ మారక నిల్వలలో 8.9 శాతం. ఇక 8,133.5 మెట్రిక్ టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల బంగారం నిల్వల్లో ఇది 71.3 శాతం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ గణనీయమైన బంగారు నిల్వలు ఉన్న ఇతర దేశాలలో ఉన్నాయి.విదేశాలలో నిల్వ చేయడమెందుకు?అనేక ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా అనేక కారణాల వల్ల తన బంగారు నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్‌లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరత లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది.లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాలకు పూచీకత్తుగా సులభంగా పొందవచ్చు.బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక, భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలకు ఉన్న ఖ్యాతి, వాటితో ఉన్న చారిత్రక సంబంధాలు విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వాల్ట్ లలో అధునాతన భద్రతా చర్యలు ఉంటాయి. నిల్వల భద్రతను నిర్ధారిస్తాయి.ప్రధాన అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్ ఇవే..బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన కస్టోడియన్‌గా ఉంది. సమగ్ర నిఘా వ్యవస్థలు, కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్‌తో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అందిస్తుంది. యూకేతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, బ్యాంక్ ఖ్యాతి.. ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.స్విట్జర్లాండ్ లోని బేసెల్ లో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సహకారానికి దోహదపడుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలకు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. బంగారం నిల్వల భద్రత, ప్రాప్యతను పెంచుతుంది.అమెరికాలోని ఫోర్ట్ నాక్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జర్మనీలోని డ్యుయిష్ బుండెస్ బ్యాంక్, ఫ్రాన్స్‌లోని బాంక్యూ డి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు జ్యూరిచ్ వాల్ట్స్ ఇతర అంతర్జాతీయ గోల్డ్ వాల్ట్స్లలో ఉన్నాయి.
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది.
ప్రభుత్వానికి కాసుల వర్షం.. భారీగా జీఎస్టీ వసూళ్లు
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దేశీయ లావాదేవీల్లో బలమైన పెరుగుదల, దిగుమతులు మందగించడంతో మే నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మే వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3.83 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది వార్షిక వృద్ధికి 11.3 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. రిఫండ్ల లెక్కింపు తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 2024 మే వరకు రూ .3.36 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం పెరిగింది.రిఫండ్ల లెక్కింపు తర్వాత మే నెలలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) రూ.32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉన్నాయని, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం.
వీడియోలు
తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు
కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్
తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
YSRCPదే ప్రభంజనం..
దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
ఫ్యామిలీ
ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!
పురాతన ఆచారాలు, సంస్కృతులు కాస్త వింతగా ఉంటాయి. అందులోనూ తవ్వకాల ద్వారా బయటపడ్డవి అయితే ఓ పట్టాన అర్థం కావు. చాలా విస్తుపోయాలా ఉంటాయి ఆనాటి ఆచారాలు. అలాంటి విచిత్రమైన ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. నాటికాలాలతో అంత్య క్రియలు ఇలాచేసేవారా..!అని నోరెళ్లబెడతారు..టర్కిలోని థార్సా నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి సమాధిని కనుగొన్నారు. ఇది అడయమాన్ శాన్‌ల్యర్ఫా హైవేపై కుయులు గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత విచిత్రమైన సమాధి బయటపడింది. రోమన్ కాలాం నాటిదిగా గురించారు. ఈ సమాధి నాటికాలంలోని చరిత్రపై కొత్త ఆశను అందిస్తోంది. నాటికాలంలో ఉండే పురాతన నాగరికత, శ్మశాన వాటికల గురించి ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ సమాధి దోహదపడుతుంది. థార్సా నగరంలోని నెక్రోపోలి ప్రాంతంలో 2024 నుంచి జరిపిన తవ్విన తవ్వకాల్లో ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రముఖంగా ఎద్దుల తల బొమ్మలతో అలంకరించినట్లు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఎద్దు తలల పరివేక్షణలో సమాధి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాటి రోమన్ అంత్యక్రియలు, ఆచారాలు కాలక్రమేణ అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. నేటి కాలంలో దహనం చేయడం వంటివి చేస్తున్నారు, కానీ క్రీస్తూ శకం రెండో శతాబ్దంలో అంత్యక్రియ ఆచారాలు వేరుగా ఉండేవని వెలుగులోకి వచ్చిన సమాధిని బట్టి తెలుస్తోందని చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు. నాటికాలంలో మరణాంతరానికి సంబంధించిన ప్రబలమైన నమ్మకాలు బలంగా ఉండేవని ఈ సమాధి అలంకరణే అందుకు నిదర్శనమేనని అన్నారు.(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..)
జీర్ణాశయాన్ని బాధించే.. ఈ సమస్యలోంచి బయటపడాలంటే?
జీర్ణాశయాన్ని బాధించే సమస్యలలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ), ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అనే రెండూ ప్రధానమైనవి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌లో తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాల్సి రావడమనే ఇబ్బంది తప్ప ‘ఐబీడీ’లాగా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేమీ ఉండవు. ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, దానిని అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తినీ తినగానే వెంటనే టాయ్‌లెట్‌కు పరుగెత్తాలనిపించడం లేదా బయట ఎక్కడైనా తినాల్సి వస్తే అలా తినడానికి ముందే మరుగుదొడ్డి ఎక్కడుందో వెతుక్కోవాల్సి రావడం ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (ఐబీఎస్)లో ప్రధాన సమస్య. అందుకే ఈ సమస్య ఉన్నవారు బయట లంచ్ చేయడానికీ, ఎవరి ఇంటికైనా అతిథిగా హాజర య్యేందుకూ, విహార యాత్రలకు వెళ్లడానికీ వెనకాడుతుంటారు. అయితే మరికొందరిది దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి. వాళ్లను మలబద్ధకం వేధిస్తుంటుంది.ఈ అంశం ఆధారంగా ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’లో నాలుగు రకాలుంటాయి.ఐబీఎస్ రకాలు:– ఐబీఎస్ – డయేరియా (ఐబీఎస్–డీ): నీళ్లవిరేచనాలతో కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – కాన్స్టిపేషన్ (ఐబీఎస్–సీ): మలబద్ధకంతో పాటు కడుపులో ఇబ్బంది. – ఐబీఎస్ – మిక్స్డ్ (ఐబీఎస్ – ఎమ్): కొన్నిసార్లు నీళ్లవిరేచనాలూ, మరికొన్నిసార్లు మలబద్ధకం... ఈ రెండు ఇబ్బందులూ మార్చి మార్చి వస్తుండడం. – ఐబీఎస్ – అన్–ఐడెంటిఫైడ్ (ఐబీఎస్–యూ): లక్షణాలు స్థిరంగా ఉండక మారుతుంటాయి.కారణాలు: నిర్దిష్టమైన కారణాలు లేవు. అయితే, జీర్ణాశయానికీ, మెదడుకు మధ్య ఏర్పడే కమ్యూనికేషన్ లోపాలే ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా భావిస్తుంటారు. దాంతోపాటు పేగుల కదలికలలో లోపాలు, జీర్ణాశయపు నరాల్లో అతి చురుకుదనం, జీర్ణాశయం (గట్) బ్యాక్టీరియాలో మార్పుల వల్ల వచ్చే తేడాలు, కొందరిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ల తర్వాత, మరికొందరిలో కొన్ని రకాల ఆహారాలు సరిపడక΄ోవడం, బాల్యంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కోవడం వంటివి.లక్షణాలు:– విరేచనానికి వెళ్లగానే కడుపులోని ఇబ్బంది తొలగి΄ోవడం– లవిసర్జనలో విరేచనం అయ్యాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్– కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం– మలంలో బంక.నిర్ధారణ:– లక్షణాలను బట్టి నిర్ధారణ చేస్తారు.– కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, మల పరీక్షతో పాటు జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరుగుతోందేమో తెలుసుకోవడం కోసం ‘హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్’ అనే పరీక్ష.చికిత్స:పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలతో పాటు‘లో–ఫోడ్మ్యాప్’ఆహారం.లో–ఫోడ్మ్యాప్ ఆహారం అంటే...‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్’అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూ΄÷ందించారు. ఆహారాల్లోని ΄ోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెరలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. ఆ ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...తీసుకోవాల్సిన ఆహారాలు... అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్; అరటి, నేరేడు, ద్రాక్ష, కివీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొ΄్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీ; క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ్ర΄÷టీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్.తీసుకోకూడనివి...పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పియర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రాకలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.పాటించాల్సినవి...– నీళ్లు ఎక్కువగా తాగడం, క్రమబద్ధమైన వ్యాయామం, కంటినిండా నిద్ర ∙లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే... మలబద్ధకం ఉన్నవారికి లాక్సెటివ్స్ అనే విరేచనకారి మందులూ, నీళ్లవిరేచనాలు అయ్యేవారికి యాంటీ డయేరియల్ మందులు, అవసరాన్ని బట్టి కొందరికి యాంటీ డిప్రెసెంట్స్, ఇంటెస్టినల్ స్పాజమ్స్, క్రాంప్స్ తగ్గించే మందులూ వాడాల్సి రావచ్చు. – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ఇవి చదవండి: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.కారణాలు..ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..నీళ్లవిరేచనాలుకడుపునొప్పిజ్వరంబరువు తగ్గడంతరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటంకొన్నిసార్లు మలబద్దకంఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..నీళ్ల విరేచనాలుకడుపునొప్పితీవ్రమైన అలసటనీరసంనిస్సత్తువబరువు తగ్గడంనోటి పొక్కులుచర్మసమస్యలుకళ్లు ఎర్రబారడం, మండడంకొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.నిర్ధారణ పరీక్షలు..కొలనోస్కోపీగ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.చికిత్స..– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారుశస్త్రచికిత్స..– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని... – జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.ఆహారంతో అదుపు ఇలా...– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్– బీన్స్, కందులు– వేటమాంసం– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి. (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్‌ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్‌ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్‌లో స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్‌తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్‌తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో పోర్టబుల్ డివైస్‌గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్‌తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
న్యూస్ పాడ్‌కాస్ట్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.