Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, అందెశ్రీ, కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల హడావుడి 'దశాబ్ది దంగల్‌'!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పూర్తిగా తమ మార్క్‌ కనిపించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. మరోవైపు అధికారంలో ఉండగానే (గత ఏడాది జూన్‌లోనే) దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పార్టీపరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరోవైపు దశాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా పలు అంశాలపై కసరత్తు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అధికారిక గేయాన్ని ఖరారు చేశారు. అధికారిక చిహ్నంలోనూ మార్పులపై దృష్టిపెట్టారు. ఈ మార్పులను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. గన్‌ పార్క్‌ నుంచి మొదలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సోనియా గాం«దీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. 2న అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అరి్పంచడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కారి్నవాల్, లేజర్‌ షో, శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అధికారిక గేయమైన ‘జయజయహే తెలంగాణ’కు జాతీయ జెండాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లోనే ఉత్సవాలు చేపట్టి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను చేపట్టింది. 2023 జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామగ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. జూన్‌ 1వ తేదీనే గన్‌ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2న కేసీఆర్‌ అధ్యక్షతన సభ నిర్వహించనున్నారు. 3వ తేదీన జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ జెండా, జాతీయ పతాకం ఆవిష్కరణ, హాస్పిటళ్లు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. అధికార చిహ్నం మార్పులపై విమర్శలు దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా ఈ కార్యక్రమానికి వస్తారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రతిస్పందిస్తుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించిన ప్రభుత్వం.. దానికి తుదిరూపునిచ్చే క్రమంలో ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణిని ఎంచుకోవడంపై బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయ హద్దులేమిటని.. అయినా బీఆర్‌ఎస్‌ హయాంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లభించిన గౌరవం మాటేమిటంటూ కాంగ్రెస్‌ నేతలు నిలదీస్తున్నారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలో రాజకీయ దంగల్‌ జరుగుతోంది.

New anthem for Telangana
రాష్ట్ర గేయం.. 2.30 నిమిషాలు!

సాక్షి, హైదరాబాద్‌: రెండున్నర నిమిషాల నిడివికి కుదించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘జయజయహే తెలంగాణ’ గేయం ఒరిజినల్‌ వెర్షన్‌లోని ఒకట్రెండు పదాలను తొలగించి.. స్వల్ప మార్పులు, చేర్పులు చేసి పదమూడున్నర నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌ను ఖరారు చేసింది. గేయ రచయిత అందెశ్రీ మార్గదర్శకత్వంలో, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రముఖ గాయ నీ గాయకులతో రికార్డు చేసిన రెండు వెర్షన్ల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో గాయనీగాయ కులు ఈ రెండు వెర్షన్ల గేయాన్ని లైవ్‌గా పాడి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గేయాన్ని సరికొత్త స్వరాలు, సంగీత బాణీలతో అద్భుతంగా తీర్చిదిద్దారని, మరోసారి ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్‌ అధినేత కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కె.రఘు, తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందిస్తున్న చిత్రకారుడు రుద్ర రాజేశం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.అధికారిక చిహ్నంలో మార్పులపైనా..తెలంగాణ తొలిదశ ఉద్యమం, అశోక చక్రం, వ్యవ సాయం, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనా చిహ్నాలను పరిశీలించి వాటిలో ఒకదానిని ఎంపిక చేశారని.. అందులో కొన్ని మార్పులను సూచించారని తెలిసింది.అయితే ఇదే అధికారిక చిహ్నమంటూ.. మూడు నమూనా చిహ్నాలు బుధవారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో దేనిని కూడా ఎంపిక చేయలేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు.అమరవీరులు, ఉద్యమకారులకు అండగత బీఆర్‌ఎస్‌ సర్కారు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలు, ఉద్యమకారులకు తమ ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పా రు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులు, అమరవీ రుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలుకు చర్య లు చేపట్టామని వెల్లడించారు. జూన్‌ 2న ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే దశాబ్ది వేడుకలకు తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమకారులను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.నేడు మిత్రపక్షాలతో సమావేశంతెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్ర గేయం, అధికారిక చిహ్నం రూపకల్పన అంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమా వేశం కానున్నారు. మిత్రపక్షాల నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణ యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించలేదు.

Pm Modi Sensational Comments On Naveen Patnaik Health
ఒడిశా సీఎం ఆరోగ్యంపై ప్రధాని సంచలన ప్రకటన

భువనేశ్వర్‌: ఒడిాశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిాశా అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే నవీన్‌పట్నాయక్‌ ఆరోగ్యంపై ఒక కమిటీ వేసి విచారణ జరుపుతామని ప్రకటించారు. బుధవారం(మే29) ఒడిషా బరిపడలో జరిగిన ఎన్నిల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘కొన్ని సంవత్సరాల నుంచి నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితులు నన్నెప్పుడు కలిసినా ఆయన ఆరోగ్యం గురించి తప్పకుండా చర్చించేవాళ్లు. నవీన్‌ తనకు తాను సొంతగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేవాళ్లు. నవీన్‌ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నవీన్‌బాబు అనారోగ్యం వెనుక ఎవరున్నారనేదానిపై కమిటీ వేసి విచారణ జరుపుతాం’అని మోదీ హామీ ఇచ్చారు. కాగా, నవీన్‌ పట్నాయక్‌ అనుయాయుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీకే పాండియన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా నవీన్‌ పట్నాయక్‌ వీకే పాండియన్‌ చేతిలో బంధీగా మారారని ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేయడం గమనార్హం.

Sajjala Ramakrishna Reddy Key Suggestion To YSRCP Polling Agents
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్‌ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్‌ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

Record Temperatures In Delhi Mageshpuri On May 29th 2024
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత

సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్‌ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్‌ ఫీల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి.

Brian Lara Bold Prediction T20 WC 2024 4 Semifinalists Underdogs In List
T20 WC: ఆసీస్‌ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్‌ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్‌ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్‌-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్, వెస్టిండీస్‌‌ టైటిల్‌ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ పేర్లు చెప్పగా.. విండీస్‌‌ దిగ్గజం బ్రియన్‌ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌ జట్టుకు తన టాప్‌-4లో స్థానమిచ్చాడు.గావస్కర్‌ టాప్‌-4 జట్లు ఇవేఅండర్‌డాగ్స్‌గా టీ20 ప్రపంచకప్‌-2024లో అడుగుపెట్టే అఫ్గన్‌.. ఈసారి కచ్చితంగా సెమీస్‌ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్‌ సునిల్‌ గావస్కర్‌ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ఈసారి సెమీస్‌ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌

Chandrababu Tension Over Kuppam Result
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?

నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌కు కౌంటింగ్ భయం పట్టుకుందా? కుప్పం ఫలితంపై ఇప్పటి నుంచే ఆందోళన మొదలైందా? వైఎస్ జగన్ పాలనలో కుప్పం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా లబ్ది పొందడమే టీడీపీ భయానికి కారణమా? మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం ప్రారంభమైందా? కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందా అంటూ టీడీపీలో మొదలైన భయానికి కారణం అదేనా? ఎన్నికల ఓట్లు లెక్కించే గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకోవడంలో తల మునకలుగా ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకు పైబడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్న కుప్పంలో చంద్రబాబు మాయమాటలకు ఎదురులేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. ఇందుకు వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణం. కుప్పంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది.ఈ ఎన్నికల్లో కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో అని చంద్రబాబుకు సైతం టెన్షన్ పట్టుకుందని టీడీపీ వర్గాల సమాచారం. కుప్పంలో ఈసారి పోలింగ్ శాతం 89.88గా నమోదైంది. గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ 30 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగ ఓట్లతోనే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారన్న వాదనా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు చెందిన వానంబాడి, తిరుపత్తూరు, నాట్రంపల్లితో పాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కే జి ఎఫ్, బంగారు పేట, బెంగళూరు, బేతమంగళం వంటి ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చి కుప్పంలో టిడిపికి ఓట్లు వేసేవారు. 2019 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్సార్‌సీపీ నేత చంద్రమౌళి టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌కు పూర్తి వివరాలతో సహా అందించారు. విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ దాదాపు 20 వేల ఓట్లను తొలగించింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 46 వేల మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30 వేలకు పడిపోయింది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కుప్పంలో దాదాపు 20వేల టిడిపి దొంగ ఓట్లు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిశీలనలో తేలింది. వీటిలో కేవలం 7, 8 వేల దొంగఓట్లను మాత్రమే ఈసీ ద్వారా తొలగించగలిగారు. ఇదిలా ఉంటే..ఈ ఎన్నికల్లో కుప్పంలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో కుప్పం వాసులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాదిమందికి ఇంటి పట్టాలతో పాటు గృహాలు మంజూరు చేశారు. అలాగే పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించారు. ప్రధానంగా కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందించారు. ఈ కారణాలతో కుప్పం వాసుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంపూర్ణంగా నమ్మకం ఏర్పడింది. అందువల్లే ఈ ఎన్నికల్లో కుప్పం వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలలో టెన్షన్ ప్రారంభమైంది.కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది మెజారిటీతో అయినా చంద్రబాబు గెలవడం ఖాయం అంటూ కుప్పం పచ్చ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కుప్పం ఏమవుతుందా అని చంద్రబాబు ఆందోళన చెందుతుంటే టీడీపీ క్యాడర్ లెక్కల మీద లెక్కలు కడుతున్నట్లు సమాచారం. 2019లో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గింది. అందుకే ఈసారి టీడీపీ నేతలు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఆందోళనకు గురవుతున్నారనే టాక్ నడుస్తోంది.

Ram Gopal Varma Super Hit Movie re Release Post Goes Viral
బ్లాక్ బస్టర్‌ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్‌ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ డైరెక్టర్‌ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్‌ హిట్‌ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్‌ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్‌గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్‌లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్‌ చైన్‌ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ ‍సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఆర్జీవీ సూపర్ హిట్‌ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024

India Successfully Tested Anti Radiation Missile Rudra
యాంటీ రేడియేషన్‌ మిసైల్‌... ‘రుద్ర ఎమ్‌-2’ పరీక్ష సక్సెస్‌

భువనేశ్వర్‌: ఉపరితల యాంటీ రేడియేషన్‌ మిసైల్‌ రుద్ర ఎమ్‌-2ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్‌ టెస్ట్‌ సెంటర్‌ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్‌ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్‌ మిసైల్‌ను భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్‌లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్‌ రష్యాకు చెందిన కేఎహెచ్‌-31 యాంటీ రేడియేషన్‌ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు పెట్టారు.

Delhi Court Key Decision On Kavitha Chargesheet In Liquor Case
లిక్కర్‌ కేసు: కవితకు మరో షాక్‌

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్‌3న ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్‌లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement