Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది.
May 10th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్‌ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్ జగన్ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్‌లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్ జగన్ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గోబెల్స్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్.
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లి పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్లలో 600 పైగా పరుగులు చేశాడు.
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఎస్బీఐ లాభం రికార్డ్
సినిమా
సికందర్‌తో జోడీ
సికందర్‌తో జోడీ కట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘‘కొంతకాలంగా నా నెక్ట్స్ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది.
డబుల్ ధమాకా
హీరో విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. గురువారం (మే 9) తన బర్త్ డే సందర్భంగా మరో రెండు కొత్త చిత్రాల అప్డేట్స్తో అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ దేవరకొండ. వాటిలో ఓ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై (ఎస్వీసీ) ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. విజయ్ హీరోగా ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న విడుదలైంది. మరోసారి విజయ్ హీరోగా ఎస్వీసీ సంస్థ తన 59వ చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసినపోస్టర్లో విజయ్ కత్తి పట్టుకుని, వయొలెంట్ మోడ్‌లో ఉన్నారు. ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మైత్రీతో మూడోసారి... ‘డియర్ కామ్రేడ్, ఖుషి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూడో సినిమా ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్) ప్రకటన వచ్చింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు.‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ‘వీడీ 14’ తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు మేకర్స్.
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్.
కృష్ణమ్మ నదిలో మలుపుల్లా...
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ చిత్రంలో అతీరా రాజ్ హీరోయిన్. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘వించిపేట భద్ర, శివ, కోటి అనే ముగ్గురి స్నేహితుల నేపథ్యంలో సాగే కథ ఇది. కథ ప్రధానంగా 2003–2015 మధ్యకాలంలో జరుగుతుంది.కొంతకాలంగా నేను ఎదురు చూస్తున్న మంచి హిట్ ‘కృష్ణమ్మ’తో లభిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘రాజకీయాలు, రౌడీయిజం అంశాలు ‘కృష్ణమ్మ’ సినిమాలో లేవు. విజయవాడను మరో కోణంలో చూసేలా ఈ చిత్రం ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాం. కృష్ణమ్మ నదిలో ఎలా అయితే మలుపులు ఉంటాయో భద్ర, కోటి, శివ జీవితాల్లో కూడా మలుపులు ఉంటాయి. ఈ మలుపులను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వీవీ గోపాలకృష్ణ.
ఫొటోలు
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
Tanya Ravichandran Photos: క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్…(ఫొటోలు)
RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
క్రీడలు
బజరంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది.
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
సెర్టోహన్బాష్ (నెదర్లాండ్స్): కొత్త సీజన్‌ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్ గేమ్స్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్ (నెదర్లాండ్స్; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్ బాస్ట్ (నెదర్లాండ్స్; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్ ప్రకారం జ్యోతికి ఒలింపిక్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధిస్తారు.
RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు.పంజాబ్ బ్యాటర్లలో రిలీ రూసో(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(37) కాసేపు మెరుపులు మెరిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లి పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్లలో 600 పైగా పరుగులు చేశాడు.
బిజినెస్
మార్కెట్‌కు ఎన్నికల కలవరం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి. → సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి. → మార్చి క్వార్టర్లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
భారత్‌లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
లింక్డ్ఇన్పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్ఇన్ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్ఇన్ ఏఐ బాట్లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్ఇన్ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయి 21,957 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1062 పాయింట్లు దిగజారి 72,404 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ లాభాల్లో ముగిశాయి. ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్‌ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..
మంగళగిరిలో సీఎం జగన్ సభ
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
మత్స్యకారులకు గుడ్ న్యూస్
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
ఫ్యామిలీ
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’ ‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...కర్నాటకలోని బాగల్కోట్కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.హాస్టల్లో ఉండిఅంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది. కాని హాస్టల్లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.ఐ.ఏ.ఎస్. కావాలని‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.ముఖ్యమంత్రి ప్రశంసఅంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం.
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
భారతీయ వంటల్లో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల వంటలకు సువాసనను, రుచిని అందించడమే కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.ఉదయాన్నే శుభ్రమైన కరివేపాకును నమిలి తినవచ్చు. లేదా కరివేపాకు నీటిని తాగవచ్చు.కరివేపాకు డీటాక్స్ వాటర్ గ్లాసుడు నీళ్లలో కొంచెం కరివేపాకులు వేసి మరిగించాలి. అలాగే పుదీనా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. దీనికి కొద్దిగా తేనె లేదా, నిమ్మరసం కలపు కొని తాగవచ్చు.జీర్ణక్రియలో సహాయపడుతుందిఫైబర్ నిండిన కరివేపాకు జీర్ణవ్యవస్థకు మంచిది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. కరివేపాకు నీటిని ఉదయాన్నే మోతాదుగా తీసుకుంటే మంచిది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణం శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలకు గ్రేట్: జుట్టుకు సహాయపడే గుణాలకు ప్రసిద్ధి చెందిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యానికి సాయపడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు చర్మానికి హాని కలిగించే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సహజమైన, ప్రకాశవంతమైన మెరుపు వస్తుంది.రోగనిరోధకశక్తికి బూస్టర్: కరివేపాకులో పోషకాలు ఎక్కువ. ఫైబర్ ఎక్కువ విటమిన్ సీ, ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన కరివేపాకు సహజంగానే రోగనిరోధక శక్తి బూస్టర్‌లా పనిచేస్తుంది. కరివేపాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు , వ్యాధులకు వ్యతిరేకంగా శరీర శక్తి పెరుగుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: కరివేపాకు గుండె ఆరోగ్యానికి చాలామంచిది. అవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్న కరివేపాకు నీళ్లతో గుండె సంబంధిత సమస్యలును నివారించుకోవచ్చు.బ్లడ్ షుగర్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. హై పోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థ వంతంగా సమతుల్యం చేస్తుంది.అధిక బరువు: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. కరివేపాకు వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. నోట్: ఇది అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
న్యూస్ పాడ్‌కాస్ట్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.