Top Stories
ప్రధాన వార్తలు
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్సీపీ, 10–12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
counting Updatesమహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయంబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అప్డేట్స్..
Live Updates..👉అమరులకు సీఎం రేవంత్ నివాళులు..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు.👉తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులుకేటీఆర్ కామెంట్స్..తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి.సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదు.ఛత్తీస్‌గఢ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రికానీ పది సంవత్సరాల తెలంగాణను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం రేవంత్.తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు.రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రిఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ… ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ… “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం… ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని… విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…ఆ పిడికిలి విప్పిచూస్తే…త్యాగం…ధిక్కారం…పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో…ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…అందరికి… pic.twitter.com/09sJMwlyFN— Revanth Reddy (@revanth_anumula) June 2, 2024 తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులుఅసెంబ్లీ కౌన్సిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ 👉 తెలంగాణ సెక్రటేరియట్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలుజాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ శాంతకుమారి,పాల్గొన్న ముఖ్య కార్యదర్శిలు కార్యదర్శిలు అధికారులు సిబ్బంది గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్.జాతీయ జెండా ఎగరేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు.కాసేపట్లో గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు..గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అరిపించనున్న కాంగ్రెస్ నేతలు.. 👉 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ 13 ఏండ్ల ఉద్యమంతో స్వప్నం సాకారం.. 10 ఏండ్ల కేసీఆర్ పాలనతో ప్రగతి వికాసం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయోజనాలను, పదేండ్ల ప్రగతి పాలన ఫలాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమ పంథాకు సిద్ధమవుదాంరాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.జై తెలంగాణ ✊… pic.twitter.com/WAmTHKgCEe— BRS Party (@BRSparty) June 2, 2024 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.👉 ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. 👉 ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.👉 అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
June 2nd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
June 2nd AP Elections 2024 News Political Updates..8:15 AM, June 2nd, 2024ఫ్యాన్‌దే హవా.. ఏపీలో వైఎస్సార్సీపీ దెబ్బకు చేతులెత్తేసిన కూటమివైఎస్సార్సీపీ భారీ విజయమని తేల్చిన ఎగ్జిట్పోల్స్వైఎస్సార్సీపీ గెలుపు లోడింగ్.. విజయం లాంఛనమే ఏపీలో వైయస్ఆర్సీపీకి మళ్లీ తిరుగులేదని తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్🔥జగనన్న దెబ్బకి చేతులెత్తేసిన కూటమి జూన్ 4న వైయస్ఆర్సీపీ గెలుపు ఇక లాంఛనమే#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/coTiCq7yz9— YSR Congress Party (@YSRCParty) June 1, 2024 Times Now- @ETG_Research #ExitPoll PredictionsAndhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections:- YSRCP: 14- BJP+: 11- Congres : 0- Others: 0@padmajajoshi further takes us through vote share predictions. pic.twitter.com/6R9hAcNQiA— TIMES NOW (@TimesNow) June 1, 2024 8:00 AM, June 2nd, 2024వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ94–104 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ‘ఆరా’ మస్తాన్50% ఓట్లతో 110–120 స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్ వెల్లడివైఎస్సార్సీపీ విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి, జన్మత్, ఆపరేషన్ చాణక్య, అగ్నివీర్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, రేస్ తదితర సంస్థలులోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా సంస్థలువైఎస్సార్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్ట్‌లపై టీడీపీ ఒత్తిళ్లుఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ 7:30 AM, June 2nd, 2024పోస్టల్ బ్యాలెట్లపై భద్రం ఏజెంట్లూ.. అవి అత్యంత కీలకం.. లెక్కింపులో జాగ్రత్తలు తప్పనిసరి ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు రావాలి ఆర్వో టేబుల్ మీద లెక్కింపు చెల్లుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి 13ఏ డిక్లరేషన్‌పై ఓటరు సంతకం, అటెస్టింగ్ సంతకం తప్పనిసరి అనుమానం వస్తే వెంటనే ఆర్వోకి ఫిర్యాదు చేయాలి 7:00 AM, June 2nd, 2024ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జలసీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ఎన్నికల్లో బాగా పనిచేసింది: సజ్జల మహిళా ఓటర్లు మా వైపే నిలబడ్డారని స్పష్టమైంది ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో పెద్దపీట 4న కౌంటింగ్‌లో మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి సొంతంగా పోటీ చేసే శక్తి లేకనే చంద్రబాబు పొత్తులు పోస్టల్ బ్యాలెట్‌పై బాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం 6:30 AM, June 2nd, 2024మళ్లీ వైఎస్సార్సీపీదే విజయంవైఎస్ జగన్ పాలన వైపు మహిళలు, గ్రామీణులు, బలహీన వర్గాల మొగ్గు వైఎస్సార్సీపీ తన ఓటు శాతాన్ని ఐదేళ్ల తర్వాత కూడా కాపాడుకుంది 94 –104 సీట్లు వైఎస్సార్సీపీకి.. 71 – 81 సీట్లు టీడీపీ కూటమికి వైఎస్సార్సీపీకి 13–15 ఎంపీ స్థానాలు.. టీడీపీ కూటమికి 10–12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు బీజేపీ 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 7–8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా సర్వే రిపోర్టు ఇచ్చానన్న ఆరా మస్తాన్.
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc)
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: భారీ లీడింగ్‌లో బీజేపీ
Counting Updates సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.
T20 WC 2024: యూఎస్ఏ సంచలన విజయం
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో తొలి మ్యాచ్ ఫలితం వచ్చేసింది. డలాస్ వేదికగా అతిథ్య అమెరికా జట్టు కెనడాను చిత్తుగా ఓడించింది. ఈ ఐసీసీ టోర్నీలో అరంగేట్ర ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది.. విజయంతో మెగా ఈవెంట్‌ను మొదలుట్టింది. అంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్ఏ క్రికెట్ హిస్టరీలోనే ఈ గెలుపును చిరస్మరణీయంగా మార్చుకుంది.సరికొత్త రికార్డుఅంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్ఏ క్రికెట్ హిస్టరీలో జూన్ 2ను చిరస్మరణీయంగా మార్చుకుంది.తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!డలాస్ వేదికగా గ్రాండ్ ప్రైయరీ స్టేడియంలో కెనడాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, భారత మూలాలున్న నవనీత్ ధాలివాల్(61), నికోలస్ కిర్టాన్(51) అర్ధ శతకాలతో మెరవగా.. కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది.అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది యూఎస్ఏ. ఓపెనర్ స్టీవెన్ టేలర్ డకౌట్ కాగా.. కెప్టెన్ మొనాక్ పటేల్ కూడా 16 పరుగులకే నిష్క్రమించాడు.ఆండ్రీ గౌస్ ఆదుకుంటే. ఆరోన్ దంచికొట్టాడుదీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూఎస్ఏ జట్టును వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ గౌస్ ఆదుకున్నాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు.గౌస్‌కు తోడైన వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోరే ఆండర్సన్(3 నాటౌట్) తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో యూఎస్ఏకు చారిత్రాత్మక గెలుపు అందించాడు.గౌస్, జోన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన యూఎస్ఏ.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.చదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc)
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది.
తప్పక చదవండి
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
- నేడో, రేపో సీమలోకి ‘నైరుతి’!
- సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
- ఐటీలో మేటి..
- ‘సాధన’ సరిపోయింది.. వామప్ మ్యాచ్‌లో భారత్ విజయం
- South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
సినిమా
లెక్క కుదిరింది
కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్)కి, షిప్ ఓనర్ (ప్రోడ్యూసర్)కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. షిప్ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడిమూడోసారి ‘దిల్’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సుప్రీమ్ (2016), ‘రాజా ది గ్రేట్’ (2017), ‘ఎఫ్ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్ 3’ (2022) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్–‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్ హీరో. హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్–అనిల్ రావిపూడి–‘దిల్’ రాజు కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్ సుకుమార్–మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్–మైత్రీ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్–నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కాంబినేషన్లో ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.∙సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సునీల్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ (2021) సూపర్ హిట్టయింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్ బేనర్లో నాగ్ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి రెండు హోమ్ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఉన్నాయి. అశ్వినీదత్ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్లో తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్’ చిత్రం తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ‘మిరాయ్’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్–విశ్వప్రసాద్ కాంబినేషన్లో ‘మిరాయ్’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డిఈసారి ‘జై హనుమాన్’తో...సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇక ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ–చైతన్య–నిరంజన్ రెడ్డి కాంబినేషన్లో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి.
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.ప్రెగ్నెన్సీ నిలవలేదుపదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.ఈసారి కూడా..ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి మూడేళ్లు..లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్‌లో జరిగిన పార్టీలో నిఖిల్ పటేల్ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఏడాది తిరిగేసరికే..అటు దల్జీత్.. ఇటు నిఖిల్.. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. భర్త చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పెళ్లి వీడియో షేర్ చేసిన నటినెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్‌తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.చదవండి: ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్‌కు ఏం మిగలట్లేదు!
సుకుమార్ షాకింగ్ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్!
ఆగస్ట్ 15.. బన్నీ ఫ్యాన్స్‌కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్ సుకుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని భావిస్తున్నాడట.సాధారణంగా సుకుమార్ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ప్లాన్ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా వేరేది యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్ కూడా పార్ట్ 3కి సెట్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్ అయిన వాటి నుంచి బెస్ట్ క్లైమాక్స్‌ని యాడ్ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్ టెన్షపడుతున్నారట. ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్ 15కి రిలీజ్ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్లైమాక్స్ చేంజ్ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
ఫొటోలు
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
Vignesh-Nayanthara Hong Kong Vacation: ఫ్యామిలీతో నయనతార సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
సాగరిక ఘట్జ్ హ్యాండ్ పెయింటింగ్ కళ్ళుతిప్పుకోలేరు.. (ఫోటోలు)
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
క్రీడలు
T20 WC 2024: యూఎస్ఏ సంచలన విజయం
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో తొలి మ్యాచ్ ఫలితం వచ్చేసింది. డలాస్ వేదికగా అతిథ్య అమెరికా జట్టు కెనడాను చిత్తుగా ఓడించింది. ఈ ఐసీసీ టోర్నీలో అరంగేట్ర ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లోనే గెలుపొంది.. విజయంతో మెగా ఈవెంట్‌ను మొదలుట్టింది. అంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్ఏ క్రికెట్ హిస్టరీలోనే ఈ గెలుపును చిరస్మరణీయంగా మార్చుకుంది.సరికొత్త రికార్డుఅంతేకాదు తమ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి సరికొత్త రికార్డు సాధించింది. కెనడాతో శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో పైచేయి సాధించి యూఎస్ఏ క్రికెట్ హిస్టరీలో జూన్ 2ను చిరస్మరణీయంగా మార్చుకుంది.తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!డలాస్ వేదికగా గ్రాండ్ ప్రైయరీ స్టేడియంలో కెనడాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, భారత మూలాలున్న నవనీత్ ధాలివాల్(61), నికోలస్ కిర్టాన్(51) అర్ధ శతకాలతో మెరవగా.. కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది.అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది యూఎస్ఏ. ఓపెనర్ స్టీవెన్ టేలర్ డకౌట్ కాగా.. కెప్టెన్ మొనాక్ పటేల్ కూడా 16 పరుగులకే నిష్క్రమించాడు.ఆండ్రీ గౌస్ ఆదుకుంటే. ఆరోన్ దంచికొట్టాడుదీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూఎస్ఏ జట్టును వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ గౌస్ ఆదుకున్నాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు.గౌస్‌కు తోడైన వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోరే ఆండర్సన్(3 నాటౌట్) తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో యూఎస్ఏకు చారిత్రాత్మక గెలుపు అందించాడు.గౌస్, జోన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన యూఎస్ఏ.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.చదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc)
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc)
క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ!
ధనాధన్ సిక్సర్లు.. ఫటాఫట్ ఫోర్లు.. ప్రపంచ క్రికెట్ అభిమానుల కోసం ట్వంటీ20 పండగ సిద్ధమైంది.. ఐపీఎల్ ముగిసి వారం రోజులే కాలేదు.. అప్పుడే మరో 20–20 సమరానికి అంతా రెడీ.. మీరు హైదరాబాద్ అభిమానులైనా, రాజస్థాన్ ఫ్యాన్స్ అయినా.. బెంగళూరును ఇష్టపడినా... కోల్‌కతాను ప్రేమించినా.. ఇప్పుడు మాత్రం అంతా భారత జట్టు వీరాభిమానులే..ఫ్రాంచైజీ క్రికెట్ ఎలాంటి వినోదాన్ని అందించినా ఆటలో అసలు కిక్కు మాత్రం మన దేశం, మన జట్టు అనడంలోనే ఉంది! కాబట్టే టి20 వరల్డ్‌కప్ అంటే అంత క్రేజ్! అందుకే పదహారేళ్ల వ్యవధిలో ఎనిమిది మెగా టోర్నీలు వంద శాతం ఆనందాన్ని పంచాయి. ఈసారీ ఆ సంబరంలో ఎలాంటి లోటు రానివ్వనన్నట్లుగా మరో వరల్డ్‌కప్ మన ముంగిటకు వచ్చేసింది. అందమైన కరీబియన్ సముద్ర తీరాన కలిప్సో సంగీతంతో సాగే టి20 మ్యాచ్‌లకు ఈసారి అగ్రరాజ్యం అమెరికా కూడా జత కట్టడం కొత్త ఆకర్షణ. ఇన్నేళ్లుగా క్రికెట్ అంటేనే మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఇప్పుడు ఆతిథ్య జట్టుగా తమ దేశంలో కామన్వెల్త్ దేశాల ఆటకు స్వాగతం పలుకుతోంది. బరిలోకి దిగనున్న జట్ల సంఖ్య తొలిసారి 20కి చేరడం ఈసారి మరో ప్రత్యేకత. సంప్రదాయాలు, ప్రారంభోత్సవాల తంతు ముగిస్తే ఇక జట్లు మైదానంలో తలపడటమే మిగిలింది. ఇకపై నెల రోజుల పాటు ట్రవిస్ హెడ్ మనవాడు కాదు, కమిన్స్‌పై అభిమానం అస్సలు కనిపించదు, క్లాసెన్ తొందరగా అవుట్ కావాలనే మనం కోరుకోవాలి.గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ఇప్పుడు ఆతిథ్యం కూడా ఇస్తూ వెస్టిండీస్ మరో కప్‌పై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ వేటలో జట్టునంతా హిట్టర్లతో నింపేయగా.. మాజీ విజేత ఆస్ట్రేలియా తమ స్థాయిని మళ్లీ ప్రదర్శించేందుకు ‘సై’ అంటోంది.ఒకసారి చాంపియన్లుగా నిలిచి రెండో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్, శ్రీలంక తమ అస్త్రాలతో సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా ట్రోఫీ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా ఆ జట్ల రాత మారుతుందా అనేది చూడాలి. లెక్కల్లో భాగంగా ఉన్నా డజను టీమ్‌లు టైటిల్ గెలిచే అంచనాల్లో లేవు. అయితే తమ స్థాయికి మించిన ప్రదర్శనతో సంచలనానికి అవి ఎప్పుడూ రెడీనే.ఇక చివరగా.. మన రోహిత్ శర్మ బృందం ఏ స్థాయి ప్రదర్శనతో భారత అభిమానుల కోరిక తీరుస్తుందనేది ఆసక్తికరం. ఎప్పుడో 2007లో తొలి టి20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మనకు నిరాశే ఎదురైంది. ఈసారి విండీస్ దీవుల్లో విజయీభవ అంటూ అందరం దీవించేద్దాం!జట్ల సంఖ్యను పెంచి...టి20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 టోర్నీలు జరిగాయి. 2007 నుంచి 2022 మధ్య వీటిని నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది 9వ టోర్నీ. గత నాలుగు వరల్డ్ కప్‌లలో 16 జట్లు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే ఈసారి 20 జట్లకు అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందుగా అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం మరో రెండు టీమ్‌లను ఎంపిక చేశారు. రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడనుండగా... ఆతిథ్య హోదాలో అమెరికా కూడా మొదటిసారి ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగుతోంది.నవంబర్ 16, 2001... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ హక్కుల ప్రకటన వెలువరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కలసి సంయుక్తంగా ఈ అవకాశం కోసం బిడ్ వేశాయి. అమెరికాలో కొత్తగా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశం... కరీబియన్ దీవుల్లో కొత్త తరంలో క్రికెట్‌పై తగ్గిపోతున్న ఆసక్తిని పెంచేందుకు ఈ రెండు దేశాల బోర్డులు కలసి ముందుకు వెళ్లాలని 2019లోనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త బిడ్‌కు సిద్ధమయ్యాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో క్రికెట్‌కు ఇప్పటి వరకు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దేశంలోని వివిధ జట్లలో కూడా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చినవారే సభ్యులుగా ఉంటున్నారు. అయితే వాణిజ్యపరంగా ఆ దేశంలో మంచి అవకాశాలు ఉండటం కూడా అమెరికాను ఐసీసీ ప్రోత్సహించేందుకు మరో కారణం. పైగా 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో కూడా టి20 క్రికెట్‌ను చేర్చడంతో దానికి ఒక ట్రయిలర్‌గా ఈ వరల్డ్‌కప్ ఉండనుంది. మరోవైపు విండీస్ గడ్డపై క్రికెట్‌కు క్రేజ్ తగ్గుతుండటంతో స్టేడియాల నిర్వహణ సరిగా లేక ఆ జట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌తో కాస్త కళ పెంచే అవకాశం ఉండటంతో విండీస్ ముందుకు వచ్చింది. ఏర్పాట్ల కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకునేలా ఐసీసీ ఈ రెండు బోర్డులకు అవకాశం కల్పిస్తూ హక్కులను కేటాయించింది.మొత్తం 9 వేదికలు..వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ఎంపిక కోసం అమెరికా–వెస్టిండీస్‌లకు హక్కులు ఇచ్చినా మ్యాచ్‌లు జరిగే వేదికల విషయంలో ఐసీసీ చిక్కులు ఎదుర్కొంది. ముందుగా అమెరికాలో నాలుగు స్టేడియాలను ఎంపిక చేశారు. వీటిలో న్యూయార్క్ శివార్లలో ఉన్న బ్రాంక్స్ స్టేడియానికి సంబంధించి జనం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ సమయంపాటు పార్క్ స్థానికులకు అందుబాటులో లేకపోవడంతోపాటు పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని వాదించడంతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వేర్వేరు దేశాల సమాహారమైన వెస్టిండీస్ నుంచి కూడా ఏడు వేదికలను వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గ్రెనడా, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఆర్థిక సమస్యల కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కోసం బిడ్ వేయకుండా వెనక్కి తగ్గాయి. మైదానం సిద్ధం చేసేందుకు తమ వద్ద తగినంత సమయం లేదని డొమినికా కూడా తప్పుకుంది. చివరకు వాటి స్థానంలో కొత్త వేదికలను చేర్చి మొత్తంగా ఆరింటిని ఖరారు చేశారు.ఏ జట్టులో ఎవరున్నారంటే...భారత్..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, బుమ్రా.ఇంగ్లండ్..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డకెట్, మొయిన్ అలీ, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో, ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్ హార్ట్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.దక్షిణాఫ్రికా..మార్క్రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, మిల్లర్, మార్కో జాన్సెన్, డికాక్, క్లాసెన్, రికెల్టన్, స్టబ్స్, బార్ట్‌మన్, కొయెట్జీ, జాన్ ఫార్చూన్, కేశవ్ మహరాజ్, నోర్జే, రబడ, షమ్సీ.ఆస్ట్రేలియా..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, హెడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అగర్, ఇంగ్లిస్, వేడ్, కమిన్స్, ఎలిస్, హాజల్‌వుడ్, స్టార్క్, జంపా.న్యూజీలండ్..విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్, నీషమ్, రచిన్ రవీంద్ర, సాన్‌ట్నర్, డెవాన్ కాన్వే, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, ఇష్ సోధి, సౌతీ.పాకిస్తాన్..బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, సయీమ్ ఆయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్, ఇమాద్ వసీమ్, ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఆమిర్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఆజమ్ ఖాన్.శ్రీలంక..హసరంగ (కెప్టెన్), నిసాంక, అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, కామిందు మెండిస్, షనక, వెల్లలాగె, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చమీర, మధుషంక, పతిరణ, తీక్షణ, నువాన్ తుషారా.వెస్టిండీస్..రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, రసెల్, హోల్డర్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, రొమారియో ఫెఫర్డ్, అకీల్ హొసెన్, గుడకేశ్ మోతీ.బంగ్లాదేశ్..నజ్ముల్ హొస్సేన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తన్జిద్, తౌహిద్ హృదయ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, లిటన్ దాస్, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, తన్వీర్ అస్లాం, రిషాద్ హొస్సేన్, ముస్తఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్.నేదర్లండ్స్..స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఒడౌడ్, తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్, లెవిట్, బస్ డి లీడి, టిమ్ ప్రింగిల్, వెస్లీ బరెసి, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, డేనియల్ డోరమ్, మికెరెన్, వివియన్ కింగ్మా.ఐర్లండ్..పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రోస్ అడెర్, బల్బీర్నీ, టెక్టర్, డెలానీ, కాంఫర్, డాక్రెల్, నీల్ రాక్, టకర్, మార్క్ అడెర్, హ్యూమ్, జాషువా లిటిల్, మెకార్తీ, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్.కెనడా..సాద్ బిన్ జఫర్ (కెప్టెన్), నవ్‌నీత్ ధలీవాల్, ఆరన్ జాన్సన్, మొవ్వ శ్రేయస్, రవీందర్‌పాల్ సింగ్, కన్వర్పాల్, దిల్‌ప్రీత్ బాజ్వా, పర్గత్ సింగ్, రయాన్ పఠాన్, హర్ష్ ఠాకెర్, జెరెమి జోర్డాన్, డిలాన్ హెలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖి, నికోలస్ కీర్టన్.నమీబియా..గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డావిన్, జేన్ గ్రీన్, కోట్జీ, మలాన్ క్రుగెర్, లీచెర్, స్మిట్, ఫ్రయ్‌లింక్, లింజెన్, డేవిడ్ వీస్, బ్లిగ్నాట్, జేక్ బ్రాసెల్, లుంగామెని, షాల్ట్జ్, షికోంగో, ట్రంపెల్మన్.అఫ్గానిస్తాన్..రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నాంగ్యాల్ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, కరీమ్ జనత్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్హక్ ఫారూఖి, ఫరీద్ అహ్మద్ మాలిక్, నూర్ అహ్మద్.నేపాల్..రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్, కుశాల్ భుర్తెల్, సందీప్ జోరా, కరణ్, కుశాల్ మల్లా, ప్రాతిస్, అనిల్ సాహ్, సోంపాల్ కామి, అభినాష్ బొహరా, గుల్షన్ జా, లలిత్ రాజ్‌బన్షీ, కమాల్ ఐరీ, సాగర్ ఢకాల్.ఒమన్..అకీబ్ ఇలియాస్ (కెప్టెన్), ప్రతీక్ అథవాలె, ఖాలిద్, మెహ్రాన్ ఖాన్, నసీమ్, కశ్యప్ ప్రజాపతి, షోయబ్ ఖాన్, జీషాన్ మక్సూద్, అయాన్ ఖాన్, నదీమ్, బిలాల్ ఖాన్, ఫయాజ్, కలీముల్లా, షకీల్ అహ్మద్, రఫీయుల్లా.పపువా న్యూ గినీ..అసద్ వాలా (కెప్టెన్), సెసె బావు, కిప్లిన్, హిరి హిరి, లెగా సియాక, టోనీ ఉరా, చార్లెస్ అమిని, సెమో కమెయి, జాన్ కరికో, కబువా, అలె నావో, చాద్ సోఫెర్, నార్మన్ వనువా, జేక్ గార్డెనర్, హిలా వరె.స్కాట్లండ్..రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, మైకేల్ జోన్స్, జార్జి మున్సే, లీస్క్, మెక్‌ములెన్, గ్రెవెస్, జార్విస్, షరీఫ్, క్రిస్ సోల్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్, ఒలీ కార్టర్, బ్రాడ్లీ కరీ, చార్లీ టియర్.ఉగాండా..బ్రియాన్ మసాబా (కెప్టెన్), ఫ్రెడ్ అచెలమ్, దినేవ్ నక్రాని, అల్పేష్ రాంజానీ, కెన్నెత్ వైస్వా, బిలాల్ హసన్, కాస్మస్, రియాజత్ అలీషా, జుమా మయాగి, రోజర్ ముకాసా, ఫ్రాంక్ నుసుబుగా, రాబిన్సన్ ఒబుయా, రోనక్ పటేల్, హెన్రీ సెన్యోండో, సిమోన్ సెసాజి.అమెరికా..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, నితీశ్ కుమార్, షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, షాడ్లీ, హసన్ అలీఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్.వందల్లో ‘ఒక్కడు’... ప్లేయర్ ఆఫ్ ద సిరీస్...బరిలో డజను కంటే ఎక్కువ జట్లు.. 200 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు.. చివరకు ఒక జట్టే విజేత.. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే వారుంటారు.. కొన్నిసార్లు వీరి ప్రదర్శన ఆయా జట్లను అందలాన్ని ఎక్కిస్తుంది.. లేదంటే టైటిల్‌కు చేరువ చేస్తుంది.. తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో పురస్కారం వరిస్తుంది. ఇప్పటి వరకు 8 సార్లు టి20 ప్రపంచకప్ జరగ్గా.. మూడుసార్లు మాత్రమే విజేత జట్టు నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నవారున్నారు. వారి వివరాలు క్లుప్తంగా..2007షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అఫ్రిది 91 పరుగులు సాధించడంతోపాటు 12 వికెట్లు పడగొట్టాడు.2010కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)ఏడాది తిరగకుండానే మూడో టి20 ప్రపంచకప్ జరిగింది. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లండ్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్ 243 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.2009 తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)ఇంగ్లండ్‌లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ నిలకడగా రాణించాడు. టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 317 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం గెల్చుకున్నాడు. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.2012షేన్ వాట్సన్ (ఆస్టేలియా)శ్రీలంకలో జరిగిన నాలుగో టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును వెస్టిండీస్ ఓడించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో వాట్సన్ 249 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరేందుకు దోహదపడ్డాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.2014 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా రెండోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో భారత జట్టును ఓడించి శ్రీలంక జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సంపాదించాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 319 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచాడు.2016 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా మూడోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు తొలిసారి భారత్ వేదికయింది. వెస్టిండీస్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 273 పరుగులు సాధించాడు.2021డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)రెండేళ్లకోసారి జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఈసారి ఐదేళ్ల విరామం వచ్చింది. 2020లో భారత్ వేదికగా ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఒక ఏడాది వాయిదా పడింది. 2021లో ఒమన్–యూఏఈ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్లో న్యూజీలండ్ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టి20 విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 289 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు.2022స్యామ్ కరన్ (ఇంగ్లండ్)ఏడాది తిరిగేలోపు ఎనిమిదో టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ బంతితో మెరిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్యామ్ కరన్ ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.టోర్నీ ఫార్మాట్..మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతిజట్టూ తమ గ్రూప్‌లో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్లపరంగా ప్రతిగ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) తర్వాత దశ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతిటీమ్ తన గ్రూప్‌లో ఉన్న మిగతా 3 జట్లతో తలపడుతుంది. టాప్–2 టీమ్స్ సెమీఫైనల్‌కు చేరతాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.గ్రూప్‌ల వివరాలు..గ్రూప్-ఎభారత్, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా.గ్రూప్-బిఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లండ్, ఒమన్, నమీబియా.గ్రూప్-సివెస్టిండీస్, న్యూజీలండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ.గ్రూప్-డిశ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నేదర్లండ్స్, నేపాల్.టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ బ్రిడ్జ్‌టౌన్ గ్రౌండ్ ఫైనల్ మ్యాచ్ వేదిక..– మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ
T20 WC: తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!.. కెనడా భారీ స్కోరు
క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్ వేదిక. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్లు, బ్యాట్‌తో ‘స్కోర్ ఫోర్’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.పీజే గోడ్హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు లింకన్ అతిథిగా హాజరయ్యారు. కెనడా భారీ స్కోరుటీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో ఆరోన్ జాన్సన్(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్ ధాలివాల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)తొలి హాఫ్ సెంచరీతద్వారా టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ పగ్రాత్ సింగ్(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.ఇక వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్ హేలిగెర్(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్ సింగ్ 11 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చండీగఢ్‌లో జన్మించిఅక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్ ధాలివాల్. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)
బిజినెస్
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది.
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024
వీడియోలు
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
బీజేపీ అందుకే వెనకపడింది
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్
నేడో, రేపో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు
బ్రిటన్ నుంచి భారత్ కు భారీగా బంగారం నిల్వలు తరలింపు
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
ఏపీలో పనిచేయని NDA హవా.. షర్మిలకు డిపాజిట్ గల్లంతు
గెలుపు ఎవరిదో తేలిపోయింది..
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
ఏపీలో వైఎస్ఆర్ సీపీదే విజయం..
ఫ్యామిలీ
పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే!
1995, ఏప్రిల్ 6.. ఉదయం ఆరు దాటింది. అమెరికా, ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్‌కి.. ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ‘టామీ బుర్ష్ డిప్యాటిక్’ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలసి కాన్పు కోసం వచ్చింది. ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ 6 అని చెప్పడంతో.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం. నెల తప్పినప్పటి నుంచీ తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఒకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ. అయితే ఆమె భర్త జేమ్స్ టాడ్ కారల్ మాత్రం చాలా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే.. టామీకి అది మూడో కాన్పు. అప్పటికీ రెండేళ్ల క్రితం.. రెండో కాన్పులో బిడ్డ.. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దాంతో.. ‘పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో? ఏమవుతుందో’ అనే భయం అతడ్ని వెంటాడసాగింది. ఆ భయం అతడినే కాదు.. టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది.జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ప్రసవ వేదన అనుభవించింది టామీ. అప్పటివరకూ తల్లీబిడ్డల హాట్ బీట్స్‌ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్లు. కాన్పు సమయంలో కూడా.. ‘ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది’ అనే చెప్పారు. సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు. పుట్టబోయే బిడ్డకు ‘లోగాన్ కారల్’ అని పేరుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కానీ పుట్టిన బిడ్డ లోగాన్‌లో ఎలాంటి చలనం లేదు. దాంతో డాక్టర్ ఓకాన్.. బాబు(లోగాన్ )కు సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గదికి తరలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు. మెదడులో ఎలాంటి కదలిక లేదు. దాంతో సాయంత్రం 5:15 గంటలకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు. పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం.. ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టాడ్, టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు. ఆసుపత్రి సిబ్బంది.. బాబు లోగాన్ ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు. అనంతరం బాబుతో కలిపి ఫొటోలు తీస్తుండగా.. టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది. ఉలిక్కిపడిన ఆమె.. వెంటనే వైద్యులతో చెప్పింది. కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు. మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి.. ఆ విషయాన్ని మరోసారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్లింది.ఆ నర్సు.. లోగాన్ (బాబు)ను పరిశీలించి.. నాడి చూసింది. బాబు హార్ట్ బీట్నూ గమనించింది. ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది. వెంటనే డాక్టర్ ఓకాన్ను పిలిచి విషయం చెప్పింది. ఆమె బాబుని చెక్ చేసి.. షాక్ అయ్యింది. బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది. అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్, ఎనిమిది మంది నర్సులు నమ్మి.. నిర్ధారించిన తర్వాత.. కొన్ని గంటల్లో బాబు తిరిగి బతకడం మిరాకిల్‌గా.. అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది.ఆ రోజు మొదలు లోగాన్ ‘మిరాకిల్ బేబీ’గా వార్తల్లోకి ఎక్కాడు. ‘అన్సాల్వ్డ్ మిస్టరీస్’, ‘ఇట్స్ ఎ మిరాకిల్’ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో.. లోగాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బాబు పుట్టుక నుంచీ మానసిక సమస్యలతో బాధపడుతూ.. వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్నే గడిపిన లోగాన్.. తన 24వ ఏట.. 2020లో తీవ్ర అనోరోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆ రోజు చనిపోయాడనుకున్న లోగాన్ తిరిగి ఎలా బతికాడు? అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన
విపరీతమైన నడుము నొప్పా? సరైన ట్రీట్మెంట్ కోసం..
డెలివరీ టైమ్‌లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్‌లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్‌లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్‌ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్‌గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్‌కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్‌లు అందరూ సపోర్టివ్‌గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
రాధ డిగ్రీ చదువుతోంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది. బాగా చదువుతుంది. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. కానీ కొన్ని నెలలుగా ఆమె అతిగా తింటోంది. అక్కడితో ఆగడంలేదు. అతిగా తినడంవల్ల లావయిపోతాననే భయంతో భోజనం కాగానే వాష్ రూమ్‌లోకి వెళ్లి బలవంతంగా వాంతి చేసుకుంటోంది. అలా చేయడం నేరంగా, అవమానకరంగా భావిస్తోంది. క్లాసులో కూర్చున్నా ఆలోచన మాత్రం బరువుపైనే ఉంటోంది. తన శరీరాకృతి సరిగా ఉందో లేదోనని తరచూ అద్దంలో చూసుకుంటోంది. బరువు తగ్గించుకునేందుకు విపరీతంగా వ్యాయామం చేస్తోంది.రాధ ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గీతాదేవి ఏం జరుగుతోందని ఆరా తీసింది. అలా తిని, బలవంతంగా వాంతి చేసుకోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చూసింది. రాధ వయసుకు తగ్గ బరువే ఉందని వెయింగ్ మెషిన్లో చూపించింది. కానీ రాధ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన సలహా మేరకు రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ చేయించారు. న్యూట్రిషనిస్ట్‌ను కలసి ఆహారపు అలవాట్లు, బరువు తగ్గే మార్గాలపై కౌన్సెలింగ్ తీసుకున్నారు.ఫ్యామిలీ డాక్డర్ సలహా మేరకు సైకోడయాగ్నసిస్కి తీసుకొచ్చారు. రాధతో మాట్లాడాక ఆమె బులీమియా నెర్వోసా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతోందని అర్థమైంది. అతిగా తినడం, వెంటనే బలవంతంగా వాంతి చేసుకోవడం దీని ప్రధాన లక్షణం. వారానికి ఒకసారి అతిగా తిని, వాంతి చేసుకుంటే బులీమియా ఉందని నిర్ధారణ చేసుకోవచ్చు.పలురకాల చికిత్సలు అవసరం..బులీమియాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల చికిత్సలు అవసరం కావచ్చు. అంటే సైకాలజిస్ట్, ఫ్యామిలీ డాక్టర్, డైటీషియన్లతో కూడిన బృందం అవసరం ఉండవచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంతోపాటు లైఫ్ స్టయిల్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.– బులీమియా గురించి తెలుసుకోవాలి. థెరపీ సెషన్లను దాటవేయవద్దు.– ఆహారం, వ్యాయామం ప్రొఫెషనల్స్ సలహాతోనే తీసుకోవాలి.. చేయాలి.– అదే పనిగా బరువు చెక్ చేసుకోవద్దు, అద్దంలో చూసుకోవద్దు. ఈ తరహా ధోరణి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రేరేపించే ప్రమాదం ఉంది.– ఆకలిని తగ్గించే లేదా బరువును తగ్గించే సప్లిమెంట్లు లేదా మూలికల వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి.– Enhanced cognitive behavior therapy ద్వారా తిండి గురించిన అనారోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తన స్థానంలో ఆరోగ్యకరమైన నమ్మకాలు, ప్రవర్తనను పెంపొందించవచ్చు.– బులీమియాతో బాధపడుతున్న పిల్లలు, టీనేజర్ల పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకోవడానికి, పిల్లలు తినే వాటిపై నియంత్రణ తీసుకురావడానికి Family based therapy సహాయపడుతుంది.– ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్సకి, ఇతరులతో సర్దుకుపోవడానికి డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది.– యాంటీడిప్రెసెంట్స్తో బులీమియా లక్షణాలను తగ్గించవచ్చు. టాక్ థెరపీతో పాటు దీన్ని ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి.– బులీమియాకు చికిత్స చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన డైటీషియన్లు సహాయపడతారు.– బులీమియా తీవ్రంగా ఉండి.. ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.బులీమియా లక్షణాలు...– ఒకే సిట్టింగ్‌లో అసాధారణ రీతిలో ఆహారాన్ని అతిగా తినడం– అతిగా తినడాన్ని నియంత్రించలేకపోతున్నామని అనిపించడం– బరువు పెరగకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా వాంతులు చేసుకోవడం లేదా అతిగా తిన్న తర్వాత విపరీతంగా వ్యాయామం చేయడం– బరువు పెరుగుతుందనే భయంతో, అనారోగ్యకరమైన మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించడం– విరేచనాల కోసం మందులు ఉపయోగించడం– శరీర ఆకృతి, బరువు విషయంలో చాలా అసంతృప్తిగా ఉండటం– విపరీతమైన మూడ్ స్వింగ్స్‌ని కలిగి ఉండటం.బులీమియా నెర్వోసాకు బింజ్ ఈటింగ్ డిజార్డర్‌కు మధ్య తేడా.. బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తులు అతిగా తిని, ఆ తర్వాత బలవంతంగా వాంతి చేసుకుని ఆహారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు కూడా అతిగా తింటారు, కానీ వాంతి చేసుకోరు. అలాగే, బులీమియాతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారు. బింజ్ ఈటింగ్ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక బరువు/ఊబకాయం కలిగి ఉంటారు.– సైకాలజిస్ట్ విశేష్
న్యూస్ పాడ్‌కాస్ట్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.