-
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
బ్లాక్ అండ్ వైట్ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి. తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్లో భాగంగా పరిణితి బ్లాక్ అండ్ వైట్ చీరలో గ్లామరస్ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్బ్లౌజ్ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి. చాలా సింపుల్‌గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్‌తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. View this post on Instagram A post shared by @parineetichopra (చదవండి: గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్‌పోర్ట్‌కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్‌లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
సింగర్ అవతారమెత్తిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా సినీ ప్రియులకు సుపరిచితమైన పేరే. గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ముద్దుగుమ్మ సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ భామ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్గా అలరించిన పరిణీతి ప్రస్తుతం సింగర్‌గా మారిపోయింది. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టూడియోలో పాట పాడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నాకు సంగీతం ఎప్పటికీ సంతోషకరమైన ప్రదేశం. నా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకేసారి రెండు కెరీర్లు చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. అందుకే ఇక్కడ నాకు తెలియని వాటిని నేర్చుకోవడం, నాలో భయాలన్నింటినీ తొలగించుకుని.. నా తొలి గానం ప్రారంభించా. దీనికోసం నేను ఉత్తమ సంస్థతో చేతులు కలిపా. ఈ ఏడాది మొత్తం మీ కోసం కొన్ని అద్భుతాలు సృష్టించబోతున్నా. మీరు కూడా దీని కోసం నాలాగే ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ వీడియోలో పరిణీతి పాడిన ఈ పాట'మాన కే హమ్ యార్ నహీ' అనే పాట ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన 2017 రొమాంటిక్ మూవీ 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలోనిది. అయితే పరిణీతి ఇంతకుముందే మనోజ్ ముంతషిర్ రాసిన దేశభక్తి పాట 'తేరి మిట్టి' మహిళా వర్షన్‌ను అలపించింది. ఈ సాంగ్ అక్షయ్ కుమార్, పరిణీతి నటించిన 2019 యుద్ధ చిత్రం 'కేసరి'లో ప్రదర్శించారు. అంతే కాకుండా 35 ఏళ్ల బాలీవుడ్ భామ తన డిస్కోగ్రఫీలో 'మత్లాబి యారియన్' ట్రాక్‌ను కూడా కలిగి ఉంది. ఈ పాట మిస్టరీ థ్రిల్లర్ 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' అనే చిత్రంలోనిది. ఇందులో పరిణీతి, అవినాష్ తివారీ, అదితి రావ్ హైదరీ నటించారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన పరిణీతి.. తన పెళ్లి పాట 'ఓ పియా' కూడా పాడింది. కాగా.. ప్రస్తుతం ఆమె 'అమర్ సింగ్ చమ్కిలా' అనే చిత్రంలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement